మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
గానామృత బోధ!
శ్రీ స్వామివారు తపోసాధన చేసుకుంటున్న రోజుల్లో..నేను తరచూ వారిని కలిసినా..పెద్దగా నాతో మాట్లాడింది లేదు..నేను వయసులో చిన్నవాడిని కావటం..అదీకాక వారి స్థాయికి తగ్గ మానసిక పరిపక్వత లేకపోవడం..కారణం కావొచ్చు..మామూలు క్షేమ సమాచారం అడుగుతూ వుండేవారు..లేదా అమ్మా నాన్న గార్లకు ఏదైనా చెప్పదలుచుకుంటే..వారిని తన దగ్గరకు ఫలానా సమయం లో రమ్మనమని నా ద్వారా కబురు చెప్పి పంపేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు ఆశ్రమ ప్రాంగణంలో పచార్లు చేస్తూ వుండేవారు..అప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా..స్వచ్ఛమైన నవ్వుతో..వెలిగిపోతున్న ముఖంతో వుండేవారు..
ఒకరోజు నేను మా పొలానికి వెళుతూ..ఆశ్రమం దగ్గర ఆగాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ఆశ్రమం బయటే నిలుచుని వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."మాగాణికి పోతున్నావా?.."అన్నారు..
ఔనన్నాను..నన్ను తనతో పాటు రమ్మన్నట్టుగా సైగ చేసి..ఆశ్రమం లోకి వెళ్లారు..వెనుకనే నేనూ వెళ్ళాను..తాను తపస్సు చేసుకునే గది బైట వరండా లో పద్మాసనం వేసుకొని కూర్చుని..నన్నూ కూర్చోమన్నట్టుగా చేయి చూపారు..కొద్దిదూరంగా కూర్చున్నాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ప్రశాంతంగా వున్నారు..పైగా హాయిగా నవ్వుతూ వున్నారు..
"ఇప్పుడు కనిగిరి లో చదువుతూ ఉన్నావా?.." అన్నారు ..తలూపాను..
పెద్దగా నవ్వుతూ.."నేను మాట్లాడుతూ వుంటే...నువ్వు మౌనంగా ఉన్నావా?.." అన్నారు..
"అదేం లేదు స్వామీ..మీకు తెలుసు కదా నేను కనిగిరి లో చదువుకుంటున్నాననీ..మొన్ననే ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరాను." అన్నాను..
"సినిమాలు చూస్తావా?.." అని అడిగారు..తలూపాను..నవ్వారు..
"నీకు తెలుసా?..నేను ఒక్క సినిమా చూసాను..నా చిన్నప్పుడు.."అన్నారు..
కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాను.."ఏ సినిమా స్వామీ.." అని..
"భక్త ప్రహ్లాద.." అన్నారు.."నువ్వు చూసావా?..ఆ సినిమాను.." అన్నారు..చూసాను అని చెప్పాను..
ఒక్కక్షణం కళ్ళు మూసుకొని.."అందులో ఒక పాట ఉంది..నారాయణ మంత్రం..శ్రీమన్నారాయణ భజనం..అని..ఆ పాటలో నీలాటి వాళ్ళు తరించడానికి సులభమైన ఉపాయం బోధించారు..ఈసారి ఎప్పుడైనా మనసు పెట్టి విను.."
అంటూ..
"గాలిని బంధించి, హఠించి గాసిల పనిలేదు..
జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు..
మాధవా..మధుసూదనా అని మనసున తలచిన చాలుగా..."
రాగయుక్తంగా పాడి వినిపించారు..
ఎంత మధురమైన కంఠస్వరం?..ఏదో దివ్యగానం వింటున్న అనుభూతి కలిగింది..ఒక్కనిమిషం పాటు మైమరపు కలిగింది..పాటలోని భావం తెలుసుకోవడం కన్నా..శ్రీ స్వామివారి గాత్రం లోంచి జాలువారిన ఆ పాట కర్ణపేయంగా అనిపించింది..
"అర్ధమైందా?..మేము సాధకులము..హఠ యోగం ద్వారా సాధన చేస్తున్నాము..అందరికీ ఇది సాధ్యం కాదు కదా..ముఖ్యంగా నీలాటి వాళ్ళు..రోజుకు కొద్దిసేపైనా ఆ పరమాత్ముడిని తలచి తరించమని ఎంత చక్కగా చెప్పారో చూసావా?.."
కొద్దిసేపటి క్రితం దాకా ఎంతో ఉల్లాసంగా..నవ్వుతూ ఉన్న స్వామివారు..అంతే ఉత్సాహంగా సినిమా ప్రసక్తి తెచ్చి..చిన్నపాటి బోధ చేశారు..
అందులోని తాత్వికభావాన్ని ఆరోజు నేను పూర్ణంగా ఆకళింపుచేసుకోలేక పోయాను..కానీ..ఇప్పటికీ శ్రీ స్వామివారు పాడిన ఆ చిన్నపాటి చరణం నాచెవుల్లో గింగురుమంటూనే ఉంది!..
మరో అనుభవం తో రేపు..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి