19, జులై 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 119*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 119*


*రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము :*


📕 *మంచి ఆలోచన అవసరం* 📕


1. సంపాద్యాత్మానమన్విచ్చేత్ సహాయాన్ (ఆత్మను అనగా తనను తాను చక్కబరచుకొన్న తర్వాత, సహాయకు సంపాదించడం కోసం ప్రయత్నించాలి.)


2. నాసహాయస్య మంత్రనిశ్చయః (సహాయకు లేనివాడు ఏ విషయంలోను ఒక నిర్ణయం తీసుకొనజాలడు.) 


3. నైకం చక్రం పరిభ్రమతి (ఒక చక్రంతో బండి నడవదు.) 


4. సహాయః సమ దుఃఖసుఖః (సుఖదుఃఖాలను సమంగా పంచుకోగలిగినవాడే సహాయకుడు.) 


5. మానీ ప్రతిమానినమాత్మని ద్వితీయం మనస్త్రముత్పాదయేత్ (దురభిమానం కలవాడ్ని సహాయుడ్నిగా తీసుకుంటే అతడు ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా వేరొక ఆలోచన చేస్తాడు.) 


6. అవితీతం స్నేహమాత్రేణ న మంత్రకుర్వీత (స్నేహితుడైన విద్యావినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు.) 


7. శ్రుతవనత ముపధాశుద్ధం మంత్రీణం కుర్వీత (శాస్త్రజ్ఞానం ఉండి ఏ ప్రలోభాలకీ లొంగని వాడిని మంత్రిగా చేసుకోవాలి. ధనం స్త్రీ మొదలైన వాటిని ఎరచూపి రహస్యంగా పరీక్షించడం ఉపధ. అలాంటి పరీక్షలలో పరిశుద్ధుడిగా తేలినవాడు "ఉపాధాశుద్దుడు".) 


8. మంత్రమూలాః సర్వారమాభాః (అన్ని పనులకీ మూలం మంచి యంత్రాంగం.) 


9. మంత్రరక్షణ్యే కార్యసిద్ధిర్భవతి (మంత్రాన్ని రక్షిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది.) 


10. మంత్రనిఃస్రావీ సర్వమపికార్యం నశయతి (ఆలోచనలు బయటపెట్టేవాడు అన్ని పనులూ చెడగొట్టుకుంటాడు.) 


11. ప్రమాదాత్ ద్విషతాం వశముపయాస్మతి (యంత్రాంగం ఏమాత్రం పొరబడినా శత్రువుకి లొంగిపోతాడు.) 


12. సర్వద్వారేభ్యో మంత్రో రక్షితవ్య (మంత్రాన్ని అన్ని వైపుల నుండీ రక్షించాలి) 


13. మంత్రసంపదా రాజ్యం వర్ధతే (యంత్రాంగం బాగుంటే రాజ్యం వృద్ధిలోనికి వస్తుంది.) 


14. శ్రేష్ఠతమాం మంత్రగుప్తిమాహు (ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవడం చాలా శ్రేష్టమైనవి.) 


15. కార్యానద్దస్య ప్రదీపో మంత్ర (పనుల విషయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవాడికి మంత్రాంగమే (మంత్రమే) దీపం.) 


16. మంత్రచక్షుషా పరచ్చిద్రాణ్యవలోకయంతి (మంత్రాంగ నేత్రంతో శత్రువుల లోపాన్ని చూస్తారు.) 


17. మంత్రకాలే న మత్సరః కర్తవ్య (మంత్రాలోచన చేసేటప్పుడు మత్సరం పనికిరాదు.) 


18. కార్యాకార్యతత్త్యార్ధదర్షినో మంత్రిణ (ఏదిచేయాలో ఏదిచేయకూడదో బాగా తెలిసిన వాళ్ళే నిజమైన మంత్రులు.) 


19. షట్కర్ణాద్భిద్యతే మంత్ర (ఇద్దరు చేసిన ఆలోచన మూడోవాడికి తెలిస్తే రహస్యం బయటపడ్డట్లే.) 


20. త్రయాణామేకైకవాక్యే ఏవాసంప్రత్యయః (ముగ్గురు కలిసి ఒకే మాట మీద ఉంటారనేది నమ్మజాలని విషయం. మరి ఇద్దరు చేసిన మంతనాలు మూడోవాడికి తెలిస్తే దాగుతాయా ? రాజ్యపాలనం బాగా నడవాలంటే మిత్రుల్ని సంపాదించాలి.) 


21. అపత్సు స్నేహసంయుక్తం మిత్రమ్ (ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు.) 


22. మిత్రసంగ్రహేణ బలం సంపద్యతే (మిత్రుల్ని సంపాదించడం చేత బలం చేకూరుతుంది.) 


23. బలవానలబ్ధలాభే ప్రయతటే (బలం కలవాడు ఇంతకు ముందు లభించిన దానిని పొందడం కోసం ప్రయత్నిస్తాడు.) 


24. అలబ్దలోభోమనాలసస్య (సోమరికి (అలబ్దం) ఇదివరకు దొరకనిది లభించదు.) 


25. అలసేన లబ్దమపి రక్షితుం న శక్యతే (సోమరి దొరికినదాన్ని కూడా రక్షించుకోలేడు.) 


26. న చాలసస్య రక్షితం వివర్ధతే (సోమరి రక్షించుకొన్నది కూడా వృద్ధిపొందదు.) 


27. నాసౌ భృత్యాన్ పోషయతి ; న తీర్థం ప్రతిపాదయతి చ (సోమరి పోష్యవర్గాన్ని పోషించడు, సత్పాత్రదానం చెయ్యడు.) 


28. అలబ్దలాభాదిచతుష్టయం రాజ్యతంత్రమ్ (లేనిదాన్ని సంపాదించడం, సంపాదించినదాన్ని రక్షించుకోవడం, రక్షించుకున్న దాన్ని వృద్ధిపొందించుకోవడం, తగిన రీతిలో వినియోగించడం - ఈ నాలుగే రాజ్యతంత్రం అంటే.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

కామెంట్‌లు లేవు: