30, జూన్ 2023, శుక్రవారం

వాసుదేవ ద్వాద‌శి*_

 _*ఈరోజు వాసుదేవ ద్వాద‌శి*_



వాసుదేవ ద్వాదశి రోజు ప్రధానంగా కృష్ణుడికి సంబంధించినది. తొలి ఏకాదశి తర్వాతరోజు జరుపుకోవాలి. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుండి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుండగా , వాసుదేవ ద్వాదశి నుండి ప్రారంభించాలని స్మృతి కౌస్తుభం చెబుతుంది. 


వాసుదేవుడు అంటే విష్ణువనే విషయం అందరికీ తెలిసిందే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ఉంది. ఆయన వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నిటిలో వసించు వాడు కునుక వాసుదేవ అనే పేరు మరో విధంగా కూడా ఆయనకు సరిపడింది. ఆయన వేయి నామాల స్త్తోత్రమైన విష్ణు సహస్ర నామంలోని *‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’* అనేది దీనినే సూచిస్తోంది.


ఇక అన్ని ప్రాణులలో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు. అలాగే ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉందని కూడా పేర్కొంటారు. *‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:* అని గీతలో భగవం తుడు చెప్పిన విషయం తెలిసిందే. విష్ణు సహస్ర నామంలో *‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’* అని అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని వివరించారు. అర్జునుడు కృష్ణుణ్ని ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవ.

ఇక ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానకి వస్తే శయనేకాదశి రోజున ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశే పుణ్య తిథి. విషువుకు ప్రీతికర మైనది. శయనపేకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ. ఆ తర్వాత కూడా విష్ణు స్మరణతో కాలం గడిపితే మంచిది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ విశేషఫల దాయకం.

అంతేకాక మన సంప్రదాయం అంతా దానానికి ఎంతో ప్రాధాన్య మిచ్చింది. అందువల్ల విష్ణు సహస్ర నామస్తోత్ర పుస్తక దానం కూడా పుణ్యప్రదమే. కొంత మంది విసన కర్రలు కూడా దానం చేస్తారు. వాస్తవంగా చూస్తే వేయి నామాల ఆ దేవుని ఏ పేరుతో పిలిచినా , ఏ నామం పలికినా పుణ్యం వస్తుంది. జగదాధారుడైన ఆయనను ఒక పేరుతో పరిమితం చేయలేము. అందుకే వేయి నామాలతో విష్ణు సహస్ర నామం ఏర్పడింది. అయినా ఈ వేయి నామాలకు కూడా ఆయన పూర్తి స్వరూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. విష్ణువు అసలు స్వరూపాన్ని దేవతల రాజైన ఇంద్రుడే చూడలేద‌ని ఒక చోట ఉంది.


ఆయన అందరిలోనూ , అన్నిటా ఉన్నం దున ఒక ప్రదేశం నుంచి ఆయనను చూడడం కుదరదు. మరో విధంగా చెప్పాలంటే చూసేదీ ఆయనే , చూడబడేదీ ఆయనే. అటువంటి వారిని ఇలా ఉంటాడని చెప్పలేం. అయితే దేవునికి ఒక రూపం ఉండాలి కనుక ఆయన ధ్యాన శ్లోకాలు ఇలా ఉన్నాడని చెబుతున్నాయి కనుక మనం పరిమితులం కనుక పరిమితునిగానే ఆయననూ చూస్తున్నాం. ఆయన మనం ధ్యానించే రూపుడు కూడా.

సున్నిపిండి

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి  - 


 కావలసిన పదార్దాలు   - 


  * పచ్చ పెసలు  - 1 కిలొ .


  *  బావంచాలు    - 100 గ్రాములు .


   *  వట్టి వేళ్లు       -  100 గ్రాములు . 


   *  కచ్చురాలు   -  100 గ్రాములు . 


   *  మంజిష్ట         -   100 గ్రాములు .


   *  మంచి పసుపు  - 100 గ్రాములు .


   *  కస్తూరి పసుపు -  100 గ్రాములు .


   *  ఉలవలు          -  100 గ్రాములు .


   *  బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .


   *  కరక్కాయ బెరడు  - 100 గ్రాములు .


   *  ఉసిరికాయ బెరడు -  100 గ్రాములు .


   *  తానికాయ బెరడు   -  100 గ్రాములు .


   *  ఎండు ఖర్జూరాలు    -   100 గ్రాములు .


   *  కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 


    *  సుగంధపాల వ్రేళ్లు  - 100 గ్రాములు .


    *  తుంగ గడ్డలు    -  100 గ్రాములు .


    *  దానిమ్మ పండ్ల బెరడు  -  100 గ్రాములు .


    *  ఎండు గులాబీ రేకులు  - 100 గ్రాములు . 


    *  మరువము -  100 గ్రాములు . 


     *  ధవనము  -  100 గ్రాములు .


     *  జాపత్రి    -   100 గ్రాములు . 


     *  యాలుకలు -  100 గ్రాములు . 


     *  కురువేరు  -  100 గ్రాములు . 


     *  తులసి ఆకులు  - 100 గ్రాములు . 


  తయారీ విధానం  - 


    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 


 

  వాడేవిధానం  - 


     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


  ఉపయోగాలు  - 


 

 *  ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 


 *  శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 


 *  చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 


 *  మృత చర్మ  కణాలు నిర్మూలించబడతాయి .


 *  చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .


 *  శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 


 *  శరీరానికి మంచి తేజస్సు కలుగును. 


 *  సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .


  

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ: 


*లార్డ్ వేంకటేశ్వర విగ్రహము మీద వుండే సింహం బొమ్మ కు అర్థము ఏమిటి ?*



నిజానికి దీన్ని సింహం బొమ్మ అనరు అండి…..దానిని మకర తోరణం అంటారు… ఇది ఒక్క వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మీదే కాదు…హిందూ దేవి దేవతల విగ్రహాలు అన్నింటి మీద వుంటుంది. ఇది ఇలా పెట్టడం వెనుక వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడింది.


కీర్తి ముఖుడు అనే రాక్షసుడు అమరుడిగా పొందిన వర గర్వంతో ముల్లోకాలు జయించి, దేవతలను పీడిస్తూ, కన్ను మిన్ను కానక జగన్మాత ను కూడా పొందడానికి ప్రయత్నించగా మహా దేవుడు ఆగ్రహోదగ్రుడై మహా భీకర ప్రళయాగ్నిను ఆ రక్కసుని పైకి ప్రయోగించగ….వరము పొందినా కూడా భయ కంపితుడై నలు దిక్కులు పరుగెడుతూ చివరికి మళ్ళీ కైలాసం చేరి మహాదేవుని కాళ్ళ మీద పడి ప్రార్థించగా ఆ అగ్నిని తన మూడవ నేత్రంలో బంధించి తనను కాపాడగా…ఆ రాక్షసుడు ఆకలి గొని ఆ విషయం మహాదేవుని చెప్తే తనను తనే తినమని పరమ శివుడు ఆజ్ఞపించగ…ముందుగా ఆ రాక్షసుడు మకర ముఖుడు అయి తోక నుండి తినడం మొదలెట్టి దేహం అంత తిని చివరికి తల దగ్గరకు వచి అది తినడం సాధ్యం కాకపోగా మహాదేవుని అర్ధించాడు….తనకు ఇంకా ఆకలి తీరలేదు ఏం చేసేదని వేడుకొనగా మహాదేవుడు తనను అప్పటినుండి దేవతల విగ్రహాలకు వెనుక తోరణ భాగంగా వుంటూ వారిని దర్శనం చేసుకునే భక్తుల అహంకారం, అరిషడ్వర్గాల ను భుజిస్తూ వుండమని, తద్వారా పుణ్యము పొందగలవు అని చెప్పగా ఆ క్షణమునే మకర ముఖుడుగా వున్న ఆ రాక్షసుడు తోరణం లో కలిసిపోతాడు. ఆ రాక్షసుని తలయే మకరతోరణములోని తల.

ఆవులను రక్షించండి

 *ఆవును చంపడం దారుణం!!!*😭

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

     ఆవు:

 నన్ను కబేళాలో పెట్టి 4 రోజులు కడుపునిండా తిండి పెట్టరు!

  ఎందుకంటే....నా రక్తంలోని హిమోగ్లోబిన్ కరిగిపోయి కండలో అతుక్కుపోతుంది!

 అప్పుడు నన్ను ఈడ్చుకెళ్లారు ఎందుకంటే...నేను మూర్ఛపోయాను.

 200 డిగ్రీల సెల్సియస్ వేడినీరు నాపై పోస్తారు....నాకు తల తిరుగుతోంది.

 అప్పుడు నా పాలు తాగుతున్న నువ్వు (మనిషి) గుర్తుకొస్తాను!

 అప్పుడు నన్ను కర్రతో తీవ్రంగా కొడతారు....ఎందుకంటే నా చర్మం తేలికగా రాలిపోతుంది!

 వారు నా రెండు కాళ్లను కట్టి, తలక్రిందులుగా వేలాడదీసి, ఆపై నా శరీరం నుండి చర్మాన్ని తీసివేసారు.

 భూలోక జీవులారా, వినండి.

 నేను ఇంకా చావలేదు!!

 ఈ కబేళాలో మానవత్వం పుడుతుందా అని ఆత్రుత కళ్లతో చూస్తాను!  అలాంటి సమయంలో కూడా నన్ను పోషించే వారు ఎవరూ లేరు...

 నా చర్మం కోరుకున్నంత కాలం....నేను బ్రతికుండగానే దుర్మార్గులైన కసాయిలు నా చర్మాన్ని తొలగిస్తారు....నేను మూలుగుతూ ఆరాటపడి చనిపోతాను.


 ఇంత పవిత్రమైన భారతదేశంలో నన్ను రక్షించడానికి ఏ మతం మరియు చట్టం అనుసరించాల్సిన అవసరం లేదు.

 నీపై జరిగిన క్రూరమైన అత్యాచారాన్ని భరించి కూడా నేను నీకు 'శాపం' ఇవ్వలేను.

 ఎందుకంటే........నేను నీ తల్లిని కదా...


 మీరు గోవు ప్రేమికులా...

 మరి మీరు ఆవు పాలు తాగే వారైతే...... ఈ మెసేజ్ ని షేర్ చేసి పాల రుణాన్ని కొంచెం అయినా తగ్గించుకోండి.

 హిందువులందరి ఒక్క ఏడుపు...

 గోహత్యను ఇక సహించేది లేదు..!


 ఆవు యొక్క ఈ బాధను అందరికీ తెలియజేయడానికి 2 నిమిషాల సమయం ఇవ్వండి మరియు మీ స్నేహితులు మరియు బంధువులందరితో పంచుకోండి.


 దేవుడు నిన్ను దీవించును!

 జై శ్రీ కృష్ణ!

 జై శ్రీరామ్!....

  దయచేసి ఆవులను రక్షించండి

 మరియు మీ మానవత్వానికి విలువ ఇవ్వండి........ Sada Gomatha Seva Lo.....  Me..  Yalagandula Ramu formor film censor board and textiles board member Government of India..  AICC member..  Suryapet Assembly consistency Suryapet Town 🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🙏🙏🙏🙏🙏

బోగిపళ్ళు

 బోగి పండ్లు


రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.


భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.


బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.


 

 













 

పుష్పగిరి

 "పుష్పగిరి"

                  ➖➖➖


      చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్టాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకువద్దామనీ, పుణ్య నదులన్నిటి లోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా వుండేది. ఐతే, పుట్టుపేద కావటంచేత చేయిసాగక, కోరిక నెరవేరింది కాదు.


ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా, ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, "నాయనా ! ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి, నీకైనా సావకాశం చిక్కినట్టయితే, నా అస్తికలను వీలైనన్ని పుణ్యనదులలో కలప వలిసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలప వలిసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది. నాకు ముక్తిమార్గం యేర్పడుతుంది”   అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు.


చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు 'అప్పో సొప్పో చేసి ఐనా సరే, తండ్రి కోరిక నెరవేర్చి తీరాలె. కొడుకుననిపించుకుంటూ, ఈ మాత్రం పని చేయలేకపోతే, నాజన్మ యేం జన్మ !' అనే సంకల్పంతో బయల్దేరిపోయి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తికలు గంగా నదిలో కలపాలని, నిశ్చయించుకున్నాడు.


ఆ కాలంలో ఇప్పటిలాగా రైల్లా, విమానాలా, ఇట్టె వెళ్లి అట్టె రావటానికి ! కాలి నడకని పోవాలి. కీకారణ్యాలు దాటాలి. కష్టసుఖాలు ఒంటపట్టించుకోవాలి. ఇన్ని జరిగినా, బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునేవరకూ నమ్మకం లేకపోయె ! అందుకనే - “కాశీకి వెళ్లినవాడూ కాటికి పోయినవాడూ తిరిగిరారు" అనే సామెత కూడా యేర్పడినట్టుంది.


చైనులు పాదచారి అయి బయల్దేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ, దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ, పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. ‘సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం' అనుకుని, అస్తికలమూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు.


అతడు స్నానం చేసికొని, సంధ్య వార్చుకుని వచ్చి, మళ్లీ మూట బుజాన వేసుకు పోదామనుకొన్నాడు. తీరా చూడగా, ప్రవహించే పినాకినీ నది పొంగువచ్చి ఆ మూటంతా తడిసిపోయివున్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్లీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు.


ఆ మూట విప్పేసరికి, అస్తికలు మాయమై, , వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుపండువుగా కనిపించినై! ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది ! కాశీలో వుండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కాని, పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకొన్న వాడినయాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు. ఇక్కడనే ధన్యుడనయాను”  అనుకుంటూ అపరిమితానందభరితుడై, తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపి వేసి ఇంటిముఖం పట్టాడు.


ఏమి చిత్రమో కాని, చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా యేర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటంచేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి, నీళ్లుపట్టుకునేవాళ్లు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి.


ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్కచిక్కివున్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి ఇవతలకు వచ్చేసరికల్లా మిస మిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినై. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తనుకూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు పైకి వచ్చేసరికల్లా తాతకు ముసిలిరూపం పోయి, పడుచువాడయాడు.


సరీగా అదే సమయానికి ఆ ముసలి వాని భార్య నెత్తిని కూటికుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూవుంది. అలా పోతూవున్న ఆమెను అతడు పలుకరించే సరికి, ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకొని, ఎదిరించి సమాధానం చెప్పసాగింది. 

"నేను నీ భర్తను, ఫలాన ముసిలివాడనే,” అని ఎంత చెప్పినా ఆమె నమ్మక పోయేసరికి వాడు ఆమెను బరబర చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది? పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి, యౌవనవతి ఐ కూర్చుంది. తీరా ముసిలివాడూ అతని భార్యా కలిసి ఇంటికి వెళ్లేటప్పటికి, వాళ్ల బిడ్డలు తలి దండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకూ వెల్లడి ఐంది. అప్పటినించీ ఆ మడుగులో స్నానం చేసి, ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది.


కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి ఐనటువంటి నారదమహర్షి చెవుల బడింది. ఎవరికైనా మేలు జరుగుతూ వుంటే ఓర్వలేని నారదుడు, ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూవుంటే చూచి సహించగలడా? ఉహుం. కనుక, ఈ మడుగుకి ఏవిధంగా కట్టడి చేయటమా!" అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేముని వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు.


ఐతే, భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది?' అని దివ్య దృష్టితో  చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు, తన తల్లి దాస్యవిముక్తికోసం దేవలోకంనించి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకు పోతూవుండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి నట్టు గ్రహించాడు.


నారదుడు నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, “హనూ ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి" అన్నాడు. 


చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. 


కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూవుంది.


 ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలోవుండే విష్ణుమూర్తి వద్దకుపోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు.


విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, “నాకూ, శివునికి యెప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూవుంటై. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!" అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపి వేశాడు. 


తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూవున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు.


అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకపోయింది.


ఆ బ్రాహ్మడి అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది- పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజ నేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి 

'పుష్ప గిరి' అనే పేరు వచ్చిందంటారు.


శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది.


ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతై. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు.


పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరం లోనే ఉన్నది. కాబట్టి ఈ సారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి!✍️

(1951 ఏప్రిల్ నెల చందమామ కథ)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

సజ్జన సాంగత్యం*

 .               🕉️🕉️🕉️


            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*సాధు సజ్జన సాంగత్యం* 

*సద్బుద్ధిమ్ సత్ప్రవర్తనం|* 

*సంతోషం సద్విచారాంశ్చ* 

*దేహి మే మధుసూదన||*


తాత్పర్యము:

ఓ మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము....  నిరతము సంతోషముతో మంచి ప్రవర్తన ఉండునట్లు చేయుము..మంచి బుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.

దేవుడు ఉన్నాడు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా ?


మనిషికి దేవుడు ఉన్నాడా లేడా , ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచుగా మదిని తొలుస్తూనే ఉంటుంది . మనలానే దేవునికి కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను కదా,ఏ మానవుడైన మనఃపూర్వకమైన భక్తితో , ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైన ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు .


దేవుని కరుణకు అవధులు లేవు . ఆయన కృపకు అందరూ పాత్రులే అయితే ఆ పాత్రత మనలో ఉండాలి అంతే . రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతరందాల్చి హిరణ్యకసపుని కడతేర్చిన వృతాంతం మనకు సుపరిచితమే . 


అయినా అవన్నీ ఎప్పుడో కృత యుగం లో జరిగిన సంగతి కదా అంటారా . శ్రీ రాముడు త్రేతా యుగం లోనూ , శ్రీ కృష్ణుడు  ద్వాపర యుగం లోనూ అవతరించారు ప్రస్తుత కలియుగంలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా ?  అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించిన వృతాంతం ఏదైనా ఉందా ? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా , కనీసం ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాలో , వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా ? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ? ఆ భక్తుని స్వామి వారి అనుగ్రహం కలుగుతుండగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా , ముఖ్యంగా నాస్తికులు , హేతువాదులు , అన్యమతస్థులు ప్రత్యక్షంగా చూసి , వాటిని నమ్మి అంగీకరించిన సంఘటనలు ఉన్నాయా ? 


పైన చెప్పిన వాటికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఈ భక్తుని వృతాంతం . దీన్ని కధ అనడం లేదు ఎందుకంటే ఇది యదార్ధ గాధ కనుక . 


అది 1889 వ సంవత్సరం .  విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులు ధార్మికంగా జీవనం సాగిస్తుండేవారు.వారికి దేవుని యందు భక్తి ప్రపత్తులు మెండు.ఆ పుణ్య దంపతులకు 1889 ఏప్రిల్ 4వ తేదీన దేవుని అనుగ్రహం వలన ఒక మగబిడ్డ జన్మించాడు.ఆ బాలునికి నరసింహం అని నామకరణం చేశారు తల్లిదండ్రులు . ఆ అబ్బాయికి కూడా తల్లిదండ్రుల లానే  చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.భగవన్నామస్మరణ , కీర్తనలు , భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం . జీవనోపాధికి తన కుల వృత్తి స్వీకరించి ఆభరణాలు తాయారు చేయడంలో సిద్ధహస్తులయ్యారు . ఏ పని చేస్తున్నా అతని జిహ్వ భగవన్నామస్మరణ చేయడంలో ఉత్సహించేది అందులోనే సేద తీరేది . ఆయనకు పండరీపురం విఠలునిపై యెనలేని భక్తి ఉండేది .


తన 18వ ఏట బందరు జిల్లా చిలకలపూడి గ్రామానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు నరసింహం గారి తల్లిదండ్రులు . అప్పటికే ఆభరణాల తయారీలో ఆరితేరిన నరసింహం గారు బంగారు పూతతో తాయారు చేసే నకిలీ నగలు తాయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఆయన కనిపెట్టిన విధానమే నేటికి ( రోల్డ్ గోల్డ్ , ఉమా గోల్డ్ , గిల్టు నగలు , 1 గ్రాము గోల్డ్ ) అమములో ఉంది . వాటికి ఆధ్యులు నరసింహం గారే . 


గురువు అనుగ్రహం : 


జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు కానీ గురువు అనుగ్రహం పొందటం అంత తేలిక కాదు . గురువంటే మన అజ్ఞానాన్ని తొలగించి , తగిన ఉపదేశమిచ్చి , నిత్యానిత్య వివేకమును కలిగించి , న్మార్గంలో ప్రవేశింపజేసి , గమ్యాన్ని తెలిపి , ఆ గమ్యాన్ని చేరుకోవడంలో పడే ప్రయాసల నుండి రక్షించి చివరి వరకు వెన్నంటి ఉండే భగవంతుని రూపమే. నరసింహం గారి జీవితంలో అటువంటి గురువు దర్శన భాగ్యం , అనుగ్రహం కలిగి ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిన సంఘటన పండరీపురంలో జరిగింది . నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించారు.


నరసింహం గారు తరచుగా పండరీ యాత్ర చేసి గురువు గారిని దర్శించుకునే వారు . 1929 వ సంవత్సరంలో ఆయన పండరీ పురం వెళ్ళినప్పుడు మహీపతి గుండా మహారాజ్ గారు " నీవు తరచుగా పండరీ యాత్ర చేస్తున్నావు కదా , నీకు ఈ పండరీ నాధుని వృతాంతం తెలుసునా ? " అని అడిగారు . నరసింహం గారు " తెలుసును గురువు గారు , పండరీనాధుడైన విఠలు తన భక్తుడైన పాండురంగని కోసం అతని ఇంట్లో వెలిసారని సమాధానమిచ్చారు . 


మరి నీవు కూడా ఆ పండరీనాధుని భక్తుడవు నీకోసం స్వామి వారు అక్కడే సాక్షాత్కరిస్తారు కదా ఇంత దూరం రావడం దేనికీ ? అని ప్రశ్నించారు . తరువాత ఇలా అన్నారు " ఇక నీవు పండరీ యాత్ర చేయవలసిన అవసరం లేదు , నీకోసం స్వామి వారే నీ ఊరిలోనే వేలుస్తారు . అక్కడే ఆలయం నిర్మించి కొలుస్తూ ఉండు అని చెప్పారు .


స్వామి వారి మాటలు విని విస్మయమొందిన నరసింహం గారు గురువు గారి అనుగ్రహంతో ఆలయం నిర్మించాలని నిశ్చయించుకుని చంద్రభాగా నది ( పండరీపురంలో ప్రవహించే నది ) లోని కొన్ని రాళ్ళను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేస్తున్న సమయంలో వాటిని అక్కడ ప్రతిష్టించాలని అనుకున్నారు . కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.


నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.


కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 


గర్భ గుడికి తాళం :


ఆ రోజు రానే వచ్చింది , అందరూ ఎంతో  ఉత్కంటగా ఎదురుచూసే సమయం అది . స్వామి వారు నిజంగానే ప్రత్యక్షమవుతారా ? ఈ కలికాలంలో ఇది సాధ్యమేనా ? నరసింహం గారు నిజంగానే అంతటి భక్తులా ?ఇలా ఎన్నో సందేహాలు . అప్పటి పాలకులైన బ్రిటీషు వాళ్ళు , నాస్తుకులు , హేతువాదులు ఈ విషయాన్ని నమ్మలేదు . అప్పటి బ్రిటిషు అధికారి ఆలయపు గర్భ గుడిని మూయించి , తాళం వేసి , బయట బందోబస్తును పెట్టించి , స్వామి వారు రావడం బూటకం అని నిరుపించాలనుకున్నాడు .  


ఆంజనేయ స్వామి అభయం : 


ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .


పగలు పదిన్నర అయింది: 


ఉన్నట్లుంది ఆకాశం బ్రద్ధలవుతున్నాట్లు పెద్ద శబ్దం . ఉరుములు మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది వాతావరణం . అంతలో గర్భ గుడిలో ఒక పెద్ద చప్పుడు పిడుగు పడినట్లు అనిపించింది .  దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. చల్లని చిరుజల్లు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.


నాస్తికులు ముక్కున వేలేసుకుని , తమ నాస్తిక వాదం వదిలి పాండురంగడి పాదాక్రాంతులయ్యారు . ఆ బ్రిటిషు అధికారి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి స్వామి వారి భక్తుడయ్యాడు . ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనగా ఆలయ చరిత్రలో లిఖించారు .


ఆ పండరీనాధుడే ఇక్కడ ఆయన భక్తుడైన నరసింహం గారి కోసం వెలిసారని వేయినోళ్ళ కొనియాడారు.పండరీపురంలో లాగానే ఇక్కడ కుడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.


తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.


శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.


భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు. 


దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.


ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.


సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.


భక్తుని కోసం భగవంతుడు వెలసిన నిదర్శనాలు ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్నాయి . 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


అందరం  " ఓం నమో నారాయణాయ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహానికి  పాత్రులమవుదాం ...


ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

జై శ్రీ కృష్ణ


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

దేవుడు అంతటావున్నాడు*


*దేవుడు అంతటావున్నాడు*

                   ➖➖➖✍️


*”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”*


*ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.*


*విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో…  ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.*


*స్వామీజీ నవ్వుతూ స్పందించారు.*


*రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.*


*అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.*


*అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.*


*నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.*


*స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.*


*రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.*


*చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో    మా రాజు వున్నారు అంటూ అరిచాడు.*


*అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.*


*స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.*


*ఇదే విగ్రహారాధన యొక్క సారము.*


*భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.*


*మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.*


*విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.*


*విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.*


*నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.*


*అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

[29/6 7:40 AM] +91 96038 32266: విగ్రహారాధన వ్యతిరేకించే వారికి ఈ msg ఒక కనువిప్పు కలగాలి

టచ్‌తోనే జీవితం

 నిజమే కదా మరి... 

1. ఇది గడియారాన్ని తినేసింది

2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది

3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది

4. ఇది పుస్తకాల్ని తినేసింది

5. ఇది రేడియోను మింగేసింది

6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది

7. ఇది కెమెరాను మాయం చేసింది

8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది

9. ఇది ఇరుగుపొరుగుతో దోస్తీ తినేసింది

10. ఇది బంధుత్వాల్ని తినేసింది

11. ఇది మన మెమొరీని తినేసింది

12. థియేటర్ లేదు

.

.

.

నాటకం లేదు, 

టీవీ లేదు, 

ఆట లేదు,పాట లేదు... 

ఇదే బ్యాంకు,ఇదే హోటల్,ఇదే కిరాణ షాపు... 

ఇదే డాక్టర్, ఇదే జ్యోతిష్కుడు... 

అసలు మార్కెట్ అంటేనే ఇది... 

బయటికి వెళ్తే కదా, అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్... 

అంతా స్మార్ట్ ఫోన్‌దే రాజ్యం... 

మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్‌గా  మారుతోంది.

వేలు ప్రపంచాన్ని,సారీ మనిషి జీవితాన్ని శాసిస్తోంది..

నోరు మ్యూట్‌లో ఉంది... 

ఎస్, నిజమే... టచ్‌తోనే జీవితం... 

కానీ ఎవరూ టచ్‌లో లేరు...

ఈ రోజు పదము

 206వ రోజు: (భృగు వారము) 30-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

కొడుకు: అంగజుడు, అంగభవుడు, అబ్బాయి, అర్భకుడు, ఆత్మజుడు, ఆత్మసంభవుడు, ఔరసుడు, కొమరుడు, కుమారుడు, తనయుడు, తనూభవుడు, దేహజుడు, నందనుడు, నందివర్ధనుడు, పుత్రుడు, బాలుడు, బిడ్డడు, సుతుడు, మగబిడ్డ.


 ఈ రోజు పద్యము:


 సిరిగల వాని కెయ్యడల చేసిన మేలది నిష్పలం బగున్/

నెఱి గుఱిగాడు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్/

వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్/

కురిసిన గాక అంబుధుల కర్వగ నేమి ఫలంబు భాస్కరా!


ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవానికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది.  వానలు లేనప్పుడు ఎండిపోతున్న చేల మీద మేఘుడు వాన కురిస్తే ఫలితం ఉంటుంది కాని, సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా!

సన్యాసం అంటే ఏమిటి

 *సన్యాసం అంటే ఏమిటి?? - కొంచం వివరంగా తెలుసుకొందాము...!!!*


సన్యాసమంటే కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన...


_సన్యాసమంటే..._

ప్రపంచం నుంచీ, మరి దేని నుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలి వేయడం కాదు, సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం, ఆ ఆలింగనంలో సంసారము అన్నీ వుంటాయి...


_సన్యాసమంటే..._

అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దాని పట్ల అనురక్తిని త్యజించడం...


_సన్యాసమంటే.._ 

పరిశుద్ధ జ్ఞానం...

 

ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం...

నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. 

ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి, సన్యసించించాలి అని అనుకోరు...


నిజమైన సంసారం మనస్సంసారం, దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. 

కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు, సర్వ కర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్న వారే నిజమైన సాధకులు...


విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. 

మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే, సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం...

పెద్దన యాశీస్సులు

 శుభోదయం🙏


పెద్దన  యాశీస్సులు

                              ------------------------------ 


శా: "  శ్రీ వక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద  విశ్వంభరా


          దేవిం దత్కమలా  సమీపమున  బ్రీతిం  నిల్పినాడో  యనం


           గా వందారు  సనందనాది  నిజ  భక్త శ్రేణికిం   దోచు   రా

           

           జీవాక్షుండుఁ  గృతార్ధు  సేయు  శుభదృష్టిన్  కృష్ణరాయాధిపున్


                           మను చరిత్రము  కావ్యారంభమున  కృతిభర్త యగు శ్రీకృష్ణరాయ  సార్వ భౌమునకు  పెద్దన యెసఁగు

ఆశీర్వచనము.


                   ఆది లక్ష్మియు  శ్రీహరియు  సరసములలో  దేలుచుండ  నామె వక్షోజములకు  అలంకరించుకొనిన  కస్తూరి

శ్రీహరి  వక్షస్థలమున  నంటినది.  అది జూచి  సనక సనందనాది మునులు ఆహా! శ్రీహరి యెంతగొప్పవాడు! శ్రీ దేవితో సమముగా భూదేవికి గూడ సముచిత స్థానమునొసంగినాడనుచు మురియుచు  వందనముల నొనరింప  సంతసమున

విలసిల్లు  ఆహరి దయాళువై కృష్ణరాయలను  శుభదృష్టితో జూచి యనుగ్రహించుగాక!

   

                                అనిదీని తాత్పర్యము!


         శ్రీదేవి  విష్ణువక్షస్థల  నివాసి. భూదేవికి ఆభాగ్యములేదు. ఇపుడీ కస్తురి పూతలు జూడ ఆమెకుగూడ హరి తనహృదయమున  నివాస మేర్పరచెనా ?యను భ్రాంతిని సనందనాదులకు కలిగించినది.కావున భ్రాంతిమంత

మను నలంకారము ఇందుకలదు.

                         

                 కృతిభర్త రాయల కిరువురు భార్యలు  తిరుమలదేవి, చిన్నాదేవి,లు. వారిరువురను  శ్రీహరివలెనీవు సమముగా నేలి దక్షిణ నాయకుడ వనిపించు కొందువుగాక! యని రాయల కుపదేశము (వ్యంగ్యము) 


           నావిష్ణుః పృధివీపతిః"- అను న్యాయముచే  ప్రభువుకూడా విష్ణువుతో సమానుడే! విష్ణువు ,జగత్పోషకుడు. రాయలుకూడ జగద్రక్షకుఁడై వర్ధిల్లవలెనని భావము.


                 శ్రీదేవి కలిమిచే భాగ్యము, భూదేవి కలిమిచే  పంటల ,సమృధ్ధితో  నొప్పుదువుగాక యని యాశీస్సు!


ఈవిధముగా "ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశోవాపి తన్ముఖమ్" అను నాలంకారిక సూత్రాను సారముగా  ఆశీర్వాద పురస్సరముగా పెద్దనగారు  మనుచరిత్రమును  ప్రారంభించినారు. 


                                                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

⚜ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం

 🕉 మన గుడి : 


⚜ అరుణాచల్ ప్రదేశ్ : జైరో (సుబన్సీరి జిల్లా)


⚜ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం



💠 దేవతలు సైతం పూజించే గొప్ప దైవం ఈశ్వరుడు. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


💠 ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని జైరో వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బయటపడింది. 

2004 సంవత్సరం శ్రావణమాసంలో  దట్టమైన అడవి మధ్యలో ఈ శివలింగం బయటపడింది. ఈ శివలింగం గురించి శివపురాణంలోని రుద్రకాండం 17 అధ్యాయంలో ఉంది. 


💠 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ సహజసిద్దమైన రాయి క్రింద నిరంతరం ప్రవహించే జలధార ఉంది.

 ఆ లింగం చుట్టూ పరమశివుని పరివారమైన పార్వతీదేవి, గణేశుడు మొదలైనవారి విగ్రహాలు లింగరూపంలోనే ఉన్నాయి.


💠 రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో లభించిన దేవతా విగ్రహాలను ఆయా ప్రదేశాల్లోనే పునర్ ప్రతిష్టించడంగాని, పురావస్తు ప్రదర్శనశాలకు తరలించడంగాని చేస్తున్నారు. వందలాది సంవత్సరాలుగా ఈ ప్రదేశాలలో ప్రచారంలో ఉన్న పురాణగాథలు, విశ్వాసాలకు బలం చేకూర్చేవిధంగానే ఈ విగ్రహాలు లభ్యమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.


💠 ఈ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం..దీని పొడవు 25అడుగులు దీని చుట్టుకొలత 22 అడుగులు

శివుడు తల పై భాగంలో రుద్రమల మరియు వాసుకి నాగను ధరించారు.. లింగం పునాది నుండి నిరంతరం నీటి ప్రవాహాన్ని మనం స్ఫష్టంగా చూడవచ్చు..


💠 శివరాత్రి సమయంలో ప్రతి 3(మూడు)సం.. లకు ఒకసారి పాములు ఈ శివలింగాన్ని ఆరాధిస్తాయని నమ్ముతారు...


💠 శివలింగం చుట్టూ రాతితో ఏర్పడిన పాము ఆకృతిని గమనించగలరు.

శివలింగం వెనుక నిలబడి ఉన్న భంగిమలో పార్వతి, వారి కుమారులు గణేష్,  ఎడమ వైపున కూర్చున్న భంగిమలో మరియు శివలింగానికి కుడి వైపున కార్తికేయుడి సహజంగా ఏర్పడిన ఆకారాలను గమనించారు. 

సహజ శివలింగం దిగువన పవిత్ర నంది ఎద్దు. నంది చాలా భాగం భూగర్భంలో ఉన్నందున పాక్షికంగా కనిపిస్తుంది.


💠 మహాశివరాత్రిని ఇక్కడ గొప్పగా జరుపుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు శివరాత్రి సమయంలో పాములచే శివలింగాన్ని పూజిస్తారని స్థానికులు నమ్ముతారు. 


💠 శివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మా మరియు విష్ణువుని పూజిస్తారు.


💠 ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి  ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు.

మహాశివరాత్రి సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి కూడా  ప్రజలు శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ మందిరాన్ని సందర్శించి సహజ శివలింగాన్ని దర్శిస్తారు . 


💠 అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళరు, కానీ ప్రత్యేకంగా అడిగితే   తీసుకువెళతారు. అడగండి.



👉 ఎలా చేరుకోవాలి

 

💠 ఈ ఆలయం గౌహతి నుండి 435km ఇటానగర్ నుండి 114km .

అస్సాం అరుణాచాలప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నది ఈ ఆలయం..

Ziro టౌన్ కి 5km దూరంలో ఉన్నది.

 ఇది సముద్ర మట్టానికి 5754 ఎత్తులో ఉన్నది...

అతని వలననే

అతని వలననే  







వాట్సాపులో వచ్చిన ఒక వీడియోకు నే నిచ్చిన  అక్షర రూపం 

సురేష్ ఒక యువకుడు ఉద్యోగరీత్యా తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు.  తాను నివసించే రూముకు దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటరు వుంది ఆ సెంటరులో ఎప్పుడు రద్దీగా ఉంటుంది.  యెంత రద్దీ అంటే అక్కడ టిఫిన్ తిన్నతరువాత కౌంటరులో బిల్లు చెల్లించాలంటే కనీసం 5నిముషాలు ఆగవలసి ఉంటుంది అంటే అక్కడి రద్దీని ఊహించుకోవచ్చు. రోజు సురేష్ ఆ హోటలుకు వెళుతూ ఉండటం వలన అక్కడి వేయిటరులు ఇంకా ఇతర ఉద్యోగస్స్తులు పరిచయం అయ్యారు.  అందువల్ల వారికి సురేష్ ఏమి తింట్టాడు ఏమి తాగుతాడు అంటే కాఫీ, టీలు అన్ని తెలుసు కాబట్టి అతనిని చూడంగానే ఆయన అడగకుండానే అన్ని సమకూర్చేవారు.  అది సురేషుకి కొంత ఆనందం  కలుగచేసింది. తన పరపతి హోటల్లో ఉందని అనుకోని తరచూ తన స్నేహితులిని కూడా ఆ హోటలుకే తీసుకొని వచ్చేవాడు. 

ఇది ఇలా ఉండగా సురేష్ గత కొంతకాలంగా ఒక విషయాన్ని గమనించాడు అదేమిటంటే ఒక నడివయస్కుడు పాత బట్టలు వేసుకొని సరిగా షెవింగు కూడా లేకుండా ఉన్నతను రోజు ఆ హోటలుకు వచ్చి టిఫిన్ తిని అక్కడి మందలో కలిసి చిన్నగా బిల్లు కట్టకుండా తప్పించుకునేవాడు. ఈ విషయాన్నీ మన హీరో సురేష్ చాలా కాలంగా గమనిస్తూ వున్నాడు. ఎట్లాగైనా ఈ మోసాన్ని ఆ హోటలు యజమానితో చెప్పి అతనికి శిక్ష పడేవిధంగా చేసి తన గొప్పతనం చాటుకోవాలని ప్రయత్నం  చేయసాగాడు. కానీ రోజు కౌంటరు దగ్గర అనేకమంది ఉండటంతో ఆ కౌంటరుమీద కూర్చున్న యజమానితో మాట్లాడటమే కుదరటంలేదు.  రోజు రోజుకు సురేషుకు అసహనం పెరిగిపోతున్నది. ఇదేమిటి ఈ హోటలు యజమానికి ఇంత నష్టం వస్తువున్న ఒక్క వెయిటర్ కూడా ఎందుకు చెప్పటంలేదు అని మనసులో అనుకోనగానే  అక్కడి వెయిటర్లమీద కోపం వచ్చింది 

ఒకరోజు ఎందుకో కాని టిఫిన్సెంటరులో కస్టమరులు చాలా తక్కువగా వున్నారు. అప్పుడే మన సురేషు అనుకున్నాడు ఇది సరైన సమయం నేను ఆ మనిషి మోసాన్ని హోటలు యజమానికి చెపుతాను అని అనుకోని కౌంటరు వద్ద కూర్చున్న యజమానితో తానూ రోజు చూస్తున్న విషయాన్ని చెప్పి మీరు పోలీసు కంప్లీన్ట్ చేయండి అటువంటి మోసగాళ్లను అస్సలు వదిలి పెట్ట కూడదు.  కావాలంటే నేను మీకు సాక్ష్యం కూడా చెపుతాను.  నా రక్తం వుడుకుతున్నది అని ఆవేశంతో చెప్పాడు.   అది విన్న హోటలు యజమాని తన సీటు మీది నుంచి లేచి ఒక టేబులు ముందర కూర్చొని సురేషును కూడా అక్కడ కూర్చోమని సైగ చేసాడు. ఇద్దరు టేబులు వద్ద కూర్చోగానే హోటలు యజమాని నవ్వుతూ ఒక వేటర్ని పిలిచి మా ఇద్దరికీ రెండు మంచి కాఫీలు తీసుకునిరా అని ఆర్డర్ వేసి ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు చూడు సోదర నీవు గత కోద్ది కాలంగా మా హోటలుకు వస్తువున్నావు నీవు వచ్చినప్పటినుండి నీవు చూసినది నీవు చెప్పావు.  కానీ అతను చాలా  కాలంగా నా హోటలుకు వస్తువున్నాడు. అతను రావటం బిల్లు కట్టకుండా పోవటం నేనెరుగుదును అని అన్నాడు.  అప్పుడు ఆశ్చర్యపడటం సురేషు వంతయింది. ఆ అలానా అయితే మరి ఇంతవరకు అతని మీద ఎందుకు చర్యతీసుకోలేదు అని అడిగాడు.  ఇంతలో వెయిటరు కాఫీ తీసుకొని వచ్చాడు. మిత్రమా ముందు కాఫీ తాగు అంతా వివరంగా చెపుతాను అని హోటలు యజమాని అన్నాడు.  సురేషు మెదడులో అనేక సందేహాలు ఇదేమిటి నేను ఇతనికి మేలుచేసే విషయంచెప్పి మార్కులు కొట్టేద్దాము అని అనుకున్నాను.  ఈయనేమో ఎంతో కూలుగా ఉండటమే కాకుండా అంతా తనకు తెలుసు అంటున్నాడు అని మనసులో అనుకున్నాడు. మిత్రమా కాఫీ తాగు ముందు అంతా నీకు సవివరంగా చెపుతాగా అని అన్నాడు. 

నా కొక ప్రశ్నకు సమాధానం చెప్పు నా హోటలులో రద్దీ ఎలావుంది అని అడిగాడు యజమాని.  మీ హోటలుకు ఏమిటి సారూ ఈ ఏరియాలో వున్న అన్ని హోటళ్లకన్నా ఎక్కువ రద్దీ మీదే మాతో మాట్లాడాలని నేను ఎన్నో రోజులనుండి చూస్తుంటే ఈ రోజు నాకు అవకాశం లభించింది అన్నాడు. అంటే నా హోటలు మంచిగా నడుస్తున్నదని నీవు వప్పుకున్నావన్నమాట అని అన్నాడు.  నేను వప్పుకోవటం ఏమిటి మీ హోటలుకు వచ్చిన ఏ కొత్తవారయినా అదే అంటాడు. ఇంత రద్దీగా ఉండటానికి కారణం అతనే అని అన్నాడు. నిజానికి  ఈ రోజు కూడా నీకు రద్దీగానే ఉండేది కానీ ఈ రోజు పండగ చేయబట్టి ఎవ్వరు బయటి టిఫిను చేయరు ఎంచక్కా ఇంట్లో రకరకాల వంటాకాలు వండుకొని తింటారు. నిజానికి నేను ఈ రోజు హోటలుకు సెలవు  ఇవ్వవలసింది. కానీ నీలా వంటరిగా వుండే వాళ్లకు ఇబ్బంది అవుతుందని టిఫిన్ సెంటరు తెరిచాను అని అన్నాడు. 

ఈ రోజు నా హోటలు ఇంతమంది కస్టమరులతో కళ కళ లాడుతూ ఉన్నదంటే దానికి కారణం ఆయనే తెలుసా అన్నాడు. ఇదేమిటి ఒక బిల్లు ఎగ్గొట్టే వాడు మీ హోటలు అభివృద్ధికి కారణమా నిజానికి అతను ఎగవేసిన డబ్బులు చాలా మీరు నష్టపోయారు. అయినా కూడా మీరు అతనే మీ అభివృద్ధికి కారణం అని అంటున్నారు ఇదెలా సాధ్యం అని సురేషు అన్నాడు. చెపుతాను విను అని హోటలు యెజమాని చెప్పటం మొదలు  పెట్టాడు. మొదట్లో నేనుకూడా అతను బిల్లు ఎగవేసి పోవటం గమనించి అతనిమీద కక్ష సాధిద్దామని ఒకరోజు అతనిని వెంబడించాను.  ఆ విషయం తెలియక అతను ఇక్కడికి దగ్గరిలోవున్నఒక  చెట్టుక్రింద కూర్చొని భగవంతుని ఇలా ప్రార్ధిసున్నాడు " భగవంతుడా ఆ హోటలులో ఎప్పుడు రద్దీగా ఉండేటట్లు చూడు అప్పుడే నేను బిల్లు కట్టకుండా తప్పించుకోగలుగుతాను" అది విన్న నాకు అతనిమీద కోపం పూర్తిగా పోయింది.  దానికి బదులుగా ఆయనమీద నాకు జాలి కలిగింది. ఈ రోజు నేను ఈ స్థితిలో వున్నానంటే దానికి కారణం అతనే అవునంటావా కాదంటావా అన్నాడు. భగవంతుడు ఆతని ప్రార్ధనను మన్నించి నా హోటలులో రద్దీని పెంచాడని ఎందుకు అనుకోకూడదు. నిజానికి అతని స్వార్ధం కేవలం అతను బిల్లు కట్టుకోకుండా తప్పించుకోవటమే కానీ అతనికి తెలియకుండా ఆ భగవంతున్ని నాకు ఎక్కువ కస్టమర్లు రావాలని ప్రార్ధించాడు. అందుకోనేమో అతను నాహోటలుకు వచ్చిన నాటినుండి హోటల్లో రద్దీ ఎక్కువ అయ్యింది నా రాబడిరోజు రోజుకు  పెరగసాదింది. అతను రోజు తింటే యాబై లేక వంద రూపాయల టిఫిను  తింటాడు. కానీ నాకు లాభం వేలల్లో వస్తువున్నది. ఇప్పుడు చెప్పు నాకు అతని వల్ల లాభమా లేక నష్టమా అని అన్నాడు. ఇలా ఆలోచించేవారు కూడా వుంటారా అని నాకు ఆక్షణంలో అనిపించింది. 

 ఆ హోటలు యజమాని మంచితనం సురేషు ఆనందాన్ని ఇచ్చింది.  ఇద్దరు కాఫీలు తాగటం అయ్యింది. బిల్లు ఇస్తానని సురేసు అంటే మీరు నా అతిధులు మీకు నేను ఆతిధ్యం ఇచ్చాను అని అని ఇంకొక మాట అన్నాడు.  మీరు నేను అతని వద్ద బిల్లు తీసుకోవటం లేదనుకున్న నిజానికి ఏ రోజయిన ఆయన రాకపోతే నాకు ఎందుకో మనసు బాధ  పడుతుంది. ఈ రోజు ఆయనకు ఏమైంది ఎందుకు రాలేదు అని అనుకుంటాను. ఆయన రావటం అలానే తప్పించుకొని వెళ్ళటం నేను ఓరగంట కనిపెడుతాను. నిజానికి ఆయన తినే టిఫిన్లు నేను భగవంతునికి అర్పించిన నివేదనగా భావిస్తాను అని అన్నాడు. హోటలు యజమాని ఔదార్యానికి సురేషు హృదయం పులకరించిపోయింది. 

సామాన్యంగా మనమన్దరము చేసే ప్రతిపనికి అప్పుడే ప్రతిఫలం  కావాలనుకుంటాము. కానీ భగవంతుని లీలలు మనకు అర్ధంకావు అయన కొన్ని మన వద్ద తీసుకొని వాటికి బదులుగా  ఎన్నో మనకు  ఇస్తాడు.  ఈ విషయం తెలుసుకుంటే భూమిమీద ప్రతివక్కరు సంతోషంగా వుంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః. 

మీ 

భార్గవ శర్మ

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 106*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 106*


మలయకేతు రాక్షసామాత్యుని దర్శనం కోసం కబురు పంపించాడు. 


ఆ వార్త చేరే సమయానికి పాటలీపుత్రం నుంచి రాక్షసభృతుడైన ప్రతీహారి వచ్చాడు. అతనితో రహస్యంగా ముచ్చటించేందు కోసం రాక్షసుడు తన సిబ్బందిని పిలిచి "మాకు తలనొప్పిగా ఉంది. ఈరోజు ఎవరినీ దర్శించం..." అని చెప్పాడు.  


ఆ తర్వాత కొద్దిసేపటికి మలయకేతు పంపిన భటుడు వచ్చి, రాక్షస దర్శనం కాక తిరిగి వెళ్లి "ప్రభూ ! అమాత్యుల వారికి మా చెడ్డ తలనొప్పిగా వున్నదట.... ఈ రోజు వారి దర్శనం ఎవరికీ లభించదట" అని మనవి చేశాడు. 


బాగురాయణుడు కల్పించుకొని "అయ్యో... పాపం... మనమే వెళ్లి ఆయన్ని పరామర్శించి వద్దాం పదండి" అంటూ మలయకేతును ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి రాక్షస నివాసానికి వెళ్లారు. ఆ నివాసం బయటనే కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న సిద్దార్థకుడు వాళ్ళని చూసి గతుక్కుమని "అమాత్యుల వారిది కల్పిత శిరోవేదన అని మీకు తెలిసిపోయిందా ?" అనేసి నాలిక కరుచుకున్నాడు. 


మలయకేతు వులిక్కిపడి "ఏమిటి ? తలనొప్పి ? అబద్ధమా ?" అంటూ ముందుకు వెళ్లి అంతకు ముందు సిద్ధార్థకుడు పచార్లు చేసిన చోటనున్న కిటికీ వద్దకు చేరాడు. లోపలి నుంచి మాటలు వినిపించసాగాయి. 


"భళా .... చాణక్య చంద్రగుప్తుల మధ్య విరోధము కల్పించబడి, చాణక్యుడు అతని నుండి విడిపోయినాడన్న మాట" అన్నాడు రాక్షసుడు ఉత్సాహంతో. 


ప్రతీహారి నవ్వి "అవును. నీకంటే రాక్షసుడే మంచివాడని చంద్రగుప్తుడన్నాడు. అయితే ఆ రాక్షసుడినే తెచ్చి మంత్రిని చేసుకోమని చెప్పి చాణక్యుడు వెళ్లిపోయాడు. ఇక మీ అభీష్టం సిద్ధించడానికి ఆటంకాలన్నీ తొలగిపోయినట్లే...." అని చెప్పాడు. 


రాక్షసుడు సంతోషంతో పగలబడి నవ్వి "కాదా మరి. చంద్రుడు నా నామస్మరణ మొదలు పెట్టాడంటే, నా సంకల్పం సిద్ధించినట్లే...." అన్నాడు సంబరంతో. 


ఆ సంభాషణలను కిటికీ బయటనుంచి ఆలకించిన మలయకేతు ఆవేశంతో ఏదో అనబోగా, బాగురాయణుడు సైగలతో అతనిని వారించి అవతలికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ రాజభవనం చేరారు. 


"ఆ సంభాషణల ఆంతర్యమేమిటో బోధపడిందా ? చంద్రగుప్తుడు ప్రశంసించాడట... యీయన ఇక్కడ పరవశించిపోతున్నాడట... ఎందులకటా ?" అన్నాడు మలయకేతు ఉక్రోషంతో. 


"మగధరాజ్య మహామాత్య పదవి లభించనున్నదన్న పరవశమేమో...." అనేశాడు బాగురాయణుడు. 


మలయకేతు ఉలిక్కిపడి అనుమానంగా చూశాడు. 


బాగురాయణుడు సాలోచనగా తలపంకించి "అవును. ఎవరేమైపోయినా రాక్షసునికి కావాల్సింది మగధ మంత్రిత్వం. దాని కోసమే ఒకనాడు మహానందుల వారికి ద్రోహం చేసి మహాపద్ముడిని ఆశ్రయించాడు. ఆ పదవి కోసమే లోపలి నుంచి కోట తలుపులు తెరిపించి చంద్రుని ద్వారా నందులను చంపించాడు. కానీ అక్కడ చాణక్యుడు అడ్డగోడ వలె నిలిచాడు. ఇప్పుడా గోడకూలిపోయింది. ఇక అవాంతరం ఏదైనా ఉంటే... అది మనమే..." అన్నాడు సాలోచనగా. 


మలయకేతు కోపంతో పళ్లు కొరుకుతూ "తక్షణమే రాక్షసుని పిలిపించి..... " అంటున్నాడు. 


బాగురాయణుడు వారిస్తూ, "వద్దు. సరైన ఆధారాలు లేకుండా రాక్షసుని నిలదీయడం మంచిది కాదు. మనం కూడా నాటకమాడి వాళ్లకన్ను వాళ్ళ వ్రేలితో పొడవాలి. తక్షణం యుద్ధయాత్ర మొదలెడదాం. ప్రస్తుతం బలహీనుడైన చంద్రగుప్తుని జయించి, ఆ తర్వాత రాక్షసుని సంగతి ఆలోచిద్దాం. అంతవరకూ మనకు తెలిసిన ఈ రహస్యం... గప్ చిప్...." అని చెప్పాడు. 


ఆ సలహా నచ్చిన మలయకేతు యుద్దయాత్రకి ఏర్పాట్లు పూర్తి చేసి ఆ తర్వాత రాక్షసునికి ఆ విషయం తెలియపరిచాడు. ఆ మరునాడే యుద్ధయాత్ర ప్రారంభం. చేసేది లేక రాక్షసుడు అనుసరించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పూరి జగన్నాథుని దర్శనం

 👆*బంగారు✨ ఆభరణాలతో⚡ పూరి జగన్నాథుని దర్శనం - సునా💫బేషా*(సోనా వేష)


సునా బేషా  ఏకాదశి తిథిలో జరిగే ఆచారం. దశమి నాటికి ప్రదాన ఆలయంకు చేరుకున్న రథంలో ఉన్న దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు దీనినే *సునా బేషా* అంటారు.

దీనిని *రాజధీరాజ భేషా* లేదా *రాజా బేషా* అని కూడా అంటారు. 


1430 సంవత్సరంలో ఈ 'సునా బేషా' ను రాజు కపిలేంద్ర దేబ్ పాలనలో ప్రవేశపెట్టబడిందని చరిత్ర చెబుతోంది. దేవతలు దాదాపు మూడు క్వింటాళ్ల బరువున్న మెరిసే బంగారు ఆభరణాలను ధరిస్తారు. 


ఈ ఆభరణాలను శ్రీమందిర్ ఖజానా వద్ద భధ్రపరుస్తారు. దీనిని *రత్న భండార్* అని పిలుస్తారు.


సాంప్రదాయం ప్రకారం, సేవకులు రత్న భండార్ నుండి బంగారు మరియు వెండి ఆభరణాలను తెచ్చి, రథాలపై *పుస్పాలక మరియు దైతాపతి *సేవకులకు అప్పగిస్తారు, తరువాత *చతుర్ధ మురతిని *ఆభరణాలతో అలంకరిస్తారు.


ముగ్గురు దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. భగవంతుడు జగన్నాథ్ మరియు బలభద్ర బంగారంతో చేసిన చేతులు మరియు కాళ్ళతో కనిపిస్తారు. జగన్నాథుడు తన కుడి చేతిలో బంగారు చక్రం మరియు ఎడమ చేతిలో ఒక వెండి శంఖాన్ని కలిగి ఉన్నాడు. బాలభద్ర ఎడమ చేతిలో బంగారు నాగలిని, కుడి చేతిలో బంగారు జాపత్రిని పట్టుకొని కనిపిస్తాడు.


సునా బేషంలో ఎవరైతే భగవంతుడిని చూస్తారో అతని చెడ్డ కర్మలన్నిటి నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.


సునా వేశంలో దేవతలను అలంకరించడానికి ఈ క్రింది ఆభరణాలు ఉపయోగించబడతాయి:


*హస్తా (చేతి), 

*పాయర్ (అడుగులు), 

*ముకుటా (తలపాగా లేదా పెద్ద కిరీటం), 

*మయూర్ చంద్రికా- ఒక నెమలి ఈక రూపకల్పన, దీనిని శ్రీకృష్ణుడు, చులపతి తల అలంకరణగా ఉపయోగించారు, 

*ముఖ సౌందర్యం, కుండల్ (చెవి వేలాడదీయడం) రింగులు), 

*రాహురేఖా- దేవత ముఖం మీద అలంకరించబడిన సగం చదరపు ఆకారపు అలంకరణ, 

*పద్మం (తామర), 

*సేవతి (చిన్న సూర్య పువ్వు), 

*చంద్రుని పువ్వు ఆకారంలో అగస్తి, 

*వివిధ రకాలైన మాలాలు లేదా కంఠహారాలు. బంగారు పూసలు), 

*నెమలి ఈకలు రూపంలో మేయర్, మరియు *చంపా- ఒక పసుపు పువ్వు,

*దేవతల మూడవ కన్ను సూచించే శ్రీ చితా, చక్ర లేదా చక్రం, గడా లేదా జాపత్రి, పద్మ ఒక తామర పువ్వు, మరియు  శంఖం కొన్ని ప్రత్యేక సందర్భంలో  అలంకరించడానికి ఉపయోగించే బంగారు నమూనాలు.


*జై జగన్నాథ్🙏* 

🔔 🔔 🔔

నేరేడుపండు - మాంసాహారం

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - II 


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

తేనె ఉపయోగాలు

 తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 


        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 


                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 


                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 


                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 


              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 


                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో  సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 


              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 


      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034

29, జూన్ 2023, గురువారం

Short film

 https://www.youtube.com/watch?v=04q0ye4GBR0&t=26s

యోగ.. రహస్యం...

 *భారతీయ యోగ.. రహస్యం...*


మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో 

ఆ రహస్యం ...


*శ్వాస*

-------------

మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.


ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?


దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...

అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.


మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.


ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది. 

దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.

ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".

ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...


ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.

ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...

ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...

ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.

ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......


ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...

ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...

ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.


పాత వాటిని ఖాళీ చేస్తేనే...

కొత్తవి రాగల్గుతాయి.

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.


ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 

వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,

సరిగా ఉష్ణం జనించక......

తీవ్ర రోగాల బారిన పడతారు...


కనుక ఈ టాక్సిన్ లను

బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్

(విసర్జన)"

చాలా ముఖ్యం.


ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.


అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


5 రోజులు జీవిస్తుంది......


13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


7 రోజులు జీవిస్తుంది......


ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...

మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.


ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......

అలాగే ఈ కణాలు కూడా......


భారతీయ యోగులు ...

కణం యొక్క జీవిత కాలాన్ని...

3 నుండి 21 రోజుల వరకూ

పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...


శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

ఆ కణం త్వరగా పాడై పోతుంది.


*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"* ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......

మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...


ఎందుకంటే......


అవయవాలు అంటే...

కణాల సముదాయమే.


ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...

ఆయుష్షు పెరిగితే...


*మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!*


*మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...*

*20 సంవత్సరాల ఆయుష్షును*

*పెంచు కోవచ్చు...*


*యోగులు...*

*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*

*తాము... ఏ రోజు...మరణించేదీ...*

*ముందే చెబుతారు 🙏🙏.

 శ్లోకం:☝️

  *అక్షిదోషాద్యధైకోఽపి*

*ద్వాయవద్భాతి చంద్రమాః l*

  *ఎకోఽప్యాత్మా తథా భాతి*

*ద్వయవన్మాయయా మృషా ll*


భావం: ఉన్నది ఒకే చంద్రుడు అయినను దృష్టి దోషము కలవానికి అక్కడ ఇద్దరు చంద్రులున్నట్లు కనిపించును. అదే విధముగా మిధ్యాజ్ఞానము గల జీవులకు ఒకే ఆత్మ రెండుగా అనిపించును. అంటే మనలోని జీవాత్మా ఆ పరమాత్మ వేరుకాదు, కేవలం మన జ్ఞానలోపము తప్ప - అంటున్నారు భగవత్పాదులు.🙏

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


 క్రీ.శ. 622 నుండి క్రీ.శ. 634 వరకు కేవలం 12 సంవత్సరాలలో, మహమ్మద్ అరేబియాలోని విగ్రహారాధకులందరినీ బలవంతంగా కత్తితో ముస్లింలుగా మార్చాడు!  (మక్కాలో మహాదేవ్ కబలేశ్వర్ (కాబా) తప్ప!)*


 *క్రీ.శ.634 నుంచి 651 వరకు అంటే కేవలం 16 ఏళ్లలో పార్సీలంతా కత్తిమీద సాముతో బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 640లో, ఇస్లాం మొదటిసారిగా ఈజిప్టులో అడుగు పెట్టింది మరియు కేవలం 15 సంవత్సరాలలో, 655 నాటికి, దాదాపు ఈజిప్ట్ ప్రజలందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 *ఉత్తర ఆఫ్రికా దేశాలైన అల్జీరియా, ట్యునీషియా, మొరాకో మొదలైన దేశాలు క్రీ.శ.640 నుండి 711 వరకు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డాయి!*


 * 3 దేశాల సంపూర్ణ సంతోషాన్ని, శాంతిని బలవంతంగా లాక్కోవడానికి ముస్లింలు కేవలం 71 ఏళ్లు పట్టారు!*


 * 711 ADలో స్పెయిన్ ఆక్రమించబడింది, 730 AD నాటికి స్పెయిన్ జనాభాలో 70% ముస్లింలు!

 కేవలం 19 సంవత్సరాలలో తురుష్కులు కొంచెం ధైర్యంగా మారారు, టర్కీలకు వ్యతిరేకంగా జిహాద్ 651 ADలో ప్రారంభమైంది, మరియు 751 AD నాటికి తురుష్కులందరూ బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డారు!*


 * ఇండోనేషియాపై జిహాద్ కేవలం 40 ఏళ్లలో పూర్తయింది!  1260లో, ముస్లింలు ఇండోనేషియాలో మారణకాండ సృష్టించారు మరియు 1300 AD నాటికి ఇండోనేషియన్లందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్ మొదలైన దేశాలు 634 మరియు 650 మధ్య బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డాయి!*

సిరియా కథ మరింత బాధాకరం!  ముస్లింలు తమ స్త్రీలను క్రైస్తవ సైనికుల ముందు ఇచ్చారు!  ముస్లింల నుండి మమ్మల్ని రక్షించడానికి ముస్లిం మహిళలు క్రైస్తవుల వద్దకు వెళ్లారు!  పేద మూర్ఖ క్రైస్తవులు వచ్చి ఈ దుష్టుల మాటలకు ఆశ్రయం ఇచ్చారు!  అప్పుడు ఏముంది, "శూర్పణఖ" రూపంలో వచ్చిన వారంతా కలిసి సైనికులందరినీ రాత్రిపూట హలాం చేశారు!*


 *ఇప్పుడు మీరు భారతదేశ పరిస్థితిని చూడండి!*


 ఆ తర్వాత భారత్‌పై జిహాద్ క్రీ.శ.700లో మొదలైంది!  అతను ఇంకా నడుస్తున్నాడు!*


 * ఆక్రమణదారులు ఇరాన్‌కు చేరుకుని తమ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న సమయంలో, భారతదేశంలోని రాజపుత్రులు తమ సామ్రాజ్యాన్ని తమ కళ్లతో కూడా చూసే ధైర్యం వారికి లేదు!


 * క్రీ.శ.636లో ఖలీఫా భారతదేశంపై మొదటి దాడిని ప్రారంభించాడు!  ఒక్క ఆక్రమణదారుడు కూడా సజీవంగా తిరిగి వెళ్లలేడు!*


 కొన్నేళ్లుగా ముస్లిం ఆక్రమణదారులు భారతదేశానికి ఎదురుగా నిద్రపోయే సాహసం కూడా చేయలేదు!  అయితే కొన్నాళ్లకే రాబందులు తమ కులాన్ని చూపించారు!  మళ్లీ దాడి!  ఈ సమయంలో ఉస్మాన్ ఖలీఫా సింహాసనంపైకి వచ్చాడు!  అతను హకీమ్ అనే జనరల్‌తో భారీ ఇస్లామిక్ మిడతలను భారతదేశానికి పంపాడు!

సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, కమాండర్-ఇన్-చీఫ్ బందీగా పట్టుకున్నాడు!  యువరాజు భారతీయ రాజపుత్రులచే చంపబడ్డాడు మరియు చాలా దుర్భరమైన స్థితిలో అరేబియాకు తిరిగి పంపబడ్డాడు, తద్వారా అతని సైన్యం యొక్క దురదృష్టం ఉస్మాన్‌కు చేరుకుంటుంది!


 * ఈ ప్రక్రియ దాదాపు 700 AD వరకు కొనసాగింది!  భారతదేశం వైపు మొహం తిప్పిన ముస్లింలంతా రాజపుత్ర పాలకులు భుజాల నుంచి తల దించుకున్నారు!*


 ఆ తర్వాత కూడా భారత వీర సైనికులు ఓటమిని అంగీకరించలేదు!  7వ శతాబ్దంలో ఇస్లాం ప్రారంభమైనప్పుడు, అరేబియా నుండి ఆఫ్రికా, ఇరాన్, యూరప్, సిరియా, మొరాకో, ట్యునీషియా, టర్కీ వంటి పెద్ద దేశాలు ముస్లింలుగా మారిన సమయంలో, మహారాణా ప్రతాప్ పూర్వీకుడైన బప్పా రావల్ భారతదేశంలో జన్మించాడు! *


 * అతను అద్భుతమైన యోధుడు, ఇస్లాం యొక్క గోళ్ళలో చిక్కుకోవడం ద్వారా, ఆ హీరో ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లింలను చంపాడు!  ఇది మాత్రమే కాదు, అతను యుద్ధం చేస్తూనే ఖలీఫా సింహాసనాన్ని చేరుకున్నాడు!  ఖలీఫా స్వయంగా తన ప్రాణాలను అడుక్కోవలసి వచ్చింది!*


* ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ ఆగలేదు!  భారతదేశానికి నాగభట్ట ప్రతిహార II వంటి యోధులు లభించారు!  తన జీవితాంతం రాజపుత్ర మతాన్ని అనుసరించి, మొత్తం భారతదేశాన్ని రక్షించడమే కాకుండా, ప్రపంచంలో మన శక్తి యొక్క ధృవాన్ని నిలబెట్టింది!


 అరబ్ ఓడిపోలేదని బప్పా రావల్ ముందే చెప్పాడు!  కానీ క్రీ.శ.836లో ప్రపంచాన్ని జయించిన ముస్లిములను దిగ్భ్రాంతికి గురిచేయడం భారతదేశంలో జరిగింది!


 * మిహిర్భోజ ప్రతిహార చక్రవర్తి ముస్లింలను కేవలం 5 గుహలకే పరిమితం చేశాడు!  అదే సమయంలో, ముస్లింలు యుద్ధంలో మాత్రమే విజయం సాధించి, అక్కడి ప్రజలను ముస్లింలుగా మార్చేవారు!


 * భరత్ వీర్ రాజ్‌పుత్ మిహిర్భోజ్ ఈ ఆక్రమణదారులను అరేబియా వరకు కదిలించాడు!


 ఇస్లాం ఆవిర్భవించిన 400 సంవత్సరాల వరకు పృథ్వీరాజ్ చౌహాన్ వరకు, రాజ్‌పుత్‌లు ఇస్లాం వ్యాధిని భారతదేశాన్ని ప్రభావితం చేయనివ్వలేదు!  ఆ యుద్ధ కాలంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా ఉంది!  ఆ తర్వాత ముస్లింలు కూడా విజయం సాధించారు, కానీ రాజ్‌పుత్‌లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేదు, వారు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు!

* చివరిగా వీర్ దుర్గాదాస్ జీ రాథోడ్ ఢిల్లీకి నమస్కరించాడు, జోధ్‌పూర్ కోటను మొఘలుల చేతుల్లోకి తీసుకెళ్లి, హిందూ మతానికి గౌరవాన్ని జోడించారు!*


 ముస్లింలు ఏ దేశాన్ని ముస్లింగా మార్చడానికి 20 సంవత్సరాలు పట్టలేదు, 800 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించినా, మేవార్ సింహం మహారాణా రాజ్ సింగ్ తన గుర్రంపై ఇస్లాం ముద్ర వేయడానికి అనుమతించలేదు.


 * మహారాణా ప్రతాప్, దుర్గాదాస్ రాథోడ్, మిహిర్భోజ్, రాణి దుర్గావతి, తమ మాతృభూమి కోసం తమ జీవితాలను ఆడుకున్నారు!*


 * ఒకప్పుడు ఇది వచ్చినప్పుడు, పోరాడుతున్న రాజపుత్రులు కేవలం 2% వద్ద ఆగిపోయారు!  ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూడండి మరియు ఈ రోజు మీ వర్తమానాన్ని చూడండి!  20 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం మందిని ముస్లింలుగా మార్చిన ముస్లింలు కేవలం భారత్‌లోనే ఎందుకు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు పరిమితమయ్యారు?


 * రాజా భోజ్, విక్రమాదిత్య, నాగభట్ట I మరియు నాగభట్ట II, చంద్రగుప్త మౌర్య, బిందుసార, సముద్రగుప్త, స్కంద గుప్త, ఛత్రసల్ బుందేలా, అల్హా ఉదల్, రాజా భటి, భూపత్ భాటి, చాచాదేవ్ భాటి, సిద్ధ శ్రీ దేవరాజ్ భాటి, కనద్ దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్ హమ్మీర్ దేవ్ చౌహాన్, విగ్రహ్ రాజ్ చౌహాన్, మాల్దేవ్ సింగ్ రాథోడ్, విజయ్ రావ్ లంఝా భాటి, భోజ్‌దేవ్ భాటి, చుహార్ విజయరావ్ భాటి, బలరాజ్ భాటి, ఘడ్సీ, రతన్ సింగ్, రాణా హమీర్ సింగ్ మరియు అమర్ సింగ్, అమర్ సింగ్ రాథోడ్, దుర్గాదాస్ రాథోడ్, జస్వంత్ సింగ్, మీర్జా రాజా జై సింగ్, రాజా జైచంద్, భీమ్‌దేవ్ సోలంకి, సిద్ధ శ్రీ రాజా జై సింగ్ సోలంకి, పులకేశిన్ II సోలంకి, రాణి దుర్గావతి, రాణి కర్ణావతి, యువరాణి రతన్‌బాయి, రాణి రుద్రా దేవి, హదీ రాణి, రాణి పద్మావతి వంటి అనేక మంది రాణులు పోరాడారు మరియు తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు.దీని కోసం ప్రాణాలర్పించారు!*

* ఇతర యోధులు తోగా జీ వీర్వర్ కల్లాజీ జైమల్ జీ జీటా కుపా, గోరా బాదల్ రాణా రతన్ సింగ్, పజ్బన్ రాయ్ జీ కచావా, మోహన్ సింగ్ మంధర్, రాజా పోరస్, హర్షవర్ధన్ బెస్, సుహెల్దేవ్ బెస్, రావు షేఖాజీ, రావు చంద్రసేన్ జీ డోడ్, రావు చంద్ర సింగ్ జీ రాథోడ్ కృష్ణ కుమార్ సోలంకి, లలితాదిత్య ముక్తాపిడ్, జనరల్ జోరావర్ సింగ్ కలువారియా, ధీర్ సింగ్ పుండిర్, బల్లూజీ చంపావత్, భీష్మ రావత్ చుండా జీ, రాంసా సింగ్ తోమర్ మరియు అతని వారసులు, ఝాలా రాజ మన్, మహారాజా అనంగ్‌పాల్ సింగ్ తోమర్, స్వాతంత్ర్య సమరయోధులు రావ్ భక్తవర్ సింగ్, అమ్జ్హన్ పట్వార్ సింగ్ , రావ్ రాజా రామ్ బక్ష్ సింగ్, ఠాకూర్ కుశాల్ సింగ్, ఠాకూర్ రోషన్ సింగ్, ఠాకూర్ మహావీర్ సింగ్, రావ్ బేణి మాధవ్ సింగ్, దూంగ్జీ, భుర్జీ, బాల్జీ, జవహర్జీ, ఛత్రపతి శివాజీ!*


 అటువంటి హిందూ యోధుల ప్రస్తావన అప్పటి నెహ్రూ-గాంధీ ప్రభుత్వ హయాంలో మన చరిత్రలో మనకు బోధపడలేదు!  అక్బర్ గొప్ప చక్రవర్తి అని బోధపడింది!  అప్పుడు హుమాయూన్, బాబర్, ఔరంగజేబు, తాజ్ మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ మొదలైన వాటి గురించి మాత్రమే నేర్పించారు!


 * హిందువులు సంఘటితమై ఉండకపోతే, ఈ రోజు ఈ దేశం సిరియా మరియు ఇతర దేశాల మాదిరిగా పూర్తిగా ముస్లిం దేశంగా మారిపోయేది!


 * హిందూ సమాజానికి చేరుకోవడానికి ఈ అందమైన విశ్లేషణ సమాచారం తప్పనిసరి!  ప్రతి తరగతి మరియు సమాజంలోని హీరోల కథలు చెప్పడం వారు గర్వపడేలా చేయాలి!*


 *కనీసం ఐదు గ్రూపులు పంపాలి*

 *కొందరు పంపరు*

 * కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను * ️🔱

*స్వామి దీపేశానంద సరస్వతి*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 105*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 105*


చక్రవర్తి తృళ్లిపడి "ఆర్యులా.... తరతరాలుగా పాటిస్తున్న ఆచారాన్ని ఆయన నిషేధించారా....? అదీ.... మాతో మాట మాత్రం చెప్పకుండా...." రెట్టించాడు. 


ప్రతీహారి తలవంచుకుని, ఓరకంట చక్రవర్తిని చూస్తూ "తామే సర్వంసహా శాసనకర్తలమని, మీతో మాటవరసకైనా చెప్పనవసరం లేదని ఆర్యుల అభిప్రాయం" అన్నాడు. 


"అభిప్రాయమా ? అహంకారమా ? ఈ రాజ్యానికి చక్రవర్తులము మేము. రాజ్యాధికారం మాది. మమ్మల్ని కాదని శాసనాలు చెయ్యడానికి ఆయనెవరు ?" అంటూ చక్రవర్తి పళ్లు కొరికి "ప్రతీహారీ ! తక్షణమే చాణక్యుల వారికి వర్తమానం పంపించు. ఆర్యులు వెంటనే వచ్చి చక్రవర్తి దర్శనం చేసుకోవాలి..... యీ రాత్రి ... యిక్కడే..." అంటూ ఆదేశించాడు ఆవేశంతో. ప్రతీహారీ వేగంగా నిష్క్రమించాడు.  


చంద్రగుప్తుడు కోట బురుజుల మీదనే అసహనంతో పచార్లు చెయ్యసాగాడు. అర్ధఘడియ తర్వాత.... 


చాణక్యుడు వస్తూనే "ఏమిటి.... ఎప్పుడూ నా దర్శనం కోసం నువ్వే వచ్చేవాడివి.... ఇవాళ, వేళకాని వేళ నీ దర్శనం చేసుకోవడానికి నన్ను రమ్మన్నావట ?" అడిగాడు వ్యంగంగా. 


"ఆ సంగతి తర్వాత. ముందు ఈ విషయం చెప్పండి. దీపోత్సవాన్ని ఎందుకు నిషేధించారు ?" తీవ్రస్వరంతో ప్రశ్నించాడు చక్రవర్తి. 


చంద్రుని స్వరంలోని మార్పుని గుర్తించిన చాణక్యుడు అభిజాత్యంతో "మమ్మల్నే నిలదీసి ప్రశ్నించేంతటి వాడివయ్యావా ?" అని ఎదురు ప్రశ్నించాడు. 


చక్రవర్తి పళ్లు కొరుకుతూ "మా ప్రశ్నకి సమాధానం ఇది కాదు. మేము మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తులం. చక్రవర్తి ప్రశ్నకి ఎంతటి వారైనా సమాధానం చెప్పి తీరాలి" అన్నాడు కటువుగా. 


"ఆహా... అలాగా .... మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నిన్ను చక్రవర్తిని చేసింది మేమే.... ఆ సంగతి మర్చిపోకు...." 


"ఆ సంగతి గుర్తున్నది కాబట్టే ఇంకా మిమ్మల్ని, మీ అహంభాహాన్నీ భరిస్తున్నాం. కానీ, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది మీరు కాదు. అది మా తండ్రిగారి అంతిమకోరిక. మా సామ్రాజ్యానికి ఆ పేరు వారే పెట్టారు. ఇహ.... నన్ను చక్రవర్తిని చేసింది మీరా.... ? కాదు.... సాటిరాజులు సహకరించారు. మాకు కన్యాదానం చేసిన మామగారు బాసటగా నిలిచారు. పాపం ఏలోకానున్నారో గానీ, పర్వతకుల వారు తమ సైన్యాలతో అండగా నిలిచారు. ఇందరి సహాయ సంపత్తులతో, మా శౌర్య ప్రతాపాలతో పోరాడి, నందులను సంహరించి మేము రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాం. చక్రవర్తులమయ్యాం. ఈ బృహత్తర కార్యంలో మీరు చేసిన సాయమెంత ? మీరు చేసిన ఆవగింజంత సహాయాన్ని కొండంతలుగా ఊహించుకొని మాకు మారుగా మీ అంతట మీరే అధికారం చెలాయిస్తారా ? శాసనాలు చేస్తారా ? ఎంత ధైర్యం ?" ఆవేశంతో ఊగిపోయాడు చక్రవర్తి. 


"వృషలా...." గర్జించాడు చాణక్యుడు. ఆగ్రహంతో మండిపడుతూ "ఏమి మా ధైర్యాన్నే ప్రశ్నించేంతటి వాడివయ్యావా ? నీ కోసం ఎంతో చేస్తే, అది మరిచి, కృతఘ్నుడవై...." అంటుంటే, చక్రవర్తి మధ్యలోనే కల్పించుకుంటూ "ఏం చేశారు నా కోసం ..." రెట్టించాడు. 


ఎదురు చూడని ఆ ప్రశ్నకు నిశ్చేష్టుడయ్యాడు ఆర్యుడు. 


"ఏం చేశారు నా కోసం.... ? అమాయకులైన పర్వతకుడిని విషకన్య ప్రయోగంతో చంపించి నేపాళరాజులతో మాకు శత్రుత్వాన్ని తెచ్చిపెట్టారు. బాగురాయణ, డింగరాత్త, భద్రభటాదులను దేశబహిష్కారంగావించి ఆ రాజభక్తుల సేవలను నాకు దూరం చేశారు. ఆఖరికి మీ కుతంత్రంతో..... మగధులకు అత్యంత ప్రేమాస్పదుడైన రాక్షసామాత్యుల వారిని ఈ రాజ్యం నుంచి తరిమేశారు.... " 


"ఏమిటేమిటీ... ఆ రాక్షసుడు మాగధులకు అత్యంత ప్రేమస్పదుడా... ఆహా ! ఆ మాగధులలో నీవు ఒకడివే గదా ! ఇంకేం .... విషయం ఇంత ముదిరిన తర్వాత ఇంక నీతో మాకు మాటలేమిటి ? ఈ క్షణం నుంచి నీ రాచకార్యాలతో మాకేం సంబంధం లేదు..... ఆ రాక్షసుడినే తెచ్చిపెట్టుకో...." 


"తెచ్చి పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను. దానికి తమరి అనుమతి అవసరం లేదు. అయినా మీ వంటి కౌటిల్యుని కంటే ప్రజా సంక్షేమమే జీవితధ్యేయంగా బ్రతికే ఆ రాక్షసుడు వెయ్యి రెట్లు నయం" అన్నాడు చక్రవర్తి ఉక్రోషంతో. 


"ఔరా ... ఎంత మాటలంటున్నావు ? ఇంక, ఇంకొక క్షణం ఇక్కడ నిల్చోవడమే మహాపరాధం..." అని అరుస్తూ గిర్రున వెనుతిరిగాడు చాణక్యుడు. 


"ఆగండి...." హెచ్చరించాడు చక్రవర్తి కటువుగా. 


చాణక్యుడు ఆగి తల వెనక్కి తిప్పి చూసాడు. 


"నా ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏ అధికారంతో దీపోత్సవాన్ని నిషేధించారు ?" తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు చక్రవర్తి. 


చాణక్యుడు కోపంగా చూస్తూ "అధికారమేదో వుందనుకొని నిషేధించాం... ఆ అధికారం లాంటిదేదైనా మాకుంటే... ఈ క్షణం నుంచే దాన్ని వదులుకుంటున్నాం. అంతే ఇదే మా సమాధానం...." అనేసి ముఖం తిప్పుకొని చరచరా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 


"ప్రతీహారీ....." అరిచాడు చక్రవర్తి ఆవేశంతో. ప్రతీహారీ లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. చక్రవర్తి అతడివైపు కన్నెర్రగా చూస్తూ "ఈ నాటి నుంచి ఆర్య చాణక్యుల వారికి మా రాజ్యపాలనలతో ఏ సంబంధం లేదు. పరిపాలన వ్యవహారాలన్నీ మేమే స్వయంగా చూసుకుంటాం.


ఈ విషయాన్ని నగరమంతటా దండోరా వేయించు...." అని ఆదేశించి చరచరా అంతఃపురం వైపు సాగిపోయాడు. 


అలా వెళ్ళిపోతున్న చక్రవర్తిని వెనకనించి చూస్తూ మందహాసం చేశాడు ప్రతీహారి.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పోతన సన్నివేశ చిత్రణము

: పోతన సన్నివేశ చిత్రణము!


సుందర సురుచిర ఘట్టముల నావిష్కరించుటలో పోతన మొనగాడు. ప్రతిఘట్టమున కొన్ని సుందర దృశ్యములుండును.వానినిపాఠకుని మనో పటమున మరపురాని మనోజ్ఙ వర్ణరంజిత చిత్రాలుగా మలచుట ఆతని కవిత లోని ప్రత్యేకత!


       గజేంద్రమోక్షమున భక్తపరాధీనుడైనహరి,గజరాజు మొరవిని వైకుంఠమునుండి పరుగుపరుగున వచ్చుదృశ్యమును పోతన వర్ణంచిన తీరు నాన్యతో దర్శనీయము.

"తనవెంటంసిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్,/ వానివెన్కను బక్షీంద్రుడు,వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ/

క్రనికాయంబును,నారదుండు,ధ్వజనీకాంతుండురావచ్చిరొ/

య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాలగోపాలమున్;//

చివరకు వైకుంఠపురంలోని పిలాపెద్దా అంతా హరివెనుక కదిలారు.


మంచిసుందరదృశ్యము.దీనిని 


వినువీధిలో నిలచి దేవతలు చూచుచూ ఆజగద్బాంధవునకు మ్రొక్కులిడు చున్నారట!

పరిశీలిపుడు.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్,సురారాతిజీ/

వన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృ/

ద్వనవర్తిష్ణు, సహిష్ణు,భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణు,నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్,


ఒకరితో నొకరు ఇలాచెప్పుకుంటుంన్నారు.


"చనుదెంచెన్హరి,యల్లవాడె!  హరిపజ్జంగంటిరే లక్ష్మి,శం/

ఖనినాదంబదె!చక్రమల్లదె ,భుజంగధ్వంసియున్ వాడె,చ/

య్యన నేతెంచెనటంచు వేల్పులు నమోనారాయణాయే/

తి! నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్;


ఆయాకాశమేమో? ఆదేవతలేమో? మ్రొక్కులిడుటేమో మనమెన్నడు చూచినవారముగాకపోయినా చదువరుల మనోకుడ్యములమీద ఆచిత్రమంతయు మద్రబడునట్లు వర్ణించినాడు పోతనమహాకవి.


 ఇదీ ఆకవికలము జేసిన వర్ణనా మాయా మహేంద్రజాలము


.ఆచిత్రములను జూచుటకు మన నయనములుగాని,సులోచనములుగానిపనికిరావు.ఆలోచనా లోచనాలతో అంతరంగమున పరికింప వలసియుండును.ప్రయత్నింపుడు.ఫలితము మీచెంతనే! ఇట్టి మనోహర కవితా నిర్మాణచాతుర్యముగల పోతనమహాకవీంద్రునకు వినమ్రాంజలులర్పించుచు,

                      స్వస్తి!🙏🙏



                _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝


*దివసేనైవ తత్కుర్యాద్ యేన రాత్రౌ సుఖం వసేత్।*

*అష్టమాసేన తత్కుర్యాద్ యేన వర్షాః సుఖం వసేత్।।*

*పూర్వే వయసి తత్కుర్యాద్ యేన వృద్ధః సుఖం వసేత్ ।*

*యావజ్జీవం హి తత్కుర్యాద్ యేన ప్రేత్య సుఖం వసేత్ ।।* 


తా 𝕝𝕝 

పగలు అంతా కష్టపడి పనిచేసిన వాడికి, రాత్రి సుఖంగా నిద్ర పడుతుంది... ఒక సంవత్సరములో మిగిలిన ఎనిమిది మాసాలు కష్టపడి జాగ్రత్త తీసుకున్న వారికి వర్షాకాలం నాలుగు మాసాలు సుఖంగా ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బలంగాను , ధైర్యంగాను , తెలివిగాను ఉన్నవారికి వృద్ధవయసు సుఖంగా ఉంటుంది.


     అలాగే జీవితం మొత్తం తెలివిగా తగిన పనులు చేస్తూ జాగ్రత్తగా ఉన్నవారికి మరణం సుఖంగా ఉంటుంది. అంటే జీవితం మొత్తం దైవం గురించి తెలుసుకుంటూ... "హరి నామస్మరణ" చేసిన వారికి మరణమే ఉండదు..అంటే జననం మరణ చక్రాలు ఉండవు... అని అర్థము.

వాసిష్ఠ గణపతి ముని

 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని


     ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు  అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే  శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .

                                   


జననం –విద్యా భ్యాసం –వివాహం


    అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి  దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .

                 పిన తండ్రి  ప్రకాశ  శాస్త్రి దగ్గర కావ్యాలు చదివటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహత్యా లనుకరతలా మలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయనాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .

                                     


    దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు


              1896లో అంటే పదహారేల్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువ రాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన  కన్పించిగణపతి  గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవాని   శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్తూల శిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు  చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి  నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావదానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900  లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహం టో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంథ    వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తుఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని  అనే  ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంథ గణపతి  ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .

                    వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు .గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో  సహా మంద సా వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి ,తమ్ముడు శివ రామ శాస్త్రి తో  కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు  చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం  చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ ఇంచుకొన్నాడు .

          కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులేవారిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు .రోజు అరుణాచల నందీశ్వరుని  ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు .🙏