!! ఓం నమో వేంకటేసాయ !!
!! ఓం నమో శ్రీనివాసాయ !!
కొండవంటి దేవుఁడు నేఁ గొలిచే దేవుఁడు వీఁడే
నిండుకున్నాఁడు తలఁచు నెమ్మదినోమనసా // పల్లవి //
నన్నుఁ బుట్టించే దేవుఁడు నాలోనున్నాఁడు దేవుఁడు
కన్నచోటులనే వుండే కాచే దేవుఁడు
వెన్నతోఁబెంచే దేవుఁడు వివేకమిచ్చే దేవుఁడు
యెన్నని పొగడవచ్చు యీతఁడే మా దేవుఁడు // కొండ //
సిరులిచ్చిన దేవుఁడు సేవగొనేటి దేవుఁడు
గురుఁడై బోధించి చేకొన్న దేవుఁడు
మరిగించిన దేవుఁడు మాటలాడించే దేవుఁడు
ఇరవై మాయింటనున్నాఁ డీదేవుఁడు // కొండ //
దాపుదండైన దేవుఁడు దరిచేర్చిన దేవుఁడు
రూపు చూపె నిదివో బోరున దేవుఁడు
శ్రీపతియైన దేవుఁడు శ్రీవేంకటాద్రి దేవుఁడు
చేపట్టి మమ్మేలినాఁడు చేచేతనే దేవుఁడు // కొండ //
శ్రీ తాళ్లపాక అన్నమయ్య
. . . స్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి