3.
అమ్మ యున్న బ్రతుకె యానందమయమౌను
అమ్మ చేతి స్పర్శ హాయి నీయు
అమ్మ చేతి ముద్ద యమృతమయమ్మురా!
శైలజమ్మ వాక్కు సత్యవాక్కు.
భా:- అమ్మ ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. అమ్మ చేతి స్పర్శ హాయిగా ఉంటుంది. అమ్మ చేతి ముద్ద అమృతం వలె ఉంటుంది.
శైలజమ్మ పలుకు సత్యమైన పలుకు.
4.
కష్టకాలమందు కాచెడి పెన్నిధి
కన్నతల్లి ప్రేమ గాక నేమి
తల్లి కన్న మిన్న ధరణి యందెవ్వరు?
శైలజమ్మ వాక్కు సత్యవాక్కు.
భా:- కష్టములయందు రక్షించే పెన్నిధి కన్నతల్లి ప్రేమ. తల్లి కన్న గొప్పవారు ఈ భూమిని ఇంక ఎవరుంటారు? శైలజమ్మ పలుకు సత్యమైన పలుకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి