2, ఆగస్టు 2024, శుక్రవారం

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1565 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-200. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

యదధ్రువస్య దేహస్య 

సానుబంధస్య దుర్మతి:l

ధ్రువాణి మన్యతే మోహాద్ 

గృహ క్షేత్ర వసూని చll 


తేటగీతి:

నిక్కపు వివేక రహితుం డనిత్యమైన 

యీ శరీర సంబంధిత యిల్లు, భూమి,

ధనము మొదలైన వాటిని తలచుచుండు 

శాశ్వతమని మోహమ్ముతో జగతియందు.


భావం: వివేకం లేని మనిషి అనిత్యమైన, అనేక బంధాలతో కలిగిన ఈ శరీరానికి సంబంధించిన ఇల్లు, భూమి, ధనం మొదలైన వాటిని మోహంతో శాశ్వతమైనవని తలుస్తాడు.

కామెంట్‌లు లేవు: