చేతి కఱ్ఱ
-------------
సీ||
ఎగుడు దిగుడు బాట నెప్పుడు నడచిన
చేత కఱ్ఱ వలయు సిద్ధముగను!
పరుల నిలువరించ,బురదను దాటగా
చేత కఱ్ఱ వలయు సిద్ధముగను!
పశుపక్షి గణముల,పన్నగమ్ముల గొట్ట
చేత కఱ్ఱ వలయు సిద్ధముగను!
కంటి చూపు చెడిన,కడు వార్ధకమ్మున
చేత కఱ్ఱ వలయు సిద్ధముగను!
ఆ.వె||
సిగ్గు పడుట తగదు చేత కఱ్ఱను బట్ట!
చేటు నిలువరించు చేతి కఱ్ఱ!
చేత కఱ్ఱ యున్న చేయలేనిది లేదు!
శేషఫణియె చెప్పె చిత్తమలర!
----------కోడూరి శేషఫణి శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి