🌸శ్రీరామ స్తుతి🙏
పట్టాభిరామ ! నీపావననామమ్ము
తలచిన జన్మంబు ధన్యమగును
కోదండరఘురామ ! కోర్కెలు తీర్చుమా
కోసలాధీశుడా ! కోరి కొలుతు
జనకునిజామాత ! జానకీ ప్రాణేశ !
జగమేలు జగదీశ ! జయము జయము
సకలలోకములకు సంరక్ష సర్వజ్ఞ
సజ్జనసేవిత సాధుశీల
తే.రమ్ము మముకావ రఘు నాథ ! రమ్య దేహ !
ధర్మ పాలన చేసిన ధర్మవీర !
పరమపావన రఘు వంశి ! పరమపురుష !
దశరథాత్మజ ! రఘువీర ! ధర్మ తేజ
జయలక్ష్మి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి