*కం*
ఒకటికి కుడిప్రక్క విలువ
నొకటికి వామంబు సున్న నొందును సున్నా.
సకలంబుల విలువలెపుడు
నొకకడనొకరీతినుండు నుర్విన సుజనా.
*భావం*:-- ఓ సుజనా!"సున్న" అనేది ఒకటి కి కుడి ప్రక్కన ఉంటే విలువ కలిగి ఎడమప్రక్కన ఉంటే విలువ లేనిదిగా మారుతుంది. అంటే ఈ భూలోకంలో అన్నిటికీ విలువ లు అవి ఉండే స్థానాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయి. అంటే ఒకోచోట గరిష్ఠంగా ఉంటూ మరోచోట శూన్యం కూడా అయిపోగలదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి