30, జనవరి 2023, సోమవారం

ప్రతిరోజూ పరీక్షయే

 ప్రతిరోజూ పరీక్షయే 

విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయి.  తెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకైనావాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత  సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా ఏ రోజు పాఠం ఆ రోజే చదివి అవగాహన  పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు. 

మోక్షార్ధి అయిన సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అయినా వాటినన్నిటిని తానూ ఓర్పుతో, పట్టుదలతో, నిరంతర కృషితో అధిగమించి అను క్షణం భగవంతుని ధ్యాసలో గడిపి తన సాధనను సాగిస్తాడు. సాధకునికి వచ్చే ఆవరమోదాలు  ఏమిటో చూద్దాము. 

1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది 

తామాస ప్రవ్రుత్తి : తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే ప్రధాన  అవరోధం.  నీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు కాబట్టి నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత ఏ 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఊరు మొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదు.  అంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా 

రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా  రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలి.  సాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారు.  నిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి  ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారంమే  కానీ సాత్విక్ ఆహరం కాదు. నూనెతో చేసిన ఆహారం జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది.  అలాగే మాసాలతో చేసిన పదార్ధాలు కూడా త్వరగా జీర్ణం కావు. సాధకుడు కొంత సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఏ పదార్ధం తినాలో, ఏ పదార్ధం తినకూడదో తన మనసుకు తనకే తెలుస్తుంది. అదే విధంగా ఎంతపరిమాణంలో ఆహరం తీసుకోవాలో కూడా అవగాహనకు వస్తుంది.  పదార్ధం చాలా రుచికరంగా ఉన్నాకూడా మితి మీరు ఎట్టి పరిస్థితిలో సాధకుడు భుజించడు.

తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంత వరకు తొందరగా నిద్రకు  ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు .ప్రతి మనిషి తన వయస్సు ప్రకారం కొన్ని గంటల నిద్ర అవసరం అని శాస్త్రం చెపుతుంది.  కాబట్టి తొందరగా నిద్రిస్తే సాధకుడు తొందరగా నిద్రనుంచి లేవగలుగుతాడు.

ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి ఈ రెండిటికి  చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మీద మోజు అంటే ప్రతివారు వారి శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు రాసు కోవటం విలువైన ఆభరణాలు ధరించటం లాంటి పనులు చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి స్నానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు. 

తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి  ఉండటం. ఇది ఆధ్యాత్మిక జగతిలో తరచుగా వినపడే ఉపమానం. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నాకూడా అది తామరాకుకు అంటుకొని ఉండదు కేవలం దాని అస్తిత్వం దానిది తామరాకు అస్తిత్వం దానిది. సాధకుడు సంసారాన్ని నిర్వహిస్తున్నా కూడా కుటుంబ బండలను కేవలం యాదృచ్చికంగా తీసుకొని బాధ్యతలను నెరవేయాలి కానీ బంధాలను మనస్సుకు తీసుకొని బాధపడటం ఆనందపడటం చేయకూడదు. నీవు నీ మిత్రుడు కలసి వీధిలో వెళుతున్నావు అక్కడ ఒక బాలుడు స్కూటరు నడపటం చాటగాక క్రిందపడి దెబ్బలు తాకించుకున్నాడు. చూసినవారు అందరు వాడి తల్లిదండ్రులని అనాలి ఇంత చిన్న పిల్లవానికి స్కూటరు ఇస్తారా వాళ్లకు బుద్ధిలేకపోతే సరి అని ఆనుతున్నారు.  నీవు కూడా వాళ్లలాగే అని నీ మిత్రుని పోనీయరా నీ బండిని ఇటువంటివి రోజు అనేకం జరుగుతుంటాయి వీటిని చూస్తూ మనం కాలయాపన ఎందుకు చేయాలి అని నీ మిత్రుని మోటారు సైకిల్ నడపటానికి ప్రేరేపిస్తావు.  అంతలో ఆ గుంపులోంచి నీకు తెలిసిన ఒకడు వచ్చి పరంధామయ్యగారు ఆ స్కూటరు మీదినించి పడింది మీ పిల్లవాడే అని చెపితే అప్పుడు నీ లోంచి తండ్రి ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చి అమాంతం మోటారుసైకిల్ దిగి వెంటనే నీ కొడుకు వద్దకు వెళతావు. అదే బంధం అంటే అదే ఆ పడినాబాలుడు పరాయి వాడు అంటే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించావు. ఇలా ప్రతి వక్కటి మనసుకు పెనవేసుకొని ఉంటుంది. కోటిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా ఇలానే వుంటారు. ఆ ఒక్కరు ప్రస్తుతం మనకు మన సభ్యసమాజంలో ఉండకుండా హిమాలయాలలోనో, లేక ఇతర పర్వతాలమీదో తపస్సు చేసుకున్తున్నారు. 

గృహస్ట జీవనం చేస్తున్న మనం పర్వతాలలో తపస్సు చేసుకునే యోగులంతగా మన మనస్సును నియంత్రించలేము.  కానీ ప్రయత్నించటం మన ధర్మం.  ఆపైన భగవదానుగ్రహం. కాబట్టి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటం అనేది  చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి. 

వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి, స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలనె  వ్యామోహం పెంచుకోకూడదు. సాధన బలపడితే సాధకునికి ప్రకృతి పూర్తిగా సహకరిస్తుంది.  ఉదాహరణకు నీకు చలి అంటే చాలా బాధాకరం. నీవు చలిని తట్టుకోవాలేవు.  కానీ నీలో సాధన బలపడుతుంటే నీకు తెలియకుండానే యెంత చలి వున్నా కూడా నీవు నిర్బయంతరంగా నిర్విరామంగా సాధన చేయగలుగుతావు. 

భయం: భయం అనేది కూడా సాధకునికి కలిగే ఒక అవరోధంగా మాన్యులు చెపుతారు. నేను వంటరిగా ఉండి సాధన చేయలేను. నాకు భయం అని కొంతమంది సాధకులు ఆశ్రమాలకు, బాబాలదగ్గరకు వెళ్లి సామూహిక సాధనలో కూర్చుంటారు.  నిజానికి కొన్ని రోజులు అంటే సాధనలో పట్టు లభించేవరకు అలా చేస్తే పరవాలేదు కానీ అటువంటి జీవనానికి అస్సలు అలవాటు పడకూడదు.  సాధకుని సాధన కేవలం ఒంటరిగానే చేయాలి. ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదు.  ఇంకొక విషయం సాధనలో కొంత ముందుకు వెళ్లిన తరువాత సాధకునికి కొన్ని అతిన్ద్రియ శక్తులు వస్తాయి.  వాటిని తాను గమనించి కూడా గమనించకుండా ఉండి సాధనను కొనసాగించాలి. సంపూర్ణంగా సాధనలో సమాధి స్థితి వచ్చినప్పుడు సాధకుడు అనన్య ఆనందాన్ని పొందగలడు. శరీరానికి సంబంధించి ఈ నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లే.  కానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం. 

ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం  లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవు.  ఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారు.  అక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి ఈ రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు.  ఈ రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయి.  వారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక ఏ మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన ఆ రోజు సాగాదు . ఇక పొతే ఈ రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక  వేస్తున్నారు. ఆ శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయి.  నీవు వారితో పోరాడ లేవు.  అధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. ఈ రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి. సాధకుడు సదా సాత్విక్ ప్రవృత్తిని కలిగి ఉండాలి, ఎట్టిపరిస్థితుల్లోనూ, రాజస, థామస్ ప్రవృత్తిని దరి చేరనీయకూడదు. ఇది చాలా కాలం అభ్యసిస్తేనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది రాజసప్రవృత్తిలో, థామస ప్రవృత్తిలో వుంటారు.  వారి మధ్యన వుంటూ సాత్వికంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది.  కానీ సాధకుడు భగవంతుని మీద భారం వేసి ప్రయత్నించాలి.

అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ ఈ కోవకు వస్తాయి.  నీవు సాధనకు కూర్చున్నావు చక్కగా ఫాను వేసుకొని ఫాను క్రింద నీ సాధన మొదలు పెట్టావు.  నీ చుట్టుప్రక్కల ఎటువంటి అవరోధాలు లేవు. కానీ నీకు ఎంతో దూరంలో పెనుగాలులు వీచాయి నీకు ఆ విషయంకూడా తెలియదు.  కానీ దాని పర్యవసానంగా అక్కడ విద్యుతు స్తంబాలు పడిపోయాయి. దానితో నీకు విద్యుత్ సరఫరా నిలిచి నీ ఫాను తిరగటం లేదు. అది నీకు సాధన భంగాన్ని కలుగ చేసింది. ఇటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష అవరోధాలు అనేకం సాధకునికి ఎదురుపడుతాయి. ఏ సమయంలో ఏరకంగా అవరోధం కలుగుతుందో సాధకుడు ఉహించలేడు.  సాధకుడు ఒక దృఢ సంకల్పం చేయాలి ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డాకూడా తన సాధనను మధ్యలో ముగించనని తలంచి. సాధనంకు ఉపక్రమించాలి.  అప్పుడే సాధకుడు అవరోధాలను దాటి తన సాధన చేయలేడు. 

సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహం.  నిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని మాన్యులు చెపుతారు.  కానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో  మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో ఆలోచించు అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా. 

సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ఈ ప్రశ్నకు కూడా అవును అని  చెప్పలేము. ఈ రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారు.  వారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు. అంటే గృహస్తు తన బంధాలను మోస్తువుంటే ఇటువంటి సన్యాసులు తనకు ఏమాత్రం సంబంధము లేని తనకు పట్టని వాటిని అతికించుకొని లేని బంధాలను కలిగించుకొని సాధనలో చాల వెనుక పడివుంటారు. పైపెచ్చు వారు మనలాంటివారికి అనేక విధాలుగా ఉద్బోధలు చేయటం విడ్డురం. సాధకులు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధకునికి కలిగిన ఒక అనుభవం తెలుపుతున్నాడు.  ఒకసారి ఒక మిత్రుడు నేను ఫలానా గురువుగారి వద్ద యోగ విద్య నేర్చుకున్నాను నాకు చాలా మంచిగా వున్నది అని తెలిపితే అదేమిటని దానిగూర్చిన వివరాలను సేకరిస్తే తెలిసింది ఏమిటంటే అందులో చేరటానికి తగు ద్రవ్యం ఫీజుగా చెల్లించాలట. తరువాత కొన్ని రోజులు ఆ గురువుగారొ లేక అయన శిష్యగణమో శిక్షణ ఇస్తారట అంతవరకూ బాగానే వున్నది శిక్షణ పూర్తి అయినతరువాత తానూ నేర్చుకున్న యోగం ఇతరులకు నేర్పనని ప్రమాణం చేయాలట.  చూసారా ఇటువంటివి ఇప్పుడు సమాజంలో అనేక సంస్థలు పుట్టగొడుగులులాగ పుడుతూ సామాన్యులకు రోజు ప్రక్కదోవ పట్టిస్తున్నాయి. ఇటువంటివి కేవలం నీ నుంచి ద్రవ్యాన్ని పొందేవి మాత్రమే అని గమనించాలి. మనకు శ్రీ కృష్ణ పరమాత్మను మించిన గురుదేవులు లేరు. ఆది శంకరులను మించిన మార్గదర్శకులు లేరు. ఈ విషయం గమనించి వారు బోధించిన మార్గాన్ని అనుసరిస్తే సాధకుడు మోక్షం పొందటం తధ్యం.

యదార్ధంగా సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా ఉండి ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు. వారు  సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు. 

నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయి.  వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును  మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిఁ 

మీ 

భార్గవ శర్మ

నేడుమధ్వనవమి

 _*నేడుమధ్వనవమి*_

 

*మధ్వనవమి విశిష్టత* 

మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం.

త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం. శ్రీమధ్వాచార్యులు.

ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు.

మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట , వేదవతిలుగా పేర్కొన్నారు.


ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ , ఆనందతీర్థ , మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.


పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.

బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. 

చిన్నవయసులోనే సకల శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.


ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. 

రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే.


శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు, వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. 

ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది, ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జీవుడు వేరు , బ్రహ్మము వేరు , జీవుడు మిథ్య కాదు , అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు.

ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం , భక్తి ఒక్కటే ముక్తిదాయకం , అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. అని మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు.


దేశంలో వైష్ణవమత వ్యాప్తికి , ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు , జగత్తు మాయ మాత్రమే , జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.


పరమాత్మ సర్వస్వతంత్రుడు , జీవాత్మ అస్వంతంత్రుడు , జీవోత్తముడు ఆచార్యుడు , ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి , అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.

మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.

మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. 

తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు.


ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు , తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. 

మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. 

వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.


ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా , ఓడలోని ముఖ్య నావికుడు భక్తభావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.


శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు , ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశస్తోత్రంగా పిలువబడింది.

ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. 

ఆ విగ్రహాన్నే 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. 

తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. 

ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. 

మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు , యుక్తవయస్సులో కన్యాకుమారి , రామేశ్వరం , శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.  


జీవాత్మ , పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని , ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. 

అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నెతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు.


పెజావర , పుత్తిగె , 

పాలిమార్ , ఆడనూరు , 

సోధె , కవియూరు , 

శిరూరు , కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు , మతపరమైన ఆచారాలకు , ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. 

పురందరదాసు , కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.


మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.

నమ్మకం లేనివాడు

 *సుభాషితమ్* 

*అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి* ।

*నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః||*

                          ~భగవద్గీత. 


తాత్పర్యము-

అజ్ఞాని, నమ్మకం లేనివాడు, సంశయస్వభావుడు, వీళ్ళు నశిస్తారు. సంశయాత్మకు (అడుగడుగునా సంశయించేవానికి) ఇహలోకమూ లేదు, పరలోకమూ లేదు, సుఖం అసలే లేదు.

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏*

మాఘ పురాణం*_ _*8 వ అధ్యాయము*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*ఆదివారం*_

    _*జనవరి 29, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*8 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


🌹🌷🕉️🔔🕉️🌷🌹


దత్తాత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు  ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు  కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహాత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మము లాచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణెములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.


_*ఎనిమిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*


🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*సోమవారం*_

    _*జనవరి 30, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*9 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*గంగా జలం మహిమ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️

ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించెను. మరెందరో  మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక , పూజలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశాచాలగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని  భాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడు కొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


_*తొమ్మిదివ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

శ్రీ రామదాసు గారు

 మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట

శ్రీ రామదాసు గారు


ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...


పూజ్య గురువులు అనేక ప్రవచనములలో శ్రీ రామదాసు గారి యొక్క భక్తి గురించి ప్రస్తుతించిన విశేషములు...శ్రీ రామదాసు గారి జయంతి సందర్భముగా...


మహానుభావుడు పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్నగారు. ఆయనను రామదాసు గారు అంటూ ఉంటాము. ఆయన జీవితములో చాలా గొప్ప విశేషము - కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము సుఖము వచ్చినా ఈశ్వరుడుతోనే చెప్పుకోవడము. ఏది వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము. లౌకికముగా పైకి మాట్లాడరు. ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే మాట్లాడటము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము. జ్వరము వచ్చినా ఏమిటో ఈశ్వరా! జ్వరముగా ఉన్నది, కాలు చాలా నెప్పిగా ఉన్నది అని ఏదైనా ఈశ్వరుడుకి చెప్పడము అలవాటు అయితే ప్రాణోత్క్రమణము అవుతున్నా ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు అవుతుంది. ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నారు. ఒకరోజు ఆయన ఏడుస్తూ పాడుకున్నారు -

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జననీ జానకమ్మా

ఆయన ఆ బాధలు ఓర్వలేక సీతమ్మ తల్లిని అమ్మా ఇంత కష్ట పడుతున్నాను కాపాడమని చెప్పమ్మా అంటే తట్టుకోలేక పోయింది. ఆవిడ వెళ్ళి - అంత భక్తి తత్పరుడు కష్టపడి ఆలయము కట్టించాడు అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఆయన చేసిన అపరాధము ఏమీ లేదని, రామదాసు గారిని ఎందుకు రక్షించి బయటికి తీసుకుని రారు అని శ్రీ రాముడిని అడిగింది. రాముడు - సీతా నాకు కూడా రామదాసు కష్టములు చూసి గుండెలు అవిసి పోతున్నాయి. కానీ లోకములో వేదము చెప్పిన శాసనము ఒకటి ఉన్నది. గతజన్మలో ఉండగా ఒక చిలుకను తీసుకుని వెళ్ళి తొమ్మిది సం|| పాటు పంజరములో పెట్టి బాధ పెట్టాడు. పంజరములో ఆ చిలుక ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరముతో తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తి అవుతుందా కనపడదామని నేను కూడా అగ్గగ్గ లాడిపోతున్నాను. కానీ రామదాసు గారి కన్నా ముందుగా నాదర్శనమును ముందుగా తానీషా పొందుతాడు అంటే, అదేమిటి? మిమ్ములను ఇంతగా సేవించి పూజించి గుడి కట్టిన వాడు రామదాసు. ఆయనని బంధించిన వాడు తానీషా. అటువంటి తానీషాకు రామదాసుకన్నా ముందు దర్శనమా? ఎందుకు ఇస్తారు అని అడిగింది.

రామచంద్రమూర్తి దానికి కారణము చెపుతూ గత జన్మలో పరమ శివ భక్తుడైన ఒక వ్యక్తి శివా! నిన్ను సాకారముగా చూడాలని ఉన్నది. పరమ నియమముతో నిన్ను 365 రోజులు రుద్రమును స్వరము తప్పకుండా చెపుతూ గంగా జలములతో అభిషేకము చేస్తాను. నువ్వు దర్శనము ఇవ్వమని అడిగాడు. రోజులు తప్పు లెక్క పెట్టుకుని సం|| నకు ఒక రోజు తక్కువ పూజ చేసి దర్శనము అవలేదని కోపము వచ్చి బిందె తీసి శివలింగమునకు వేసి కొట్టి శివలింగమును బద్దలు కొట్టాడు. అప్పుడు నువ్వు నియమము తప్పి, నన్ను నింద చేసి బిందె పెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేద ప్రమాణము అంగీకరి0చని సిద్ధాంతము ఉన్నచోట జన్మించెదవు కాక అన్నాను. అతను నన్ను ప్రార్ధన చేసాడు శివా ! ఇంత కష్టపడి 364 రోజులు అభిషేకము చేసాను. ఒక్క రోజు తక్కువ అయినందుకు ఇంత శిక్షా అంటే, నువ్వు చేసిన అభిషేకమునకు కూడా ఫలితము ఉంటుంది. శివుడనైన నేను రామభక్తుడైన రామదాసు కన్నా రాముడిగా మొదటి దర్శనము నీకే ఇస్తాను అని వరమిచ్చాను. అందుకని మొదటి దర్శనము తానీషాకి ఇవ్వాలి. ఆయన కోటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభువు అంత ఎత్తులో కూర్చుని కనపడుతూనే ఉంటాడు. ఎవరైనా ఆయనకి ఆపద కలిగించాలి అనుకుని ధనస్సుకి బాణము సంధించి విడచి పెట్టినా, కత్తి విసిరినా ఆయనక తగలదు. మధ్యలో దేనికో తగిలి పడిపోతుంది. ఎందుకనగా అది వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారములు అడ్డు ఉంటాయి. ఆ రోజులలో అంత చిత్ర విచిత్రమైన శిల్పకళా నైపుణ్యముతో కట్టారు. తానీషా రాత్రి నిద్రపోతే పన్నెండు ప్రహారములు దాటితే తప్ప ఆయన నిద్రపోతున్న గదిలోకి వెళ్ళడము సాధ్యము కాదు. ఆయన భార్యతో కలసి ఏకశయ్యా గతుడై గాఢ నిద్రలో ఉండగా రామచంద్రమూర్తి భక్తుడైన రామదాసు గారిని రక్షించుకోవాలి అనుకున్నారు. ఆయన తలచుకుంటే కష్టము ఏమి ఉన్నది? రాజకుమారుల వేషము వేసుకుని గుఱ్ఱముల మీద ప్రహరాలు దాటి తానీషా పడుకున్నగదిలోకి వెళ్ళారు. తానీషా ఉలిక్కి పడి లేచాడు. భద్రాచల వృత్తాంతములో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అనగా నిద్ర లేచిన ప్రభువు ఎవరు నువ్వు? అనలేదు. ఎవరక్కడ? అని గంట కొట్టలేదు. ఎదురుగా ఉన్న రాజకుమారుల అందమును చూసి ఏమి అందము ఎవరు వీళ్ళు అని చూస్తూ అలా ఉండిపోయాడు. అది పరమేశ్వరుని దర్శనము అంటే ! ఆ స్థితిలో కన్నుల నీరే కానీ నోట మాట ఉండదు. రాముడే మాట్లాడారు. మేము రామదాసు గారి దాసులము, ఆయన సేవకులము అన్నారు.. అది భద్రాచల క్షేత్రము యొక్క వైభవము. భద్రాచలములో రామదాసు గారు అంటాము. రామదాసు గారు రాముడికి దాసుడు కాదు, రాముడు రామదాసుగారికి దాసుడు! భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఆయన ఎంత దాసుడైపోతాడో భద్రాచల క్షేత్రము చూపిస్తుంది.

మేము రామదాసుగారి సేవకులము ఆయన ఏ ద్రవ్యమును ఉపయోగించి ఆలయము కట్టాడని అభియోగము చేసారో ఆ వరహాలు పట్టుకుని వచ్చాము. తీసుకుని రశీదు ఇవ్వండి. రామదాసు గారిని విడిపించుకుంటాము అని అన్నారు.


ప్రభువు ఇంత రాత్రివేళ డబ్బు పట్టుకుని తిన్నగా నాదగ్గరకు రావడమేమిటి? రశీదు ఇమ్మని అనడము ఏమిటి? నిర్దానుడై చేతిలో రూపాయ కాసు లేకపోతే కదా కారాగారములో పెట్టాము. అటువంటి రామదాసు గారికి ఇన్ని లక్షల వరహాలు ఎలా వచ్చాయి. కారాగారములో ఉన్నవాడి కోసము మీరు ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అని తానీషా అడగ లేదు రామ దర్శనముతో అలా ఉండిపోయాడు. రామ లక్ష్మణుల దర్శనము పొందడము మాటలు కాదు. ఆనంద పారవశ్యములో ఉండిపోయి డబ్బు పుచ్చుకున్నాడు. డబ్బు ముట్టినది విడచి పెట్టమని తానీషా రశీదు వ్రాసి ఇచ్చేసాడు. రాముడు ఉన్నాడని అనడానికి రామచంద్రమూర్తి ఇచ్చిన డబ్బే సాక్ష్యము. ఆ రశీదు పట్టుకుని రామదాసు గారిని విడిపించారు. నాకు సేవకులు ఎవరు? దాసులు ఎవరు? వాళ్ళు ఇన్ని లక్షల వరహాలు పట్టుకుని వచ్చి నన్ను విడిపించడము ఏమిటి? అని ఆయన తెల్లబోయారు. వెంటనే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారు అనుకున్నారు. వారు తమ పేర్లు దాచలేదు. రామోజీ, లక్ష్మోజీ అని చెప్పారు. ఇద్దరూ రామదాసు గారిని విడిపించి తీసుకుని వచ్చారు. ప్రభువు కూడా అనేక రకములైన ఈనాములు కానుకలు ఇచ్చి దివ్యస్నానము చేయించి పట్టుబట్టలు కట్టి పల్లకీలో తీసుకుని వచ్చి భద్రాచలమునకు తాహసీల్దారు పదవిని ఇచ్చాడు. ఆయన వాడిన ఆరు లక్షల వరహాలు కూడా ఇచ్చాడు. ఆ డబ్బంతా పెట్టి రామచంద్రమూర్తికి నగలూ పాత్రలూ వైభవాలూ ఉత్సవాలు ఎన్నో చేయించారు.


వృద్దాప్యములోకి వచ్చిన తరవాత ఆయనకి శరీరము బడలిపోయి కొండ ఎక్కలేక పూజామందిరములో కూర్చుని రామా! ఎప్పటికి నిన్ను చేరుకుంటాను? ఇందులో ఉండలేక పోతున్నాను, డొల్ల బారిపోయింది అని ప్రార్ధన చేస్తే భద్రాచలమునకు శ్రీ వైకుంఠము నుంచి దివ్య విమానము వచ్చి రామదాసు గారి ఇంటి ముందు దిగింది. అందులో నించి విష్ణు పార్శదులు దిగి, లోపలి వచ్చి, అయ్యా గోపరాజు గారూ శ్రీమన్నారాయణుడు మీకోసము విమానము పంపించారు. మిమ్ములను సశరీరముగా విమానము అధిరోహించి రమ్మన్నారు అంటే విని ఆయన సంతోషముగా బయటికి వెళుతూ భార్య కమలాంబని పిలిచి కమలా వైకుంఠము నుంచి విమానము వచ్చింది వెళ్ళిపోతున్నాను నువ్వూ వస్తావా? అన్నారు. ఎప్పుడూ రామనామము చెపుతూ విమానము వచ్చింది నారాయణుడు వచ్చాడు అని అనడము అలవాటు అయినా కమలాంబ గారు ఏదో పలవరిస్తున్నారు అనుకుని అలాగే నేను పనిలో ఉన్నాను మీరు బయలుదేరండి నేను తరవాత వస్తాను అంటే మహానుభావుడు బయటికి వచ్చి విమానము ఎక్కి అందరి వంకా చూసి భద్రాచల క్షేత్రములో అందరితో రామనామము చెప్పించారు.


భండన భీముడార్త జనబాంధవుడుజ్జ్వల బాణతూణ కో

దండకలాప్రచండభుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

డాండ డడాండ దాండ నినదంబులజాండము నిండ మత్తవే

దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !


రాముడున్నాడని నాకు ఎంత నమ్మకమో తెలుసా? ఉన్నాడని చెప్పడము కాదు, నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభములు పాతి, మధ్యలో పెద్ద భేరి కట్టి, ఏనుగు ఎక్కి, వచ్చి ఢామ్ ఢామ్ అని భేరి మ్రోగిస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు అలా మ్రోగిస్తున్నారు అని అడిగితే, నా రాముడు సాటి దైవము ఇంక లేడు! ఆయన యొక్క భుజములు శత్రువులను మర్దనము చేసేటప్పుడు తాండవము చేస్తాయి! ఎప్పుడు ధనుస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణము తీసి వింటి నారికి సంధిస్తాడో, ఎప్పుడు విడచి పెడతాడో తెలియదు! అటువంటి వాడు రాముడు! అని చెప్పుకున్న మహానుభావుడు రామదాసు గారు. 


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage 


instagram.com/pravachana_chakravarthy

 సర్ స్టఫోర్డ్ క్రిప్స్ ఏం చెప్పారు?


మా నాన్నగారు ఆలంగుడి ఆపత్సకాయం అయ్యర్ పరమాచార్య స్వామివారికి ‘బానిస’. మహాస్వామివారిపై వారికి అచంచలమైన భక్తిప్రపత్తులు. 1920లో ఉమామహేశ్వరపురం తాలూకా గ్రామాధికారిగా ఉన్నప్పుడు మాహాత్మా గాంధి గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ, పన్ను నిరాకరణ ఉద్యమాలకు అధ్యక్షత వహించారు. కుంబకోణం, పాపనాశం తాలూకాలలో ఇవి నిర్వహించినందుకు వారిని గ్రామాధికారి పదవి నుండి తొలగించారు.


1950లలో పరమాచార్య స్వామివారు కొన్నిరోజులపాటు మా ఊర్లో మకాం చేసారు. మొత్తం ఊరిప్రజలంతా ఆనందోత్సాహాలతో, దర్శనానికి వస్తున్న భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. ఒకరోజు పూజ పూర్తైన తరువాత మధ్యాహ్నం సమయంలో మఠం క్యాంపు ఉన్న స్థలంలో కొద్దిగా అలజడిగా ఉంది. మా ఇంటి ముందర నిలబడి ఉన్న నేను ఏమి జరిగిందో చూద్దామని అటుగా వెళ్లాను.


కుంబకోణం నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పులతో, చొక్కాలు వేసుకుని లోపలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న కావలివాడు వారిపై అరుస్తూ లోపలికి వెళ్ళకుండా వారిస్తున్నాడు. కాని వారు మాట వినకపోవడంతో అక్కడున్న వారి సహాయంతో నేను వారిని పట్టుకున్నాను. అక్కడున్న కొబ్బరి చెట్లకు కట్టేసి, అటువైపు వచ్చిన పోలీసులకు వారిని అప్పగించాము. ఆ ఇద్దరినీ తిరువిడైమరదూర్ పొలీస్ స్టేషనుకు తీసుకుని వెళ్ళారు.


ఆరోజు రాత్రి పూజ మొత్తం పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు నాకు కబురు చేశారు. మధ్యాహ్నం జరిగిన విషయం అడిగి, “అది సరే! అప్పుడే అక్కడకు పోలీసులు ఎలా వచ్చారు?” అని అడిగారు.


“నేను కమ్యునిష్టు పార్టి వ్యక్తిని కావడం వల్ల నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి విన్నపం చేశారు. (అప్పుడు నేను పక్కఊరిలో గ్రామాధికారిగా ఉన్న మా నాన్నగారికి సహాయకుడిగా ఉండేవాణ్ణి). దాని గురించి విచారించడానికి ఒక అధికారి వచ్చారు. ఆయనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా వచ్చారు. అప్పుడు వారిని ఉపయోగించుకున్నాను” అని చెప్పాగా, “ఓహో! అలాగా?” అని ఆశ్చర్యపోయారు స్వామివారు.


తరువాత స్వామివారు లబ్రేరియన్ ను పిలిచి, “నేను నిన్ను అప్పుడు కొనమని చెప్పిన కమ్యునిజం గురించిన ‘సిక్స్ ఆథర్స్’ పుస్తకాన్ని రేపు ఇతనికి ఇవ్వు” అని చెప్పారు. నావైపు చూసి, “వారంరోజుల లోపల ఆ పుస్తకాన్ని చదివి అందులో ఏముందో నాకు చెప్పు; ఎవరైనా అడిగితే ఆ పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పు” అని ఆదేశించారు.


అది నిఘంటువులా చాలా పెద్ద పుస్తకం. నాకు గుర్తు దాని వెల నలభై రూపాయలు. అప్పుడు పౌండు స్టెర్లింగ్ పదిహేను రూపాయలు. అది సర్ స్టఫోర్డ్ క్రిప్స్, అనువిన్ బెవన్, లూయిస్ ఫిషర్ మరియు ముగ్గురు ఇతర పాశ్చాత్య ప్రముఖులు వ్రాసిన పుస్తకం. దాన్ని చూడగానే నాకు వణుకు పుట్టింది. ఓకే వారం గడిచిపోయింది. ఒకరోజు పరమాచార్య స్వామివారు అడగనే అడిగారు, “ఏమిటి? ఆ పుస్తకాన్ని చదివావా? అందులో దేని గురించి చెప్పారు” అని.


“అది చాలా పెద్ద పుస్తకం పెరియవ. కొన్ని విషయలు నాకు అర్థం కాలేదు. స్టఫోర్డ్ క్రిప్స్ వ్రాసిన భాగం మాత్రం చదవగలిగాను” అని చెప్పాను.


“సరే! అతను ఏమి చెప్పారు?”


“అన్ని ఇజాలు మానవాళికి ఎదో ఒకటి ఇస్తాయి. కాని కమ్యునిజం మాత్రం మనుషుల నుండి అన్నిటిని తీసుకుంటాయి”


పరమాచార్య స్వామివారు అప్పుడు చూసిన చూపు, “ఏంటి అర్థమైందా?” అన్నట్లు ప్రశ్నిస్తున్న వారి చూపులు ఇప్పటికి నా కళ్ళముందు కదలాడుతున్నాయి.


ఈ ఘటన తరువాత నా ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అటు తరువాత పరమాచార్య స్వామివారికి సంపూర్ణ శరణాగతి చేశాను.


సాయంత్రం పూజ తరువాత స్వామివారు ఎందఱో పండితులు, ఘనాపాఠీలతో వేద చర్చలు చేసేవారు. మధ్యలో అయిదడుగుల ఎత్తు ఉన్న రెండు పెద్ద కంచు దీపాలు వెలుగుతూ ఉండేవి. ఆ వెలుగులో నుంచుని చదవమని నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి, స్వామివారు ఇష్టాగోష్టిలో మునిగిపోయారు. ఆ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో అక్కడ చాలా గందరగోళంగా ఉంది. నేను పుస్తకం చదువుతూ, 'meditation' కు బదులుగా 'mediation' అని చదివాను. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి, “ఇతను ఒక అకౌంటెంట్. అందుకే 'meditation' ని 'mediation' అని చదివాడు” అని అన్నారు. తరువాత స్వామివారు దాదాపు అరగంట పాటు meditation గురించి వివరిస్తూ మానసికంగా భారత దేశం మొత్తం తీసుకునివెళ్ళారు. అక్కడున్న గందరగోళంలో నేను ఏమి చదువుతున్నానో ఎవరికీ వినబడే అవకాశమే లేదు. కాని ఈ శతావధాని చెవులకు నా తప్పు వినబడింది.


కొద్ది రోజుల్లోనే శ్రీమఠం మకాం ‘శ్రీధర అయ్యార్ వాళ్’ వారి తిరువిసైనల్లూర్ చేరుకుంది. మఠం ఏనుగుకు అక్కడ మదమెక్కింది. గుడిసెలను కూల్చి విసిరేస్తున్న ఆ ఏనుగును నియంత్రించడం ఎవరివల్ల కాలేదు. చాలా ఇళ్ళు కూడా పాడయిపోయాయి. ఆ ఏనుగు ఆగ్రహానికి కార్లు, బస్సులు కూడా తప్పించుకోలేదు. ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఆ ఏనుగును అడ్డగించి, రెండు నదుల గుండా మా ఊరికి తీసుకురావడానికి సంబంధించిన విషయమై నన్ను రమ్మని పిలవడానికి మఠం నుండి ఒక వ్యక్తి నాకోసం మా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నేను ఇంటిలో లేకపోవడంతో నాకు ఆ విషయం తరువాత తెలిసింది. ఆ సాయంత్రం పూత ఏనుగును రెండు నదులను దాటించడం కాస్త కష్టమైన విషయం. అందునా నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మరుసటిరోజు ఉదయం శ్రీమఠానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా పోలీసులు ఏనుగును కాల్చి చంపారన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. ఒక్కసారిగా బాధ, అసహ్యం వేసింది. రాత్రే నేను వెళ్ళాల్సి ఉన్నింది అన్న ఆలోచనలతో స్వామివారి దగ్గరకు వెళ్లాను.


పూజ, ఆహారం వదిలివేసి ఎవరితోనూ మాట్లాడక, ఎవ్వరినీ చూడటానికి ఇష్టపడనట్టుగా శ్రీమఠం వెనకాల ఒక్కరే కూర్చున్నారు. అంతా శోకసంద్రంలా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు; స్వామివారి వద్దకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. మెల్లిగా ఒక్కొక్కరే స్వామివారు కూర్చున్న చోటుకు వెళ్ళాము. నేను అపచారం చేశానని ఏడుస్తూ స్వామివారి పాదాలపై పడ్డాను. ఏమి చెయ్యాలో తెలియక అందరూ అలా నిలబడి వున్నారు. అలా అరగంట గడిచిపోయింది. తరువాత స్వామివారు నిదానంగా వారికి కలిగిన నష్టం గురించి ఎంతో బాధతో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లి పడే వేదనతో అందరికీ వినబడేటట్టు ఆ ఏనుగు పుట్టినప్పటి సంగతి, దాని ఎదుగుదల, శరీరంపై మచ్చలు, దాని గుణాలు, ఇలా ఎన్నో విషయాలు తెలిపి, దాని జీవితకాలం అంతే అని తెలిపి, ఎంతో బాధ, శోకంతో మరలా స్వామివారు మౌనం వహించి, గోడకు చేరగిలబడ్డారు.


మహాస్వామి వారు చూపించిన ఈ కరుణకు అక్కడున్నవారందరమూ కదిలిపోయము. మాటలు రాని ఒక జీవిపై స్వామి కరుణ చూపారు అని కాదు. ప్రపంచంలోని అన్ని జీవరాసులపై స్వామివారికి ఉన్న ఆర్తి గురించి తలచుకుని. 


ఇది జరిగి దాదాపు యాభై సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు నాకు ఎనభైనాలుగేళ్ళు. తలచుకుంటే ఇప్పటికి హృదయం ద్రవిస్తుంది.


ఆలంగుడి (గురు స్థలం) అన్న పేరు వినగానే, స్వామివారి కళ్ళల్లో వచ్చే వెలుగును మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మహాస్వామి వారు సాక్షాత్తు ఆ గురు స్వరూపమే కదా! ఎంత రద్దీ ఉన్నప్పటికీ, “ఏమిటి, ఆలంగుడి నుంచా?” అని నన్ను అడగగానే, నాకు అది నాకు ఒక దివ్యమైన అనుభూతిలో కరిగిపోయాను. మాణిక్యవాచకులు చెప్పినట్టుగా, “ఉళ్ళంతాళ్ నిండ్రు ఉచ్చి అళవుం నెంజాయ్ ఉరుకత్తన్” కాలి నుండి తలదాకా కరిగి నీరైపోవడం.


--- నడువక్కరై ఎ. నారాయణ స్వామి అయ్యర్, మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ప్రశాంతంగా నిద్రపోలేడు

 శ్లోకం:☝️

*న చ రాత్రౌ సుఖం శేతే*

 *ససర్ప ఇవ వేశ్మని ।*

*యః కోపయతి నిర్దోషం*

 *సదోషోఽభ్యంతరం జనం ।।*

-మ.భా. ఉద్యోగపర్వం 38.40


భావం: ఇంట్లో పాము దాగి ఉందని తెలిస్తే సుఖంగా ఎలా నిద్రపట్టదో - అలాగే తాను దోషియై యుండి నిర్దోషులకు కోపం తెప్పించేవాడికి కూడా ప్రశాంతంగా నిద్రపోలేడు.

29, జనవరి 2023, ఆదివారం

శ్లోకం

: శ్లోకం:☝️

*నిన్దన్తు నీతినిపుణా యది వా స్తువన్తు*

*లక్ష్మీః స్థిరా భవతు గచ్ఛతు వా యథేష్టం l*

*అద్యైవ వా మరణమస్తు యుగాన్తరే వా*

*న్యాయాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః ॥*


భావం: నీతి నిపుణులు విమర్శించినా లేక ప్రశంసించినా, ధనం స్ధిరంగా ఉన్నా లేకపోయినా, మరణం ఈ రోజు వచ్చినా లేక యుగాంతంలో సంభవించినా, ధీరులు న్యాయమార్గం నుండి ఎన్నడూ వెనక్కి తగ్గరు.

: *కాశీ ఖండం - 11*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 *నైరుతి, వరుణ లోక వర్ణన* 


 శివశర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని, విష్ణు దూతలను కోరగా, వివరిస్తున్నారు. 


 మొదటిది నైరుతి. పుణ్యవతి పుణ్య జనులకు ఆవాసం.

వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు. దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా, ఈ లోకంలభిస్తుంది, అని, పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు

                                               *పింగాక్షోపాఖ్యానం*  


 వింధ్యాటవిలో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు. మంచి శూరుడు. క్రూరకర్మలంటే అయిష్టం. నిర్దాక్షిణ్యంగా జంతువులను, మనుష్యులను చంపే వారిని, కఠినంగా శిక్షించేవాడు. అడవిలో ప్రయాణించే వారిని, వెంట ఉండి దాటిస్తాడు. 


 ఒకసారి ఇతని బంధువు, ప్రయాణీకులను హింసించాడని విన్నాడు. రహస్యంగా వచ్చి, వాడిని పట్టుకొన్నాడు. ఇతరులకు అపకారం చేయవద్దని హెచ్చరించాడు. వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి, గౌరవంగా సాగనంపాడు. ఇంకోసారి మరో బృందం వస్తుంటే, కొందర్ని, వాళ్ళను చంపమని, దోచుకోమనీ, హెచ్చరికలు వచ్చాయి. అప్పుడు వారంతా, తాము పింగాక్షుడున్నాడనే ధైర్యంతో వచ్చామని, కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని, ప్రాణాలను రక్షించమని, యాత్రికులు వేడుకొన్నారు. ఈ మాటలను విన్న పింగాక్షుడు, వారిని భయపడవద్దని అనునయిస్తూ, ఆ చోటుకు చేరుకొన్నాడు. ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి, తన అనుచరగణంతో, పింగాక్షుడిని చంపమని ఆదేశించాడు. ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది. శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి, బంధించాడు. కాని అతని ధనుస్సు, బాణాలు, ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులు అవటంతో, వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు.  


 నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి, పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి, నైరుతి దిక్కుకు, ప్రభువును చేశారు

                                                  *వరుణ లోక వర్ణన*


 అక్కడి నుండి విష్ణుశర్మను వరుణ లోకానికి, విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు. ప్రజలకోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు, వరుణ లోకానికి వస్తారు. ఐశ్వర్య సంపన్నం. దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించేవారు, ఈ లోకం చేరుతారు. వేసవిలో విసనకర్రలను దానం చేసినవారు, సుగంధపు చల్లని పానీయాలిచ్చే వారు, చలివేంద్రాలను ఏర్పాటుచేసేవారు, వరుణలోకానికి చేరతారు. జలదారా మండపాలను, నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి ఇది నెలవు. పుణ్యనదులలో స్నానం చేయటానికి వీలుగా, మెట్ల నిర్మాణం చేసే వారికి, వరుణలోకం ఆవాస భూమి. అన్ని జలాశయాలకు వరుణుడు అదిపతి. అన్ని సముద్రాలకు నీటిని, ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా


 *వరుణుని జన్మ వృత్తాంతం*


 కర్దమ ప్రజాపతికి 

శుచిష్మoతుడనే కుమారుడు ఉన్నాడు. వినయ శీలి. సుగుణవంతుడు. ధైర్య శాలి. ఒకరోజు ఇతడు కొందరు బాలురతో కలిసి, ఒక సరస్సులో, స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగగానే, అతడిని, ఒక మొసలి 

 పట్టుకుంది. ఈ విషయాన్ని, స్నేహితులు, తండ్రికి తెలియజేశారు. 


 ఆయన, అప్పుడు, శివధ్యానంలో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల, ఒక సరస్సులో, కొంతమంది మునిబాలురు జలక్రీడలాడటం, కనిపించింది. అందులో రుద్రరూపుడైన, ఒక ముని బాలుడు, ‘’ఓయి సముద్రాధిపా !భక్తుడైన కర్దమ ప్రజాపతి కుమారుడెక్కడ ఉన్నాడు? శివుని సామర్ధ్యం తెలియకుండా, దుష్క్రుత్యానికి పాలుపడ్డావు.‘’ అని గర్జించాడు.  


 సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశుమారకమైన మొసలిని కూడా బంధించి తెచ్చి, శివుని పాదాల చెంత పడేసాడు. శివుని పాదాలకు నమస్కరించి, ‘’మహాశివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువు వల్లనే, శిశువుకు మరణం సంభవించింది .’’ అని, విన్న వించుకొన్నారు. అప్పుడు శివుడు మన్నించి, ఆ బాలుని తండ్రి, కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి, అప్పగించమని, ప్రమధగణాలకు చెప్పాడు. 


 తండ్రి కుమారుని చూచి, సంతోషంతో కౌగలించుకొని, యోగాక్షేమాలను విచారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా, తండ్రికి తెలియ జేశాడు. తండ్రి అనుమతి గ్రహించి, బాలుడు, కాశీలో శివలింగాన్ని ప్రతిష్టించి, అయిదు వేల సంవత్సరాలు శిలలాగా నిశ్చలంగా శివుని కోసం, తపస్సు చేశాడు.

మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. తనకు జలాలపై ఆధిపత్యం కావాలని, బాలుడు విన్నవించాడు. 


 అప్పుడు భవానీపతి ‘’నువ్వు, వాపీ, కూప, తటాకాది నదీనదాలకు సమస్త జలాలకు 

అధిపతివి అవుతావు. సమస్త రత్నాలకు అధిపతివి నీవే. పశ్చిమదిక్కునకు అధిపత్యం నీదే. పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు. నువ్వు స్థాపించిన ఈ లింగం ‘’వరుణేశ్వర లింగం‘’ గా ప్రసిద్ధి చెందుతుంది. మణికర్నేశ్వరలింగం నైరుతి దిశలో, సంస్తాపితమై ఉంటుంది. దీనిని అర్చించిన వారికి, అకాలమరణం రాదు. నీరసాలైన అన్నపానాదులు వరుణుని అనుగ్రహంతో సరసములుగా మారుతాయి." అని వరమిచ్చి, అంతర్ధాన మయ్యాడు . 


 శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు, నైరుతి దిశకు అధిపతి అయాడు.


 *కాశీఖండం సశేషం..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🅰️🅿️SRINU*

: *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - jan 28._*


 **స్వామి వివేకానంద స్ఫూర్తి* ..*రోజుకో సూక్తి - జనవరి 28* 

 

*దీరులై ఉండండి,* 

*ఆత్మస్థైర్యంతో పని చెయ్యండి,*

*మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే*,*

*పిరికిపందలు ఆత్మస్థైర్యం లేనివారు రోజు మరణిస్తారు* .


बने रहें,

आत्मविश्वास से काम लें,

इंसान सिर्फ एक बार मरता है*,*

बिना संयम के कायर रोज मरते हैं।


stay tuned,

Work with confidence,

Man dies only once*,*

Cowards die every day without self-control.


 __1901 సంవత్సరం మార్చి31వ తేదీన స్వామి వివేకానంద టాక పర్యటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనము పుట్టిన హిందూ మతం సనాతన ధర్మము గురించి_ .. _ఆ సమయంలో ఇచ్చిన ఉపన్యాసం._ 


 *అంశం* : *మనము పుట్టిన* *హిందూ మతం గురించి* ...


 – *స్వామి వివేకానంద*.


🙏*శుభోదయం*🙏


       ***************

🌷మహానీయుని మాట🌷

       ****************


"మనిషిగా జన్మించినoదుకు మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి అని చూడాలి.

ఎదుగుతున్న వారికి ప్రోత్సహించి చేయూతనివ్వాలి.

అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది."


       *************

💎నేటి మంచి మాట💎

       *************


"మనకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకూడదు.

మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు."


 ❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌺 అమృతం గమయ 🌺


*అమృత మనసు*

  

జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది. వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి.


శ్రద్ధగా రాస్తే చేతివ్రాతే మారినపుడు, శ్రమిస్తే తలరాతలు మారవా.

       

మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


నీవు ముళ్ళ మధ్యలో వున్నా అందంగా ఎలా వుండాలో గులాబీని చూసి, బురదలో వున్నా పవిత్రంగా ఎలా వుండాలో తామర పువ్వును చూసి నేర్చుకో. 


ఎందుకంటే, ఎన్ని కష్టాలు, సమస్యలున్నా, వాటిని మనోబలంతో ఎదుర్కొంటూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం పంచడమే ఆనందం. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నవ్వుకుంటారు. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. 


రూపాయి అయినా, రూపం అయినా ఎక్కువ రోజులుండవు. 


కానీ, నీ యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 


 ప్రశాంతంగా ఉండు.

*మాఘ పురాణం - 8 వ అధ్యాయము*

*29-01-2023 ఆదివారం*


🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


దత్తత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*🅰️🅿️SRINU*

హిందువు కావడానికి

 హిందువు కావడానికి

హిందువుగా బ్రతకాడానికి 101 కారణాలు


1. నేను హిందువుని, ఎందుకంటే భగవంతుడిని గ్రహించడం జీవిత గమ్యం అని నాకు చెబుతుంది.

2. హిందూ ధర్మం నేనే ఆత్మ అని నేర్పుతున్నాను, శరీరం కాదు అని చెప్తుంది.

3. హిందూ ధర్మం నాకు నచ్చిన ఏ పేరు లోనో మరియు ఏ రూపంలోనైనా దేవుణ్ణి ఆరాధించడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది.

4. హిందూ ధర్మం, దేవుడు బయట మాత్రమే కాదు, నాలో కూడా ఉన్నాడు అని చెప్తుంది.

5. సత్యం మాత్రమే విజయం సాధిస్తుందని హిందూ ధర్మం బోధిస్తుంది.

6. సాధువులు మరియు ఋషులు దేవుని ప్రేమ మరియు దయకు జీవన రుజువులు.

7. నిస్వార్థ సేవ అత్యున్నత కర్తవ్యం అని హిందూ ధర్మం బోధిస్తుంది.

8. నా స్వంత నిజమైన ఆత్మ తత్వాన్ని కనుగొనటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.

9. హిందూ ధర్మం మనలో ఇప్పటికే ఉన్న దైవత్వం యొక్క అభివ్యక్తిగా భావిస్తుంది.

10.శరీరం యొక్క అశాశ్వతతను చూడటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.

11. హిందూ ధర్మం నాకు అనువైన విధంగా దేవుణ్ణి పూజించే స్వేచ్ఛను ఇస్తుంది.

12. సర్వజ్ఞుడైన భగవంతుడిని చేరుకోవడానికి ఒక్క మార్గం మాత్రమే లేదని హిందూ ధర్మం అంగీకరించింది.

13. జీవితంలోని వివిధ దశలను జరుపుకోవడానికి హిందూ ధర్మం నాకు మార్గనిర్దేశం చేస్తుంది.

14. హిందూ ఋషులు మరియు భక్తుల కథలు చదవడం నాలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

15. హిందూ ధర్మం ఆలోచన మరియు హేతుబద్ధీకరణను ప్రోత్సహిస్తుంది.

16. హిందూ పండుగలు అందరికీ ఆనందకరమైన కార్యకలాపాలను అందిస్తాయి.

17. హిందూ ధర్మం ఆరోగ్యకరమైన సాధారణ ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.

18. నేర్చుకున్నవారిని, జ్ఞానులను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

19. ప్రాచీన హిందూ దేవాలయాలు నా పూర్వీకుల విస్మయం మరియు ఆశ్చర్యాన్ని చూపిస్తాయి.

20. దేవుని సృష్టిని సేవించడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.

21. శరీరం మరియు మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి యోగా సహాయపడుతుంది.

22. ధ్యానం మనస్సును శాంతపరుస్తుంది మరియు అంతర్గత శాంతిని ఇస్తుంది.

23. నా శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడానికి యోగాసనాలు నాకు సహాయపడతాయి.

24. వేద మంత్రాల శ్లోకం అంతర్గతంగా మరియు బాహ్యంగా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది.

25. హిందూ ధర్మం చిన్నది లేదా పెద్దది అనే తేడా లేకుండా జీవులను మన స్వంతంగా సేవ చేయడానికి బోధిస్తుంది.

26. అన్ని జీవులలో మానవులే గొప్పవారని హిందూ ధర్మం చూపిస్తుంది.

27. ఏ పని లౌకిక కాదు కానీ ప్రతి పని ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావచ్చు.

28. జయించడం అంటే త్యజించడం.

29. అత్యధిక లాభం స్వీయ నియంత్రణ సాధించడం.

30. హిందూ ధర్మం ఎవరిపైనా దేనినీ బలవంతం చేయదు.

31. అన్ని మతాలను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

32. హిందూ ధర్మం ఏ పాపిని శాశ్వతంగా ఖండించదని భరోసా ఇస్తుంది.

33. నేను ఎల్లప్పుడూ నన్ను సంస్కరించుకుంటాను మరియు పరిపూర్ణతను సాధించగలనని హిందూ ధర్మం నాకు ఆశను ఇస్తుంది.

34. హిందూ ధర్మం నా శరీరానికి, మనసుకు వివిధ విభాగాలను అందిస్తుంది.

35. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తానని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.

36. నేను ఎప్పుడూ స్వచ్ఛమైన, ఎప్పుడూ స్వేచ్ఛగా, ఎప్పటికి పరిపూర్ణమైన ఆత్మ అని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.

37. నా కోసం సత్యాన్ని కనుగొనడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.

38. భౌతిక విషయాలలో కూడా దేవుని ఉనికిని అనుభూతి చెందడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.

39. నా మొదటి దేవుడు నా తల్లి అని హిందూ ధర్మం చూపిస్తుంది.

40. గురువును గౌరవించకుండా జ్ఞానం పొందలేరని హిందూ ధర్మం చూపిస్తుంది.

41. పవిత్రమైనా, లౌకికమైనా ప్రతి జ్ఞానం దేవుని నుండే వచ్చిందని హిందూ ధర్మం బోధిస్తుంది.

42. ప్రతి ఒక్కరిలో దేవుడు అంతర్గత మార్గదర్శి అని హిందూ ధర్మం బోధిస్తుంది.

43. ప్రతి స్త్రీ దేవుని శక్తి యొక్క స్వరూపం అని హిందూ ధర్మం బోధిస్తుంది.

44. ఆత్మకు లింగం, జాతి, కులం లేదని హిందూ ధర్మం బోధిస్తుంది.

45. సంపూర్ణంగా మరియు నిస్వార్థంగా చేసిన ప్రతి పని నన్ను పరిపూర్ణంగా చేస్తుంది.

46. ​​నేను నృత్యం ద్వారా భగవంతుడిని చేరుకోగలను.

47. నేను సంగీతం ద్వారా దేవుణ్ణి కనుగొనగలను.

48. నేను కళల ద్వారా దేవుణ్ణి కోరుకుంటాను.

49. మంచి ఎప్పుడూ చెడుపై విజయం సాధిస్తుందని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

50. హిందూ ధర్మం నన్ను దేవుడికి భయపడమని చెప్పదు కాని దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది

51. దేవుడు నా స్నేహితుడు.

52. దేవుడు నా గురువు.

53. దేవుడు నా తల్లి.

54. దేవుడు నా తండ్రి.

55. దేవుడు నా ప్రేమికుడు.

56. దేవుడు నన్ను భరించేవాడు

57. దేవుడు నా బిడ్డలో,నాలో కూడా ఉన్నాడు.

58. దేవుడు ప్రతిదానిలో స్వచ్ఛమైనవాడిగా మరియు అందమైనవాడుగా ఉన్నాడు.

59. దేవుడు కూడా దు దుఃఖమైన స్థితిలో ఉన్నాడు అని చూపించాడు.

60. దేవుడు అంతర్గత నియంత్రిక.

61. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు.

62. నేను పరిపూర్ణత సాధించే వరకు జీవితం పుట్టుక మరియు మరణాల పరంపర అని హిందూ ధర్మం బోధిస్తుంది.

63. నా స్వంత సామర్థ్యం ప్రకారం ఉపవాసం మరియు జాగరూకత పాటించటానికి నాకు స్వేచ్ఛ ఉంది.

64. నా మనస్సును భక్తి మరియు స్వచ్ఛతను పెంపొందించడానికి మాంసం మానుకోవాలని హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.

65. భగవంతుడిని ప్రేమించటానికి వినయంగా ఉండటానికి హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.

66. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడమని హిందూ ధర్మం నాకు చెప్తుంది.

67. హిందూ ధర్మం నాకు అహింస మరియు ఇతరులకు గాయపడకుండా ఉండటానికి నేర్పుతుంది.

68. బలహీనులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

69. దేవుని అనుగ్రహం ద్వారా పాపులను కూడా శుద్ధి చేయవచ్చని హిందూ ధర్మం చూపిస్తుంది.

70. హిందూ ధర్మం నమ్మటంలో కాదు, ఉండటం మరియు మారడం.

71. దేవుడు ప్రతిదీ మరియు ప్రేమతో ఇచ్చిన దేన్నీ అంగీకరిస్తున్నాడని హిందూ ధర్మం చూపిస్తుంది.

72. అధర్మం నుండి ధర్మాన్ని రక్షించమని భగవద్గీతలో దేవుడే స్వయంగా చెప్పాడు.

72. ధర్మం యొక్క మార్గాన్ని చూపించడానికి దేవుడు భూమిపై అవతరించాడని హిందూ ధర్మం చూపిస్తుంది.

73. నన్ను పాపిగా భావించడం దైవదూషణ అని హిందూ ధర్మం చూపిస్తుంది.

74. ప్రతి చర్యకు దాని ప్రతిచర్య ఉందని హిందూ ధర్మం బోధిస్తుంది.

75. ప్రార్థనలు మరియు దేవుని పేరును పునరావృతం చేయడం ద్వారా కర్మను మార్చవచ్చు.

76. పవిత్ర ప్రజలకు, మంచి భక్తులకు సేవ చేయడం ద్వారా నేను దేవునికి సేవ చేయగలను.

77. కర్మ సిద్ధాంతం నేను నా స్వంత విధి యొక్క సృష్టికర్త అని చూపిస్తుంది.

78. వేదాలు నిర్భయతపై బోధిస్తాయి.

79. భగవద్గీత స్వీయ ప్రేరణపై ఉత్తమ మాన్యువల్.

80. పురాణాలు సరళమైన కథలలో గొప్ప సత్యాలను ఇస్తాయి.

81. రామాయణం ఎలా జీవించాలో నాకు చూపిస్తుంది.

82. శ్రీమద్ భాగవతం ఎలా చనిపోవాలో నాకు నిర్దేశిస్తుంది.

83. జీవితంలో కష్టాలను ఎలా ఓడించాలో మహాభారతం నాకు చూపిస్తుంది.

84. ఉపనిషత్తులు నా నిజమైన ఆత్మ గురించి అత్యున్నత సత్యాన్ని నాకు నిర్దేశిస్తాయి.

85. భగవంతుడిని వివిధ మార్గాల్లో ఎలా ఆరాధించాలో అగమాలు నిర్దేశిస్తుంది.

85. ఇతిహాసాలు మరియు పురాణాలు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడతాయి.

86. ఇతరులను గాయపరచడం నా స్వయాన్ని గాయపరచడమే అని హిందూ ధర్మం బోధిస్తుంది.

87. నేను మరొకరి స్వాధీనంలో ఉండకూడదని హిందూ ధర్మం బోధిస్తుంది.

88. నా పెద్దలను గౌరవంగా చూడాలని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

89. హిందూ ధర్మం నాకు జీవితంలోని వివిధ దశలలో వేర్వేరు విధులను నిర్దేశిస్తుంది.

90. ఇతరుల కోసమే స్వార్థాన్ని వదులుకోవడాన్ని హిందూ ధర్మం ప్రశంసించింది.

91. శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసే ధర్మ

కర్మగా వివాహాన్ని హిందూ మతం సూచిస్తుంది.

92. హిందూ ధర్మం మరణాన్ని పాత వస్త్రం యొక్క మార్పుతో పోలుస్తుంది.

93. మంచి చర్యలు చేయడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.

94. హృదయంలో స్వచ్ఛమైన వారు భగవంతుడిని చూడగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.

95. గొప్ప ప్రయత్నం ద్వారా ఎవరైనా గొప్పతనాన్ని సాధించగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.

96. హిందూ ధర్మం ప్రతి ఒక్కరూ - పురుషుడు, స్త్రీ, బిడ్డ మరియు వృద్ధులు గొప్ప సాధువులు మరియు ఋషులు కావచ్చు.

97. హిందూ ధర్మం శిక్షించేది దేవుడే కాదు, మన స్వంత కర్మ అని చూపిస్తుంది.

98. భగవంతుని ప్రేమికులు ఏ జాతికి, కులానికి చెందినవారు కాదని హిందూ ధర్మం చూపిస్తుంది.

99. హిందూ ధర్మం సహనాన్ని మాత్రమే కాకుండా సార్వత్రిక అంగీకారాన్ని బోధిస్తుంది.

100. హిందూ ధర్మం వైవిధ్యంలో ఐక్యతను చూస్తుంది.

101. హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి...

.

హనుమత్కుండం

 #హనుమత్కుండం / హనుమ కుండము:


దక్షిణ మహాసముద్రం తీరంలో రామేశ్వర మహాక్షేత్రంలోని ‘’హనుమత్కుండం" గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించి చెప్పాడు.


స్కంద పురాణంలో బ్రహ్మఖండంలో రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించబడింది. అవి 

▫️చక్ర తీర్ధం, 

▫️భేతాళ వరద తీర్ధం, 

▫️పాప వినాశనం, 

▫️సీతా సరస్సు, 

▫️మంగళ తీర్ధం,

▫️అమృత వాపిక, 

▫️బ్రహ్మ కుండము,  

▫️హనుమత్కుండం, 

▫️అగస్త్య తీర్ధం, 

▫️రామ తీర్ధం, 

▫️లక్ష్మణ తీర్ధం, 

▫️జటా తీర్ధం, 

▫️లక్ష్మీ తీర్ధం, 

▫️అగ్ని తీర్ధం, 

▫️శివ తీర్ధం, 

▫️శంఖ తీర్ధం, 

▫️యమునా తీర్ధం, 

▫️గంగా తీర్ధం, 

▫️గయా తీర్ధం, 

▫️కోటి తీర్ధం, 

▫️స్వాధ్యామ్రుత తీర్ధం, 

▫️సర్వ తీర్ధం, 

▫️ధనుష్కోటి తీర్ధం, 

▫️మానస తీర్ధం.


రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల‘’ గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్త విషయాన్ని కూడా తెలిపి, ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.


హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించిపోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి ఇసుకతో లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు. ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. 


మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. విషయము తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి ‘’రామా ! నన్ను అవమానిస్తావా ? సైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు ? ఇంకో చోట ప్రతిష్ట చేయటానికోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది ? నాకీ జీవితం వద్దు. నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను‘’ అని దూకబోతుండగా రాముడు వారించాడు ‘’అన్నా హనుమన్నా ! మనిషి తను చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు. దుఖం పొందటం వివేకికి తగని పని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్తాపిద్దాం. ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరెయ్యి‘’ అన్నాడు.


అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఇసుమంత కూడా కదలలేదు. మళ్ళీ ప్రయత్నం చేసి వీలుగాక నెత్తురు కక్కుకొంటు దూరంగా పడిపోయాడు. పడిన చోట హనుమ ముక్కులు, చెవుల, నోటి నుండి విపరీతంగా రక్తంకారి ఒక సరస్సుగా మారింది. హనుమ స్పృహ కోల్పోయాడు. అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్లి, అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకొని సేద తీర్చాడు. అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు.


కొంత సేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది. అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతారాములు ప్రతిష్టించారు. హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే ‘’హనుమత్కుండం‘’.


ఇది రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతారాములు అనుగ్రహించారు.

మాఘ పురాణం* *7 వ అధ్యాయము*

 *మాఘ పురాణం*

*7 వ అధ్యాయము*

*28-01-2023 శనివారం*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*


వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.


తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.


అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.


ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.


కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.


*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.


ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🅰️🅿️SRINU*

అహంకారం వదిలితే

 అహంకారం వదిలితే సర్వం బ్రహ్మ మయం


మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ కలియుగానికి తరుణోపాయం. సత్యం అన్నది సత్ కు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.

ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని పిలవడం మొదలెట్టాడు, అంతలో ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.

‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.

నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’

దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.

‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”

‘నమ్ముతున్నాను’ అన్నాడు.

‘నేను ఏది చెప్పినా చేస్తావా?”

‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.

‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు

బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.

‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.

‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.

సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి.

సద్బోధన

 *సద్బోధన*

            ➖➖➖


*భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం.*


*మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి..!* 


*అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, ఆయన మనకు మంచినే యిస్తాడు.*


*ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...*

                       

         *లోకాః సమస్తాః సుఖినోభవన్తు!*

భీష్మాష్టమి

 🕉️👉 *భీష్మాష్టమి*👈🕉️


*గురుబోధ*

ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మ తర్పణం, అర్ఘ్యం మాత్రము(తల్లి తండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే. 


వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹

గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹

అపుత్రాయ జలంధద్మి ౹ నమో భీష్మవర్మణే ౹౹

భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹

అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹


తర్పణ క్రమః


1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం

   తర్పయామి -  3 సార్లు

2. ఆజన్మ బ్రహ్మచారిణం  అపుత్రాయ భీష్మవర్మాణం 

  తర్పయామి - 3సార్లు

3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం

భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు


ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.


 శ్లో.  వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹ 

అర్ఘ్యం దదామి భీష్మాయ  ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹


ఇతిభీష్మ తర్పణ విధిః


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

గాయత్రి మంత్ర మహిమ..!!

 🙏గాయత్రి మంత్ర మహిమ..!!


🌿ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా

చేసుకొని పాండ్యరాజు ఒకరు

పాలిస్తూ వుండేవారు. 


🌸ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు. 

వైద్యులు ఎంత మంది

ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.


🌿అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు. 


🌸 జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు 

చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 


🌿మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 


🌸పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని

చెప్పాడు . 


🌿రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు.


🌸కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ

వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 


🌿ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు

రాగానే   ప్రతిసారి లాగనే

ఆ బొమ్మ మూడు వేళ్ళు

ఎత్తి చూపింది. 


🌸బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. 

వెంటనే బొమ్మ రెండు వేళ్ళు

చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు.  


🌿తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ.

దానికి   బ్రాహ్మణుడు 

సరేనని,  దగ్గర వున్న  

పాత్రలోని  నీటిని, తీసుకుని

ఆ నీటి ధారతో దానం చేశాడు.


🌸మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే 

మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.


🌿పిదప  , ఆ మంత్ర బొమ్మ 

మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.


🌸రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను

మూడు పూటలా చేసే 

గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.


🌿తరువాత రెండు వ్రేళ్ళను

మాత్రమే చూపింది బొమ్మ, 

అప్పుడు కూడా, రెండు

పూటలా జపించిన గాయత్రి

మంత్ర జప  పుణ్య ఫలాన్ని

అడుగుతున్నదని తలచి

ఇవ్వను అని చెప్పాను. 


🌸ఆఖరికి ఒక వ్రేలు చూపినది

బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర

పుణ్య ఫలాన్ని  యివ్వడానికి

సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని

ధారపోశాను. 


🌿దాని ఫలితంగా 

బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.


🌸రాజు గారు , గాయత్రీ మంత్ర

జప పుణ్యఫలాలను, 

అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి

విలవైన కానుకలను యిచ్చి

సత్కరించాడు.


🌿ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి...🙏💐

🌹ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః…🙏


A collection from 

🙏mi Nagaraju Ravula guru swami 🪴🙏

 *ॐ            श्री आदित्य हृदयम्* 

            *శ్రీ ఆదిత్య హృదయమ్* 

        *SRI ADITYA HRUDAYAM* 


     *(महाकाव्य रामायण में युद्ध कांड से)* 

           *(శ్రీరామాయణాంతర్గతం)* 

   *(FROM SRIMADRAAMAAYAN)* 


                                *శ్లోకం :14/31* 

                        *SLOKAM :14/31* 


*आतपी मण्डली मृत्युः*  *पिङ्गलस्सर्वतापनः ।* 

*कविर्विश्वो महातेजाः*  *रक्तस्सर्वभवोद्भवः ॥१४॥* 


*అతీప మండలీ మృత్యుః* 

*పింగళః సర్వతాపనః I*  

*కవిర్విశ్వో మహాతేజాః* 

*రక్తః సర్వభవోద్భవ ॥* 


    *వేడిని కలిగియుండువాడు,*  

    *వృత్తాకారమైన బింబము గలవాడు,* 

    *విరోధులను రూపుమాపుతాడు.* 

    *ప్రభాతసమయమున పింగళవర్ణము కైగియుండువాడు,* 

    *మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు.* 

    *వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు.* 

    *విశ్వమును నిర్వహించువాడు,* 

    *గొప్ప తేజస్సు గలవాడు.*  

    *సకల ప్రాణులయందును అనురక్తి గలిగియుండు వాడు,*  

    *సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.*  


   *भगवान सूर्य वह हैं जो अंतरिक्ष के स्वामी हैं,* 

    *वे उत्पन्न करते हैं और गर्मी फैलाते हैं,* 

    *जीवन का निर्माण करते हैं और जीवन का अंत करते हैं।*

    *वह ब्रह्मांड में कार्रवाई को प्रेरित करता है।* 

    *वह सर्वव्यापी है।* 

    *उनकी चमकदार लाल किरणें इस ब्रह्मांड में जीवों को जीवित कर देती हैं।* 


*(Salutations to the Sun God)* 

    *His great orb (Mandala) which is full of Heat is like an incarnation of Death (Mrityu),* 

    *having Reddish Brown colour and burning everything within it.* 

    *He is a Poet who creates the World (by supplying energy for activities);* 

    *His great Fiery Energy, Red in colour, gives rise to this entire Worldly Existence.* 


https://youtu.be/T4CkKYfYhYw


                      *=x=x=x=*


  *— రామాయణం శర్మ* 

           *భద్రాచలం*

ముసలితనం

 శ్లోకం:☝️

*వార్ధక్యం వయసా నాస్తి*

  *మనసా నైవ తద్భవేత్‌ l*

*సంతతోద్యమ శీలస్య*

  *నాస్తి వార్ధక్య పీడనమ్‌ ll*


భావం: ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని భావం. 


ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.


పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. 


మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.


మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. 


‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక్య పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. 


భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు. 


భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. 


నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.!!


ఓం నమో భగవతే వాసుదేవాయ!🙏

28, జనవరి 2023, శనివారం

రథోత్సవాలు

 మువ్వురు మానవులకు రథోత్సవాలు


దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.


“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.


తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.

దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.


శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.


ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.


అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!

మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.


ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.


“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.


--- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గంగా పుష్కరాలు

 *గంగా పుష్కరాలు 2023*

                                                                           హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని 

గంగా, 

యమునా, 

గోదావరి, 

కావేరీ 

మొదలైన నదులను స్త్రీశక్తి రూపాలుగా పూజిస్తారు. ఒక్క బ్రహ్మపుత్ర తప్ప మిగిలిన నదులన్నీ స్త్రీల పేర్లతో ఉన్నాయి. మానవుడు ఆచరించు అన్నిరకాల  మంగళకరమైన అర్చనలు, ఆరాధనలు, క్రతువులు, యజ్ఞాలు మొదలైన సంప్రదాయాలన్నీ నీటితో ముడిపడి ఉన్నాయి. అంతేకాక శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలుకూడా నీటితో ముడిపడినవే. స్నానాలు అన్నిటిలో పుష్కరసమయంలో సంబంధిత నదీస్నానం చేయడం పుణ్యప్రథమని పురాణాల్లో తెలుపబడింది. పుష్కరసమయంలో సంబంధిత నదులు ప్రవహించు పరీవాహకప్రాంతాలో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలలో మరణించిన పూర్వీకులకు  శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలు చేయుట ఉత్తమమని కూడా తెలుపబడింది. బ్రహ్మ ఆకాశం, వాయువు, జలం, అగ్ని,భూమి అను పంచ భూతాలు సృష్టించగా పంచ భూతాల నుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం. మనిషి ఉదయం నిద్రలేచింది మొదలుగా  నిద్రకు ఉపక్రమించేవరకు దైనందిన కార్యక్రమాలు నీటితో ముడిపడ్డవే. మానవజీవితంలో ప్రధానమైన నీటి  ప్రాముఖ్యత గుర్తుచేసేవే పుష్కరాలు.

దైనందిన కార్యక్రమాలలో 12 సంవత్సరాలు కాలం లేదా సమయం చెప్పడానికి పుష్కరకాలం అనిచెప్పడం సాధారణం.. మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు నదికి సంబంధించిన రాశిలో  బృహస్పతి ప్రవేశించినట్లు గణనచేసి ఆనదీజలం సాధారణ రోజులకంటే 12 రోజుల కాలం పుష్కరాలకాలం పవిత్రమైనట్లు భావిస్తారు. పుష్కరాలకుకల ఖ్యాతిపై కధనం ఉన్నది. పురాణకథ ప్రకారం  పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సుచేయగా శివుడు ఆయన భక్తికిమెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు.  పుష్కరుడు జీవులు చేసిన పాపాలవల్ల వారు స్నానంచేసిన నదులు అపవిత్రమవుతున్నాయని,నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, లోకహితం కోరి తన శరీర స్పర్శచే నదులు పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడు. శివుడు పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆనది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చాడు.  

సింధూనదికి కుంభ రాశిలో  20-11-2021 తేదీన  ప్రణహితనదికి మీన రాశిలో 13-04-2022 తేదీన పుష్కరాలు జరిగియున్నవి. రాబోవు పుష్కరాలు గంగానదికి  మేష రాశిలో 22-04-2023 తేదీన, రేవానదికి (నర్మదకు ) వృషభ రాశిలో 01-05-2024 తేదీన,  సరస్వతీనదికి మిథున రాశిలో 14-05-2025  తేదీన,

యమునానదికి  కర్కాట రాశిలో 01-06-2026తేదీన,  గోదావరినదికి  సింహ రాశిలో 26-06-2027 తేదీన,

కృష్ణా నదికి కన్యా రాశినందు  24-07-2028 తేదీన ,

కావేరీ నదికి తులారాశినందు 24-08-2029 తేదీన, భీమానదికి వృశ్చిక రాశిలో 23-09-2030 తేదీన,తపతి పుష్కరవాహినికి ధనస్సు రాశినందు 15-10-2031 తేదీన మరియు తుంగభద్రనదికి మకర రాశినందు 24-10-2032  తేదీన పుష్కరాలు ప్రారంభమౌతాయి..

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం 22-04-2023 తేదీన  ప్రారంభమైబృహస్పతి పన్నెండో రాశిఅయిన మీనంలో ప్రవేశించినప్పుడు 03-05-2023 తేదీన ముగుస్తుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము అనిచెప్పబడింది. పుష్కర కాలంలో  22-04-2023  నుండి మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరంఅని, చివరి పన్నెండు రోజులు 03-05-2023 వరకు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు. సంవత్సరకాలంలో ఆది మరియు అంత్య పుష్కరాల పన్నెండు రోజులు ప్రత్యేకమైనవి. అంత్య పుష్కరాలకంటే ఆదిపుష్కరాలు పన్నెండురోజులు పవిత్రమైయనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో ఉంటాడని పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటంవలన సకల తీర్థాలలో స్నానంచేసిన ఫలితం దక్కుతుందని గంగానదిలో అనేకమంది భక్తులు స్నానాలుచేస్తారు.

హిందువులు గంగాదేవిని పాపములను తొలగించి శుద్ధిచేయు దేవతగా పూజిస్తారు. మొసలి వాహనధారి అయిన  గంగను అందమైన స్త్రీగా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో గంగ నదులలో పవిత్రమైనదిగా పేర్కొనబడింది. గంగాదేవి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. రామాయణం ఆమె పర్వతరాజు హిమవంతుని ప్రధమ సంతానంగా పార్వతి సోదరిఅని తెలుపుతుంది. బ్రహ్మ హిమవంతున్ని సృష్టించి హిమాలయాలకు రాజును చేశాడు.  హిమవంతుడు మేరు అను పర్వతరాజు కుమార్తె మేనవతిని వివాహం చేసుకున్న చాలాకాలం పిమ్మట  వారికి కుమార్తె జన్మించగా ఆమెకు గంగఅని పేరుపెట్టారు. పిమ్మట వారికి సతీదేవి అవతారమైన పార్వతి కుమార్తెగా జన్మించింది. గంగ పెద్దయ్యాక, దేవతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు, ఆమె నది రూపంలో ప్రవహించింది. 

మహాభారతంలో గంగ కురువంశరాజైన శంతనుని భార్యగా భీష్మునితో ఎనిమిదిమంది వశువులకు తల్లిగా తెలుపబడింది. బ్రహ్మ గంగ మరియు శంతనులను భూలోకంలో జన్మించమని శాపంఇచ్చాడు. శంతనుడు గంగానది ఒడ్డున గంగాదేవిని కలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరాడు. తన చర్యలను శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుపై ఆమె ఆతని ప్రతిపాదనన అంగీకరించింది. శంతనుడు వారు వివాహంచేసుకొని కలిసి జీవించి వసువుల అవతారమైన ఎనిమిదిమంది కుమారులను పొందారు. శాపగ్రస్తులైన వారు భూమిపై జన్మించి నప్పుడు తమజీవితాన్ని ముగించమని గంగను కోరారు. వారి అభ్యర్థనప్రకారం శంతనుని ఎదురుగానే గంగ సంతానాన్ని గంగలో పారవేయడం ప్రారంభించింది. ఎనిమిదవ కుమారుడైన భీష్ముని గంగలో ముంచబోగా, శంతనుడు అడ్డుకున్నాడు.గంగ భీష్మునితో వెళ్లిపోయి అతనికి పదేళ్ల వయసులో శంతనునికి  తిరిగి అప్పగించి వెళ్లిపోయింది. 

భాగవత గ్రంధంలో విష్ణువు గంగకు మూలమని పేర్కొనబడింది. కధనంప్రకారం, వామన అవతారంలో విష్ణువు తన ఎడమపాదాన్ని విశ్వమంతా విస్తరించి బొటనవేలు గోరుతో ఒక రంధ్రం ఏర్పరచాడు. రంధ్రంద్వారా, సముద్రంనీరు స్వచ్ఛమైన గంగానదిగా భూమిపై ప్రవేశించింది. ఎర్రటి కుంకుమరంగు కల వామనుని పాదాలను కడిగిన తరువాత, గంగ గులాబీరంగు పొందింది. విశ్వంలోకి వచ్చేముందు గంగ విష్ణువు పాదాలను తాకింది కాబట్టి గంగను విష్ణుపది అనిపిలుస్తారు.భూమిపైకి దిగేముందు గంగ బ్రహ్మలోకంలో ఉండిపోయిందని నిర్ధారణ అయింది. ఆమె రాజర్షి భగీరథుని తపస్సువల్ల మరియు శివుని వరంప్రభావంతో భూమిపైకి దిగింది.

సాగరరాజు వంశస్థుడైన భగీరథుడి ప్రయత్నాలద్వారా గంగ భూమిపైకి వచ్చిన కథ రామాయణం, మహాభారతం మరియు వివిధ పురాణాల్లో వివరించబడింది.సాగర రాజు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని సంచరించడానికి వదిలి వేశాడు.యాగం విజయవంతం కాకుండా ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు.గుర్రం అదృశ్యమైందని సాగరరాజు తన అరవైవేలమంది కొడుకులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు పాతాల లోకంలో కపిలమహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని కనుగొన్నారు. కపిలమహర్షి గుర్రాన్ని దొంగిలించాడని భావించి, ఆయన ధ్యానంలో ఉండగా వారు ధ్యానాన్ని ఆటంకపరచారు. కపిలమహర్షి కోపించి తనచూపులతో అరవై వేలమందినీ కాల్చి బూడిదచేసాడు.వారిఆత్మలకు విముక్తి కలిగించడానికి పరిహారం కపిలమహర్షినుండి తెలుసుకోడానికి సగరరాజు మనవడైన అంశుమాన్‌ని పంపాడు. స్వర్గంనుండి ప్రవహింఛు గంగ మాత్రమే వారిని విముక్తి చేయగలదని కపిలమహర్షి తెలిపాడు.

అంశుమాన్ మనుమడు భగీరథుడు తీవ్రమైన తపస్సుచేసి, బ్రహ్మ మరియు శివుని అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ గంగను భూమిపైకి దిగడానికి అనుమతించగా, శివుడు గంగ ఉధృతి తగ్గుటకు కేశములందు బంధించి ఒకపాయగా భూమిపై వదిలాడు. శివుని జటాఝూటం (కేశముల) నుండి గంగానది గంగోత్రివద్ద ఉద్భవించింది. గంగను భగీరథుడు సముద్రానికి అక్కడనుండి, పాతాళానికి ప్రవహింపచేశాడు. గంగానది భూమిపై ప్రవహించుప్పుడు జాను మహర్షి యొక్క ఆశ్రమంలో హోమాగ్ని ఆర్పివేసింది. మహర్షి  ఆగ్రహించి మొత్తం గంగను మ్రింగివేశాడు. భగీరథుని విజ్ఞప్తిపై, జాహ్నాఋషి ఆమెను తన ఎడమచేవినుండి వదలిపెట్టాడు. అందువలన గంగను జాహ్నవిఅని అంటారు. పిమ్మట గంగ పాతాళంలోని కపిలమహర్షి  ఆశ్రమానికి చేరుకొని, అక్కడ బూడిదగాఉన్నభగీరథుడి పూర్వీకులను శాప విముక్తులను చేసింది.

భగీరధుని కృషి వలన భూమిపైకి వచ్చుటవలన భగీరధిగా పిలువబడు గంగానది భారతదేశంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద నది. గంగాదేవి స్వర్గం, భూలోకం మరియు పాతాళలోకాల్లో ప్రవహిస్తుంది. గంగానదికి జాహ్నవి, గంగ, శుభ్ర, సప్తేశ్వరి, నికిత, భాగీరథి, అలకనంద మరియు విష్ణుపది వంటి వివిధ నామాలు (పేర్లు) ఉన్నవి. పవిత్రమైన గంగానది దైవత్వం కలిగి స్నానంచేసినంత మాత్రాన సకల పాపములు హరిస్తుంది. మరణించినవారికి పిండప్రదానం చేస్తే వారికి ముక్తి కలిగించి స్వర్గలోక నివాసం ప్రసాదిస్తుంది. హిందూ మతంలో గంగాదేవిని మానవాళికి తల్లిగాతలచి యాత్రికులు తమ బంధువుల చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేయడంద్వారా వారిఆత్మలు శుద్ధి చేయబడి జనన మరణ చక్రంనుండి విముక్తికలిగి మోక్షం పొందుతాయని భావిస్తారు. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, వారణాశి, కలకత్తాలోని కాళీ ఘాట్‌ మొదలైన గంగానది పరీవాహక ప్రదేశాల్లో గంగానదికి పండుగలు జరుపుతారు.

గంగా పుష్కరాలు అనగానే భక్తులు సాధారణంగా కాశీ లేదా వారణాశి వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. వారణాశిలో బస మరియు భోజన సౌకర్యాలు చాలా అభివుద్ధి చెందిఉన్నాయి. కానీ భద్రీనాధ్ వద్దఉద్భవించిన అలాకానంద దేవప్రాయాగ వచ్చుసరికి గొంగోత్రివద్ద ఉద్భవించిన భగీరధితో కలిసి గంగానదిగా ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి ప్రవహించి ప్రయాగరాజ్ వద్ద యమున మరియు సరస్వతీనదులతో కలిసి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దివ్యప్రదేశాలు గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ గంగా పుష్కరాల సమయంలో పవిత్రస్నానాలకు మరియు మరణించినవార్కి పిండప్రదానం చేయుటద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు. ప్రతిక్షేత్రంలో స్నానఘట్టాలు, రవాణా, భోజన వసతి సదుపాయ వివరములు విడిగా తెలియజేస్తాం. 

గమనిక: పుష్కరాల సమయంలో కాశీ (వారణాశి) తోపాటు మిగిలిన క్షేత్రాల్లో                  నదీస్నానం మరియు పిండప్రధానం  చేయవచ్చు గంగోత్రి, దేవప్రయాగ,                                                                           ఋషీకేశ్, హరిద్వార్ ఛోటా చార్ ధామ్ యాత్రనందు భాగమై ఉన్నాయి.  కావున వీలుకొద్దీ వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కావున వీలుకొద్దీ  వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కోరుతున్నాం.

నేను ఎవడను

 .

                    *సుభాషితమ్*


*శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి*  

*క్వ గమిష్యామి కస్య వా।*

*కస్మిన్ స్థితః క్వ భవితా* 

*కస్మాత్కిమనుశోచసి॥*

                              ( *మహా భారతం* )


తా𝕝𝕝 *"నేను ఎవడను.ఎక్కడినుండివచ్చాను? ఎక్కడికి పోతాను ?ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి*? 


*ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను?ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా?* 

*ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?"*

అరాళ కుంతలా

 అరాళ కుంతలా .🌹

🌺

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా

చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద

అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.

"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.

ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి

"నీ పేరు" అన్నారు.

-అప్పారావు -

"గోత్రం"

-అరాళ కుంతల-

పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.

"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా

ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

 కొస మెరుపులు:

1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.

2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

స్వ ధర్మో నిధనం శ్రేయః

 నేను మతం మారి మీకు సేవ చేస్తాను.....

ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి మకాం మారుస్తున్నారు. ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు.వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.

స్వామి "మీరు నన్ను కరం బకుడి లో చూచారుగా. మరల ఇంత రొప్పుతూ ఎందుకు వచ్చారు."

ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు ఉంటే మీలా ఉంటాడు. అని నా అభిప్రాయం అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. మీ మతం లోకి మారి మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని మీ సేవా భాగ్యం కలిగించండి. "కన్నీళ్లతో గద్గద స్వరంతో.

స్వామి కరుణ వర్షించే కళ్ళతో చూస్తూ "మీకు నన్ను చూడాలనిపించి నప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు." అని అనునయంగా చెప్పి స్వామి ముందుకు సాగారు.స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే చూస్తూ వృద్దుడు ఆగిపోయాడు.

**** మతం మానవుడు ఏర్పరుచుకున్న

కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాల, విశ్వాసాల హద్దు.స్వామి వారు ఎవరి హద్దులలో వారుండి గమ్యాన్ని చేరవలేనని విశ్వసిస్తారు . "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం.

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 

తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 

దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  

సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 

తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 

తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 

తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 

చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.

ఓం తత్సత్ 

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ