2, ఆగస్టు 2024, శుక్రవారం

కురుసభన్

 *తేటగీతి.*

నాడు కురుసభన్ నిను గావ *నన్నయ* గను

వనమున జయద్రథుని దుష్ట ప్రల్లదముల

కినుమడించిన నీదు క *న్నెఱ్ఱన* గను

దీటుగ విరటుని కొల్వున *దిక్కన* గను


*తేటగీతి.*

ఎంచి జూడంగ నిల్చిన దెవ్వ రమ్మ!

నీదు సౌశీల్యమును నిల్ప నిక్కముగను

కవులు మువ్వురి రూపమౌ కౌస్తుభమణి

ధరుడు శ్రీకృష్ణుడు మురళీధరుడు గాక.


# పై రెండు పద్యములను ద్రౌపదీ దేవి పరంగా, ఆంధ్ర కవిత్రయం మువ్వురి పేర్లను పొందుపరుస్తూ వ్రాసినవి.


# కవిత్రయ పరంగా - నన్నయ, తిక్కన, ఎఱ్ఱన; 

ద్రౌపది పరంగా - అన్నయ్య, దిక్కు , కన్ను ఎఱ్ఱన;

ఈ విధంగా అన్వయింపబడినవి.


*—-అయ్యగారి. కోదండరావు*

    _*AGM (Retired) - BSNL*_

    _*RAJAHMUNDRY*_

    _*Mobile: 9440000402*_

కామెంట్‌లు లేవు: