6, అక్టోబర్ 2024, ఆదివారం

శరన్నవరాత్రులు 4 వ రోజు

 శరన్నవరాత్రులు 4 వ రోజు


కూష్మాండ ( కామాక్షి స్త్రోత్రం): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

కూరగాయలు వేసి చేసిన కాదంబం నైవేద్యం పెట్టాలి

ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారి కి పూజ చేసుకోవాలి, శ్రీ మాత్రే నమః అని నిరంతరం జపించాలి.


 శ్రీ మహిషాసురమర్ధినీ స్తోత్రం


అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే

గిరివర వింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే :

అయిశత ఖండవిఖండిత కుండవితుండితశుండ గజాధిపతే

రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే

నిజభుజదండ  విపాతితఖండ విపాతితముండ భటాధిపతే

జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే  || 4 ||


శతఖండమనే ఆయుధంతో ముండాసురుని మట్టికరిపించిన దేవీ, గజాసురుని తొండాన్ని ఖండించిన దానా, ఏనుగు రూపు దాల్చిన శత్రువుల మెడలను తెగనరకడంలో ఆరితేరిన దానా, దండమువంటి నీ భుజములచే ముండాసురుని సేనాధిపతిని ముక్కలు ముక్కలు చేసినదానా, మహిషాసురుని సంహరించిన దానా, సొగసైన జడకలదానా, పర్వతరాజ పుత్రీ జయజయ ధ్వానాలతో నిన్ను స్తుతిస్తున్నాను....!!

కామెంట్‌లు లేవు: