2, ఆగస్టు 2024, శుక్రవారం

లోకంతీరు-11

 లోకంతీరు-11

కందం||


దేవుని పూజింప ధనము

వేలుగవెచ్చింతురకట విధముచెడంగన్

కావుమని వేడుచుండడె

తావుల ధర్మమునణచుచుదా భక్తునిగన్


భావము:--

భక్తి పేరున లక్షలరూపా

రాలను ఖర్చుపెట్టడమే

భక్తిగా భావిస్తున్న రోజు లిపి.ఆడంబరములేని

భగవదర్పణయే నిజమైన

భక్తిగా చెప్పబనిలేదు.

తాము న్యాయధర్మాలను

అణచివేస్తూ,భగవంతుడు తనను కాపాడాలని అభ్యర్థించడం కుహనా

భక్తులకే చెల్లుతుంది.


దేవరకొండ:రాజోలు

కామెంట్‌లు లేవు: