21, డిసెంబర్ 2024, శనివారం

వేదాంత వ్యాసం

 వేదాంత వ్యాసం 

                         మొదటి భాగం 

బ్రహ్మ : 

గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.


పరబ్రహ్మ : 

బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

         ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.


అచల పరిపూర్ణ పరబ్రహ్మ : 

శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.


పరిపూర్ణము : 

పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.


ఇహరూపము : 

ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.


పరరూపము : 

ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము

                             సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గురించి👇*



 *👆బ్రహ్మశ్రీ*

*శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గురించి👇*


పండితులు 

వేదమూర్తులు 

ఏక సంథాగ్రాహులు

విశిష్ట ప్రవచనకారులు

అఖండ ప్రజ్ఞావంతులు 

 వర్తమానాంశ విశ్లేషకులు 

అష్టాదశ పురాణ జ్ఞానులు 

అత్యున్నత పేరు ప్రఖ్యాతులు 

*శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు!.*

 

గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం!.

 

 ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, 

కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 

సునాయాసంగా బయటపడ్డ ధీమంతులు. 


శ్రీ చాగంటి వారు 

1. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. 

2. వీరి భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. 

3. ఏ ఛానెల్లో ఐనా, సోషియల్ మీడియాలో ఐనా, దేవాలయ మైకుల్లో ఐనా వారి ప్రవచనాలు కని/వినిపిస్తుంటాయి. 

4. అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.

5. కాకినాడలోని ఒక దేవాలయంలోకి ఛానెల్స్ వారు వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.

6. చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.

7. ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. 

8. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే, ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. 

9. వారికున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు మాత్రమే. 

10. ఇంతవరకు ఆయనకు కారు లేదు. 

11. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. 

12. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు.

13. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. 

14. వారికి ఆరేడేళ్ల వయసులో- జనకులు గతించారు.

15. వారికి ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.

16. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. 

17. నిరుపేద కుటుంబం కావున సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు' అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. 

18. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. 

19. వేదాగ్రణి ఆయన నాలుకమీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

20. ఈవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. 

21. వాటిపై ఆయన కృషి పెద్దగా లేదు. 

22. అవన్నీ వారికి పూర్వజన్మ సుకృతంగా లభించినవి.

23. అది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.

24. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. 

25. ఆయన ఉద్యోగంలో చేరాక, తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. 

26. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే, తన సంపాదనతో వివాహాలు చేశారు. 

27. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. 

28. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్' లేదంటే నమ్ముతారా?.

29. అప్పుడపుడు కాకినాడలో "అయ్యప్ప దేవాలయంలో" సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. 

30. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.

31. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. 

32. శ్రీ పీ.వీ. నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో' ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిసినప్పుడు *"మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను"* అన్నారు.

33. చాగంటి వారు నవ్వేసి *"మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే' తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు."* అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. 

34. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!.

35. చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.అది తప్పుడు భావన.

36. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం' వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక, ప్రారంభించారు.

37. చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా శ్రీ సరస్వతిమాత కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.....


మిత్రమా !.,

దుర్మార్గులను ఖండించక పోవుట ఎంతటి తప్పో, 

ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది.

కనుక,*మీ మీ watsapp గ్రూపులకు & మిత్రులకు share చెయ్యండి.*

ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం, 

పదుగురికీ తెలియజేస్తున్నందులకు మీ మహోన్నత వ్యక్తిత్వానికి మా ప్రశంసలు!. 

మీకు బహు ధన్యవాదములు!.🙏


🙏

పుస్తకాలకు ఇక నిజంగా పండుగే

 ❗పుస్తకాలకు ఇక నిజంగా పండుగే!❗


✍️వెంకట్ శిద్దారెడ్డి,రచయిత, ప్రచురణకర్త


ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య దాదాపు పదికోట్లు. తెలుగులో ఒక మంచి పుస్తకం వస్తే అది కొనేవారి సంఖ్య మాత్రం వెయ్యికి అటూఇటూ. కాకపోతే ఇది అయిదేళ్ల నాటి సంగతి. మరిప్పుడో..? దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైన ఘనత ఒక తెలుగు (అమ్మ డైరీలో కొన్ని పేజీలు) పుస్తకానిదే! ఇంతలో అంత మార్పు ఎలా సాధ్యమైందంటే...


అయిదేళ్ల క్రితం వరకూ పుస్తక ప్రచురణ అంటే- రచయితలు తమ సొంత డబ్బుతో రచనలను ప్రచురించుకుని, బంధుమిత్రులకు పంచుకునేవారు. పుస్తకాల షాపుల్లో ఇవ్వగా మిగిలినవి అటకమీద దుమ్ము కొట్టుకుపోయేవి. కొద్దిమంది పేరున్న రచయితలను మినహాయిస్తే మిగిలిన వారందరిదీ ఇదే పరిస్థితి.పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో పరిస్థితి ఇంత దారుణంగా లేదు. తెలుగులోనే ఈ దుస్థితి ఎందుకొచ్చిందంటే- గత పాతికేళ్లలో ప్రధాన ప్రచురణ సంస్థలు, వాటితో పాటే పుస్తకాల షాపుల్లో అనేకం తెరమరుగయ్యాయి. ఈ పరిణామానికి కారణం- తెలుగులో పుస్తకాలు చదివేవాళ్లు తగ్గిపోవడం. 2000 కి పూర్వం,తెలుగు వారిలో పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువే. టీవీ, ఓటీటీలు వచ్చాక పుస్తకాలు చదవడం మానేశారనుకుంటే, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామమే తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన సమస్య కాదు. ఎందుకో మరి, తెలుగువాళ్లు మాత్రం పుస్తకాలు చదవడం దాదాపుగా మానేశారు. ఫలితంగా తెలుగు ప్రచురణరంగం కుదేలైంది.


➡️" అలవాటు అక్కడి నుంచే!"


అచ్చులో పుస్తకాలు చదవడం ప్రపంచ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టిందన్నది నిజమే మొబైల్ ఫోన్,టాబ్లెట్లలో చదువు కునేలా ఈ బుక్స్, వినగలిగేలా ఆడియో బుక్స్ రావడం ఒక కారణం. అలాగని తెలుగు పాఠకులు కూడా అచ్చు పుస్తకాలు వదిలేసి ఈ-బుక్స్ వైపు వెళ్లారా అని చూస్తే, వాటిని అమ్మే అమెజాన్, కిండిల్ లాంటి సంస్థలు తెలుగు పుస్తకాలు తాము అమ్మబోమనీ, తెలుగులో చదివేవాళ్లే లేరనీ తేల్చి చెప్పేశాయి. ఏమైపోయారు మరి తెలుగు పాఠకులు? ఒక మంచి కదో, కవితో, నవలో చదవాలనే కనీస ఆసక్తి లేకుండా బండబారి పోయిందా తెలుగు వారి మనసు... అని సాహిత్యాభిమానులకు అనిపించిన మాట వాస్తవమే. కాకపోతే తెలుగువాళ్లు మరీ అంతగా తెలుగు సాహిత్యాన్ని వదిలెయ్యలేదు.వాళ్లకు కావాల్సిన దానికోసం వెతుక్కుంటూనే ఉన్నారు. ఉదాహరణకు పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రతిలిపి' అనే ఆన్లైన్ ప్లాట్ పామ్లో ఎవరైనా కదలు రాయొచ్చు.చదువు కోవచ్చు. ఇక్కడ ఎందరో తెలుగువాళ్లు తమ కథలు, కవితలు,నవలలు ప్రచురించారు. వాటిని లక్షలాది పాఠకులు చదివారు అంటే,తెలుగువాళ్లు చదువు తున్నారు. కానీ వాళ్లకి కావాల్సిందేదో ప్రచురణకర్తలు, రచయితలు అందించడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ- తెలుగు పుస్తకాలను పీడీఎఫ్ గా పంచే టెలిగ్రాం గ్రూపులు, ఇక్కడ కూడా వేలాది సాహిత్యాభిమానులు పాత తెలుగు పుస్తకాలను ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నారు.


ఇంట్లో అమ్మోనాన్నో పుస్తకం చదువుతుంటే చూసిన పిల్లలు అనుకరిస్తారు. ఆ ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు పిల్లలకు పనికొచ్చే కథల పుస్తకాలు కొనిపెడతారు. అలా మొదలుపెట్టి క్రమంగా తన కంటూ ఒక అభిరుచిని ఏర్పరచుకుని తయారయ్యే పాఠకుడు తనకు కావాల్సిన సాహిత్యాన్ని తాను వెతుక్కుంటాడు. పాతికేళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లోనూ ఒక యండమూరో, యద్దనపూడో పుస్తకంగా ఉండే వారు. లేదా ఒక చందమామో, బాలమిత్రో ఉండేది. కనీసం నానమ్మో, తాతయ్యో చెప్పే కథలైనా వినపడేవి. ఈ పాతికేళ్లలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ, కొత్తగా చదవాలనుకునేవాళ్లు మొదటి పుస్తకంగా ఏం చదవాలీ అనడిగితే చివరికి మిగిలేది'. 'అసమర్ధుడి జీవయాత్ర, మైదానం', 'మహాప్రస్థానం' లాంటి క్లాసిక్సే చదవాలనే వారు, అలాగే రాసేవాళ్ల మీదా రచయితగా గుర్తింపు పొందాలంటే సమాజాన్ని మార్చే, సమాజాన్ని ప్రశ్నించే కథలే రాయాలనే ఒత్తిడి కనిపించేది. ఫలితంగా యువ పాఠకులు క్లాసిక్స్ ని చదివి అర్ధం చేసుకోలేకో, ఇప్పటి జీవనశైలికి చెందని విషయాలను జీర్ణించుకోలేకో, ఇది మనకు సరిపోయేది కాదులే అని మొత్తంగా పుస్తకానికి దూరమయ్యారు. ప్రపంచం, సమాజం సంగతి తరవాత... ముందు నేనంటూ ఒకణ్ని ఉన్నాను. నాకంటూ ఒక బాధుంది. నా ప్రేమ విఫలమైంది. ఆ బాధను చెప్పుకోడానికి ఒక కథ రాయకూడదా? అని ఒక ఔత్సాహిక రచయిత అనుకుంటే చుట్టూ పరిస్థితేమో అందుకు భిన్నంగా ఉంది. రచయితలంతా ప్రపంచ బాధలను తమ బాధలుగా చేసుకుని రచనలు చేస్తున్నారు. దాంతో ఇలానే రాయాలేమో అనుకుని ఔత్సాహికులు మొత్తానికి రాయాలనే ఆసక్తినే చంపేసుకున్నారు.


➡️మలుపు తిప్పిన కొత్తనీరు


అలాంటి నేపథ్యం నుంచి గత అయిదారేళ్లలో తెలుగు ప్రచురణరంగం కొత్త మలుపు తిరిగింది. ఇవాళ ఒక మంచి పుస్తకం ఒక్కరోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడవడం చూస్తున్నాం.ఈ మధ్యకాలంలో దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైంది ఒక తెలుగు పుస్తకం కావడం... మార్పులో భాగమే పుస్తక ప్రదర్శన జరుగుతున్న ఈ నెలలోనే దాదాపు మూడొందల దాకా కొత్త పుస్తకాలు ప్రచురితం ఆయ్యుంటాయని అంచనా.ఈ సంవత్సరం పదివేలకు పైగా అమ్ముడైన తెలుగు పుస్తకాలు కనీసం ఏడైనా ఉంటాయి.


ఒకరిద్దరి వల్ల వచ్చిన మార్పు కాదిది. పాతికేళ్లుగా తగ్గుతూ వస్తున్న పాఠకుల సంఖ్యను పెంచాలన్న, తెలుగు వారిలో సాహిత్యాభిమానాన్ని తట్టిలేపాలన్న సదుద్దేశంతో పలువురు కృషి చేశారు. వారి శ్రమ ఫలితాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.


➡️మంచి రచనలను వెతికి...


కలం పక్కన పెట్టేసిన రచయితలు కూడా ఇప్పుడు మళ్లీ ఉత్సాహంగా రచనలు చేస్తున్నారంటే దానికి కారణం- కొత్తగా వచ్చిన ప్రచురణ సంస్థలే. ఆస్వీక్షికి, అజు, అనల్ప, ఛాయ, కథాప్రపంచం, ఎలమి, రేగిల చ్చులు, జేవీ, ఝాన్సీ, ప్రభవ పబ్లికేషన్స్ లాంటి పాతికకు పైగా ప్రచురణ సంస్థలు సాహసోపేతమైన ప్రాజెక్టులు చేపట్టి తెలుగు సాహిత్య రంగం కాస్త కోలుకునేలా చేశాయి.సరికొత్త తెలుగు రచనలనే కాక వివిధ భాషల్లో వచ్చిన మంచి రచనలను వెతికి అనువాదం చేయించి తెలుగు పాఠకులకు అందిస్తున్నాయి.అలాగే కథకు, కవితకు పరిమితమై పోయిన తెలుగు సాహిత్యాన్ని నవలవైపు మళ్లించాయి. ఒక్క ఆస్వీక్షికి సంస్థే ఏడాదిలో దాదాపు నలభై నవలలు ప్రచురించింది.ఈ అయిదేళ్లలో కనీసం లక్షమంది కొత్త తెలుగు పాఠకులు తయారవడానికి కారణం కొత్త ప్రచురణ సంస్థలేనంటే అతిశయోక్తి కాదు, సోషల్ మీడియా కూడా తెలుగు సాహిత్య ప్రచారానికి తనవంతు తోడ్పాటు నందిస్తోంది. మొత్తా నికి తెలుగు ప్రచురణ రంగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నా యన్నదీ తెలుగు సాహిత్యానికి అభిమానం దక్కుతోందన్నదీ నిర్వివాదాంశం. ఇది ఎవరూ ఊహించని, చరిత్రాత్మకమైన మలుపు


➡️యువ రచయితలదే హవా!


ఒకప్పుడు ఏటా ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి 35 ఏళ్ల లోపు రాసేవాళ్లు తెలుగులో ఎవరున్నారని వెతుక్కునే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఇంతమందిలో ఎవరికివ్వాలి! అని ప్రశ్నించుకునే పరిస్థితి గత అయిదేళ్లలోనే చాలామంది యువ రచయితలు కలంపట్టారు. వారు రాసిన పుస్తకాలు రెండో సారి, మూడోసారి ముద్రణలకు వెళ్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వందమంది దాకా కొత్త రచయితలు నవలలు రాయడానికి సిద్ధ మవుతున్నారన్నది ప్రచురణ రంగంలోని వారి మాట.


@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

20, డిసెంబర్ 2024, శుక్రవారం

Panchaag


 

Panchang


 

పంచాంగం 20.12.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 20.12.2024 Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష పంచమి తిథి భృగు వాసర: మఘ నక్షత్రం నిష్కంభ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

విస్తరిస్తుంది

 శ్లోకం:☝️

*యః పఠతి పరిపృచ్ఛతి*

 *పండితానుపాశ్రయతి |*

*తస్య విస్తారితా బుద్ధిః*

 *తైలబిన్దురివామ్భసి ।।*


భావం: చదివేవాడు, (వ్రాసేవాడు,) ప్రశ్నించేవాడు, పండితులను ఆశ్రయించేవాడు, అతని తెలివి నీటిపై (త్వరగా) వ్యాపించే నూనె బిందువులా విస్తరిస్తుంది.

19, డిసెంబర్ 2024, గురువారం

హోటల్ కమ్ సత్రం

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మిత్రులు ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేశారు ....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.



GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

grtkasichatram.com లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


grtkasichatram.com

మనుషులు రాక్షసులవుతున్నారు

 🙏🕉️శ్రీ మాత్రేనమఃశుభోదయం🕉️🙏        🌹సమాజం మారిపోతోంది మనుషులు రాక్షసులవుతున్నారు.. అని బాధపడుతుంటారు.. కానీ చుట్టూ అంతా రాక్షస ఆలోచన మనుషులు ఉన్నా స్థిమితంగా మంచి మనసుతో, మంచి ఆలోచనలు చేయగలిగే వ్యక్తిని ఏ రాక్షస ఆలోచనల వ్యక్తుల ప్రభావం మన మీద ప్రభావితం చేయదు.. పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వు, నిరంతరం ప్రశాంతంగా ఉండే మనస్సుపై ఏవిదమైన రాక్షస ప్రభావం చూపలేదు🌹అనుకున్న పనిని ఆపేస్తాం..వద్దనుకున్నది చేసేస్తాం.. అనుకోలేదు కానీ ఆకస్మాత్తుగా అనేసాం.. ఎంతగా అనుకున్న చేయలేక పోయాను..ఇవన్నీ ఆత్మ విశ్వాసం లోపించిన్నప్పుడు మనసులో విలువడే శబ్దాలు..ఖర్చు లేదు కదా అని మనసులో ఇష్టం వచ్చినట్లు విపరీత ఆలోచనలు చేసేయడం, ఇతరుల అవగుణాలను పరిశీలించి ఆ చెత్త చేదారాన్ని అపురూపమైన సున్నిత మనసులో నింపేయడం.. ఇవన్నీ ఆత్మ విశ్వాసం తరిగి పోవడానికి తగిన కారణాలు🌹జీవితం ఒక పెయింటింగ్ లాంటిది.. ఆశ అనే గీతలు గీసుకుంటూ వెళ్ళాలి.. దాని నుండి లుపాలను సహనంతో మంచి ఆలోచనలతో తొలిగించాలి🌹🌹మీ అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి 9440893593 9182075510 మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏

తెలుగు సామెతలు

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

18, డిసెంబర్ 2024, బుధవారం

Panchang


 

శీతాకాలపు అయనాంతం

 *8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!*


డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని 'శీతాకాలపు అయనాంతం' అని అంటారు.

పురోహితుడు (ఒక్కరు ) కావలెను.

 *ఓం నమో వేంకటేశాయ*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వారి P.V. కాలనీ నందు గల శ్రీ పద్మావతీ గోదాదేవి సమే త వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు నిత్య పూజాదికములు నిర్వహించుటకు పురోహితుడు (ఒక్కరు మాత్రమే) కావలెను.


*అర్హతలు*


1. 35 సంవత్సరములు పైబడి వివాహితుడై  యుండవలెను.

2. స్మార్త, వైఖానస, ఆగమ శాస్త్ర విజ్ఞానం కలిగియుండి, ఆయా శాస్త్ర పద్ధతుల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.

3. ఏవిధమైన దురలవాట్లు లేకుండా ఉండాలి


*జీత భత్యములు*


1. నెలకు రూ.18,000/- లు జీతముగా చెల్లించ బడును.

2. నిత్య మహా నైవేద్యం నిమిత్తం రూ.5,000/- లు అదనంగా చెల్లించ బడును.

3. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితముగా ఇవ్వబడును.

4. రెండు పడక గదుల నివాసము ఆలయము పక్కనే ఉచితముగా ఇవ్వబడును.

5. కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయం

6. పిల్లలు ఉంటే వారికి ఉచిత విద్య

7. ఉచిత మంచినీరు, ఉచిత విద్యుత్తు


పైన తెలిపిన అర్హతలు, జీత భత్యములకు ఇష్టమున్న వారు మీ మీ దరఖాస్తులను మీకు సంభందించిన అన్ని వివరములతో ఈ క్రింద తెలుపబడిన చిరునామాకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జత పరచి ఈ నెల 30 వ తేదీ లోగా పంపవలెను. అన్ని దరఖాస్తులను పరిశీలించిన మీదట మీతో ముఖా ముఖి సంభాషణ జరుపు తేదీని మీ చరవాని నంబరుకు రెండు రోజుల ముందుగా తెలియ జేస్తాము.  ప్రత్యక్ష ముఖా ముఖి అయిన తరువాత మీ మీ ప్రజ్ఞా పాటవాలను బట్టి మిమ్ములను ఎంపిక చేయడం జరుగుతుంది.


*మీ దరఖాస్తులు పంపవలసిన చిరునామా* 

Dr. P. Seshagiri Rao,

Medical Superintendent,

Area Hospital, S.C.Co.Ltd.,

MANUGURU- 507117

Bhadradri -Kothagudem (Dt)

Mobile No. 9440367890

*18, డిసెంబర్, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🪷 *బుధవారం*🪷

🌷 *18, డిసెంబర్, 2024*🌷  

       *దృగ్గణిత పంచాంగం*


          *ఈనాటి పర్వం*  

       *సంకష్టహర చతుర్థి* 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : తదియ* ఉ 10.06 వరకు ఉపరి *చవితి*

*వారం : బుధవారం*(సౌమ్యవాసరే) 

*నక్షత్రం  : పుష్యమి* రా 12.58 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం  : ఐంద్ర* రా 07.34 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : భద్ర* ఉ 10.06 *బవ* రా 09.58 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.30 - 08.30  మ 01.30 - 05.00*

అమృత కాలం  : *సా 06.30 - 08.07*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*


*వర్జ్యం         : ఉ 08.49 - 10.26*

*దుర్ముహూర్తం  : ప 11.42 - 12.27*

*రాహు కాలం  : మ 12.04 - 01.28*

గుళికకాళం     : *మ 10.41 - 12.04*

యమగండం    : *ఉ 07.53 - 09.17*

సూర్యరాశి : *ధనుస్సు* 

చంద్రరాశి : *కర్కాటకం* 

సూర్యోదయం :*ఉ 06.30* 

సూర్యాస్తమయం :*సా 05.39*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.30 - 08.44*

సంగవ కాలం    :    *08.44 - 10.57*

మధ్యాహ్న కాలం :*10.57 - 01.11*

అపరాహ్న కాలం : *మ 01.11 - 03.25*


*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ చవితి*

సాయంకాలం  :  *సా 03.25 - 05.39*

ప్రదోష కాలం    :  *సా 05.39 - 08.13*

రాత్రి కాలం      :  *రా 08.13 - 11.39*

నిశీధి కాలం      :*రా 11.39 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.47 - 05.39*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🪷సరస్వతీదేవి🪷*    

     *అవతార అంతరార్థం*


*ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్నకాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను "తార'' గా వ్యవహరిస్తారు.*


*హిరణ్య గర్భః సమవర్తతాగ్రే*

*భూతస్య జాతః పతిరేక ఆసీత్‌*

*సదాధార పృధ్వీం ద్యాముతేమామ్‌*

*కస్మై దేవాయ హవిషావిధేమ*


*ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు.*


           *ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనికికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

సర్దుకుపోవడం

 సర్దుకుపోవడం మౌనంగా ఉండడం కోపాన్ని అణచుకోవడం ఇవన్నీ ఎలా సాధ్యం


ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసినా నమ్మకం కలగలేదు.

భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు.

కోకిలా ఇన్నేళ్ల మన జీవితంలో నాపైన ఎప్పుడూ కోపం రాలేదా అని.


ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీనుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టే మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. ఆ  విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను.


ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు అందులో రెండు నూలు బొమ్మలు ఉన్నాయి.

మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్లి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు. ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది.


భర్తకు ఒకటే ఆనందం కోకిలా అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు  నాపైన రెండు సార్లేనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల రెండు లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి, 


నేను వేసిన బొమ్మలన్ని అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది.


అరిచి విడిపోవద్దు

అహంతో కొట్టుకోవద్దు

ఆవేశం కోపం వచ్చినప్పుడు

వాటిని ఎలా ఆపుకోవాలో తెలిస్తే  బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.🍎🍑🍅🍅🍓🍇👍👍రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏

తిరుప్పావై మూడవ రోజు

 🔱ఓం నమః శివాయ🔱:

_*🚩తిరుప్పావై మూడవ రోజు పాశురం🚩*_

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*3. పాశురము*

*ॐॐॐॐॐॐॐ*


   ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి

    నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్

    తీఙ్గిన్ఱి  నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు

    ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప

    తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి

    వాఙ్గ-  క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్

    నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.



*భావము:-* 


ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు.



 ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి.



పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.



 ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!

    

 *3 వ మాలిక*

    

ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా!



మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.



   *(మోహనరాగము - ఆదితాళము)*


ప.    హరి తిరువడులను కొలిచెదము

    తిరు నామములనె పాడెదము


అ.ప..    పెరిగి లోకముల గొలిచిన పాదము

    పరసాధనమని తెలిసి పాడుదము


1 చ.    వ్రతమును చేయగ స్నానమాడెదము

    ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు

    వితత సస్యముల నెగయు మీనములు

    మత్తిలి కలువల సోలు భ్రమరముల


2 ఛ.    బలసిన గోవుల పొదుగుల తాకగ

    కలశముల క్షీరధారలు కురియగ

    శ్రీలెయెడతెగని ప్రసారములో యన

    ఇల సిరులదూగు చేతుము వ్రతమును.


🕉🌞🌎🌙🌟🚩


*తిరుప్పావై 3పాశురము.... ఓఙ్గియులగళన్ద తెలుగు అనువాద పద్యము*

 


సీ.పరమాత్ము సేవించు భాగ్యంబు మాదని 

     తరలి వెళ్ళెడు జన్మ ధన్యమయ్యె 

వామన రూపుడై బలిచక్రవర్తికి 

    మూడవ యడుగుతో మోక్షమిచ్చె

ఈతి బాధలు లేక సిరులతో నిండును 

       భువిలోని ప్రజలకు పోవుబాధ 

గోవిందు పూజలు గోక్షీర వృద్ధియు

         పైరులు పంటలు బాగుపడును 

వర్షదారలు పడి వరదలు పారెను 

        వరదుని సేవకై వచ్చునటుల 

తే.గీ. సిరులు సంపదలు కలిగి ధరణినిండి 

 సంతసంబుగ జీవించి స్వామి సేవ

భాగ్యమయ్యెను మాకంచు ప్రాణులెల్ల

పశువు పైరులు జనులెల్ల వశులు యగును

శ్రద్ధభక్తిని కల్గించి బుద్ధినిమ్ము 

శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!


🕉🌞🌎🌙🌟🚩

 

*ఆండాళ్ తిరువడిగలే శరణం*   


*3-పాశురము*


*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి*

*నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్*

*తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు*

*ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ*

*పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప*

*తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి*

*వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్*

*నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్*


విభవం

(అవతారములు):-


ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహము లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

 

 

"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు.



 ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.



ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు!


ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు.   పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు.



 ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు.  మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు. 



మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.



వ్రత ఫలితములు:-


ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు.  పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు.



మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక  యంత్రాలు,వాహనాలు  ఉంటే సుఖమా! లేక  సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే  సుఖమా!



మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.



మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. 



మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు.  అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.



ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది.



  ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి.



సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.



ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా!



దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు.



 అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.



"నాంగళ్" ఏం కోరిక లేని  "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది  "చ్చాత్తి నీర్ ఆడినాల్"  వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.



"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి  "ఊడు కయల్ ఉగళ"  ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి.



 "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప"  అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్"   పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.


భావం:-- 


ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే ! దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తు ఎదిగి, మూడులోకాలను కొలిచాడు.


ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్ని ఆచరిస్తే, దుర్భిక్షము అసలు కలుగనే కలుగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలే ఆకాశమంత ఎత్తుకి ఎదిగి - ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరి ... భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.



ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే.  ఇక పాలు పిదుక, గోవుల పొదుగులను తాకగానే -- కలశాలు నిండునట్లు క్షీరధారలు  అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైస్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తున్నది గోదాదేవి. 


అవతారిక:--


ఈ ధనుర్మాస వ్రతమెంతో  శుభప్రదమైనది. దీనినాచరించుట వలన -- వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునకంతకును లాభము కల్గును. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా !శాస్త్రోక్తములగు నియమములను పాటించాలి. అలా పాటించనివారు ఇహపర లోకాలలో సుఖమునొందజాలరు అని కృష్ణపరమాత్మా తెలియచేస్తున్నారు.  


🕉🌞🌎🌙🌟🚩

పంచాంగం 18.12.2024 Wednesday,

 ఈ రోజు పంచాంగం 18.12.2024 Wednesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర: పుష్యమి నక్షత్రం ఇంద్ర యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00  వరకు.



శుభోదయ:, నమస్కార:

17, డిసెంబర్ 2024, మంగళవారం

జగన్నాధ పండితరాయల గురించి

 ఇది సేకరించి పంపబడినది 👇


*జగన్నాధ పండితరాయల గురించి తెలుసుకుందాము*


ఆయన యింటి పేరును గురిచి పండితులు వేరు వేరు గా చెప్పారు.ఒకరు ముక్కామల అనీ,యింకొకరు నడిమింటి వారనీ,తరువాత ఆయన యింటి పేరు 'ఉపద్రష్ట' అని అందరు పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు.


ఆయన ఆంధ్రుడు అనేది నిర్వివాదాంశం వేగినాటి బ్రాహ్మణుడు, ముంగండ ' గ్రామ వాసి.ఆయన తండ్రి పేరు పేరు లక్ష్మీకాంత భట్టు ,తల్లి పేరు మహాలక్ష్మి,భార్య పేరు కామేశ్వరి.ఆయన గురువు పేరు పేరిభట్టు(తండ్రే).


ఆయనదగ్గర వేదాంతము,మహేంద్రుడు అనే ఆయన దగ్గర న్యాయ,వైశేషికాలు,ఖండదేవుని వద్ద జైమినీయం 

శేష శ్రీకృష్ణ పండితుని దగ్గర వ్యాకరణము నేర్చుకున్నాడు.పేరిభట్టు కేవలం పండితుడే కాక మహా కవి కూడా 

ఆయన రాళ్ళనుంచి అమృతం చిందేట్టు కవిత్వము చెప్పగల సమర్థుడట.అంటే ఆయన కవిత్వం అంత మధురంగా వుటుందన్న మాట.ఈ విషయాన్ని జగన్నాధ పండిత రాయలు తన 'రసగంగాధరము'లో ఈ శ్లోకం ద్వారా తెలియ జేస్తున్నారు.


శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రథిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః

కాణాదీ రాక్ష పాదీ రపి గహన గిరోయో మహేంద్రా ద వేదిత్ 

దేవాదే వాద్య గ్రీష్మ స్మరహర నగరే శాసనం జైమినీయం 

శేషాంక ప్రాప్త శేషామల భణితి రభూ త్సర్వ విద్యా ధరోయః 

పాషాణాదపి పీయూషం స్యందతేయస్య లీలయా 

తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం


తన తండ్రిని 'మహాగురువు ' అంటాడు పండితరాయలు జగన్నాథ పండిత రాయలు హయగ్రీవోపాసకుడు. దానికి ఆయన 'రసగంగాధారం'లో వ్రాసిన శ్లోకం.


శ్లోకం:-అపివక్తి గిరాంపతి: స్వయం యది తాసా మధిదేవతా పినా 

అ యమస్మి పురోహ యావన స్మరణో ల్లంఘిత వాగ్మయాం బుధి:


మహాపండితుడు ఎలా వుంటా డంటే, ఆ బృహస్పతే వచ్చి మాట్లాడుతాడో.ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి మాట్లాడుతుందో రమ్మనండి.యిదిగో 'హయగ్రీవ మంత్ర స్మరణం చేత వాగ్మయాంబుధి దాటి నేను వచ్చి ఎదురుగా నుంచున్నాను రమ్మనండి అన్నట్టు ఉంటాడట.


బ్రాహ్మణుల యింట్లో పిల్లల్ని ఆ కాలంలో ఎంతో కట్టుదిట్టంగా పెంచే వారు.అటువంటి కట్టుదిట్టాల్లో 

పెరిగారు.పండితరాయలు.అన్ని శాస్త్రాలు,సంగీతము కూడా నేర్చుకున్నారు.

ఆయన వివాహము అప్పటి ఆచారాల ప్రకారం చిన్నతనం లోనే ముంగండ లోని కామేశ్వరి అనే అమ్మాయితో జరిగింది.


పండితరాయలు క్రీ.శ 1600 ప్రాంతం లో పుట్టాడు.1628లో షాజహాను కొలువులో చేరాడు.అంతకు ముందే కాశీలో విద్యాభ్యాసం చేశాడు.అప్పుడే అరబ్బీ,పార్సీ భాషలు నేర్చుకున్నాడు.హిందూస్తానీ సంగీతం కూడా నేర్చుకున్నాడు.తన సంగీతం,తో షాజహానును మెప్పించాడట.అరబ్బీలో.పార్సీ లో అద్భుతమైన కవిత్వం చెప్పి షాజహాన్ ను మెప్పించాడని చెప్తారు.షాజహాను ఆయనకు 'పండిత' అనే బిరుదు యిచ్చి గౌరవిం చాడట.ఆయన ఆగ్రాలోనూ,ఉదయపూరు లోనూ.మథురలొను నివాసమున్నాడట.షాజహాను కొలువు లోని విద్వాంసులను,అరబ్బీ,పార్సీ భాషలలో వాదించి గెలిచాడట. 


అప్పటి ఉత్తర భారత దేశీయులు మన ఆంధ్రులను మీరు ఆంధ్రులా అని అడిగేవారు కాదట. మీరు జగన్నాథ పండితులవారి దేశము వారా?అని అడిగే వారట.మనవాళ్ళను వీళ్ళు పండితరాయల దేశం వారట అని 

గొప్పగా పరిచయం చేసేవారట ' ఏ పండిత్ రాజ్ కే దేశ్ వాసీ హై'అనే వారట .అంత గొప్పకీర్తి సంపాదించారు జగన్నాధ పండితులు.తెలుగు వారికి అంతటి గౌరవం తెచ్చిన ఘనత ఆయనదే.


కాశీలోనూ,హరిద్వార్ లోను జగన్నాధ పండిత రాయలు వ్రాసిన 'గంగాలహరి'శ్లోకాలను 

 ఈనాటికీ గంగకు సాయింత్రం నీరాజనం యిస్తూ పాడే హారతి పాట అదే.


ఆయన పై మెట్టుమీద నిల్చుకొని ఆ పాట 

పాడుతూ వుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కోమెట్టు చొప్పున గంగ పైకి వచ్చేదట. 

చివరికి మథురలో ఆయన యిలా చెప్పుకున్నాడు.


"శాస్త్రాలు చదివాను,నిత్య విధులన్నీ యథా తథంగా నిర్వర్తించాను.డిల్లీ వల్లభుని పాణి పల్లవాలతో యవ్వనమంతా గడిపినాను,హరిని సేవిస్తూ ఈ మథురా నగరిలో చివరి దశ వెళ్ళదీసు కుంటున్నాను.


నాకేమి కావలెను నేను అన్నింటినీ లోకాధికంగానే సాధించాను"

అనుకోని ఆత్మతృప్తి పొందిన వాడు.పుట్టినందుకు అన్ని విద్యలను నేర్చి,అన్ని వున్నతులను,సాధించి,

అమృతం చిందే కవిత్వం చెప్పాడు.గొప్పగానంవినిపించాడు,శ్రుతి ప్రమాణార్థం విడమరిచి కవులకు,అలంకారికులకు 

సాహిత్యవేత్తలకు చెప్పాడు.యిక చేయ వలిసినదేమీ లేదని అరిపండిత భయంకరుడుగాబ్రతికినన్నాళ్ళూ 

బ్రతికి చివరికి మహా యోగిగా మథుర లో ఆయన 74 వ ఏట కన్నుమూశారు. 

ఆయన మహా జ్ఞాని ఆయనకు 35,40 ఏళ్ళ మధ్యలోనే భార్యా వియోగము సంభవించింది.


మలయానిల కాలకూటమో రమణీ కుంతల భోగి భోగ్యయో:

శ్వపచాత్మ భువో నిరంతరా మమ భూయాత్పర మాటమర స్థితి:


అర్థము:మలయా నిలయమునందు,కాలకూట విషము నందు,ఆడవారి వెంట్రుకల యందు,భోగియోక్క భోగములయందు,చండాలురయందు,మన్మథ భావముల యందు,నిరంతరము నాకొక్కటే పరమాత్మ 

బుద్ధి అమరుగాక!అందరిలో పరమాత్ముని దర్శించాలని కోరుకుంటున్నానుఈ శ్లోకమే .ఆయన గొప్ప జ్ఞాని అనడానికి నిదర్శనము.


అంత కీర్తి సంపాదించిన వారంటే మిగతా పండితులకందరికీ అసూయ సహజంగా వుంటుంది. ఆయన మీద బురద చల్లే ప్రయత్నమూ చేశారు. షాజహానుబిడ్డ అయిన లవంగి తో ఆయనకు సంబంధం అంటగట్టారు. (దాదాపు 20 సంవత్సరాలు చిన్నది లవంగి ఆయనకంటే)ఆయనకు చిన్నతనము లోనే కామేశ్వరి అను కన్యతో వివాహమైంది.


వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళని ఆయన వ్రాసుకున్న శ్లోకాలద్వారా తెలుస్తున్నది. తనభార్యను గూర్చి చాలా గొప్పగా వ్రాసుకున్నారు ఆయన.

వాటిని తర్వాతి భాగములో వివరిస్తాను.


ఆయన మహాజ్ఞాని.ఆయన వ్రాసిన కావ్యాలు కూడా అటువంటివే.ఆయన వ్రాసిన మొదటి కావ్యాలు ఐదు. అమృతలహరి, యిది యమునా స్తుతి, రెండవది కరుణాలహరి, యిది విష్ణు స్తుతి, మూడవది లక్ష్మీలహరి.లక్ష్మీ స్తుతి. ఇది బీజాక్షర సహితంగా కూర్చబడింది.

భారతీయులీనాటికీ దీనినెంతో పవిత్రంగా భావిస్తారు.లక్ష్మీ మంత్రం జపించిన,పారాయణం చేసినవారికి ఫలితం వుంటుందని పండితులు సైతం అంటూ వుంటారు. నాలుగవది సుధాలహరి, ఇది సూర్యస్థుతి. అయిదవది గంగాలహరి. గంగ ఒడ్డున పై మెట్టు మీద నిలబడి యేబదియేడు శ్లోకాలతో గంగను స్థుతించ్చాడనీ ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిందనీ చెప్తారు.


జగన్నాధ పండితరాయలను షాజహాన్ పిలిపించాడో మరి ఈయనే వెళ్ళాడో తెలియదు.

షాజహాన్ కొలువులో చేరి అధికారిగా, షాహజాహాన్ చక్రవర్తికి ఆంతరంగిక సలహాదారుగా 

యిష్ట సఖుడుగా వుండేవాడు. రాజ్య విషయాలలో కానీ మతవిషయాలలో కానీ చక్రవర్తి 

ఆయన సలహాలనే తీసుకునే వారని ప్రతీతి. చక్రవర్తిని నొప్పించకుండా ఆయనకు విజ్ఞానాన్ని అందిస్తూ వుండేవాడు. చక్రవర్తిని కల్పవృక్షముతో పోలుస్తూ 


 ఔదార్యం భువనత్రయేపి విదితం సంభూతిరంభోనిధే 

వాసోనందన కాననే పరిమళో గీర్వాణ చేతో హరః 

ఏవం దాతృ గురోద్గుణా: సురతరో: సర్వేపిలోకోత్తరా:

స్యాదర్థి ప్రకారార్తి తర్పణ విధావేకో యది 


దేవలోకములోని నందనవనంలో కల్పవృక్షము అడిగినవారి కోరికలన్నీ తీరుస్తుంది. దాని పరిమళము దేవతలమనస్సును హరిస్తుంది. దానిదాతృ గుణము లోకోత్తరమైనది. 

కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర 

వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు

అనుకోవచ్చు.


చక్రవర్తిని ఆశ్రయించి కొందరు దుర్మార్గులున్నారు, వారికి భయపడి మంచివారు ఆయన దరి చేరడానికి భయపడుతున్నారు. ఆ విషయము చక్రవర్తికి ముక్కుకు సూటిగా చెప్పాడు.


   యైస్త్వం గుణగణ వాన పి

   సతాం ద్విజి హ్వాయి ర సేవ్యతాం నీతః 

   తానపి వాహసి పటీరజ 

  కిం కథ యామస్త్వదీయ మౌన్నత్యం 


అది ఒక చందనపు చెట్టట ఓసీ! చందనమా! నీ గొప్పతనం యేమని చెప్పను? నీకు అపకీర్తి తెచ్చే నాగు పాములను కూడా భరిస్తూనే వున్నావు. అని చెప్పాడు.  


కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర 

వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు

అనుకోవచ్చు.


పండితరాయలు అంతటి సమర్థుడు,చతురత గలవాడు కాబట్టే షాజహాను అయన యోగ్యతకు తల వంచాడు.ఆయన విలువ గ్రహించి తన అరచేతులతో పెట్టుకొని కాపాడుకున్నాడు.భారతదేశ చరిత్రలో విశేషమైన గౌరవాలను పొందిన కవిపండితులు ముగ్గురే కనబడతారు ప్రాచీనులలో.వారిలో మొదటివాడు కాళిదాసు, భోజుడతణ్ణి ప్రాణాధికంగా కాపాడుకున్నాడంటారు.


 రెండవవాడు అల్లసాని పెద్దన్న,'ఎదురేగినంతనే తన మదకరీంద్రము" దిగివచ్చి ఆయనను ఆహ్వానించేవాడట,రాయలవారు.మూడవ వాడు జగన్నాధ పండితరాయలు.ఒక విధంగా చూస్తే వారందరికన్నా ఈయనే మిన్న.


భోజుడు,రాయలు హిందూ రాజులు.ఇక్కడ షాజహాన్ ముస్లిం .అన్యమత ప్రభువు.

ఆ చక్రవర్తి ఆయనను అంత ఆదరించబట్టి ఒకసారి యిలా అంటాడు.


ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా 

మనోరథాన్ పరిపూరయితం సమర్థ:

అన్యై: నృపాలై: పరదీయమానం 

శాకాయ వాస్యా ల్లవణాయ వాస్యాత్


నాకోరికలు తీర్చాలంటే ఢిల్లేశ్వరుడైనా తీర్చాలి జగదీశ్వరుడైనా తీర్చాలి.వారిద్దరే అందుకు సమర్థులు. ఇతర రాజులు నాకు ఉప్పుకు, కూరకు మాత్రమే యివ్వగలరు.

అంటే అంత తక్కువ ఇస్తారని. 


జగన్నాథ పండితరాయలు మహా కవి,పండితుడు,అలంకారికుడు,బహుగ్రంథ కర్త,మన ఆంధ్రుడు.తన కవిత్వం తో 


గంగామాతను తన వద్దకు రప్పించుకొని ఆమెలో ఐక్యమై తన 

పవిత్రతను నిరూపించుకొని,ఈర్షాళువు లైన పండితమ్మన్యులకు బుద్ధి చెప్పాడు.


ఆయన వద్దకు ఎంతోమంది కవి పండితులు వచ్చి,తమ కవిత్వాన్ని వినిపిస్తూ వుంటారు.

కొందరి కవిత్వం లో కావ్యత్వం వుండదు.పదాల పొందిక మాత్రం వుంటుంది,గణముల 

కూర్పు మాత్రం వుంటుంది,అలాంటి వారి తో విసిగి పోయి యిలా అంటున్నారు.


శ్లోకం:- నిర్మాణే యది మార్మికోసి,నితరాం అత్యంత పాకద్రవన్ 

మృద్వీ కామధుమాధురీ మదపరీహారో ద్దురాణాం గిరాం 

కావ్యం తర్హి సఖేసుఖేన కథయ,త్వాం సమ్ముఖే మాదృశామ్ 

నోచేత్ దుష్కృత మాత్మనా కృతమివ స్వామ్ తాత్ బహిర్మా కృథా!


ఓ మిత్రమా!నీవు కావ్య నిర్మాణం లో సిద్ధహ స్తుడవైతే అత్యంత రసవంతమైన స్వారస్యం 

జాలువారే విధంగా ద్రాక్ష,తేనెల యొక్క మాధుర్యాన్ని,మదాన్ని హరింపజేసే మాటలతో 

హాయిగా కష్టం లేకుండా ఏదైనా కావ్యం వ్రాసి మా వంటి వారికి వినిపించవయ్యా!లేదా 

నా చేత పాపం చేయబడింది,చేయరాని పని చేయబడింది అనుకుంటూ నీ మనస్సు లోనుంచి ఆ పదాలను బయటకి రానీయకు.అని హెచ్చరిస్తున్నాడు.


కవిత్వం అంటే రసం జాలువారాలి,మనసు కరగాలి.రమణీయార్థ ప్రతిపాదన మవ్వాలి.

చమత్కారం వుండాలి .అలాంటి ఒక శబ్దం వున్న అది కవిత్వమనిపించుకుంటుంది.

అది లేని కవిత్వాలు గుట్టలు గుట్టలు గా వ్రాసినా ఎందుకూ ఉపయోగ పడవు.

అని జగన్నాథుని భావన. ఇది మనకందరకూ ప్రామాణికం,.

చెప్ప తరమ్ము గాని పలు సేవలతో

 ఉ.చెప్ప తరమ్ము గాని పలు సేవలతో తమ ప్రాణశక్తి కే

ముప్పు ఘటించినన్ గనెడు ముందుకు సాగెడు వైద్య రత్నమా!

ఒప్పుదు నీవె దైవమని ఉత్తమ ప్రజ్ఞకు మారురూపమై

ఎప్పుడు జీవ రక్షకయి యీ భువిలోన ప్రశస్తి గాంచుమా!౹౹ 79


ఉ.చెప్పిన తక్షణమ్మె తమ చెంతకు చేరి పరీక్ష సేసి యే 

ముప్పు ఘటిల్లనీయక విమోచనకై విచికిత్స చేసి తా

మప్పటి కప్పుడే జనుల నాదుకొనన్ సమకట్టి యుక్తితో

నొప్పెడు వైద్య సోదరుల ఓర్మికి వందన మాచరించెదన్౹౹ 80

Panchaag


 

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హెమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - పునర్వసు -‌‌ భౌమ వాసరే* (17.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీ మన్నరసాల నాగరాజ ఆలయం

 🕉 మన గుడి : నెం 962


⚜ కేరళ : హరిపాడు : అలెప్పి


⚜ శ్రీ మన్నరసాల నాగరాజ ఆలయం


 

💠 కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం నాగరాజుకు అంకితం చేయబడింది.  

ఈ ఆలయ సముదాయంలో సుమారు 30,000 రాతి పాము బొమ్మలు మరియు చిత్రాలను చూడవచ్చు.  ఇది చాలా పురాతనమైన దేవాలయం మరియు దాదాపు 3000 సంవత్సరాల నాటిది.


💠 మన్నరసాల శ్రీ నాగరాజ ఆలయంలో మొదటి పూజారి ఐదు తలల పాముకు జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.  నాగరాజు, ప్రధాన దేవతగా, హరి మరియు శివుని ఆత్మతో కూడి ఉంటాడని నమ్ముతారు.


💠 పురాణాల ప్రకారం, పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పరశురాముడు తపస్సు చేసాడు.

నాగుపాము మట్టిలోకి విషం వేసి భూమిని సారవంతం చేస్తుంది.  పరశురాముడు మన్నరసాలలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.


💠 సంతానోత్పత్తిని కోరుకునే జంటలు ఇక్కడకు పూజలు చేయడానికి వస్తారు, మరియు వారి బిడ్డ పుట్టినప్పుడు కృతజ్ఞతా పూర్వక వేడుకలను నిర్వహించడానికి వస్తారు, తరచుగా కొత్త పాము చిత్రాలను నైవేద్యంగా తీసుకువస్తారు. 

ఆలయంలో లభించే ప్రత్యేక పసుపు రోగ నివారణ శక్తులను కలిగి ఉంటుంది.


🔆 చరిత్ర


💠 సర్ప దేవతలకు అత్యున్నతమైన ఆరాధనా స్థలంగా మన్నరసాల ఆలయ పరిణామం జమదగ్ని కుమారుడు మరియు భృగు వంశస్థుడైన పరశురాముడితో ముడిపడి ఉంది. 


💠 పరశురాముడు క్షత్రియులను చంపిన పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను  ఋషులను సంప్రదించాడు. 

బ్రాహ్మణులకు తన స్వంత భూమిని కానుకగా ఇవ్వాలని వారు సూచించారు. 

పరశురాముడు వరుణదేవుని తనకు కొంత భూమిని ఇవ్వాలని కోరాడు. వరుణుడు ప్రత్యక్షమై భూమిని తిరిగి పొందేందుకు శివుడు తనకు ఇచ్చిన గొడ్డలిని సముద్రంలోకి విసిరేయమని సలహా ఇచ్చాడు. 

అతను దానిని విసిరి సముద్రం నుండి భూమిని పైకి లేపి బ్రాహ్మణులకు బహుమతిగా ఇస్తాడు. ఈ భూమి ప్రస్తుత కేరళ అని నమ్ముతారు.


💠 లవణీయత కారణంగా మొదట్లో కేరళ నివాసయోగ్యం కాదు. అక్కడ కూరగాయలు కూడా పండలేదు. ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.

దీంతో పరశురాముడు బాధపడ్డాడు. 

అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసాడు,


💠 అతను సర్పాల యొక్క జ్వాల విషం ప్రతిచోటా వ్యాపిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని మరియు దానికి ఏకైక మార్గం నాగరాజు ఆరాధన మాత్రమే అని సలహా ఇచ్చాడు. 


💠 పరశురాముడు యోగి.

కేరళను చెట్లు మరియు మొక్కలతో సతత హరిత అందాలతో, అన్ని విధాలుగా సుసంపన్నంగా కనిపించే వరకు తాను విశ్రాంతి తీసుకోనని నిర్ణయించుకున్నాడు. 

అతను కేరళలోని దక్షిణ భాగంలో సముద్ర తీరానికి సమీపంలో తగిన స్థలాన్ని కనుగొన్నాడు. 

తన ప్రతిష్టాత్మకమైన స్వప్నం సాకారం చేసుకోవడానికి సరైన స్థలం దొరికినందుకు తృప్తి చెంది, తపస్సు కోసం తీర్థస్థలాన్ని నిర్మించాడు.

తపస్సుకు సంతోషించిన నాగరాజు తన కోరికను తీర్చడానికి సిద్ధపడి పరశురాముని ముందు ప్రత్యక్షమయ్యాడు. 


💠 పరశురాముడు నాగరాజు పాద పద్మములకు సాష్టాంగ నమస్కారము చేసి తన లక్ష్యమును సాకారం చేయమని ప్రార్థించాడు. నాగరాజు చాలా సంతోషంతో అతని అభ్యర్థనను మన్నించాడు. 

మంటలు చెలరేగుతున్న కాలకూట విషాన్ని వ్యాపింపజేయడానికి క్రూరమైన సర్పాలు ఒక్కసారిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 


💠 విషం చిమ్మిన కారణంగా, కేరళ భూమి పచ్చదనంతో నివాసయోగ్యంగా మారడానికి అనుకూలంగా  చేయబడింది. 

పరశురాముడు తన శాశ్వతమైన ఉనికితో భూమిని శాశ్వతంగా అనుగ్రహించమని భగవంతుడిని అభ్యర్థించాడు మరియు దయగల నాగరాజు కూడా దానిని అంగీకరించాడు.


💠 పరశురాముడు, వేద ఆచారాల ప్రకారం, మందర వృక్షాలతో చుట్టుముట్టబడిన 'తీర్థస్థలం' లో బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అయిన నాగరాజును ప్రతిష్టించాడు.

ఆ ప్రదేశాన్ని అప్పుడు మందరసాల అని పిలుస్తారు. 

ఇక్కడ స్థాపించబడిన దేవత అనంత (విష్ణుస్వరూప) మరియు వాసుకి  శివుడు) సూచిస్తుంది. 

సర్పయాక్షి, నాగయక్షి మరియు నాగచాముండి, నాగదేవతలతో పాటు వారి సహచరుల ప్రతిష్ఠాపనలు సరైన ఆచారాలతో సరైన ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి. 

వేదపఠనం, సామ, అభిషేకం, అలంకారం, నైవేద్య సమర్పణం, నీరాజనం, సర్పబలి తదితర వ్రతాలను చేస్తూ పరశురాముడు సర్పంచులకు ప్రీతిపాత్రంగా నిర్వహించి, సర్వసర్పాలకు ఆనందాన్ని కలిగించాడు.


💠 పరశురాముడు ఇతర ప్రాంతాల నుండి విద్యావంతులను తీసుకువచ్చాడు; 

వివిధ ప్రదేశాలలో దుర్గ మరియు ఇతర దేవతలను స్థాపించారు; 

పూజలు నిర్వహించడానికి తాంత్రిక నిపుణులైన బ్రాహ్మణులను నియమించారు; 

వైద్యుల్లో అగ్రగామిగా ఉన్న క్షత్రియులు, రైతులు మరియు అష్టవైద్యులను నియమించాడు. 


💠 ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటానికి అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలను ఇచ్చిన తరువాత, పరశురాముడు మహేంద్ర పర్వతాలపై తపస్సు చేయడానికి బయలుదేరాడు.


💠 ఈ ఆలయం కేరళలోని అలప్పుజా జిల్లాలో హరిపాడ్ వద్ద NH66 వెంట బస్ స్టేషన్‌కు ఈశాన్య దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది . 


రచన

©️ Santosh Kumar

16, డిసెంబర్ 2024, సోమవారం

*_రేపటి తిరుప్పావై ప్రవచనం‎ - 2 వ రోజు_*

 🌹🌷🪷🪔🏹🪔🪷🌷🌹

*మంగళవారం 17 డిసెంబర్, 2024*


*_రేపటి తిరుప్పావై ప్రవచనం‎ - 2 వ రోజు_*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*వ్రతనియమాలు*

*పాశురము*


*వైయత్తు వాళ్ వీర్ గళ్ ! నాముమ్ నమ్బావైక్కు*

    *శేయ్యుం కిరిశైగళ్ కేళీరో , పాఱ్కడలుళ్*

    *పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి*

    *నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి*

    *మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్*

    *శెయ్యాదన శెయ్యోమ్* *తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్*

    *ఐయముమ్* *పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి*

    *ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.*


మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు , శాస్త్రాలలో అవి కర్మయోగమని , జ్ఞానయోగమని , భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ , కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో. 


భగవంతుణ్ణి భగవన్మయుడని , పరమాత్మ అని , గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. *"అణు:"* అతి చిన్నరూపం నుండి *"బృహత్:"* అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. *"శబ్ద సహ"* అతి సామాన్యుడు పిలిస్తే అందుతాడు , *"శబ్దాతిగ"* చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు , అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా ! మరి ఇక్కడ తగినవి - తగనివి అంటూ ఉంటాయా !! 


ప్రకృతి స్వభావాన్ని బట్టి , ఆయా గుణాలను బట్టి సత్వం , రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని , రజస్సు కోపాన్ని , తమస్సు అజ్ఞానాన్ని , బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా , కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు , బొటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు , రజస్సు , సత్వ గుణాలను మిగతామూడు వేళ్లతో పోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది , రజస్సు - తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి , కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక , మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా - అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.


*"వైయత్తు వాళ్ వీర్గాళ్!"* ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది , ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో , నివ్వు ఆజ్ఞ యివ్వు తల్లి నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు , దానికి సీత ఇది వారి తప్పు కాదయా , వారు రావణుని అండలో ఉన్నారు , ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా , చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో , కాని శ్రీరామ చంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా , నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక , తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.


*"నాముం నం పావైక్కు"* ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు , లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. *"శెయ్యుం కిరిశైగళ్ కేళీరో"* మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి , *" పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"* పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి *"పరమన్"* అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా ! ఆయన పాదాలలో శంఖ , రథాంగ , కల్పక , ద్వజా , అరవింద , వజ్రా , అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆ పాదాన్ని పడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో , భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక - యోగనిద్ర. మనకోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి. 


*వ్యుహం-పాల్కడలి*


నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం , ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఏర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.


ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు , అతి విలక్షణమైన జ్ఞానం కలవారు , కర్మభారాలు మోసేవారు , తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా ! కర్మ తొలగాలంటే దేహం కావాలి , దేహం ఉండే నేల కావాలి , దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి , వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.


అక్కడ ఆయన వాసుదేవ , అనిరుద్ధ , ప్రత్ర్యుమ్న , సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి , స్థితి , లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు , ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.


ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు , ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు , దానికి అనిరుద్ధ అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు , మరొక రూపం తీస్తాడు , దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు , ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.  


ఆయన పాదాలను పడుదాం. కడుపు నిండి పోతుంది- ఇక *"నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్"* నెయ్యి వద్దు పాలు వద్దు. *"నాట్కాలే నీరాడి"* తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. *"మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్"* కాటుక , పూలు ధరించం , ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. *"శెయ్యాదన శెయ్యోమ్"* మా పూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం *" తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్"* పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. *"ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి"* చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. *"ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్"* ఇవన్ని ఆనందంతో చేస్తాం.


*భాగస్వామ్యం చేయబడినది*

🙏 *న్యాయపతి నరసింహారావు*🙏

మంగళవారం*🍁 🌹 *17, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🍁 *మంగళవారం*🍁

🌹 *17, డిసెంబర్, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : విదియ* ఉ 10.56 వరకు ఉపరి *తదియ*

*వారం:మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం  : పునర్వసు* రా 12.44 వరకు ఉపరి *పుష్యమి*


*యోగం  : బ్రహ్మ* రా 09.11 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : గరజి* ఉ 10.56 *వణజి* రా 10.25 *ఉపరి భద్ర*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 12.00  సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 10.23 - 11.57*

అభిజిత్ కాలం  :  *ప 11.41 - 12.26*


*వర్జ్యం         : మ 12.59 - 02.33*

*దుర్ముహూర్తం  : ఉ 08.43 - 09.28 రా 10.47 - 11.38*

*రాహు కాలం  : మ 02.51 - 04.15*

గుళికకాళం     : *మ 12.04 - 01.27*

యమగండం    : *ఉ 09.17 - 10.40*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.29* 

సూర్యాస్తమయం :*సా 05.38*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.29 - 08.43*

సంగవ కాలం    :    *08.43 - 10.57*

మధ్యాహ్నకాలం    :*10.57 - 01.11*

అపరాహ్న కాలం : *మ 01.11 - 03.24*


*ఆబ్ధికం తిధి   : మార్గశిర బహుళ తదియ*

సాయంకాలం   :  *సా 03.24- 05.38*

ప్రదోష కాలం    :  *సా 05.38 - 08.13*

రాత్రి కాలం         :  *రా 08.13 - 11.38*

నిశీధి కాలం      :*రా 11.38 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.47 - 05.38*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


          🍁 *జై హనుమాన్*🍁

🌹 *శ్రీహనుమత్ - పంచరత్న స్తోత్రం*🙏


*తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం*

*సంజీవనమాశాసే* 

*మంజులమహిమానమంజనాభాగ్యం*

Continues next Saturday.....


           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

          

🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🍁🍁🌹🌷

 🌹🍃🍁🍁🍁🍁🍃🌹

సమస్య పూరణ

 *కొట్టెను భీమసేనుcడు సఖుల్ గన భానుమతీ సతిన్ సభన్*

ఈ సమస్యకు నాపూరణ. 

(శకారుడు అనేవాడు రాజుగారి బావమరిది.క్రూరుడు మూర్ఖుడు. అసంబద్ధాలు మాట్లాడుతూ వుంటాడు. సమస్యను శకారుని వాచాలతగా పూరించితిని.) 


కొట్టిన పిండి నా కెపుడు కొత్తవి సంగతు లెన్నొ విప్పగన్


మట్టిని దవ్వి తీసితిని మాధవు వేణువు నిచ్చి వేసితిన్


కొట్టెను భీమసేనుcడు సఖుల్ గన భానుమతీ సతిన్ సభన్


ముట్టడి మౌని చేసె నొక ముచ్చట  చెప్పుదు నే శకారుడన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

సాహితీ యజ్ఞం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 అవధానం మన తెలుగు సంపద పేరుతో దాదాపు 150 సంవత్సరాలుగా తెలుగు నాట ఘన కీర్తి సాధించిన అవధాన మహోదయులందరిని పరిచయం చేస్తున్నాం. యూట్యూబ్ లో ఇది సరికొత్త ప్రయోగం. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు ఎంతో శ్రమకోర్చి ఈ సాహితీ యజ్ఞం కొనసాగిస్తున్నారు. తొలి అవధాన జంట అయిన తిరుపతి వెంకట కవుల సాహితీ గరిమను ఈ ఎపిసోడ్ లో ఆస్వాదించండి. తిరుపతి వెంకట కవుల పేర్లు అజరామరం. వారు కవి సార్వభౌములు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

తల్లితండ్రులకు మనవి

 *వధూవరుల తల్లితండ్రులకు మనవి.* *వివాహ వయస్సు* *స్త్రీకి 18-25* *పురుషునికి 23-27* *27 దాటి ,30.... ,35.... ,40.... సంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి.* *అయ్యా,అమ్మా !* *మనం మన పిల్లలకు 35, 40 ఏళ్ళు వచ్చినా కూడా* *సాఫ్ట్ వేర్ ఉద్యోగం*, *లక్షల్లో జీతాలు* *కోట్ల ఆస్తి* *లేదని మరియు ఉమ్మడి కుటుంబమని,* *వ్యాపారస్తుడని,* *తల్లిదండ్రులు పాతసామాన్లని, అన్నదమ్ములు* *పనికిమాలినవారని, అక్కా చెల్లెళ్లు ముష్టివాళ్ళని.....* *అనేక కారణాలతో, మన అర్హతనుబట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్ప వాళ్ళం అని అత్యాశకు పోయి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లిచేయ్యకుండా,* *మనం మాత్రం* *మన అమ్మాయిలు/అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని AC రూంలో రకరకాలుగా భోగాలనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం.* *చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధమైనా* *జాతకాలు బాగాలేదని లేదా* *ఏదో వంకతో సంబంధాలు తామే చెడగొడుతున్నారు.* *తల్లిదండ్రులు,* *అన్నదమ్ములు,అక్కా చెల్లెళ్ళు లేకుండా అనాధలకు ఇస్తారా పిల్లలను!* *కోటీశ్వరులు ఎక్కడో....... ఉంటారు* *అది వంశ పరంపరగానో లేక,* *పెద్దగా వ్యాపారం చేసో లేక,* *ఎదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు.* *మిగిలిన వారు పెళ్లికి అనర్హులేనా?* *ఎవరూ ఉండకూడ దంటే ఎలా ?* *చాలామంది అమ్మాయిలు/అబ్బాయిలు ఇలా ఘోఘషిస్తున్నారు.👇* *"మీకు పెళ్ళిచేసి పంపిస్తే....* *మేం ఎలా బ్రతికేది... అని మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారు, అని అమ్మాయిలు/అబ్బాయిలు భోరున ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం!* *పెళ్లి చెయ్యడం మన బాధ్యత.. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కస్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు - అల్లుడు / కొడుకు - కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి...* *గుర్తుంచుకోండి.* *పిల్లల పెళ్లిళ్లకు నవ గ్రహాలు అడ్డుపడడం లేదు*...

తిరుప్పావై

 🌹🌷🪔🏹🪔🌷🌹   

          *ధనుర్మాసం ప్రారంభం* 

*సోమవారం డిసెంబర్ 16 2024*


 *🚩ఈ రోజు నుండి 30 రోజులు తిరుప్పావై పాశురాలు పారాయణం చేసుకుందాం🚩*


*_తిరుప్పావై మొదటిరోజు పాశురం_*


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*🌴1. పాశురము :🌴*


మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


*🌳భావము :🌳* సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


*తిరుప్పావైగీతమాలిక*


*☘అవతారిక:☘*


వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


*1 వ మాలిక*


(రేగుప్తి రాగము -ఆదితాళము)


ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని

నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏


_*🚩తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు🚩*_


🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*🕉️పాశురము🕉️*


*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

*నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

*శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

*కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

*ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

*కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

*నారాయణనే నమక్కే పఱై దరువాన్*

*పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*


*నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం*


*"మార్గళి త్తింగళ్"* మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. *"మది నిఱైంద నన్నాళాల్"* చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. *"నీరాడ ప్పోదువీర్ పోదుమినో"* స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. *"నేరిళైయీర్"* భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 


*"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి"* పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని *"చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్"* సంపన్నులైన గోప పిల్లల్లా , మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.


ఏ భయమూ అవసరం లేదు. *"కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్"* పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 


*"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం"* మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. *"కార్మేని"* నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , *"చ్చెంగణ్ "* వాత్సల్యం కల్గినవాడు. *"కదిర్మదియం పోల్ ముగత్తాన్"* చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


*"నారాయణనే నమక్కే పఱైతరువాన్"* నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా *"పారోర్ పుగళప్పడింద్"* ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


*నారాయణ మంత్రం*


ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 


ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి *"విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".* విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది , ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 


నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 


అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది. 


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏

ధనుర్మాసం

 🏹🌹🍃🌿🛕🌿🍃🌹🏹

*సోమవారం 16 డిసెంబర్ 2024*


_*🚩ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?🚩*_

 

🏹🏹🏹🏹🏹🏹🏹🏹


ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము (నెల) 


కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు  ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . 


ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .


ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల *విష్ణుమూర్తికి*  ప్రీతికరమైనది. *గోదాదేవి  కథ* ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. 


ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.


కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. *ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల  మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.*


ధనుర్మాసం *విష్ణువికి* చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. *సుప్రభాతం* బదులు *తిరుప్పావై గానం* చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని *బాలభోగం* అంటారు. *అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది.* ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.


ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. *విష్ణుమూర్తికి ప్రీతికరమైన* మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.


*ధనుర్మాసం ఫలశ్రుతి:*


ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయినా మనసా వాచ కర్మణా యధాశక్తిగా  పూజించిన యెడల *1000 యేళ్ళు విష్ణుమూర్తిని* పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ  పుణ్య స్థలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో  ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.

🙏🙏🙏🙏🛕🙏🙏🙏🙏


          🌷 *సేకరణ*🌷

        🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

సోమవారం*🕉️ 🌹 *16, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️  *సోమవారం*🕉️

🌹 *16, డిసెంబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                  


          *ఈనాటి పర్వం*    

 🌹 *ధనుర్మాసారంభః* 🌹   

          *ఆరుద్రోత్సవం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : పాడ్యమి* మ 12.27 వరకు ఉపరి *విదియ*  

*వారం :సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* రా 01.13 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం  : శుక్ల* రా 11.23 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కౌలువ* మ 12.27 *తైతుల* రా 11.37 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 06.00 - 07.00  సా 03.30 - 04..30*

అమృత కాలం  : *మ 03.41 - 05.13*

అభిజిత్ కాలం  :  *ప 11.41 - 12.26*


*వర్జ్యం         : ఉ 10.20 - 11.52*

*దుర్ముహూర్తం  : మ 12.26 - 01.10 & 02.39 - 03.24*

*రాహు కాలం   : ఉ 07.52 - 09.16*

గుళికకాళం     : *మ 01.27 - 02.51*

యమగండం    : *ఉ 10.40 - 12.03*

సూర్యరాశి : *ధనుస్సు* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.29* 

సూర్యాస్తమయం :*సా 05.38*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం    :  *ఉ 06.29 - 08.43*

సంగవ కాలం   :      *08.43 - 10.56*

మధ్యాహ్న కాలం   :*10.56 - 01.10*

అపరాహ్న కాలం  : *మ 01.10 - 03.24*

*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ విదియ*

సాయంకాలం  :  *సా 03.24 - 05.38*

ప్రదోష కాలం     :  *సా 05.38 - 08.12*

రాత్రి కాలం         :  *రా 08.12 - 11.38*

నిశీధి కాలం       :*రా 11.38 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.46 - 05.38*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🕉️🌹🍁🌷🍁🌹🍃

🕉️ *బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్|*

*జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్||*

*దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్|*

*రావణ దర్ప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్||*

*సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్|*

*సిద్ధ సురాసుర వందిత లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్||*

*దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే||*

🕉️🪔🕉️🪔🕉️🪔


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

అప్పులె మానవ ప్రగతి

 ఉ.అప్పులె మానవ ప్రగతి కడ్డుగ నిల్చు వృథా వ్యయమ్ముకై 

అప్పులు జేయగా విషమయమ్మగు జీవన మంతిమంబుగా 

నొప్పదు సంఘమందున మహోన్నత రీతిగ నుండ నెంచ నా

తప్పును చేయకున్న సతతమ్ము హితమ్ము సుఖమ్ము గూర్చెడున్ ౹౹ 77


శా.తప్పుం జేసిన కల్గు కర్మ ఫలముం దామెంచ లేనప్పుడా 

తప్పుల్ జేయ క్షమించ వచ్చు జగతిన్ దైన్యమ్ముతో జేయగా

నొప్పున్ మానసమందు బాధ పడి యే యోజన్ మరే రీతినా

తప్పుం జేయనటంచు వేడికొనగా ధ్యానాత్ములై దైవమున్౹౹ 78

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హెమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - ఆర్ద్ర -‌‌ ఇందు వాసరే* (16.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వ్రణాలను హరించు యోగాలు

 శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -


   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.


 వ్రణాలు హరించు యోగాలు -


 * తెల్లజిల్లేడు పాలు రాసిన వ్రణములు పగులునట్లు చేయును . త్వరగా మాన్పును .


 * ఆవనూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాచి ఆ తైలములు రాసిన వ్రణములు నశించును.


 * సీమ అవిసెవిత్తనాలు చూర్ణం చేసి నీళ్లలో ఉడికించి కట్టిన వ్రణాలు హరించును .


 * పెన్నేరు గడ్డను అరగదీసి ఆ గంధమును వ్రణాలకు పూసిన వ్రణాలు హరించును .


 * మాచిపత్రి ఆకులను కషాయం పెట్టి సేవిస్తున్న వ్రణాలు హరించును .


 * సీతాఫలం ఆకులను , హారతికర్పూరం , పుగాకు మెత్తగా నూరి వ్రణాలపైన వేసి కడుచున్న పురుగులు పట్టిన వ్రణాలలోని పురుగులు చచ్చి పడిపోయి వ్రణాలు మానిపోవును.


 * వేపనూనె పైన పూయడం వలన వ్రణములలోని క్రిములు నశించి వ్రణాలు మానును .


 * సరస్వతి ఆకు పచ్చిది నూరి వ్రణాలపైన వేసి కడుచున్న వ్రణాలు నశించును. 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

యథా రాజా తథా ప్రజ)

 శ్లోకం:☝️

*నైవ రాజ్ఞా దరః కార్యో*

 *జాతు కస్యాఞ్చిదాపది ।*

*అథ చేదపి దీర్ణః స్యాన్-*

 *నైవ వర్తేత దీర్ణవత్ ॥*

  మహాభారతం. 5.134.1


భావం: ఎటువంటి విపత్తు వచ్చినా రాజు అనేవాడు భయపడరాదు. ఒకవేళ అతడు భయపడినా, తను భయపడేవాడిలా ప్రవర్తించకూడదు. రాజే ధీరత్వం కోల్పోతే సైన్యము, ప్రజలూ భయపడతారు _(యథా రాజా తథా ప్రజ)_, మరియు రాజ్యం త్వరలో శత్రువుల పాలవుతుంది.

15, డిసెంబర్ 2024, ఆదివారం

అనంతమైన అజ్ఞానం

 🚩🛕🛕🛕🛕🛕🛕🛕🛕🚩


 *అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!*🙏👇

 *ఇది మన అనంతమైన అజ్ఞానం!*🙏

 

1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*

👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*


2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*

👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*


3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*

👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*


4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*

👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*


5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*


6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*


7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 శుభ్రంగా, స్వచ్ఛంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  

తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*


8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*


9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం


10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం


11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*


12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.


13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 

మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*


14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*

 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*


🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*


జై సనాతన ధర్మ✊

భారతీయ సంస్కృతిని రక్షిద్దాం.

భారతీయ ఆచార సంప్రదాయాలను  అనుసరించుదాం.


🚩🚩🇮🇳💐