30, నవంబర్ 2023, గురువారం

 *అర్ధం- అపార్థం*


రెండు పదాలు కు మద్య ఓక అక్షరం తేడా అంతే, కానీ బావం మారతుంది, సంబంధాలను, భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది.

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. 

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.


తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.

అని చాలా సార్లు చెప్పుకున్నాడు.


ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు


అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. 

వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!


అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.


తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.


 "పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".


తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు. 

ఇంత  చిన్న శిక్షనా? అన్నాడు భారవి.

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.


చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు....


దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. 

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది.

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. 

ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను  మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. 

భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. 


కోపం గా మాట్లడే ప్రతివారి ని శతృత్వము తో చూడరాదు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!

అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

"తల్లిదండ్రులను ద్వేషించకండి!

అంతకంటే పాపం ఇంకోటి వుండదు"

🙏💐🙏శుభోదయం 🙏💐🙏

Panchaag


 

 #అత్యంత_అరుదైన_శ్రీ_మేధా_దక్షిణామూర్తి_స్వామి


#గురువులకే గురువు  ఈ స్వామివారు 🙏


#శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు.


#శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, 


#విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. 


#వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే. 


#ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.


#గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం

నిధయే సర్వ విద్యానాం 

శ్రీ దక్షిణామూర్తయేనమ:


#అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.


#శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. 


#దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.


 #ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.


#మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.


 #ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 


#దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. 


#అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


#మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. 


#ఆ రూపాలు వరుసగా….


#శుద్ధ దక్షిణామూర్తి, 

#మేధా దక్షిణామూర్తి,

# విద్యా దక్షిణామూర్తి, 

#లక్ష్మీ దక్షిణామూర్తి, 

#వాగీశ్వర దక్షిణామూర్తి, 

#వటమూల నివాస దక్షిణామూర్తి, 

సాంబ దక్షిణామూర్తి¸

#హంస దక్షిణామూర్తి, 

#లకుట దక్షిణామూర్తి, 

#చిదంబర దక్షిణామూర్తి,

 #వీర దక్షిణామూర్తి, 

#వీరభద్ర దక్షిణామూర్తి¸ 

#కీర్తి దక్షిణామూర్తి,

# బ్రహ్మ దక్షిణామూర్తి¸

# శక్తి దక్షిణామూర్తి,

# సిద్ధ దక్షిణామూర్తి.


#దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.


 #సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. 


#మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు


#ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః🙏


#సర్వేజనా సుఖినోభావంత్

 సంసారమంటే....?

శ్రీ రమణమహర్షి

‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?' - అని అడిగాడు శిష్యుడు.

ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ...

'సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?'* అని ఎదురు ప్రశ్నించారు రమణులు.

'ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది' అన్నాడతను.

దానికి ఆయన నవ్వి, 'అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ, కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?' అన్నారు.

శిష్యుడు ఆశ్చర్యపోయి, *'ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి? అన్నాడు.

'మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం.* ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. *భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం.*

సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు' అంటూ వివరించారు రమణులు.

భగవాన్ శ్రీ రమణ మహర్షి* సమాధానం:

ప్రశ్న: నేను నా కోరికలను , అభిరుచులను ఎలా అధిగ మించాలి?

శ్రీ రమణ మహర్షి: వాటి మూలాన్ని కనుక్కోండి, అప్పుడు సులభం అవుతుంది.

(తరువాత) అభిరుచులు ఏమిటి?

కామం (కామం), క్రోధం (కోపం) మొదలైనవి ఎందుకు పుడతాయి?

కనిపించే వస్తువుల పట్ల ఇష్టాలు మరియు అయిష్టాల కారణంగా,

మీ దృష్టిలో వస్తువులు తమను తాము ఎలా ప్రదర్శించుకుంటాయి?

మీ అవిద్య, అంటే అజ్ఞానం వల్ల...

దేనికి సంబంధించినదదీ అజ్ఞానం?

ఆత్మానుభూతిని గురించి,

కాబట్టి, మీరు ఆత్మను కనుగొని, దానిలో స్థిరంగా ఉంటే, కోరికల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు."


🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸


*ಶ್ರೀಮಾನಜನನಿಂದ್ಯಶ್ಚ*

*ಶೂರಶ್ಚಾಪ್ಯವಿಕತ್ಥನಃ |*

*ಸಮದೃಷ್ಟಿಃ ಪ್ರಭುಶ್ಚೈವ*

*ದುರ್ಲಭಾಃ ಪುರುಷಾಸ್ತ್ರಯಃ ||*

(ಯೋಗವಾಶಿಷ್ಠ)


ಜನರ ನಿಂದೆಗೆ ಗುರಿಯಾಗದ ಧನಿಕ, ಆತ್ಮಪ್ರಶಂಸೆ ಮಾಡಿಕೊಳ್ಳದ ಶೂರ, ಸಮದೃಷ್ಟಿಯುಳ್ಳ ಪ್ರಭು - ಈ ಮೂವರು ದುರ್ಲಭ.


*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*



జననింద కి గురికాని ధనికుడు, ఆత్మస్తుతి చేసుకోని శూరుడు, సమదృష్టి కలిగిన ప్రభువు దొరుకుట దుర్లభం

 *శ్రీకృష్ణపరమాత్మ* గోవర్ధనోద్ధారణ తరువాత  గోపజనులతో ఇలా అంటాడు : 


*మూ॥*  _నాహం దేవో న గన్ధర్వో న యక్షో న చ దానవః ।_  

_*అహం వో బాన్ధవో జాతో* నాస్తి చిన్త్యమతో ఽ న్యథా ॥_  

( *శ్రీవిష్ణుపురాణము* 5.13.12 )


నేను దేవుడిని కాదు , గంధర్వుడిని కాదు , యక్షుడిని (దేవుడు) లేదా దానవుడిని (రాక్షసుడిని) కాను . 

*నేను మీకందరికీ బంధువుగా పుట్టాను* . 

మీరు నా గురించి వేరే విధంగా ఆలోచించ వద్దు - తనను వారిలో ఒకనిగా ప్రీతితో  ఆదరించమని అంటాడు .  


" _సత్యం మేధా యస్య సః సత్యమేధాః_ "  -  సత్యమైన జ్ఞానము కలవాడు . అంటే ఆత్మజ్ఞానము గలవాడు . 


నామరూపాత్మకమైన జగత్తులో కనిపించే అనిత్యమైన వస్తువుల చూచి భ్రమించక , వాటికి అధిష్టానము , ఆధారము తానే అయిన వాడు .


అందువలన   శ్రీమహావిష్ణువు  -   పరమాత్మ  *" సత్యమేధాః "*  అని కీర్తింపబడు చున్నాడు .

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


దానధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్క వాదాలకు దిగకు. దుష్టసాంగత్యాలు

చెయ్యకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జూదగాళ్ళను

నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. ద్యూతము, మద్యము, సంగీతము, వారవనితాజనము

-వీటికి నువ్వు దూరంగా ఉండటమేకాదు ప్రజలనుకూడా దూరంగా ఉంచు.

ద్యూతే మద్యే తథా గేయే మానం వారవధూషుచ।

స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్తేభ్యశ్చ రక్షయేత్ (11-41)


రోజూ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి స్నానసంధ్యాదికం ముగించు. దీక్షాదక్షుడిపై నిరంతరం

పరాశక్తిని అర్చించు. అదే మానవజన్మకు సాఫల్యం. దేవీమహాపూజను చేసి పావనపాదోదకాన్ని జన్మలో

ఒక్కసారి గ్రోలినా చాలు మరింక ఆ ప్రాణికి గర్భవాసదుఃఖం ఉండదు (పునర్జన్మ ఉండదు),

సకృత్ కృత్వా మహాపూజాం దేవీపాదజలం పిబన్ |

నజాతు జననీగర్భే గచ్ఛేదితి వినిశ్చయః

513

(11-44)

మనం చేసే అన్ని పనులకూ ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో

నిక్షేపించుకో. అది నిన్ను ధర్మమార్గాన నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు.

నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. తిథివారనక్షత్రాల మంచిచెడ్డలనూ ధర్మశాస్త్రనిర్ణయాలనూ అడిగి

తెలుసుకో. వేదవేదాంగపారంగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గోభూహిరణ్యదానాలను సమృద్ధిగా

అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా పూజార్హుడుకాడు. విద్యాగంధంలేని మూర్ఖులకు

ఆకలి తీరేపాటి ఆహారంమాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చెయ్యకు.

అవిద్వాన్ బ్రాహ్మణ: కోఽపి నైవ పూజ్యః కదాచన |

ఆహారాదధికం నైవ దేయం మూర్ఖాయ కర్హిచిత్ II

(11-48)

పుకా ! లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చెయ్యకు. అన్నింటికన్నా

ముఖ్యమైనది - విప్రులను ఏనాడూ అవమానించకు. వారు భూదేవులు. ప్రయత్నతః సమ్మాన్యులు. వారి

తపశ్శక్తి క్షత్రియులకు రక్షణకవచం. వినయంగా ఉంటే చాలు వారు సంతృప్తి చెందుతారు. దానధర్మాలతో

ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది!

ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరుచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరుచు

 *అభీష్ట గణపతి భక్తులందరికీ సమాచారం*

ఈనాడు (30-11-2023) శోభకృత్ కార్తిక మాస సంకష్టహర చతుర్థి   మరియు ఆర్ద్రానక్షత్రం. శివకేశవులకు ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శుక్లపక్షం విష్ణువు కూ, కృష్ణపక్షం శివుని కీ విశేష ప్రీతికరం కాగా రేపు ఆ కృష్ణ పక్షము లో శివునికి విశేషమైన  ఆర్ద్రానక్షత్రం మరియు గణపతి కి పూజనీయమైన సంకష్టహరచతుర్థి కలిసిన త్రిపర్వం కాబట్టి మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో మూలవిరాట్ లకు ఉదయం 8 గంటల నుండి న్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. ఆసక్తి గల భక్తులందరూ ప్రత్యక్షంగా గానీ,పరోక్షంగా గానీ పాల్గొని స్వామి వారల అనుగ్రహంతో సమస్త సంకటములనూ పోగొట్టుకొని అన్ని సత్కార్యముల యందునూ దిగ్విజయంపొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలరు.స్వామి వారి అనుగ్రహం కోరుకునే వారు  వారి వారి గోత్రనామములను మా వాట్సాప్ నంబర్ 9492050200 కు పంపగలరు.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

 ౪౪౪ ఆలోచనాలోచనాలు ౪౪౪                                    ( అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్క ; లక్ష మెదళ్ళకు కదలిక!)                                1* ఒక పసిపిల్లవాడిని యోగ్యుడిగా మార్చడానికి, తల్లి 20 సంవత్సరాల కాలాన్ని తీసుకొంటుంది. భార్య వాడ్ని తెలివితక్కువ వాడిక్రింద జమకట్టడానికి 20 నిముషాల సమయం చాలు!                                 2* మనిషి సరదాగా కొంచెం మద్యాన్ని మాత్రమే పుచ్చుకొంటాడు. లోనికి పోయిన ఆ ద్రవపదార్దం మరికొంతను ఆకర్షిస్తుంది. ఆ తరువాత మద్యమే ఆ తీసుకొన్న మనిషిని లోబరుచుకొని, వాడి చేత సమాజం మెచ్చని పనులను చేయిస్తుంటుంది. -- జపాన్ దేశపు సామెత.                    3* డబ్బు పోగొట్టుకున్నవాడు - కొంత పోగొట్టుకొంటాడు.                   స్నేహితుణ్ణి పోగొట్టుకొన్నవాడు ఎక్కువ పోగొట్టుకొంటాడు.                  విశ్వాసం పోగొట్టుకొన్నవాడు అంతా పోగొట్టుకొంటాడు.                 4* ఒక వ్యక్తిని పడగొట్టినవాడు బలవంతుడైతే,అతడిని పైకి లేపి నిలబెట్టినవాడు మిక్కిలి బలవంతుడు.            5* పూల సుగంధం గాలివాలుతోనే వ్యాపిస్తుంది. కానీ మంచివారి సౌజన్యం , ఎదురు గాలికి కూడా వ్యాపిస్తుంది.                          6* నేనేది ఖర్చు పెట్టానో, అది నేను పోగొట్టుకొన్నట్లే!     నేనేది దాచిపెట్టానో అది నేటికి నేను కలిగివున్నట్లు!     నేను ఇప్పుడు దేనిని పంచిపెడుతున్నానో, దానిని నేను రేపటికి కలిగివుంటాను.                      7* మనుష్యులు తరచూ ఒంటరివారై పోతుంటారు. ఎందుకంటే వారు జగత్తులో వంతెనల కంటే గోడలనే ఎక్కువ కట్టుకొంటూవుంటారు కదా!          8* సరియగు సమయానికి నిద్రించడం ఒకరి రోగాన్ని సగానికి తగ్గిస్తుంది. మిగిలిన సగం సరియైన సమయానికి నిద్ర లేవడం ద్వారా!                                9* నౌకాశ్రయంలో ఓడ సురక్షితమే! కానీ దానిని తయారుచేసింది అట్లా ఓడరేవులో భద్రంగా, ప్రదర్శన వస్తువుగా ఉంచడానికి కాదుగదా!         10* కుక్క చర్మపు సంచీలోని గంగాజలం ఎంత పవిత్రమైనదో, శీలహీనునిగల సంపద అంత పవిత్రమైంది.               11* వేల సూర్యులు, చంద్రులు పోగొట్టలేని అజ్ఞానపు చీకట్లను మహాపురుషుల అమూల్య వాక్కులు పోగొట్టగలుగుతాయి.             12* ప్రతివాడు సమాజాన్ని మార్చాలని ఉబలాటపడేవాడే! కానీ సమాజానికి అనుగుణ్యంగా తాను మారటానికి ఇష్టపడడు.-- టాల్ స్టాయ్.                       14* స్నేహితానికి(+) కూడిక గుర్తు మంచిది. కానీ శత్రుత్వానికి (౼) తీసివేత కలిసి వస్తుంది.                       "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం 1వ మండలం, 89 సూక్తం.           " మనకు అన్నివైపులనుండి ఉదాత్త భావనలు లభించుగాక!"           ( Let noble thoughts come from every side.).             Dt 30-- 11--2023, Thursday, Good morning.

 శ్రీభగవాన్ వామన మూర్తి


బలిదనుజుని  మదమణచగ

పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా 

యిలమూడడుగుల నడిగియు 

పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్ 


ఇంతింతగుచును విశ్వము 

సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై 

వింతగు రూపము దాల్చియు 

స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్ 



శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ 

           చిరునవ్వు లొలికించు చిన్ని వటువు

దారు కమండలు దాల్చి తా కరమందు 

          విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు 

పావన దర్భలు పట్టియు న్నొకచేత 

          నతి ప్రసన్నత నున్న యర్భకుండు 

హస్తంబు  పైకెత్తి యభయంబు నిడుచుచు 

          గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర 

ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప 

వామనుని వోలె వచ్చియు  వరము నడిగి 

విశ్వమును నిండి వెల్గిన  విష్ణువునకు 

ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 16*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*16. రుద్ర పశుపతి నాయనారు*


తిరుత్తలైయూరు అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో

జన్మించాడు పశుపతి. అతడు చిన్నప్పటి నుండి పరమేశ్వరుని భక్తితో

సేవిస్తూ వచ్చాడు. 


రుద్రసూత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన ఇతనికి

రుద్రపశుపతి అనే పేరు కలిగింది రోజూ ప్రాతఃకాలంలోనే లేచి మెడవరకు  నీటిలో నిలబడి రెండు చేతులనూ శిరసుపై మోడ్చి భక్తితో రుద్రసూక్తాన్ని

పఠించేవాడు. రుద్ర పశుపతి తపోభక్తికి ప్రసున్నుడై పరమేశ్వరుడు అతనికి

శివలోక సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

*పదహారవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 శ్రీభగవాన్ వామన మూర్తి


బలిదనుజుని  మదమణచగ

పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా 

యిలమూడడుగుల నడిగియు 

పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్ 


ఇంతింతగుచును విశ్వము 

సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై 

వింతగు రూపము దాల్చియు 

స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్ 



శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ 

           చిరునవ్వు లొలికించు చిన్ని వటువు

దారు కమండలు దాల్చి తా కరమందు 

          విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు 

పావన దర్భలు పట్టియు న్నొకచేత 

          నతి ప్రసన్నత నున్న యర్భకుండు 

హస్తంబు  పైకెత్తి యభయంబు నిడుచుచు 

          గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర 

ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప 

వామనుని వోలె వచ్చియు  వరము నడిగి 

విశ్వమును నిండి వెల్గిన  విష్ణువునకు 

ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *92వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 4*


*"ఎలాగైనా సరే , నువ్వు జయించి తీరాలి ! ఆ రాక్షస గురువు , గురు రాక్షసుడూ అయిన శుక్రుడి తపస్సు భగ్నం కావాలి !"* ఇంద్రుని మాటలు జయంతి చెవుల్లో గింగిరుమన్నాయి.


ఎదురుగా , దూరంగా ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు తాపడం అయిపోయి ఉన్నాయి.


*“గురు రాక్షసుడు...”* తండ్రి మాట ఆమెకు మళ్ళీ గుర్తొచ్చింది. జయంతి పెదవులు చిరునవ్వుతో కదిలాయి. తన తండ్రి శుక్రుడిని చూసినట్టు లేదు. చూసి ఉంటే - అంత అందగాణ్ణి 'గురురాక్షసుడు' అంటాడా !


అద్భుతమైన ముఖ వర్చస్సు ! మెరిసిపోతున్న దేహ కాంతి ! గుండ్రటి భుజాలు ! వెడల్పాటి వక్షపీఠం ! పొడుగాటి చేతులు ! ముఖ్యంగా దృష్టిని లాగుతున్న మూసిన రెప్పల కింద దాగిన పెద్ద పెద్ద కళ్ళు ! బోర్లించిన అరచేతుల్లాంటి రెప్పల పైన వంకీలు తిరిగిన కనుబొమలు ! స్వర్గంలో కూడా తనకు ఇంత వరకూ కనిపించని పురుష సౌందర్యం... *"గుర్తుంచుకో తల్లీ ! ఆ దుర్మార్గుడు 'మృతసంజీవని'ని సాధిస్తే మనకు అత్యంత ప్రమాదం ! నీ అందచందాలు ఉపయోగించు ! శుక్రుడికి దీక్షాభంగం జరిగేలా చూడు ! అతన్ని వివాహం చేసుకో !..."*


*"నీకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తున్నాను ! ఆ శుక్రుణ్ణి పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం ! నీ లక్ష్యం ఒక్కటే. శుక్రుడికి మృతసంజీవని దక్కకూడదు"* 


తండ్రి తనను ఉద్బోధిస్తూ ఆవేశంగా పలికిన పలుకులు జయంతి అంతరంగంలో ప్రతిధ్వనించాయి.


*"పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం !"*


*"శుక్రుడికి మృతసంజీవని..."*


జయంతి అసహనంగా తల విదిల్చింది. తండ్రి మాటల ప్రతిధ్వనిని దూరంగా తరిమి వేస్తూ.


ఆమె పాదాలు మెల్లగా ముందుకు కదిలి , ఆమెను శుక్రుడికి మరికొంచెం దగ్గరగా తీసుకెళ్ళాయి. ఆమె చూపులు తమ అదృశ్య హస్తాలతో శుక్రుడి శరీరాన్ని స్పృశిస్తున్నాయి. ఆయన శరీరంలోంచి యౌవన తేజం పొంగిపొర్లుతోంది. తపస్సమాధి ఆయన పట్టుదలను సూచిస్తోంది. శరీరమంతా స్వేదబిందవులు అలంకరించిన పూలలా ఉన్నాయి.


జయంతి నిట్టూర్చింది. శుక్రుడి వర్చస్సు , తేజస్సు తనను సమ్మోహన పరుస్తున్నాయి. తండ్రి తనకు స్వాతంత్య్రం ఇచ్చాడు సంపూర్ణంగా ! తాను ఆయనను పతితుణ్ణి చేయదు. పతిగా స్వీకరిస్తుంది. తాను ఆయన తపస్సును పాడు చేయదు. ఫలవంతం కావడానికి సహకరిస్తుంది. మృతసంజీవని ! తన భర్త చేతిలో మృతసంజీవనీ విద్య ఉంటే ఏం ? ఉండాలి !


నిర్ణయం ఆమెకు కొండంత బలం ఇచ్చింది. తండ్రినీ , ఆయన ఆజ్ఞనూ మరిచిపోతూ , జయంతి శుక్రుడి సమీపానికి చేరింది. చెమటతో తడుస్తున్న ఆయన శరీరాన్ని చూస్తూ పైట చెరగును వీవనంగా రెండు చేతుల్తో పట్టుకొని విసరబోతూ ఆగింది.


కొంగు గాలి శృంగార సంకేతం ! శుక్రుడికి ప్రస్తుతావసరం శృంగార సంకేతం కాదు. శుశ్రూష ! జయంతి ఆత్రుతగా చుట్టూ పరికిస్తూ చూసింది. పొడుగాటి ఆకులున్న అరటి చెట్టు ఆమెను ఆహ్వానిస్తోంది , గాలికి స్పందిస్తూ. 


జయంతి వెళ్ళి జాగ్రత్తగా అరటి ఆకులు కోసి తెచ్చింది. ఒక కదళీ పత్రాన్ని శుక్రుని మీద ఎండ పడకుండా నీడలా పట్టుకుంది. రెండవ దానితో అతనికి విసరడం ప్రారంభించింది. కదళీపత్రవీవన !


శుక్రుని తపస్సు సాగుతూనే ఉంది. 


జయంతి శుక్రుడు కూర్చున్న స్థలం చుట్టూ , సెలయేటి నీటితో అలుకుతోంది. ప్రతి ఉదయమూ పూల లోంచి సేకరించిన పుప్పొడులతో ముగ్గులు పెడుతోంది. 


తామరాకు దొన్నెలో సెలయేటి స్వచ్ఛ జలం తెచ్చి , తన చేలాంచలాన్ని తడిపి , శుక్రుడి శరీరాన్ని సున్నితంగా తుడుస్తోంది. ఎండ ఉన్నంత సేపూ అరటి ఆకును సూర్యుడికి అడ్డంగా పట్టుకుంటోంది , విసుగూ , విశ్రాంతి లేకుండా.


ప్రతి ఉదయమూ కందమూలాలూ పళ్ళూ సేకరించి , ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి , ఆహారం స్వీకరిస్తాడేమో అన్న ఆశతో వేచి చూస్తోంది.


రాత్రి వేళల్లో ఆయనకు కొద్ది దూరంలో చేతినే తలగడగా చేసుకుని , నేల మీద యనిస్తోంది.


కాలం పరుగెడుతోంది. శుక్రుడి తపస్సు ఏకదీక్షతో సాగుతోంది. జయంతి శుశ్రూష కూడా ఏకదీక్షగా సాగుతోంది. శుక్రుడి లోకం తపస్సు. జయంతి లోకం ఆయన సేవ.


********************************


*"నాథా ! జయంతి వెళ్ళి ఎంత కాలమైందో గుర్తుందా ?”* శచీదేవి ఇంద్రుణ్ణి అడిగింది.


*"ఎంతకాలమైందో , రోజులలో , ఘడియలలో , విఘడియాలలో కూడా చెప్పగలను దేవీ !"* ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు.


*"నాకెందుకో ఆందోళనగా ఉంది. జయంతి...”* శచీదేవి ఏదో చెప్పబోయింది.


*"జయంతి తిరిగి వస్తుంది ! ఆలస్యం నాకు కూడా ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆచార్యులను రమ్మన్నాను..."* ఇంద్రుడు సముదాయింపుగా అన్నాడు.


*“మహేంద్రా !"* మందిర ద్వారం దాటుతూ , పలకరించాడు బృహస్పతి.


*"దయచేయండి, గురుదేవా !”* ఇంద్రుడు సగౌరవంగా బృహస్పతిని ఆహ్వానించాడు.


*"కాలం గడిచిపోతుంది. జయంతి తిరిగి రాలేదు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిందో , లేక ఏదైనా అపాయానికి గురి అయ్యిందోనని శచి ఆందోళన చెందుతోంది..."* ఇంద్రుడు బృహస్పతితో అన్నాడు.


బృహస్పతి కూర్చుంటూ, చిరునవ్వు నవ్వాడు. *“ఆ ప్రయత్నంలో జయంతికి విజయమో , పరాజయమో ఎదురవుతుంది తప్ప , అపాయం సంభవించదు ! శుక్రుడు సామాన్య తాపసి కాదు కదా ! సాక్షాత్తుగా శివుడి జఠరం ప్రవేశించి , సజీవంగా బైటపడిన మహా శక్తిశాలి ! అలాంటి మహా యోగులను లొంగదీయడం అనేది అంత త్వరితంగా అయ్యేది కాదు !"*


*"ఏమో గురుదేవా... చిన్నదాని క్షేమం గురించి నాకు భయంగా ఉంది !"* శచీదేవి అంది.


*“ఆందోళన అవసరం లేదు , ఇంద్రాణీ ! నిశ్చింతగా ఉండండి !"* అంటూ బృహస్పతి ఇంద్రుడి వైపు తిరిగాడు. *"మహేంద్రా ! జయంతీ శుక్రుల ఉదంతాన్ని అటుంచి , అసురుల గురించి ఆలోచించాలన్న తలంపు కలిగింది ! శుక్రుడు అందుబాటులో లేడు. వాళ్ళకి మంత్రాలోచన చెప్పే వారు లేరు ! రాక్షసుల మీద దండయాత్ర చేయడానికి ఇది అనువైన సమయం !"*


ఇంద్రుడు తల పంకిస్తూ చూశాడు.


*“అసుర సైన్యం ప్రస్తుతం బలహీనంగా ఉంది. యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాను !”* బృహస్పతి అన్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 102*


భారత పర్యటన....బయలుదేరుతున్నారు..


తల్లితండ్రులు, చుట్టాలూ, పక్కాలూ, మిత్రులు అందరినీ వదలిపెట్టి ఒంటరిగా జీవించాలి; ఏ స్థలంలోనూ స్థిరంగా ఉండిపోకుండా సంచారం చేస్తూనే ఉండాలి;  చేతకర్ర, కమండలం మాత్రమే తీసుకొని వెళ్లాలి. ఆత్మను మాత్రమే తోడుగా చేసుకోవాలి - ఒక సన్న్యాసి ఈ విధంగా జీవించాలని కోరుకొంటాడు. స్వామీజీ ఆశయం కూడా అదే. అలాంటి జీవితం కోసం ఆయన పరితపించారు. కాని ఆయన ఒంటరిగా పోవడం సోదర శిష్యులకు సుతరామూ ఇష్టం లేదు. అంతేకాదు; బయలుదేరాలని అనుకొన్నప్పుడల్లా ఏవేవో అవాంతరాలు వాటిల్లాయి. 


ఆయన దూర ప్రయాణం చేసి వెళ్లినది వారణాసి (కాశీ) మాత్రమే.  మహాశ్మశాన వాటికగా ఈ స్థలం పేర్కొనబడుచున్నది. ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ ముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తే ఎనలేని ఫలం ప్రాప్తిస్తుందని హైందవుల విశ్వాసం. స్వామీజీ కూడా తమ పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు. 


కాశీలో బసచేసిన రోజుల్లో స్వామీజీ పలువురు సన్న్యాసులను, సర్వజ్ఞులను కలుసుకొన్నారు. వారిలో త్రైలింగస్వామి, భాస్కరానంద ముఖ్యులు,


గొప్ప మహాత్మునిగా ఖ్యాతిగాంచారు త్రైలింగస్వామి. 1868 జనవరిలో శ్రీరామకృష్ణులు కాశీ సందర్శించినప్పుడు ఈయనను కలుసుకొని, "ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలున్నాయి" అని వ్యాఖ్యానించారు. మణికర్ణికా ఘట్టంలో నివసిస్తున్న త్రైలింగస్వామిని స్వామీజీ దర్శించారు. "త్రైలింగస్వామి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నారు. అలాగని ఆయన ఉపదేశం ఏమీ చేయలేదని భావించరాదు. మౌనమే ఆయన ఉపదేశం" అంటూ కాలాంతరంలో ఆయన గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు.


తమ స్వాధ్యాయ, తపోమయ జీవితం వలన భాస్కరానంద ఎనలేని గౌరవ మర్యాదలను పొందారనడం అతిశయోక్తి కాదు. సామాన్యంగా ఆయన దిగంబరం గానే జీవించేవారు. ఈయనను కూడా స్వామీజీ కలుసు

 కొన్నారు. స్వామీజీ ముఖారవిందాన తాండవిస్తున్న దివ్య తేజస్సును చూసి భాస్కరానంద ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. వారిద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. సంభాషణ మధ్యలో భాస్కరానంద, "కామినీ కాంచనాలను సమూలంగా ఎవరూ త్యజించలేరు" అన్నాడు. 

 

అందుకు స్వామీజీ, "స్వామీ, మీరేమంటున్నారు? వాటిని సంపూర్ణంగా త్యజించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు! ఒక సన్న్యాసి జీవితమూ, లక్ష్యమూ అదే కదా! కామినీ కాంచనాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసిన వ్యక్తిని నేను చూశాను" అన్నారు. ఆ మాటలు విని భాస్కరానంద చిన్నగా నవ్వి, “నువ్వు చిన్న వాడివి. నీకేం తెలుసు?" అన్నాడు. ఇది విన్నాక స్వామీజీ ఊరకే ఉండలేక పోయారు. 


కామినీకాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితం స్వామీజీ మనస్సులో మెదలింది. దానిని వివరించి, ఉద్వేగంతో తమ భావనలను ప్రకటించారు. స్వామీజీ ఉద్వేగపు వెల్లువను గమనించిన భాస్కరానంద ప్రక్కన ఉన్నవారితో, "ఆహా! ఈయన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంది. ఈతడి మనస్సు మహోజ్జ్వల కాంతితో ప్రకాశిస్తున్నది" అన్నాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 16*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*16. రుద్ర పశుపతి నాయనారు*


తిరుత్తలైయూరు అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో

జన్మించాడు పశుపతి. అతడు చిన్నప్పటి నుండి పరమేశ్వరుని భక్తితో

సేవిస్తూ వచ్చాడు. 


రుద్రసూత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన ఇతనికి

రుద్రపశుపతి అనే పేరు కలిగింది రోజూ ప్రాతఃకాలంలోనే లేచి మెడవరకు  నీటిలో నిలబడి రెండు చేతులనూ శిరసుపై మోడ్చి భక్తితో రుద్రసూక్తాన్ని

పఠించేవాడు. రుద్ర పశుపతి తపోభక్తికి ప్రసున్నుడై పరమేశ్వరుడు అతనికి

శివలోక సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

*పదహారవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 'ఓట'ను దివ్యాస్త్రమ్మును

ఓటరు తా పూని మదిని యోపిక తోడన్

దీటుగ పోలింగ్ వద్దను 

'మీట'ను తా నొక్క వలయు మేలగు మదితో

 డాక్టర్ దేవులపల్లి పద్మజ 


గురు'జాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ 


మాత్రాచందస్సులో  ముత్యాలసరాలు అప్పటి కొత్త ఛందోరీతి లోరాసిన గేయం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.  సుమారుగా 1890 తరువాత రాసినట్టు అంచనా. గురు'జాడలలో ఒక ఆణిముత్యం ఈ గేయం. వారు అదే సమయంలో రాసిన దేశభక్తి గేయం ప్రభావం వందశాతం అనుసరించవలసిందే. 

       19 శతాబ్దం నాటికి బాలికల, మహిళల స్థితిగతులు పూర్తిగా ఈ గేయంలో మనకి ద్యోతకమవుతుంది. బ్రిటిష్ పాలకుల నిరంకుశ ధోరణి ఒకవైపు,  గృహంలో  ఎదుర్కొంటున్న   వేధింపులు మరోవైపు మహిళల, బాలికల మనోవ్యధకు గురై, నిరాశ, నిస్పృహలతో 




 చావలేక సంతోషం చైతన్యం లేని జీవితంతో నెట్టుకొస్తున్న వైనం అని అప్పటి సామాజికతను తెలియచేస్తోంది. 

     సమాజంపై పూర్తి అవగాహన ఉండి, రుగ్మతలను రూపుమాపాలనే జిజ్ఞాస ఉంటే రచయితగా ఉత్తమ ఫలితాలను సాధించి సంస్కర్తగా కీర్తిశిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన మన గురజాడ వారు,  మనకి గురు'జాడలే అందించారు.  ఆ జాడలలో ఒకటి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం.

     పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే  గేయ కావ్యం ఒక  ముగ్ధ , అందాలరాశి అయిన ఓ కన్య బ్రతుకు, తండ్రి గల ధనాశ కి బలైపోయిన తీరును వర్ణిస్తూ సమాజాన్ని అప్పటి దురాచాలని రూపుమాపే ఇతివృత్తం  ఈ కథలో వివరించారు గురజాడ. 

        కలువల వంటి చక్కనైన కన్నులు కలిగి, పచ్చని బంగారు ఛాయతో, లోకమెరుగని  బంగారు పాపల్లారా  మీలాగే ఆడుకునే   అమ్మాయి పూర్ణమ్మ కథ  విన్నారా?  అంటూ ప్రశ్నించిన వైనం. 

     ఆటల పాటల పేటికలారా!

       కమ్మని మాటల కొమ్మల్లారా!

        అమ్మలగన్నా అమ్మల్లారా!

         విన్నారమ్మా మీరీ కథను ?


వచ్చీరానీ ముద్దు ముద్దు మాటలతో అలరించే బాలికలారా,  బాల్యంలోనే తల్లైపోయిన పాపల్లారా

ఈ కథ వినండి అని చెప్పడం ప్రారంభించారు.

        కొండల మధ్యలో ఒక కోన,  ఆ కోన మధ్య ఒక కొలనుంది.  ఆ కొలను గట్టున కోవెల ఉంది. ఆ కోవెలలో వెలసిన బంగారు దుర్గమ్మ  కొలువై �

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ తృతీయ -‌ఆర్ధ్ర -‌  గురు వాసరే* *(30-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/kO6hE4WvG8w?si=dMzbFrn5j1gF23Hf


🙏🙏

 •••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-11-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. 

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు  వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకుపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.  పాతరుణాలు తీర్చాగలరు.

---------------------------------------

మిధునం


ఇంటాబయటా నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------

కర్కాటకం


వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. 

---------------------------------------

సింహం


బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది.

---------------------------------------

కన్య


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 

---------------------------------------

తుల


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆకారణ వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

---------------------------------------

వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది.  చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

---------------------------------------

మకరం


బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

కుంభం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో తీసుకున్న  నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

మీనం


సమాజంలో పేరుకలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

 శు భో ద యం🙏


దాశరధీ!  కరుణా పయోనిధీ !


          ఉ:  ఎంతటి పున్నెమో  శబరి  యెంగిలిగొంటివి ;  వింతగాదె !  నీ


                 మంతన మెట్టిదో యుడుత మైని   కరాగ్ర  నఖాంచలమ్మునన్


                సంతస  మందఁజేసితివి ; సత్కుల  జన్మము  లేమి  లెక్క?   వే


               దాంతము  గాదె  నీమహిమ!  దార

శరధీ !కరుణా  పయోనిధీ !


                            దాశరధి శతకము--  రామదాసు  (కంచర్ల గోపన్న) 


                     దయా సాగరా !శ్రీరామ చంద్రా ! యెంతపుణ్యం  చేసినదో  శబరి  ఆమెయొసఁగిన  యెంగిపండ్లను  తిన్నావు..

నీవుచేసే  వింతలెన్నని  విన్నవించగలను? వారధినిర్మాణ సమయంలో  మేనికంటిన  యిసుకను  దులిపినంత మాత్రానికే  ఆయల్ప

ప్రాణి  ఉడుత  శరీరమును  నీవ్రేళ్ళతోనిమిరి సత్కరించావు. నేటికీ  ఆవ్రేలిగుర్తులు వానిమేనిపై  నలంకారములై  నిలచియున్నవిగదా!


                              సత్కుల మందు జన్మించుట  ప్రసిధ్దు లగుట  యిత్యాదు లెవ్వియు  నీకృపకు అర్హతలు కానేకావు. వారేకులము వారైనా  అల్పులైనా  ప్రాణితతిలో  నెవ్వరైనను  నీకృపకు పాత్రులే యగుట తథ్యము. నీమహిమ  వేదాంతమే  గదా!


                                నీ కృపా పాత్రులకు  మోక్షము లభించుట  వింతగాదని  కవియభిప్రాయము!


                                                                     స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 *ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే*


అని మన సంధ్యావందనములో గాయత్రి మాతను స్మరించుకొంటాం కదా.


ఆ మంత్ర తాత్పర్యము ఇదిగో:


ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను.


ఇక్కడ నా సందేహం ఏంటంటే మొదటి పాదాలలో అంతటి శాంత మూర్తిగా వర్ణింపబడిన గాయత్రి దేవికి అంకుశం, కొరడా, కపాలం మరియు గదలను ఎందుకు ఆపాదించవలసి వచ్చినదో మరి, అర్థం కావడం లేదు. 


ఒక వేళ గాయత్రి మాత స్వరూపాన్ని ఇలాగే వర్ణింపబడాలంటే దానికి మరో భేదాభిప్రాయము ఉండదు.


అయినా దీనిపై లోతుగా ఆలోచించిన వారు ఏవైనా కొంత వివరణ ఇవ్వగలరేమో.

 శ్లోకం:☝️ పశుపతి

*బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతాః*

    *పశవః పరికీర్తితాః |*

*తేషాం హి నాయకో యస్మాత్*

    *శివః పశుపతిః స్మృతాః ||*


భావం: బ్రహ్మ మొదలుగా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి.ఈ పశువులన్నింటికీ శివుడు నాయకుడు కనుక, ఆయన *పశుపతి* అయినాడు. అందుకే *నమో భవాయ చ రుద్రాయ చ నమశ్శర్వాయ చ పశుపతయే చ* అని నమకం చెప్తుంది. *పశు* శబ్దానికి కొంతమంది కనిపించేవి (objective world) అని అర్థం చెబుతారు.*పశ్* ధాతువుకి కనిపించు (పశ్యతి) లేదా చూడు అని అర్థం వస్తుంది. ఈ కనిపించే విశ్వానికి ఆయన ఈశ్వరుడు కనుక పశుపతి అని అర్థం చెబుతారు.🙏

 ఈ రోజు పంచాంగం 30.11.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: తృతీయా తిధి బృహస్పతి వాసర: ఆర్ద్ర నక్షత్రం శుభ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ మధ్యాహ్నం 02:29 వరకు 

ఆర్ద్ర మధ్యాహ్నం 03:04వరకు 

సూర్యోదయం : 06:33

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం :  రాత్రి 03:54 నుండి 05:36 వరకు.

దుర్ముహూర్తం : పగలు 10:14 నుండి 10:58 వరకు తిరిగి మధ్యాహ్నం 02:39 నుండి 03:23 వరకు.


శుభోదయ:, నమస్కార:

29, నవంబర్ 2023, బుధవారం


 

Panchaag


 

 🕉 మన గుడి : నెం 254


⚜ గుజరాత్ : ఖంబాట్ 


⚜ శ్రీ సికోటార్‌ - వాహనావతి మాత మందిర్ 



💠 వాహనవతి దేవి ( సికోటార్ అని కూడా పిలుస్తారు ) భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో పూజించబడే దేవి యొక్క గిరిజన / స్థానిక రూపం.  

ఈ ఆలయానికి 950 ఏళ్ల చరిత్ర  ఉంది.


💠 సి = లక్ష్మి

కోటర్ = లోయలో నివసించే దేవత.

సికోటార్ మా సముద్ర దేవత అని కూడా పిలుస్తారు.



💠 కొన్నేళ్ల క్రితం ఖంభాట్‌ను త్రంబవతి నగరి అని పిలిచినప్పుడు, వాహనవతి మా ఖంభాట్‌లో నివసించేదని నమ్ముతారు.


💠 ఆమె శక్తి / పార్వతి యొక్క ఒక అంశంగా పరిగణించబడుతుంది మరియు దేవి హర్సిద్ధి అని మరొక పేరు కూడా ఉంది, ఆమె గుజరాత్‌లో అనేక దేవాలయాలను కలిగి ఉన్న దేవి పార్వతి మరియు ఆమె ప్రధాన మందిరం ఉజ్జయిని నగరంలో ఉంది.  

వాహనవతి దేవి యొక్క ప్రధాన ఆలయం గుజరాత్‌లోని ఖంభాట్ జిల్లాలో ఉన్న రాలేజ్ గ్రామంలో అరేబియా సముద్ర తీరానికి సమీపంలో ఉంది.


💠 సికోటార్ మాత  గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. ఇది సికోటార్ మాత వాహనవతిగా ఎలా  పిలవడం ప్రారంభించారో  వివరిస్తుంది.


💠 వాహనవతి దేవిని సముద్ర దేవత అని కూడా పిలుస్తారు మరియు స్థానిక పురాణాల ప్రకారం   ఓడలు దారితప్పినప్పుడు వారు వాహనవతి మాతను ప్రార్థించేవారు.  

వెంటనే, రాగి స్తంభంపై దీపం వెలిగించి, దిశలను తీసుకుంటే, ఓడలు తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకునేవి.

వాహనవతి దేవాలయం వెనుక భాగంలో ఇప్పటికీ  రాగి స్తంభం ఉంది.


🔅 వాహనవతి దేవి స్థల పురాణం 🔅


💠 గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు, జగదూసా అనే వ్యాపారి ఖంభాట్‌కు వచ్చి తన ఓడలను తీరంలో బంధించాడని చెబుతారు.  

అతను మా వాహనవతికి నిజమైన భక్తుడు మరియు త్వరలోనే అతని వ్యాపారం పూర్తి స్థాయికి పెరిగింది.  

తన వద్ద ఉన్న డబ్బును ఏం చేయాలా అని ఆలోచిస్తూ వాహనవతికి బంగారు గొలుసు కొన్నాడు.  


💠 వ్యాపారి అయినప్పటికీ, మెరుస్తున్న బంగారాన్ని చూసిన తర్వాత అతని ఆలోచనలు మారిపోయాయి. 

వాహనవతి దేవికి అంకితం చెయ్యకుండా  తన కుటుంబం మరియు ఇతర అవసరాల కోసం ఆ బంగారు గొలుసును ఉంచాడు.


 💠 ఆ రాత్రి, అతని కలలో, వాహనవతి దేవి కనిపించి, తన ఓడ యొక్క స్థానాలను చూడమని జగదూసుకు చెప్పింది.  త్వరత్వరగా, సముద్రంలో మునిగిపోతున్న తన ఓడను చూసేందుకు జగదూసా బయటకు వచ్చాడు.  

తను చేసిన ఘోర తప్పిదాన్ని గ్రహించి వెంటనే దేవిని క్షమాపణలు చెప్పి సహాయం కోరాడు .  దేవత వచ్చి తన త్రిశూల శక్తితో అతని ఓడ మునిగిపోకుండా ఆపి, జగదూసా మరియు అతని కుటుంబాన్ని మరణం నుండి కాపాడింది.

ఈ సంఘటన నుండి, దేవి వాహనవతిగా పరిగణించబడుతుంది.


💠 పై పురాణం నుండి మనం చెప్పగలిగినట్లుగా వాహనవతి ఒక దయగల దేవత.

ఆమె నిజమైన భక్తిని కోరుతుంది 


💠  నవరాత్రి సమయంలో వాహనవతి కూడా మానవ రూపంలో నవరాత్రులలో గర్బా ఆడటానికి వస్తుందని మరియు మాత యొక్క చీలమండ శబ్దం చాలా శక్తివంతమైనదని, సమీప గ్రామాల రైతులు సులభంగా వినగలిగేంత శక్తివంతమైనదని స్థానిక కథలు తరచుగా చెబుతాయి.


💠 వాహనవతి దేవిని సంతానోత్పత్తి దేవతగా పరిగణించబడుతుంది మరియు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను నయం చేయడానికి తరచుగా పూజిస్తారు.


💠 ఈ ఆలయం పెద్ద మైదానం మరియు ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. 

ఈ ఆలయానికి సమీపంలో 12 జ్యోతిర్లింగ దుష్మేశ్వర్ మహాదేవ్ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాల అందమైన శివలింగాలు ఉంటాయి.


💠 రాలేజ్‌లోని సికోటార్ (వాహన్వతి) మాత ఆలయానికి ఎలా చేరుకోవాలి

 

బస్సు ద్వారా: రాలేజ్, ఖంభట్‌లోని సికోటార్ మాతా ఆలయానికి అనేక ప్రైవేట్ మరియు పబ్లిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.


రైలు ద్వారా : సమీప రైల్వే స్టేషన్ ఖంభాట్ రైల్వే స్టేషన్. 7 కి.మీ.


విమాన మార్గం: సమీప అంతర్జాతీయ విమానాశ్రయం వడోదర (70 కి.మీ) మరియు అహ్మదాబాద్ విమానాశ్రయం.

 ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు  -


   ఉత్తరేణి చెట్టుని "అపామార్గ" అని పిలుస్తారు . తెలుగులో " దుచ్చెన చెట్టు " అని మరొక పేరు . ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖస్థానం ఉన్నది.  ఈ చెట్టు గురించి దీని ఔషధ ఉపయోగాలు గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.


 *  ఈ చెట్టు సమూల రసం కాని కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును.


 * శరీరంలోని త్రిదోషాలను పోగొట్టును .


 *  ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకుని తినుచున్న పరిణామ శూలని పొగొట్టును. పరిణామశూల అనగా ఆహారం తీసుకొనిన తరువాత జీర్ణం అయ్యే సమయంలో కలుగు నొప్పి.


 *  ఈ చెట్టు సమూలం తీసికొనివచ్చి నీడలో ఎండించి భస్మం చేసి ఆ భస్మమును 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకొనుచున్న అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గును.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం గంజితో కాని , శొంఠి కషాయంతో కాని ఇచ్చిన శరీరపు ఉబ్బు మరియు ఉదర రోగం నివారణ అగును.


 *  దీని విత్తనాలను నీళ్లతో నూరి కాని , చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రికుక్క విషపు సంధి   (Hydrophobia ) తగ్గును. దీని పూతవెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రికుక్క కరిచిన వానికి ఇచ్చిన విషం హరించును 

పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండుపూటలా 3 నుంచి 4 దినములు ఇవ్వవలెను.


 * ఉత్తరేణి చెట్టు ఆకులను కాని పూత వెన్నులను నూరి తేలు కుట్టినచోట దళసరిగా పట్టించిన బాధ  మరియు మంట తగ్గును. పాము కరిచిన చోట పట్టించిన దాని విషం హరించును . జెర్రీ కుట్టినచోట పట్టించిన మంట నివారణ అగును.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు , ఉబ్బసం హరించును . మోతాదు 2 గ్రాములు . రోజుకు రెండుపూటలా ఇవ్వవలెను.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు , పులిపిరికాయలు హరించును .


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వులనూనె లో కలిపి ఉదయం , సాయంత్రం 2 చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును .


 *  ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పిపంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును .


 *  ఉత్తరేణి చెట్టు విత్తనాలు గాని ఆకు గాని నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట , పక్క నొప్పి  ( Pleurodynia ) నివారణ అగును.


 *  ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్పవిషం హరించును .


 *  ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు, ఆయాసం తగ్గును.


 *  ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొనిన రక్తగ్రహణి తగ్గును.


 *  ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలిజ్వరం రాక మునుపు ఇచ్చుచుండిన చలిజ్వరం , వరసగా వచ్చు జ్వరం నివారించును.


 *  ఉత్తరేణి ఆకును నీటితో కలిపి నూరి వంటికి పూసిన కందిరీగలు, తేనెటీగలు మొదలయిన పురుగులు కుట్టినప్పుడు కలుగు మంట, బాధ నివారణ అగును.


 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          9885030034

 చీనా పంచదార , పంచదార  - 


  *  ఇది చలువ చేయును . రుచిని పుట్టించును .

 

  * వీర్య వృద్ది, బలము కలగచేయును. 

 

  * మూర్చ, సర్వ ప్రమేహములు , దాహము ,జ్వరము, వాంతి , క్షయకు , ఎక్కిల్లకు పనిచేయును. .


 * మూత్రము నందు సుద్ధవలె పడు వ్యాధిని రూపుమాపును .

 

  * ఉన్మాదము, కామెర్లు, అతిగా దాహము వేయుట, తల తిప్పుతూ సృహ తప్పడం వీటికి బాగుగా పనిచేయును . 


  * పాండు రోగమునకు మంచి మందుగా పనిచేయును .

 

  * నరుకులు, దెబ్బలు మాన్పును.

 

  * గొంతుకను, గుండెలు ( రొమ్ములు ) లొని రోగములు కు పనిచేయును .


   * ఉపిరితిత్తులకు మేలు చేయును . 


   * దీనిని ఇతర మందులతో అనుపానముగా ఇచ్చినచో వేగముగా దేహమంత వ్యాప్తి చెందును. ప్రాణమును కాపాడును.


   * కడుపులో వాతమును వెదలించును .

 

   * మంచి రక్తమును బుట్టిన్చును.


   * నరములకు, కార్జము ( లివర్ ) కు సత్తువ చేయును 

 

   * ముసలితనమును వేగముగా రాకుండా ఆపును. 

 

   * కడుపునొప్పిని తగ్గించును.


   * 20 దినములు ( సుమారు 6 తులముల ఎత్తు ) మోతాదుగా ఇచ్చిన రక్తమును శుద్ధి చెయును. 


   * దేహము నందు గట్టిపడిన దుష్ట పదార్ధ కూటమి ని కరిగించును. నీరు చెయును.


  * శరీరం కుళ్ళుని ఆపును.


          చీనా పంచదార తెల్లగా , పిండివలె ఉండును. తెల్ల పంచదార ఇసుక వలె తెల్లగా శుబ్రముగా ఉండును. చక్కీ పంచదార ఇసుక వలె ఉండును. కాని కొంచం ఎర్రగా ఉండును. 

     ఈ మూడింటి గుణం ఇంచుమించు ఒకేలా ఉండును గాని మొదటి దాని కంటే తక్కిన రెండు ఒకదాని కంటే ఒకటి తక్కువ చలువ , అదిక వేడి గలవి . పరగడుపున పొద్దున్నే పంచదార ఒట్టిగా తినినను, అధికముగా తినినను , ఆకలి మంధగించును. అజీర్ణం చెయును.


 దీనికి విరుగుళ్ళు  - 

బాదం పప్పు, పచ్చిపాలు, పులుపు పదార్దములు 


 ఒట్టి పంచదార తిని నీళ్లు త్రాగరాదు. అలా త్రాగిన జలుబు, వాతము, శ్లేష్మము చెయును, జ్వరము తెచ్చును.


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          9885030034

 *సంకష్టహర చతుర్థి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*రేపు నవంబర్ 30 గురువారం సంకష్టహర చతుర్థి సందర్భంగా...*


పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం గణపతిని పూజించి, ఉండ్రాళ్ళు, మోదకములు మొదలైనవి నైవేద్యంగా పెట్టి, చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రునికి, చతుర్థీ దేవతకు అర్ఫ్యప్రదానం చేసిన తరువాత ప్రసాదాన్ని స్వీకరించలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం కష్టనివారణం, అభీష్టదాయకం.


సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!


ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.


ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.


*🌺🌺🌺 అంగారక చతుర్థి 🌺🌺🌺*


ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. 


కొంతమంది ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దాని కోసం వినాయకుడి ముందు తెలుపు లేదా ఎర్రటి జాకెట్‌ గుడ్డని పరిచి, అందులో పసుపుకుంకుమలు వేయాలి. మనసులో ఉన్న కోరికను తల్చుకుని ఆ గుడ్డలో మూడు గుప్పిళ్లు బియ్యం పోయాలి. ఆపై రెండు ఖర్జారాలు, రెండు వక్కలు, దక్షిణ వేసి మూటకట్టాలి. ఈ ముడుపుని స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి... సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలి.


ఈ వ్రతాన్ని3, 5, 11, లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా తీరిపోతుందంటున్నారు. ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లినా కూడా ఆ స్వామి ప్రసన్నం అవుతాడట.

 


Popcorn


 


 


 

 https://youtube.com/shorts/DmvOqTtrlNs?si=hKUUVX3WzkliX56h


 *సంకష్టహర చతుర్థి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*రేపు నవంబర్ 30 గురువారం సంకష్టహర చతుర్థి సందర్భంగా...*


పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం గణపతిని పూజించి, ఉండ్రాళ్ళు, మోదకములు మొదలైనవి నైవేద్యంగా పెట్టి, చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రునికి, చతుర్థీ దేవతకు అర్ఫ్యప్రదానం చేసిన తరువాత ప్రసాదాన్ని స్వీకరించలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం కష్టనివారణం, అభీష్టదాయకం.


సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!


ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.


ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.


*🌺🌺🌺 అంగారక చతుర్థి 🌺🌺🌺*


ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. 


కొంతమంది ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దాని కోసం వినాయకుడి ముందు తెలుపు లేదా ఎర్రటి జాకెట్‌ గుడ్డని పరిచి, అందులో పసుపుకుంకుమలు వేయాలి. మనసులో ఉన్న కోరికను తల్చుకుని ఆ గుడ్డలో మూడు గుప్పిళ్లు బియ్యం పోయాలి. ఆపై రెండు ఖర్జారాలు, రెండు వక్కలు, దక్షిణ వేసి మూటకట్టాలి. ఈ ముడుపుని స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి... సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలి.


ఈ వ్రతాన్ని3, 5, 11, లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా తీరిపోతుందంటున్నారు. ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లినా కూడా ఆ స్వామి ప్రసన్నం అవుతాడట.

 పూర్వము కృతయుగంలో దైత్య వంశములో *మధు* అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు ధర్మశాలి. దేవతలకూ, బ్రాహ్మణులందరికీ ఇష్టుడు. ధర్మంగా దేశాన్ని మిక్కిలి చక్కగా పరిపాలించేవాడు. 


శివభక్తుడైన ఆ మధు శివుని గురించి గొప్ప తపస్సు చేయగా శివుడు అతని తపస్సుకు మెచ్చి తన శూలము నుండి మరొక శూలాన్ని సృష్టించి ఇస్తూ, 'రాజా నీవు ధర్మాన్ని తప్పకుండా పరిపాలిస్తూ వున్నంతకాలం ఈ శూలం నీతో వుండి, శత్రువులను సంహరించి నిన్ను చేరుతుంది, ఒకవేళ నీవు ధర్మాన్ని పాలించకపోతే, అప్పుడు ఆ శూలం నన్ను చేరుతుంది' అని చెప్తాడు. 'నీ తరువాత నీ కుమారుని వద్ద వుండి యుద్ధంలో అతనిని అజేయుడుగా నిలబెట్టు గలుగుతుంది, శూలాన్ని మరచి వాలాయముగా యుద్ధానికి వెళ్తే అతడు హతుడౌతాడు, తదుపరి ఆ శూలం నా శూలంలో కలిసిపోతుందనీ' వివరించి చెప్తాడు.


ఆ శూలాన్ని పొందిన తరువాత ఆ నరభోజి (నరభక్షకుడు) వివాహము చేసుకొని ఓ కొడుకుకు తండ్రవుతాడు.   ఆ కొడుకు చిన్నతనం నుండే క్రూరుడు, కుటిలాత్ముడు. కుమారుడు ఇలా దురాత్ముడై వున్నందుకు విసిగి, తట్టుకోలేక కుమారునికి పట్టాభిషేకం చేసి శివుడిచ్చిన శూలాన్ని ఇచ్చి, సముద్రంలో మునిగిపోయాడు మధు. 


రాజైన తరువాత కొడుకు తన దగ్గర శూలమున్నదన్న గర్వంతో, మునులనూ, బ్రాహ్మణులను, దేవతలను ఎవ్వరినీ వదలక అందరినీ బాధిస్తాడు. వాడి బాధలు ఓర్వలేక మునులు, ఆ బాధలు నివారించమని  శ్రీరాముని వేడుకొంటారు. 


అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడిని యుద్ధానికి పంపుతాడు. తన వద్ద ఉన్న అస్త్రాన్ని ప్రయోగ, ఉపసంహార మంత్రాలతో నేర్పి పంపుతూ, "ఆ రాక్షసుని చేతిలో శూలం ఉన్నంతవరకూ,ఎవరూ చంపలేరు కనుక అతని చేతిలో శూలం లేని సమయం చూసి సంహరించమని' సలహా ఇస్తాడు. "నీవు రేపు ఉదయమే అతనిని చంపగలవు! అతడు అడవికి వెళ్ళగానే అతని పుర ద్వారం వద్ద ధనుర్థారివై అడ్డు నిలిస్తే, నీవు కృతకృత్యుడవు కాగలవు!” అని దీవించాడు. 


తెల్లవారగానే ఆ రాక్షస కుమారుడు మాంసభక్షణకై అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీరాముని తమ్ముడు ధనుర్థారియై మధుపురం ద్వారం వెలుపల నిలిచాడు. ఆ రాక్షసుడు అలవాటు ప్రకారం అడవిలో జంతువులను చంపి తిన్నాడు. మరి కొన్ని జంతువులను చంపి, రాత్రి భోజనానికై వాటిని తీసుకుని మధ్యాహ్న సమయంలో తన అంతఃపురాన్ని సమీపించాడు. కోట వెలుపల ముఖద్వారం వద్ద కాలయముని వలె ఉగ్ర మూర్తియై నిలిచి ఉన్న వీరుణ్ఢి చూసి, అడ్డు తొలగమని   హుంకరించాడు. 


వీరుడు ఆ రాక్షసుణ్ణి   యుద్ధానికి ఆహ్వానించాడు. శూలం కొరకు పోదలచి, లోపలికి పోయి వచ్చి నీ పని పడతాను అన్నాడు రాక్షసుడు. శత్రువు యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉంటే, ‘వాయిదా వేయడం వీర లక్షణమా!’ అని ఆ వీరుడు అధిక్షేపించాడు.

”నా కంట పడడం నీకు భూమిపై నూకలు చెల్లి నట్లే!” అన్నాడు. 


”ఓహో! నీవు రాముని సోదరుడవా? నా బంధువు రావణుని చంపిన రామునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే నా సంకల్పం నెరవేరే అవకాశం ఇన్నాళ్ళకు నాకు లభించింది! నీ చావును వెతుక్కుంటూ నీవే వచ్చావు. ఈ రోజు నా చేతులలో నీ చావు తప్పదు” అంటూ అతను చెట్లతో, రాళ్ళతో యుద్ధానికి పూనుకున్నాడు. 


ఆ వీరుడు ఆ రాక్షసుడి ధాటికి తట్టుకోలేక సొమ్మసిల్లి దిమ్మ తిరిగి నేలపై పడి మూర్ఛపోయాడు. అతడు  చచ్చాడని భ్రమించిన ఆ రాక్షసుడు ఇంతసేపు పోరాడాడు కదా! ఆకలి బాధ అధికమయ్యింది. అడవి నుండి తెచ్చిన మాంసాన్ని భక్షిస్తున్నాడు. శత్రువు చచ్చాడు కదా! ఇక శూలంతో ఏముంది పని? అని అనుకొన్నాడు. 


హఠాత్తుగా వీరుడు మూర్చ నుండి తేరుకుని లేచాడు. వెంటనే శ్రీ రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది నిప్పులు గ్రక్కుతూ రాక్షసుణ్ణి వధించింది.


ఇంతకీ ఆ రాక్షసుడు ఆ వీరుడు ఎవరో మరి.

 *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*


𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*కదాచిత్ కవచంభేద్యం తోమరేణ శరేణ వా*

*అపి వజ్రశతాఘాతైః అభేద్యా బ్రాహ్మణాశిషః*

                 (సుభాషితరత్నకోశః)


𝕝𝕝తా𝕝𝕝 

శరీరరక్షణకొరకు ధరించిన కవచమును ఎప్పుడొఒకప్పుడు తోమర, శర, బాణాద్యాయుధముల చేత భేదించవచ్చును. కానీ... బ్రాహ్మణ ఆశీర్వాదబలం ఉంటే వజ్రాయుధము చేత వందదెబ్బలు కొట్టినా... [వజ్ర, బాణ, శరాయుధములు అతని దాపులకు చేరినా] ఏమీ చేయలేవు.

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మంత్రిసామంతులందరూ సంతోషంగా బయలుదేరారు. సత్యవ్రతుణ్ణి చేరుకున్నారు. సాంత్వన

వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్ళ తరువాత కొడుకును చూసిన

అరుణుడి మనస్సులో ఆనందమూ దుఃఖమూ పెల్లుబికాయి. జడలు కట్టిన జుట్టు. మాసిపోయిన

వస్త్రాలు. నీరసపడిన శరీరం. అయ్యో! కన్న బిడ్డడిని ఎంత కఠినంగా శిక్షించాను. రాజ్యార్హుణ్ణి

ఆడవులపాలు చేశానుగదా ! ధర్మం తెలిసీ దారుణంగా శిక్షించానుగదా అని లోలోపల కుమిలిపోయాడు.

ఎదురువెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు. బుజంమీద చేయివేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన

ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతిని ఉపదేశించాడు.

అరుణుడు చేసిన నీతిబోధ

నాయనా ! ఏనాడూ ధర్మం తప్పకు. అధర్మాన్ని ఆలోచనల్లోకి కూడా రానియ్యకు. ధర్మబద్ధమైన

రాజ్యసుఖాలను తనివితీరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయమార్గాలలోనే ధనం సంపాదించు.

ఎప్పుడూ అసత్యం పలకకు. అపమార్గంలో నడవకు. తపస్వులను గౌరవించు. శిష్టులు ఇచ్చిన

సలహాలను పాటించు. క్రూరులైన దస్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య

నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడుగదా

అవి ఎప్పుడూ ఏ శత్రువునూ ఉపేక్షించకు. పరాసక్తుణ్ణి విశ్వసించకు. మరీ వొంగి వొంగి దండాలు పెట్టే

చచివుణ్ణి అస్సలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనేకాదు మిత్రులపట్లకూడా చారులను నియోగించు.

న విశ్వసేత్సరాసక్తం సచివంచ తథానతమ్ |

చారాః సర్వత్ర యోక్తవ్యాః శత్రుమిత్రేషు సర్వథా

 *సుభాషితం*

*--------------*

*శస్త్రవిద్యా స్వభావేన*

     *సర్వభ్యూsస్తి మహీయసీ ౹*

     *శాస్త్రేణ రక్షితే రాష్ట్రే*

     *శాస్త్రచింతా ప్రవర్తతే* ౹౹🌺


      *(మహాభారతం)*

        *శస్త్ర విద్య అన్ని విద్యలకన్నా స్వాభావికంగా ఎక్కువ గొప్పది.ఎందుకంటే శస్ర్తంతో రాష్ట్రాన్ని రక్షించినపుడు మాత్రం శాస్త్రముల అధ్యాయనం నడవడానికి సాధ్యమవుతుంది.*

🌺✍🏽

 *వడ్డికాసులవాడు*

        


 లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు  ఆనందనిలయంలో నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి

" స్వామీ!  కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ రోజు రోజుకు

పెరిగిపోతున్నది. 

మన వద్ద అనంతమైన 

సిరి సంపదలున్నాయి.  సిరులకు అధిదేవతనైన ఈ లక్ష్మి మీ అర్ధాంగి.కుబేరుడి  అప్పు పూర్తిగా తీర్చేయవచ్చును కదా, ఏందుకు జాప్యం చేస్తున్నారు " అని అడిగింది. అందుకు లక్ష్మీపతి చిరునవ్వుతో

  " దేవీ,  కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కారణమే లోకకళ్యాణం కోసం. 

కలియుగంలో  భూలోకవాసులకు

 ధర్మాధర్మ విచక్షణ బోధించడానికి , నాస్తికవాదం ప్రబలకుండా వారిలో ఆధ్యాత్మిక భక్తి  చింతనను  పెంపొందించడానికి నేను కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఉపయోగపడుతుంది " అని అన్నాడు. 


శ్రీనివాసుని సతులిద్దరికీ పతి మాటలు అర్ధం కాలేదు. మరల పురుషోత్తముడే ఇలా అన్నాడు.

 

కలియుగంలో

నిష్కామ భక్తికి 

(ప్రతిఫలం

ఆశించని భక్తి) తావులేదు. మానవులు  

తమ తమ కోరికలు నెరవేర్చుకుందుకి మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు. తమ వాంఛలు తీర్చుకోవడానికి 

ఆలయాలకి వచ్చి మ్రొక్కులు మ్రొక్కి అవి నెరవేరగానే ప్రతిఫలం చెల్లించుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.

ఈ క్రమంలో మానవుడు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఆవిధంగా

కలియుగంలో  దేవుని పట్ల భక్తి  నిలిచి

వుంటుంది. మానవులు నన్ను తమ కోరికలు తీర్చే వరాలనొసగే

 స్వామిగా, ఆపదమ్రొక్కులవాడిగా నన్ను కొలుస్తారు. వారు నా భక్తులైనా , కాకపోయినా వారిని కాపాడేందుకు నేను

కలియుగాంతము వరకు యీ తిరుమలపై  నివసిస్తాను. 


" స్వామి!.మీ  దయార్ద గుణము మాకు తెలుసు. అనంతమైన

భక్తులను అనుగ్రహిస్తూవుంటే 

కుబేరునికి  అప్పు ఎలా తీరుతుంది? " అని లక్ష్మీ దేవి ప్రశ్నించినది.  


" దేవీ! కలియుగంలో మానవులకి సిరిసంపదలు

ఒక్కటే ముఖ్యంగా  కనిపిస్తాయి.  అందువలన అనేక పాపాలు చేసి, అక్రమ మార్గాన ధనం చేరుస్తారు. ఆ పాప కర్మల ఫలితంగా ఈ జన్మలోనే కఠోర వ్యాధులతో, ఎడతెగని సమస్యలతో కష్టాలపాలవుతారు.

అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి 

' గోవిందా! నన్ను రక్షించు" అంటూ నా చరణాలు పట్టుకుంటారు.

వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తామని

మ్రొక్కులు మ్రొక్కుకుంటారు.

నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి , నా వద్దకు చేరేటట్టు

చేసుకుంటాను.   అన్నాడు స్వామి. 

పాపపు మచ్చ పడిన ధనం సత్కార్యాలకు వినియోగించ తగునా ?  అని లక్ష్మీదేవి అడిగింది.

" దేవీ దానిలో  కూడా

ఒక రహస్యం యిమిడి వున్నది.

పాపులు సమర్పించిన కానుకలను  అజ్ఞానముతో ఇహలోక సంపదలు ఆశించి నన్ను ప్రార్ధించే వారికి  

అనుగ్రహిస్తాను. పవిత్రమైన ఆశయాలతో నిర్మల మనస్సు గల 

భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం మాత్రమే   నేను స్వీకరించి మూడొంతుల  భాగం కుబేరునికి అప్పుగా తీరుస్తాను. " అని శ్రీనివాసుడు వివరించాడు.


" సరే , ఇందులో  మా కర్తవ్యం   ఏమిటి 

స్వామీ ?  " అని అడిగిన లక్ష్మీదేవితో

' నన్ను  నమ్మి నా చెంతకు వచ్చేవారందరికీ వారి మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా వారి కోరికలు తీరేలా అనుగ్రహిస్తూ వుండాలి " అని పలికాడు

భగవంతుడు.

" స్వామి! మీ చిత్తానుసారమే

చేస్తాను. కాని ధనం పెరిగిన కొద్దీ వారు మరింత గర్వమధాంధులుగా, దుర్మార్గాలకు పాలుపడకుండా శిష్ట రక్షణ చేయవలసిన బాధ్యత మీదే "

అని అన్నది శ్రీదేవి. 


"ఈ తిరుమల కొండ మీద దానధర్మాలు చేసే వారికి ఒకటికి పదింతలుగా  పుణ్యఫలాలు లభిస్తాయి. 

ఇక్కడ ఏకాగ్రచిత్తంతో నన్ను పూజించి ధ్యానించే

ఉత్తములకు ముక్తిని కటాక్షిస్తాను.  నీవు

అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం పెచ్చు పెరుగుతుందని

నీవు సందేహించవద్దు." 

అని భగవంతుడు  అన్నాడు.


 పద్మ పురాణంలో లక్ష్మీ శ్రీనివాసుల ఈ సంభాషణము

వివరించబడివున్నది.  కలియుగ

దైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహానికి  గల రహస్యాన్ని

యీ విధంగా తెలుపుతున్నది.

ఇందులోని నిగూఢార్ధాన్ని సద్భక్తితో గ్రహించి 

తిరుమల దేవుని దర్శించిన వారి జీవితం శోభాయమానం 

అవుతుందని

మహాత్ముల ఉవాచ.

 సుందరమగు కందమ్ముల 

నందాత్మజు తలచి తమరు నవ్యపు రీతిన్

డెందమ్మలరగ చెప్పియు

స్పందన కల్గించినారు సత్కవివర్యా!

 *** ఆలోచనాలోచనాలు *** అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక *** అవధాన మధురిమలు ***  శతావధాని శ్రీ కాకర్ల కొండల రావు*** సమస్యాపూరణములు***    1* "" మరణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో""                      ఉ. సరసుడ వంచు సూనశరాస్త్రవరిష్టుడవంచు పండితా/ భరణుఁడ వంచు సన్మధుర వాక్చతురత్వయుతుండవంచు భా/ సుర నవయౌవన స్ఫురిత సుందరగాత్రుడవంచెఱింగి కా/మ రణముఁగోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో!                       2* "" తల చేతులలోనయుండు దలప జగంబుల్.""                       కం. కలస్థావర జంగమ జం/ తులఁబుట్టింపగఁ బెంప ద్రుంపంగ సమ/ ర్థులగుట ముగురమ్మల నే/ తల చేతులలోన నుండుఁదలప జగంబుల్.     3* "" పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.""       కం. చాలగద్రావి యొకండమి/ త్రాళి వధింపగ నేగి యా సదనముల/ న్వ్రేలెడు ఛాయపటరూ/ పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.                         4*"" కాయలు పండ్లుగావు మరి గాయలుగావల పండ్లు కోమలీ.""                   ఉ. ఆయతదాన వాల్యాయ మృగాంగుడనే నల రావణుండ రం/ భా యెద నిన్నె కోరితిని వంచన సేయగ నెంచబోకు మ/ మ్మాయలమారి నూర్వశిని మానసమందున నొల్లసుంతయుం/ గాయలు పండ్లుగావు మరిగాయలుగా వలపండ్లు కోమలీ!                                 5*"" తల్లిని జూచి కౌగిటికి దార్చి రమింపగ జొచ్చె నయ్యెడన్.""                        ఉ. పల్లవ పత్ర పుష్ప ఫలభాసురమైన వసంతవేళ రా/ నుల్లములోని మోహభర నేరక పాండురాజు వి/ ద్యుల్లతవోలె కట్టెదుట నొప్పెసలారెడు ధర్మపుత్రు మా/ ర్తల్లని జూచి కౌగిటికి దార్చిరమింపగ జొచ్చె నయ్యెడన్.                            6* ""భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.""     శా. శ్లేష్మంబందునపడ్డ మక్షికమటుల్ చిత్తంబు చొక్కొండగా/ నూష్మశ్రేణిని వుడ్చికొంచు రిపు వీరోత్తంసముల్ చేడ్పడన్/ గ్రీష్మాదిత్యుని భంగి మంటలొలయం గ్రీడించు నక్క్రీడితో/ భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.         దత్తపదులు;---                     1*" ముండ -- దండ -- పండ -- బండ -- నిండ -- కుండ -- కొండ"" పదములతో "" రామాయణార్థములో "" పద్యం .                              చం. పొలుపుగ వచ్చి శూర్పణఖ ముండ రఘూద్వహు దండ పండగా/ గులుకుచు బండ మాటలను కోరిక నిండగ బల్కి డెంద మం/ దొలసిన కూర్మి జంకు గొనకుండ సమీపము జేరరాఘవుం/ డులుకున లేచి పల్కకుమికొండని యవ్వల ద్రోసె దానినిన్.                       2* ""కర్పూరము -- దేవానాంప్రియులు -- పరమార్థచింత -- కవీశాగ్రణి"" పదములతో "" శ్రీ విష్ణు పూజ"" పై పద్యం.      మ. బరువౌ పాపము వాపుకోదలచు దేవానాంప్రియుల్ భక్తిమై/ వర కర్పూరము ధూపవస్తువులు పుష్పశ్రేణులుం గూర్చి దు/ ష్కర వృత్తిం బరమాత్మచింత నెపుడుం గంజాక్షునిం గొల్చుచో/ దెఱలుం బాపము, ముక్తియుంగలుగు నెందేనిం గవీశాగ్రణీ!               ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         "" ఆనో భద్రాః, క్రతవోయంతు విశ్వతః!"" మనకు అన్ని వైపులనుండి ఉదాత్త భావములు లభించుచుండును గాక!           ( Let noble thoughts come from every side.)  తేది 6--12--2023, బుధవారం, శుభోదయం.

 *గోవిందమ్మ నివేదన..*


"అయ్యా..మీరు స్వామివారికి నైవేద్యాలు వండిపెట్టడానికి వంటమనిషి కావాలని అడిగారు కదా..ఎవరైనా కుదిరారా..?" అని ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు అడిగారు.."లేదండీ..చూస్తున్నాము.." అన్నాను.."మా వాళ్లకు తెలిసిన ఒకావిడ ఉన్నదట..పిలిపించమంటారా?" అన్నారు.."పిలిపించండి.." అన్నాను..ఈ సంభాషణ 2007వ సంవత్సరం నాటిది..ఆరోజుల్లో మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద శ్రీ స్వామివారికి నిత్యా నైవేద్యాలు అర్చకస్వాములే తయారు చేసుకొని వచ్చి నివేదన చేసేవారు..ఒక్కొక్కసారి అర్చకస్వామి నైవేద్యం తయారు చేసే సమయం లో భక్తులు వస్తే..వారు స్వామివారి మంటపం లో అర్చకస్వామి రాక కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది..అదీకాక..ఆదివారం నాడు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉండేది..దీనికి పరిష్కారంగా ఒక వంటమనిషిని ఏర్పాటు చేసుకోవాలి అని నేనూ మా అర్చకస్వాములు ఇతర సిబ్బంది అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము..ముందుగా దేవాదాయశాఖ వారి వద్ద నుంచి వంటమనిషి కొఱకు ఒక ఉద్యోగం కల్పించడానికి అనుమతి కూడా తీసుకున్నాము..


ఇద్దరు ముగ్గురు వంట వాళ్ళు వచ్చారు కానీ..ఏ ఒక్కరూ నెల రోజుల కంటే ఎక్కువ కాలం స్వామివారి మందిరం వద్ద వుండలేకపోయారు..కారణం విచారిస్తే..వాళ్లకు శ్రీ స్వామివారి మందిరం వద్ద  తమకున్న దురలవాట్లను మానుకోవడం కష్టంగా తోచి..ఇమడలేక వెళ్లిపోయారు..అని తెలిసింది..ఆ సమయం లో ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు నాతో తమకు తెలిసిన ఆడమనిషి వున్నదని నాతో అన్నారు..ఆ తరువాత రెండురోజుల్లో ఆవిడ వచ్చింది..


"అయ్యా..నా పేరు గోవిందమ్మ..ఈ స్వామివారి గురించి నేను విని వున్నాను..నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి..వాటిని వదిలించుకోవడానికి ఈ స్వామివారి సన్నిధిలో కొన్నాళ్ళు ఉండాలని అనుకున్నాను..అటువంటిది ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు తయారు చేయడానికి వంటమనిషి గా నన్ను పిలిపించారు..ఆ దత్తుడే నన్ను పిలిపించాడేమో తెలీదు..ఇక దత్తయ్య ను నేను వదలను..నా ప్రాణం ఉన్నంత వరకూ ఈ దత్తాత్రేయుడి దగ్గరే వుంటాను..ఒకవేళ నేను చేయలేని పక్షములో..వేరే వాళ్ళు ఈ ఉద్యోగం చేసినా..నేను ఈ మందిరం వద్దే వుంటాను..అందుకు కూడా సమ్మతించండి.." అని కన్నీరు కారుస్తూ చెప్పింది..నాకూ మా సిబ్బందికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నది..తాను స్వామివారి వద్దకు రావాలని అనుకోవడం ఏమిటి..? ఆమె చేయదగ్గ ఉద్యోగం సిద్ధంగా వుండటమేమిటి..?..అంతా ఏదో పధకం ప్రకారం జరుగుతున్నదేమో అనిపించింది..


"అమ్మా..స్వామివారు ఈ మందిరం వద్దకు రాకముందు మొగిలిచెర్ల లోని శ్రీ పవని శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్ల ఇంటి వద్ద వున్నారు..ప్రస్తుతం ఆ దంపతులు అనారోగ్యం తో వున్నారు..స్వామివారు సిద్ధిపొందే దాకా వారికి ఆహారం ఆ ఇంటినుంచి వచ్చేది..ఆ దంపతుల కడుపున పుట్టినందుకు..స్వామివారికి కొన్నాళ్ళు ఆహారం తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం నాకూ కలిగింది..నువ్వు అక్కడే వుండి..స్వామివారికి నైవేద్యాలు అక్కడే తయారు చేసి పంపించు..ఇందుకు నీకేమి అభ్యంతరం లేదు కదా..?" అన్నాను.."అయ్యా..వాళ్లకు కూడా నా చేతనైన సేవ చేసుకుంటాను..మీరు చెప్పినట్టే వుంటాను.." అన్నది.."అయ్యా..మీరు ఇష్టపడితే..రేపటినుంచి నేను స్వామివారికి నైవేద్యం చేస్తాను.." అన్నది..సరే అన్నాను..


ఆరోజు నుంచీ సుమారు పది సంవత్సరాల పాటు గోవిందమ్మ స్వామివారికి క్రమం తప్పకుండా నైవేద్యాలు తయారు చేసి పంపించేది.."ఆ దత్తయ్యకు నామీద కరుణ కలిగింతకాలం నేను చేస్తూనే వుంటాను.." అని పదే పదే చెప్పేది..మా తల్లిదండ్రులు శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్ల అంత్యకాలం లోనూ గోవిందమ్మ వారికి సేవ చేసుకున్నది..."స్వామివారు తనకు నైవేద్యాల కోసమే కాకుండా మన తల్లిదండ్రుల అవసరాల కోసం కూడా గోవిందమ్మను తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచారు.." అని మేము తరచూ అనుకునే వాళ్ళము..


2017 వ సంవత్సరం లో గోవిందమ్మ అనారోగ్యం పాలైంది..డాక్టర్ల కు చూపించాము..కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం అన్నారు..కేవలం పదిరోజులు పాటు తన కుటుంబం వద్ద వుండి..మళ్లీ మొగిలిచెర్ల కు వచ్చేసింది..ఆరోజు ఆదివారం స్వామివారి సన్నిధికి వచ్చి.."దత్తయ్యా..నాకు ఓపిక ఇచ్చినంతకాలం నీకు సేవ చేసుకున్నాను..విశ్రాంతి తీసుకొని మళ్లీ వస్తాను.." అని చెప్పుకున్నది..కానీ మరో వారం కల్లా గోవిందమ్మ స్వామివారినే స్మరిస్తూ కన్నుమూసింది..


ఇప్పటికీ స్వామివారి మందిరం వద్ద నేనూ.. మా సిబ్బంది..అర్చకస్వాములు..అందరమూ కూడా అనుకునేది ఓకేమాట.."స్వామివారే గోవిందమ్మను ఇక్కడికి పిలిపించారు..అందువల్ల నే ఆమె అంత భక్తి తో సేవ చేసుకున్నది.." 


ప్రతిక్షణం స్వామివారినే తలుస్తూ..చివరి క్షణం వరకూ తాను చేసేది ఉద్యోగం కాదు..స్వామివారి సేవే.. అనుకుంటూ జీవితాన్ని సార్ధకం చేసుకున్న ధన్యజీవి గోవిందమ్మ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).

 *పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*


పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..* 


పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..


వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..


ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)


🔥  తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥  లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥  కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు..


ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..


🔥  ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..


మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...


కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*


ఒక్కసారి ఆలోచన చేయండి...


*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*


కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..


పిల్లలకు..👇


👉  *బాధ్యత* 

👉  *మర్యాద*

👉  *గౌరవం* 

👉  *కష్టం* 

👉  *నష్టం* 

👉  *ఓర్పు*

👉  *సహనం*

👉  *దాతృత్వం*

👉  *ప్రేమ*

👉  *అనురాగం*

👉  *సహాయం*

👉  *సహకారం*

👉  *నాయకత్వం*

👉  *మానసిక ద్రృఢత్వం* 

👉  *కుటుంబ బంధాలు*

👉  *అనుబంధాలు*    

👉  *దైవ భక్తి*

👉  *దేశ భక్తి*


*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*


పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...


మనం కూడా మమేకమవుదాం...


*భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.....*


     🙏🏻 *లోకా సమస్తాః సుఖినోభవంతు* 🙏🏻

 మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..


చాలా  మంచి పోస్టు  . అందరూ చదవండి .


ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.

''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.

''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.

రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.

''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

పిల్లాడి రుద్రయ్య

 *** ఆలోచనాలోచనాలు *** తెలుగు నీతి పద్య రత్న కదంబం ***                   *** 1* ఉ. మాటలచేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తు;రా/ మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు లిత్తు; రా/ మాటలచేత మానినులు మన్ననజేసి మనంబు లిత్తు, రా/ మాటలు నేర్వకున్న యవమానము,న్యూనము, మానభంగమున్.( చాటుపద్యము)                   2* ఉ. కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్/ జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు, హానిఁగాంతు రా/ చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెల్గినన్/ గ్రూర భుజంగమున్ గవయఁ గూడెనె శ్రీకర రాజశేఖరా!       (రాజశేఖర శతకము, సత్యవోలు సుందర కవి)          3* శా. సత్యం బెప్పుడు దప్పడేనియు, దురాచారుండు గాడేని, యౌ/ చిత్యం బేమరడేని , దుర్జనుల గోష్ఠింబొందడే, భక్తి సాం/ గత్యం బాదటఁ బాయడేని, మదనగ్రస్తుండు గాడేని,నీ/ భృత్యుండాతడు మూడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా! (సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ్య)                    4* శా. గాజుంబూస యనర్ఘ రత్నమగునా? కాకంబు రాయంచయౌ/ నా? జోరీగ మధువ్రతేంద్ర మగునా? నట్టెన్ము పంచాస్యమౌ/ నా? జిల్లేడు సురావనీజమగునా? నానా దిగంతంబులన్/ రాజౌనా ఘనలోభి దుర్జనుడు? భర్గా! పార్వతీ వల్లభా! ( శ్రీ భర్గ శతకం, కూచిమంచి తి మ్మకవి)                                5* సీ. సాధుసజ్జనులతో జగడమాడినఁ గీడు, కవులతో వైరంబు గాంచఁగీడు.                          పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు, బిచ్చగాండ్రను దుఃఖపెట్టఁ గీడు.                                   నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు,పుణ్యవంతులఁ దిట్టఁబొసగుఁ గీడు.                సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు, గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు.               తే.గీ. దుష్టకార్యములొనరించు దుర్జనులకు/ ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె/ భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర! ( నరసింహ శతకం, కాకుస్థం శేషప్ప కవి)                                      6* శా. స్నానంబుల్ నదులందుఁ జేయుట, గజస్నానంబు చందంబగున్/ మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడ్పగున్/ నానహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను/ న్నీ నామోక్తియు, నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణా! ( నారాయణ శతకము, బమ్మెర పోతన)      7* కం. ఆచార్యున కెదిరింపకు/ ప్రోచినదొర నింద సేయఁబోకుము కార్యా/ లోచనము లొంటిఁ జేయకు/ మాచారము విడువఁ బోకుమయ్య కుమారా! (కుమార శతకము, పక్కి అప్పల నర్సయ్య)                              8* కం. ఉడుముండదె నూఱేండ్లునుఁ/ బడియుండదె పేర్మి పదినూఱేండ్లున్/ మడువునఁ గొక్కెర యుండదె/ కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! ( బద్దెన కవి‌, సుమతీ శతకము)               9* ఆ.వె. అనగ ననగ రాగమతిశయిల్లుచునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినురవేమ! ( వేమన శతకం,యోగి వేమన)            10* సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద/ మంచివారి పొందు మనకు నిచ్చు/ కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు/ లలిత సుగుణజాల! తెలుగు బాల! (తెలుగు బాల శతకం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి)                   11* నల్లనిదని విడువజెల్లునె కస్తూరి/ తెల్లనిదని దాల్తె రెల్లుపూవు/ వన్నెలోన నేమి వైభోగమున్నది/ విలువ కట్టి చూడ తెలుగు బిడ్డా! ( తెలుగు పూలు, నార్ల చిరంజీవి)                      12* నిలిచి నీళ్ళు త్రాగ నీరుకారు బ్రతుకు/ పరుగులెత్తవోయి పాలు త్రాగ/ పరుగునుండె పుట్టె నరుని నాగరికత/ వాస్తవమ్ము నార్లవారి మాట! ( నార్ల వేంకటేశ్వర రావు)                                      "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం.          " అన్ని వైపుల నుండి మనకు ఉదాత్త భావనలు లభించుగాక!"                       (Let noble thoughts come from every side.).                                        తేది 28--11--2023, మంగళవారం, శుభోదయం.


 


 


 

 



 


 

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ - మృగశిర -‌  సౌమ్య వాసరే* *(29-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

 *1984*

*కం*

ఎంతటి యున్నతులొందిన

సాంతముదేవుని యెదుటన సాగిలపడగన్

చింతించగ నీవొందిన

యంతటి ఘనకీర్తిగూడ యలువమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎంతటి గొప్ప స్థాయిలను సాధించిన నూ  చివరి వరకూ దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి ఆలోచించినచో నీవు సాధించిన గొప్ప కీర్తి కూడా అల్పమే అవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత*

*నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య* |

*ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 06_* _


తా: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది.ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ! నరసింహస్వామి! కరావలంబనమొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము. *లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

▶️ Watch this reel https://www.facebook.com/reel/252776630791725?mibextid=YNcHmz&s=yWDuG2&fs=e 

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.29.11.2023

బుధ వారం (సౌమ్య వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే కృష్ణ పక్షే ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  కృష్ణ పక్షే  ద్వితీయౌపరి తృతీయాయాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.16

సూ.అ.5.20

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

కృష్ణ పక్షం విదియ మ.1.37 వరకు. 

బుధ వారం. 

నక్షత్రం మృగశిర మ.2.29 వరకు. 

అమృతం ఉ.7.06 వరకు. 

పునరమృతం తె. 5.06 ల మరునాడు ఉ.6.46 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.25 ల 12.09 వరకు. 

వర్జ్యం  రా. 11.17 ల 1.02 వరకు.  

యోగం సాధ్యం రా. 10.05 వరకు.

కరణం గరజి మ.1.37 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ.12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

***********

 పుణ్యతిధి కార్తీక  బ. తదియ. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏