31, అక్టోబర్ 2021, ఆదివారం

శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం

 శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం


మీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే తయారవుతారు అందువలన ఎప్పుడూ మిమ్మల్ని మీరు రోగిగా భావించకండి. మంచిగా అవుతాను అనే కోరికను ఎప్పుడూ వదలకండి. మీ ప్రతీ బాధ త్వరలోనే తొలగిపోతుంది, నవ జీవితం మీకు తిరిగి తప్పక లభిస్తుంది. దు:ఖం యొక్క లక్ష తుఫానులు వచ్చినా కానీ భగవంతుడు మీ తోడుగా ఉన్నారు. ఈ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోండి. స్వయాన్ని దేహానికి అతీతంగా ఆత్మగా భావించి మనస్సుని శివపరమాత్మతో జోడించండి, శరీరానికి ముందు ఎంత అవసరమో మనస్సుకి పరమాత్మ స్మృతి అంతే అవసరం, ప్రతి శ్వాసలోను శివ తండ్రి జ్ఞాపకం ఉంటే ఎలాంటి  రోగం అయినాతగ్గిపోతుంది. . మనస్సుని అచంచలంగా ఉంచుకునే వారు నిరోగి శరీరాన్ని తిరిగి పొందుతారు. మీలో ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి, సదా సంతోషంగా ఉండండి. అప్పుడు ఎటువంటి బాధ అయినా దూరం అయిపోతుంది. జ్ఞాన దీపాన్ని మనస్సులో వెలిగించుకుని ప్రతి సమస్యను ఆటగా భావించి నడవండి. గౌరవం-అగౌరవం, జయం-పరాజయం ఏదైనా సరే అన్నిటిని సమదృష్టితో చుడండి. మీ మనస్సుని స్థిరంగా చేస్కోండి అప్పుడు సదా మీరు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా వుంటారు. ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకండి. ప్రశాంతంగా వుండండి. ఇతరులతో సున్నితంగా మాట్లాడండి. అప్పుడు వారు కూడా మీ యెడల సద్భావనతో వుంటారు. ఆవేశం అనారోగ్యహేతువు అని గుర్తుంచుకోండి. ప్రేమే ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది మరవకండి. 

అన్నింటిలోను మనసారా శివపరమాత్మను జ్ఞాపకం చేయండి.  

కామెంట్‌లు లేవు: