6, అక్టోబర్ 2024, ఆదివారం

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

*దండం దశ గుణం భవేత్*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

విశ్వా మాత్రా హి పశుషు, 


కర్ద మేషు జలేషుచ


అంధే తమసి వార్ధక్యే, 


దండం దశ గుణం భవేత్.॥*


*భావము:~**


*పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !*


వ్యాఖ్య:~


*దీనిలోని అర్థం -*

1. వి - పక్షులు,

2. శ్వా - కుక్కలు,

3. అమిత్ర - మిత్రులుకానివారు(శత్రువులు),

4. అహి - పాములు,

5. పశు - పశువులు,

6. కర్దమేషు - బురదలో,

7. జలేషు - నీటిలో,

8. అంధే - గుడ్డితనంలో,

  9. తమసి - చీకటిలో,

10. వార్ధక్యే - ముసలితనంలో


దండం - కర్ర 

దశగుణం - 10 గుణాలను, 

భవేత్ - కలిగిస్తుంది.


*అంటే కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి, బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా (ఆసరాగా)ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం.*


మరొక అర్ధం:~


"దండం దశ గుణం భవేత్" ఈ వాక్యానికి  మరో అర్థం.


*దండం(కర్ర)లాగా నేల మీద పడి, సాష్టాంగ నమస్కారం చేస్తే, ఎదుటి వారిలో పది మంచి గుణాలు కలిగి, కార్యం సానుకూలం అయ్యే అవకాశం ఉంది. అలా ప్రణిపాతం చెయ్యక, తల వంచి దండం(నమస్కారం) పెట్టినా, ఎదుటివారు, దండం పెట్టిన వారిని ఆదరించి పనులు చక్కపెట్టవచ్చు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: