*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*483వ నామ మంత్రము* 31.10.2021
*ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః*
అమృతా మొదలైన పదహారుమంది మహాశక్తులచే పరివేష్ఠింపబడి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అమృతాది మహాశక్తి సంవృతా* యను పదునొకండక్షరముల నామ మంత్రమును *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆత్మానందానుభూతితోబాటు, అంతఃకరణశుద్ధి మరియు భౌతికపరమైన శాంతిసౌఖ్యములు అనుగ్రహించును.
విశుద్ధిపద్మమునకు పదునారు దళములు గలవు. వానిలో *అ* కారాది *అః* వరకు గల బీజాక్షరములు ఉండును. ంఅదేవిధంగా ఒక్కొక్క బీజాక్షరమునకు ఒక్కొక్క మహాశక్తి చొప్పున పదహారు మహాశక్తులు ఉండును. ఆ శక్తులే అమృతాది మహాశక్తులు. మధ్యలో విశుద్ధిచక్రాధిష్ఠానదేవత అయిన డాకినీశ్వరి ఉంటుంది. ఈ డాకినీశ్వరినే వజ్రేశ్వరియందురు. ఈ వజ్రేశ్వరీదేవి మంత్రమునకు బీజము, శక్తి, కీలకము అన్నియును డ కార సంకేతమగుటచే వజ్రేశ్వరీదేవి డాకినీశ్వరి అయినది. ఈ వజ్రేశ్వరీదేవికి అమృతాది పదహారు మహాశక్తులు చుట్టూ ఉండును గనుక వజ్రేశ్వరీ స్వరూపిణియైన అమ్మవారు *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది. 'అనాహత చక్రమునకు పైన పదునారు అక్షరములుగల విశుద్ధచక్రము గలదు. దాని మధ్య కర్ణికయందు డాకినీదేవి గలదు. విశుద్ధ పద్మదళమునందు అమృత మొదలు అక్షర వఱకు గల పదునారు దేవతలు గలరు. వీరే స్వరరూపలు. విశుద్ధమునకు పైన చంద్రబింబము గలదు' అని స్వచ్చంద్ర తంత్రమునందు గలదు.
*అమృతాది మహాశక్తుల పేర్లు:*
1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.
పైనుదహరించిన పదహారు మహాశక్తులు వజ్రేశ్వరీస్వరూపిణియైన పరమేశ్వరిని చుట్టి ఉండుటచే *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది.
అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి