🕉️ సుభాషితము 🕉️
శ్లో॥
*ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే*
*నారీ గృహద్వారి జనాః శ్మశానే౹*
*దేహాశ్చితాయాం పరలోకమార్గే*
*కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః॥*
సంపదలు దాచినచోటనే ఉండును. పశువాహనాదులు వాటికి నిర్దేశించిన చోటనే ఉండును. భార్య ఇంటి వాకిలి వరకు అనుసరించును. బంధుజనులు స్మశానము వరకు వెంట వత్తురు. ఎంతో ప్రేమతో పెంచి పోషించిన దేహము చితియందు కాలి బూడిదయగును. ఇక జీవుడు పరలోకమునకు వెళ్ళునపుడు తాను చేసిన మంచి-చెడు పనులయొక్క ఫలితము మాత్రమే తన వెంట వచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి