స్నేహబంధం..నిత్యసుగంధం
సీ..
ప్రాణసఖులమంచు పలికెదరెందరో
కష్టసుఖములందు కనక నొకట
గొప్పస్నేహితులంచు గొప్పలుపల్కునో
ముప్పులెదురురాగ తప్పుకొనుచు
స్నేహమాధుర్యమున్ చెప్పంగనలవియే
. ఒకరికి యొకరంచు నొప్పుచుండ
నామరణాంతమున్ ప్రేమామృతమయమౌ
చరితంబునగునద్ది సఖ్యమెద్ది
తేగీ..
అసలుసిసలైన నెయ్యము నందుకొనగ
మనసులారపెట్టగవలె మమతపులిమి
కష్టసుఖములు స్వీయాత్మ కథగనెంచ
స్నేహబంధము నిలుచునో.. నిత్యమగుచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి