🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
*శ్లో:- శతం విహాయ భోక్తవ్యమ్ ౹*
*సహస్రం స్నాన మాచరేత్ ౹*
*లక్షం విహాయ దాతవ్యం ౹*
*కోటిం త్యక్త్వా హరిం భజేత్౹౹*
*****
*భా:- ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ప్రాధాన్యాన్ని, ప్రాథమ్యాన్ని, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న అంశాలు నాలుగున్నాయి. 1."భోజనము":- వంద పనులు పక్కన పెట్టైనా సరే ప్రతి రోజు సమయానికి శుచిగా, రుచిగా, మితంగా, హితంగా భోజనము చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యమై నిన్ను వరిస్తుంది.2."స్నానము":- వేయి పనులు పక్కన పెట్టైనాసరే శ్రద్ధతో, తాపీగా స్నానము చేయాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత శుభ్రత మనకు, కుటుంబానికి, సమాజానికి శ్రీరామరక్ష. 3."దానము":- లక్ష పనులు పక్కన పెట్టైనాసరే త్రికరణశుద్ధితో దానము, ధర్మము చేయాలి. ఆ పుణ్యఫలమే నిన్ను, నీ భావి తరాలను రకరకాల ఆపదలనుండి వెన్నంటి రక్షిస్తుంది. 4."హరి స్మరణ":- కోటి పనులు పక్కన పెట్టైనాసరే శ్రీహరి నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని మనసారా ధ్యానించాలి. భవ సాగర తరణోపాయము భగవన్నామమే. అతి సులువైన ఉపకరణము నామస్మరణమే. జీవకోటికి ప్రకృతిని, వనరులను, జీవనాన్ని, సంసారాన్ని,వివేకాన్ని, విజ్ఞానాన్ని, సిరిసంపదలను, సమస్తాన్ని ప్రసాదించిన ఆ హరిని నిత్యము కొలిచి దైవఋణం తీర్చుకోవాలి. అన్నంతో ధర్మసాధనమైన శరీరాన్ని కాపాడుకుంటూ , స్నానంతో దేహమాలిన్యాన్ని, దానంతో మనో మాలిన్యాన్ని పరిశుభ్రం చేసుకుంటూ, నామసంకీర్తనంతో అంతః కరణాన్ని పవిత్రం చేసుకోవాలని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి