2, ఆగస్టు 2024, శుక్రవారం

శ్రీరామనామము

 🌸శ్రీ రామ స్తుతి🙏 


 సీ. శ్రీరామనామము తారాడు నాలుక

                  ధన్యత పొందును తథ్యముగను

      నీశుభాకారమ్ము నిత్యము కనుచుండు 

                 మునివరులందేరు ము క్తి పదము

      నిరతమ్ము మారుతి  నీ పాద సంసేవ 

                 చేయుచుండును కదా  చిత్తమలర

      సౌమిత్రి  కొఱకునై సంజీవి దెప్పించి

                 ప్రాణంబు కాచిన పరమ పురుష !

తే. సకలభూపాల రఘురామ ! శరణు శరణు 

      ధర్మ పాలన నెఱపిన ధర్మవీర !

      దైత్యకులనాశ  శ్రీరామ ! దయను చూపు 

      దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


              సాహితీ శ్రీజయలక్ష్మి

కామెంట్‌లు లేవు: