౼౼౼౼౼౼౼
మనకాలగణాన మధ్యమైవర్షాన
మహిమంబునొందిన మాన్యదినము
మధ్యమలోకులే మతిని శ్రద్ధను పితృ
క్ష్మాదేవులన్ గొల్చు మాన్యదినము
మనపితృదేవల్ మన,క్షేమవృద్ధుల
మనలను దీవించు మాన్యదినము
మధ్యమనగ ముఖ్యమగు దాన,దాన
మర్యాదలవిసల్పు మాన్యదినము
అట్టి మధ్యాష్టమీ మంజులాష్టమి తిథి
యుర్వి నేడయ్యెగా భక్తియుక్తబుద్ధి
తమతమపితృ దేవతల సంతసముగొల్పు
కర్మ సందీప్తి పొల్పొందు ధర్మదినము.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి