2, ఆగస్టు 2024, శుక్రవారం

02.08.2024. శుక్రవారం

 *జై శ్రీరాం..శుభోదయం..🌹🚩*


02.08.2024.     శుక్రవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు ఆషాఢ మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి మ.03.26 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *ఆరుద్ర* నక్షత్రం ప.10.59 వరకూ తదుపరి *పునర్వసు* నక్షత్రం,  *హర్షణ* యోగం ఉ.11.45 వరకూ తదుపరి *వజ్రం* యోగం,*వణిజ* కరణం మ.03.26 వరకూ, *భద్ర (విష్టీ)* కరణం రా.03.35 వరకూ ఉంటాయి.

*సూర్య రాశి* : కర్కాటకం (పుష్యమీ నక్షత్రం లో రా.10.06 వరకూ తడుపరి ఆశ్లేష నక్షత్రం లో)

*చంద్ర రాశి* : మిథున రాశిలో రా.రే.తె.05.41 వరకూ తదుపరి కర్కాటక రాశి లో 

*నక్షత్ర వర్జ్యం*: రా.11.29 నుండి రా.01.09 వరకూ

*అమృత కాలం*: లేదు


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.56

*సూర్యాస్తమయం*: సా.06.49

*చంద్రోదయం* : రా.04.38

*చంద్రాస్తమయం*: సా.05.27

*అభిజిత్ ముహూర్తం*:

ప.11.57 నుండి మ.12.48 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.08.30 నుండి 09.22 వరకూ మరలా మ.12.48 నుండి మ.01.40 వరకూ.

*రాహు కాలం*: ఉ.10.46 నుండి 12.22 వరకూ

*గుళిక కాలం*: ఉ.07.32 నుండి ఉ.09.09 వరకూ

*యమగండం*: మ.03.36 నుండి సా.05.12 వరకూ.


ఈరోజు *మాస శివరాత్రి*. బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తో కలసి ఉన్న రోజు మాస శివరాత్రి పండుగ జరుపుకోవడానికి చాలా ప్రశస్తమైనది. శివ భక్తులు ప్రతీ బహుళ పక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి, శివునికి రుద్రాభిషేకం చేస్తారు.


ఉత్తర భారత దేశ పూర్ణిమాంత పంచాంగము ల ప్రకారం ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతున్నది. ఈరోజు  *సావణ్ శివరాత్రి*. కాశీ విశ్వనాథ్ , బద్రీ దామ్  దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.


తమిళ సాంప్రదాయం ప్రకారం *ఆడి పెరుక్కు*,దీనినే *పదునెట్టాం పెరుక్కు* అనికూడా పిలుస్తారు. తమిళ ఆడిమాసం (కర్కాటక మాసం) లో 18 వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు.తమిళనాడు లో,శ్రీలంకలో వర్షాకాల ప్రారంభ పండుగగా జరుపుకుంటారు. మానవ జీవనాధారమైన నీటికి కృతజ్ఞత పూర్వకంగా,నదీ పరివాహక ప్రాంతంలో, సరస్సుల దగ్గర,బావుల దగ్గర జలదేవతను పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.


శుక్రవారం,పునర్వసు నక్షత్రం కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు ప.10.59 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నిరయన రవి, ఆశ్లేష నక్షత్రం లో      రా.10.06 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆశ్లేష కార్తె* ప్రారంభం అవుతుంది.


శివ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

కామెంట్‌లు లేవు: