🌸🌸
పరమాత్మ లీలలు అనంతం అని తెలియజెప్పే పద్యం...
ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
నతనిమాయలకు మహాత్ములు విద్వాంసు
లడఁగి మెలగుచుందు రంధు లగుచు.
**
పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.
🏵️పోతన పద్యం-🏵️
పరమాత్మ తత్వ ఆవిష్కరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి