శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన పశ్చిమాన్నాయ ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి స్వామివారు తన పీఠం విడిచిపెట్టి
గుజరాత్‌లోని గిరిజన జిల్లా డాంగ్ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల అత్యంత ప్రభావవంతమైన ఆయా గిరిజన ప్రాంత గ్రామాల్లో నెలల తరబడి కాలినడకన పర్యటన చేస్తున్నారు.
గత కొన్ని ఏళ్లుగా క్రైస్తవ మిషనరీలు, ఇస్లామిక్ సంస్థల చెడు ప్రభావం ఉంది, అక్కడ దురాశ పరులు పెద్ద ఎత్తున మతమార్పిడులు చేస్తున్నారు.
ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య శ్రీ శ్రీ సదానంద సరస్వతి మాహాస్వామి వారు ఈ ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో నడుచుకుంటూ ఇంటింటికి వెళ్ళి హిందూ సంస్కృతిని ప్రచారం చేస్తూ, వారితో భిక్ష చేస్తున్నారు. గిరిజనుల ఆర్థిక ప్రగతికి, విద్యా ప్రగతికి ద్వారకా పీఠం అనేక కార్యక్రమాలను చేపట్టారు. వీటితో బాటు అనేక దేవాలయాలను పునర్నిర్మాణం, శబరి పీఠాన్ని విస్తరణ చేశారు. మరలా గిరిజనులు క్రైస్తవం వదిలి పెద్ద ఎత్తున తిరిగి మన హిందూ ధర్మం లోకి వస్తున్నారు.
హిందూమత పునః వృద్ధి, మన మత ధర్మోద్ధరణ ప్రవేశం నిత్యం కొనసాగేలా చేస్తున్న స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు..🙏🕉️🪷🌸👌
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి