2, ఆగస్టు 2024, శుక్రవారం

స్నేహము మధురము

 క.   స్నేహము మధురము సృష్టిని 

స్నేహముతో వలపు పెరుగు స్నేహువునట్లన్ 

స్నేహము నిలయము తృప్తికి 

స్నేహంబున చోటు లేదు నెవ్వలకెపుడున్.


క.   చెలిమికి యవధులు లేవయ 

చెలువముగా వ్యాప్తిచెందు చేరును ధరణిన్ 

చెలికారము మంచిదయిన 

చెలరారును మిత్ర గుణము చెలియలవలనే!


ఆ.వె.   కబురు లాడువాడు కాలేడు చెలికాడు 

పనిని జేయువాడు పావనుండు 

ద్వేష బుధ్ధి కలిగి పోషించు స్నేహంబు 

అట్టివాడు మనకు గిట్టదయ్య.


తే.గీ.  చెడ్డ మిత్రుని వీడుటన్ జెలువమగును 

తేనె మాటల బల్కిన తేభ్యమగును 

మానసమున పగన్ సదా మండుచుండి 

పల్కులాడెడు వాడొక పాము కదర.


క.   తెల్లనివన్నియు పాలని 

నల్లనివై యుండునవియు నారముగానున్ 

ఎల్లరు దలతురు భువిలో 

కల్లని తన వాదమిచ్చు ఖలుడగు చెలుడౌ.

కామెంట్‌లు లేవు: