4, జులై 2024, గురువారం

*శ్రీ మాలతీశ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 368*


⚜ *కర్నాటక  : దేవరగుడ్డ - హావేరి*


⚜ *శ్రీ మాలతీశ ఆలయం*



💠 కన్నడలో దేవరగుడ్డ అంటే "సర్వశక్తిమంతునికి చెందిన పవిత్ర కొండ" అని అర్థం. 


 

💠 దేవరగుడ్డ పైభాగంలో మాలతేశ్వరుని ఆలయం ఉంది (ఈ దేవతను పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో జ్యోతిబా / ఖండోబా అని కూడా పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్‌లో అదే దేవుడిని మల్లన్న అని పిలుస్తారు).  


💠 ఈ ఆలయాన్ని ఆలయ ప్రాంగణంలో నివసిస్తున్న ఒక కుటుంబం అలాగే కర్నాటక ప్రభుత్వ ముజరాయ్ డిపార్ట్‌మెంట్ ప్రైవేట్‌గా నిర్వహిస్తుంది .


💠 ప్రతిరోజూ ఇక్కడ మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు మరియు పూర్ణిమాస్ (కన్నడ పౌర్ణమి రోజు), శని మరియు ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ప్రతి ఫిబ్రవరి/మార్చిలో నిర్దిష్ట పూర్ణిమ/పౌర్ణమి రోజున స్థానికంగా భరత్ హన్నిమ్ అని పిలుస్తారు, సుమారు 80,000 - 1,00,000 మంది భక్తులు సుమారు 10-15 రోజుల పాటు పవిత్ర స్థలాన్ని/రోజును సందర్శిస్తారు.  


💠 కర్ణిక అని పిలువబడే ఒక నిర్దిష్ట కర్మలో ఈ ప్రత్యేకమైన భరత్ హన్నిమే ప్రస్తుత సంవత్సరానికి సూచనగా ఆలయంలో అంచనా వేయబడింది.  

ఈ ప్రత్యేక రోజున 2 అడుగుల సైజులో కొత్త జత తోలు చెప్పులు ఆలయంలో ఉంచబడతాయి, అవి మరుసటి రోజు ఉదయం మాలతీశ భగవానుడి పాద ముద్రలను కలిగి ఉంటాయి.


💠 ఆలయ ప్రాంగణంలో విచిత్రమైన దుస్తులతో అనేకమంది పురుషులు కూడా చూడవచ్చు.  వీరిని గొరవప్ప అంటారు.  

ఈ గొరవప్పలు సాధారణంగా గొర్రెల ఉన్నితో చేసిన నలుపు రంగు గౌన్లు మరియు వాటిపై మతపరమైన చిహ్నాలను కలిగి ఉంటారు.  

ఈ పురుషులు తలపై తలపాగాలు ధరిస్తారు మరియు వారితో పాటు త్రిశూలాలను మరియు ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకువెళతారు.  

వారు ప్రభువు యొక్క దూతగా పరిగణించబడతారు.  


💠 ఇక్కడ అప్పుడప్పుడు భక్తులు స్వామిని "ఏలుకోటి, ఏలుకోటి, ఏలుకోటిగో... చంగ్మాలో, చంగ్మాలో" అని పిలవడం చూడవచ్చు, అంటే "ఓ, ఏడు కోటలను జయించిన మహానుభావుడా, నేను మీ ఆశ్రయానికి వచ్చాను".


💠 దేవరగూడలో సాధారణ ఉష్ణమండల వాతావరణం శీతాకాలంలో 18 డిగ్రీల సెల్సియస్ నుండి వేసవిలో 36 డిగ్రీల వరకు ఉంటుంది.


💠 పురాణాల ప్రకారం, మాలతీశ స్వామి అక్కడ గొర్రెల కాపరిగా ఉండే అమాయకులను హింసించి చంపే ఇద్దరు రాక్షసులను చంపడానికి దేవుడిగా కనిపించాడు.


💠 దేవరగుడ్డ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

సమీప రైలుమార్గం రాణేబెన్నూరులో ఉంది.  సమీప విమానాశ్రయం హుబ్లీలో 113 కి.మీ.

Panchaag


 

పెళ్ళిళ్ళ........సరదాలు

 🎊🎊🎊🚩పెళ్ళిళ్ళ........సరదాలు......సంబరాలు....🌷😃😃


👉🏿అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి తల్లి

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. అంతే!

వాడి అల్లరి అటకెక్కిపోతుంది. చేతులు కట్టుకుని మరీ

నిలబడతాడు. అదీ పెళ్లి అనే మాటకున్న శక్తి!

😂

👉🏿 పెళ్లి నూరేళ్ల పంట

అంటారు. ‘కాదు... కాదు నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు ఆడవాళ్లు. అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం.

👉🏿పెళ్లి సరసాలకు మూలం. సరదాలూ ఉంటాయి. ‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. నిజమే దంపతులు ఒకరికొకరు మానసికంగా తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు. ‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.

👉🏿‘అప్పగింతలవేళ అమ్మాయికది ఆఖరి ఏడుపు. అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే అయినప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు?

👉🏿

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. అసలు సమస్య అదే!

👉🏿‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. సాక్షాత్తూ బ్రహ్మకే

నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది.

👉🏿'మా ఆయనకు హృదయం లేదు’ అని మరొకావిడ

పతిదేవుణ్ని తూలనాడుతుంటుంది.

అది అన్యాయం! విష్ణుమూర్తికే సొంతానికి హృదయం లేదు.

దానిని లక్ష్మీదేవి ఎప్పుడో ఆక్రమించేసింది.

👉🏿‘మా ఆయన ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది.

ఏం చేస్తాం? శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే!

ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ.

🚩ఇన్ని నిజాలు తెలిసీ భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు.

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే.

👉🏿‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు.

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి.

చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు.

👉🏿హెల్మెట్టూ భార్యా ఒకే రకం. నెత్తిన పెట్టుకుంటే తలకాయకు బోలెడంత భద్రత అని ఒకాయన స్వానుభవంతో ఉపదేశించాడు.

👉🏿పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, ఉత్తమంబు.

👉🏿వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును

శిష్యుడొకరు ‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు.

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా.

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు?

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు.

అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.

దాంతో సోక్రటీసు ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు.

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు.

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.

👉🏿దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు?

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు.

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? ఎన్నెన్ని ఘోరాలు?

ఎన్నెన్ని నేరాలు?

శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే.

👉🏿ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.

అయినప్పటికీ ‘వివాహం ప్రకృతి, వివాదం వికృతి’ అని వెనకటికి ఒకాయన ‘పెళ్లి’కిలించాడు. కానీ ఈ వివాదం సంతోషం సృష్టించాలి. సంతోషం దాంపత్యానికి సగం బలం- కాదు కాదు సంపూర్ణ బలం.

ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే.

👉🏿పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.

👉🏿భార్యాభర్తలన్నాక ఎక్కసక్కెమాడుకోకపోతే ఏం మజా?

‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని,

కడిగినప్పుడు నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్యను అడిగాడు.

ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. దాంతో మొగుడు కంగుతిన్నాడు.

👉🏿ఆ మాటకొస్తే అతివ అంటే ఎక్కువగా మాట్లాడు వ్యక్తి అనేదే పిండితార్థం. పండితార్థం.

👉🏿మూడు ముళ్లయినా, ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే!

దానికి సాటీ లేదు! పోటీ లేదు!


సమర్పణ

🙌 😃😃😀

సమస్య పూరణ.

 *సూదుల తోడc గ్రుచ్చి సతి చూపెc గుమారుని పైనc బ్రేమనున్*

ఈ సమస్యకు నాపూరణ. 


"వాదము లేల? నో మగడ! వద్దన శబ్దము జేయుచుంటివే


 పాదము చేతబట్టి తన వాయిని పెంచెను నిద్ర లేచియున్


మోదమె? చూడు పాపడిని ముద్దులు వ" ద్దనె నోరచూపులన్


సూదుల తోడc గ్రుచ్చి సతి చూపెc గుమారుని పైనc బ్రేమనున్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

రథయాత్ర

 *ఈ నెల 7న పూరీ  రథయాత్ర*

ఆషాఢంలో సర్వం జగన్నాథం! ఆషాఢ శుద్ధ విదియ మొదలు ఏకాదశి వరకు పూరీ క్షేత్రంలో ప్రతిరోజూ పండుగే. కడలి ఉప్పొంగుతుంది. అలలు కొత్త కళను సంతరించుకుంటాయి. పూరీ కేంద్రంగా ఇలాతలాన్ని పాలిస్తున్న జగన్నాటక సూత్రధారి.. గర్భాలయం వదిలి.. వీధుల్లోకి కదిలి వస్తాడు. ఎక్కడా లేని విశేషం పూరీలో ఒకటుంది. ఏ హిందూ ఆలయంలో అయినా.. ఊరేగింపు సేవకు మూలమూర్తిని కదిలించరు. ఊరూరా ఉత్సవ విగ్రహాలే ఊరేగుతాయి. పూరీలో మాత్రం మూలమూర్తి రథం ఎక్కుతాడు. ఊరంతా తిరుగుతాడు. పది రోజులు ఆలయాన్ని విడిచిపెడతాడు. బలభద్ర, సుభద్ర సమేతుడై  రథయాత్రకు వేంచేసే జగన్నాథుడి మూలవిరాట్టు.. భక్తజన హృదయ సామ్రాట్టు.


పూరీ ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువుదీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తుంటారు. కానీ, పూరీలో మాత్రం జగన్నాథుడి రథ చక్రాలు మాత్రమే కాదు.. రథం కూడా ఏటా ప్రత్యేకంగా తయారవుతుంది.  రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది. వైశాఖ బహుళ విదియ రోజు రథ నిర్మాణానికి పూరీ సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు.


అక్షయ తృతీయనాడు రథ నిర్మాణ పని మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు. పదహారు చక్రాలు పూన్చిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, పద్నాలుగు చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు పద్మ ధ్వజం. ఎత్తు 43 అడుగులు. చక్రాలు పన్నెండు. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు.


కన్నుల పండుగ పహాండీ

విదియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు. ఈ వేడుకను ‘పహాండీ’ అని పిలుస్తారు. తర్వాత పూరీ సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనిని ‘చెరా పహారా’ వేడుకగా చెబుతారు. తర్వాత పలు సంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి. చివరిగా భక్తుల జయజయధ్వానాల మధ్య  రథయాత్ర మొదలవుతుంది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ..’ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథ ఆలయం నుంచి మూడుమైళ్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి గానీ రథాలు చేరుకోవు. మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు.


మర్నాడు మేళతాళాలలో గుడిలోకి తీసుకెళ్తారు. గుండీచాదేవి.. జగన్నాథుడి పిన్నిగా చెబుతారు. ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు. తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరీకి తిరుగు ప్రయాణం అవుతాడు. దీనిని బహుదాయాత్ర అంటారు. దశమి నాటి మధ్యాహ్నానికి పూరీ ఆలయానికి రథాలు చేరుకుంటాయి. రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి. తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలకంరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ఉంచడంతో పూరీ  రథ యాత్ర ముగుస్తుంది.

కర్మ, విధి,

 *శ్రీ గురుభ్యోనమః*


   *కర్మ,  విధి,  మానవసంకల్పము*


*ప్రశ్న :  ఇప్పటి  అనుభవాలన్నీ  పూర్వపు  కర్మల  ఫలమే  అయితే,  పూర్వం  చేసిన  తప్పులు  తెలిస్తే  వాటిని  సరిదిద్దు  కోవటం  వీలుపడుతుందా ?*


*జవాబు :*  ఒక  తప్పుని  దిద్దుకున్నా,  సంచిత  కర్మలో  ఇంకా  ఎన్నో  మిగిలి  ఉన్నాయి.  అవన్నీ  ముందు  ముందు  ఎన్నో  జన్మలనిస్తాయి.  కాబట్టి  ఆ పద్ధతి  కాదు  అవలంబించాల్సింది.  కొమ్మలని  తీసివేసేకొద్దీ  చెట్టు  బాగా  ఎదుగుతుంది.  నీవు  కర్మని  సరిదిద్దుకున్న  కొద్దీ  అది  ఎక్కువవుతూంటుంది.  కర్మకి  మూలమేమిటో  కనుక్కో !  దానిని  నిర్మూలించు.


*ప్రశ్న :  ప్రపంచమంతా  కార్యానికి,  ప్రతిస్పందనకి  ఫలితమనే  కదా ..  కర్మ  సిద్ధాంతం  చెప్పేది ?  అయితే,  ఈ రెండూ  దేనికి  సంబంధించినవి ?*

*జవాబు :*  ఆత్మసాక్షాత్కారమయ్యే  వరకు  కర్మ  ఉంటుంది.  అదే  కార్యమూ,  ప్రతిస్పందనాను !  సాక్షాత్కారమయిన  తరువాత  కార్యమూ  ఉండదు,  ప్రపంచమూ  ఉండదు.

             

*"నీ సహజస్థితిలో  ఉండు"*

జానుతెనుఁగు విన్నపముు !

 శు భో ద యం🙏


జానుతెనుఁగు విన్నపముు !


బలుపొడతోలు సీరయును బాపసరుల్  గిరుపారుకన్ను, వెన్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ

సలుగల ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్

వలపు మదిందల్ిర్ప బసవా!బసవా! వృషాధిపా!


పాల్కురికి సోమన- వృషాధిపశతకము;


తొలి శతకకర్తగా పేరందిన శివకవి పాల్కురికి సోమన కవీంద్రుడు రచించిన వృషాధిపశతకంలోనిది పైపద్యరత్నం!

     పై పద్యానికోప్రత్యేకత ఉంది.జానుతెనుగులో(వ్యవహారభాషలో)వ్రాయబడటం.మహాకవులరచనలు గ్రాంధికభాషకు(వ్యాకరణ సంస్కారమందినభాష)పట్టంగట్టగా శివకవులు మాత్రం నాటి వ్యవహారమైన తెనుగు బాసకు జానుతెనుగను పేరిడి దానిలోనే రచనలుగుప్పించి,రసజ్ఙులను మెప్పించి,తమదేశాభిమానమును మాతృభాషాభిమానమును వెల్లడించినారు.

వారే శివకవులు.వారిప్రయోగములకే శివకవి ప్రయోగములనుఖ్యాతి.

ప్రస్తుతము:

అర్ధములు:-

బలుపొడతోలుసీర-అనేక మచ్చలుగల చర్మాంబరము.

పాపసరులు-సర్పభూషణములు;

కిరుపాఱు-జ్వలించు;

వెన్నెలతల-తలపై వెన్నెలకురియు చందమామ;

చేదుకుత్తుక-విషపూరితమైనకంఠము;

బన్నిన-కదలకుండగట్టిన;.

వేల్పుటేఱు-గంగ;

నల్గుపూసలు-పుర్రెలనుపూసలహారముగల;

ఱేని-రాజుయొక్క;

లెంకనని-సేవకుడనని;

తరువాత సుబోధకమే!

పద్యమునందలి పదములు (ఒక్క వృషాధిపా!"-యనునదిదక్క) తక్కినవి దేశ్యములే!


భావము:వ్యాఘ్రాంబరధారియు,సర్పభూషణుడును,అగ్నినేత్రముగాగలవాడును.చంద్రధారియు, నీలగళుడును,కపాలమాలాధారియు, నగు నాపరమేశ్వరుని సేవకుడనని ప్రేమనిండిన మదితో విన్నవింతును.అని భావము.

         

                             స్వస్తి


!🌷🌷🌷💐🌷🌷💐💐💐💐💐🙏🙏🙏🌷💐💐💐

సీతమ్మ తనువు చాలించిన ప్రదేశం🚩

 *🚩సీతమ్మ తనువు చాలించిన ప్రదేశం🚩*


రామాయణం ప్రకారం సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయిపోయిందని చెప్పుతుంటారు. అయితే ఆ దేవి మాతృమూర్తి తో ఐక్యం అయినా ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశం యొక్క విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీత సమాహిత్ స్థల్’ అని ‘సీత మారి’ అని పిలుస్తారు. ఇక్కడ ఒక గుడి ఉంది. దానినే సీతాదేవి యొక్క స్మారకం అంటారు.తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డి ని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు ‘సీతా కేశ వాటిక’ ను పాడు చెయ్యకుండా అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది.ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపం లో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమ ను చూస్తుంటే ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది.గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకుంటాడు. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాశ్ పున్జ్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థుల వారు. ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి ఉన్నది.ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతి పై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడ ఉన్నాడు . ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమన్ దేవాలయం ఉంటుంది.

ఈ ఆధారాల కారణంగా సీతాదేవి తన తల్లి అయినా భూదేవితో ఐక్యం అయినా ప్రదేశం ఇదే అని అంటున్నారు.


జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

శంకరుల భోధనలు*

 *శంకరుల భోధనలు* 

     

 *తవ హితమేగం పద్య వక్ష్యే, చృణు* 

మీ ప్రయోజనార్థం కోసం ఒక శ్లోకం చెబుతాను’’ అంటారు.  శ్రీ శంకరుల బోధన బోధన మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?

 *శుకాగమో యాతి సతతం* 

"మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటే, ఈ బోధన మీకు ఉపయోగపడుతుంది."  

మరి వారి బోధన అంటే ఏమిటి?

 *స్వబ్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి స స్మర దత్వాతీతి ॥* 

“మీరు కలలో చూసేదంతా అబద్ధమని మీకు తెలుసు.  అదే విధముగా మేల్కొనే స్థితి మిథ్య అని తెలుసుకోవాలి'' అనేది ఆయన బోధన. 

ఈ విధంగా శంకర భగవత్పాదులు వేదాంత తత్వశాస్త్రంతో పాటు తన స్తోత్రాలతో మనకు అనుగ్రహించారు.  అందుచేత కేవలం శ్లోకాలను స్మరించుకోవడంతో పాటు భగవంతుని సన్నిధిలో  వాటిని పఠించడంతో ఆగిపోకుండా, భగవత్పాదాలు చెప్పిన తత్త్వాన్ని వాటిలో కూడా ప్రయోగిస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. తద్ద్వారా మనకు పరిపూర్ణ ధ్యాన ఫలితం దక్కుతుంది.మనం నిత్య నిర్మల మనస్కులమవుతాము.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ప్రాతర్వేళల కేలుమోడ్చి

 శా॥

ప్రాతర్వేళల కేలుమోడ్చి మదిలో ప్రార్థింతు శ్రీశర్మదన్ 

భూతిం గూర్చగ భూతజాలముల నే స్ఫూర్తిం గృపం జూపగా 

వ్రాతల్ మార్చగ సౌఖ్యమందునటులన్ పారంగ దారిద్ర్యమున్ 

భూతేశేశ్వరి! పావనీ! వివిధమౌ మోహమ్ములం ద్రుంచవే! 

*~శ్రీశర్మద*

8333844664

పాండిత్యము సులభము కాదు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


       శ్లో𝕝𝕝 *క్షన్తవ్యో మన్దబుద్ధీనాం*

            *అపరాధో మనీషిణః* |

           *న హి సర్వత్ర పాణ్డిత్యం*

           *సులభం పురుషే క్వచిత్* ||


తా𝕝𝕝 బుద్ధిమంతులు మందబుద్ధి కలవారి అపరాధములను క్షమించవలెయును.... ఏ పురుషునికీ కూడా అన్నింటా పాండిత్యము సులభము కాదు....

తెలుగు సంవత్సరాల పేర్లు

 పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు 


తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అని ఇలా 60 ఉంటాయి.

పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు

కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.


‘ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’ అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25వ సంవత్సరం పేరు #‘ఖర’ ( అంటే గాడిద). 26వ సంవత్సరం పేరు నందన ( అంటే కొడుకు).


‘ నీ కొడుక్కేంట్రా ‘ఇరవై తొమ్మిది’. గొప్పింటి సంబంధాలు వస్తాయి’ అంటే మన్మధుడని. 29వ సంవత్సరం పేరు #‘మన్మధ 


‘వాడికోసారి ‘నలభై’ జరిగినా తెలిసి రాలేదు’ అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40వ సంవత్సరం ‘ #పరాభవ’.


‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ‘ముప్పయి’ , ‘ముప్పై మూడు’ కదా! ‘ అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33వ సంవత్సరం ‘వికారి’.


‘నీ నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’ 48వ సంవత్సరం పేరు ‘#ఆనంద’.


‘వాడితో వాదనెందుకురా వాడో ‘యాభై అయిదు ’. అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55వ సంవత్సరం ‘#దుర్మతి’.


‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ ‘నలభై ఒకటి’ లే' అంటే కోతులూ కప్పలూ అని అర్ధం. 41వ సంవత్సరం #‘ప్లవంగ’.


‘వాడసలే ‘ముప్పై ఎనిమిది’ జాగ్రత్తగా మాట్లాడు. అంటే కొంచెం కోపిష్టి అని. 38వ సంవత్సరం పేరు #‘క్రోధి.


🌹సేకరణ 🌹

శంకరుల భోధనలు

 *శంకరుల భోధనలు* 

     

 *తవ హితమేగం పద్య వక్ష్యే, చృణు* 

మీ ప్రయోజనార్థం కోసం ఒక శ్లోకం చెబుతాను’’ అంటారు.  శ్రీ శంకరుల బోధన బోధన మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?

 *శుకాగమో యాతి సతతం* 

"మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటే, ఈ బోధన మీకు ఉపయోగపడుతుంది."  

మరి వారి బోధన అంటే ఏమిటి?

 *స్వబ్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి స స్మర దత్వాతీతి ॥* 

“మీరు కలలో చూసేదంతా అబద్ధమని మీకు తెలుసు.  అదే విధముగా మేల్కొనే స్థితి మిథ్య అని తెలుసుకోవాలి'' అనేది ఆయన బోధన. 

ఈ విధంగా శంకర భగవత్పాదులు వేదాంత తత్వశాస్త్రంతో పాటు తన స్తోత్రాలతో మనకు అనుగ్రహించారు.  అందుచేత కేవలం శ్లోకాలను స్మరించుకోవడంతో పాటు భగవంతుని సన్నిధిలో  వాటిని పఠించడంతో ఆగిపోకుండా, భగవత్పాదాలు చెప్పిన తత్త్వాన్ని వాటిలో కూడా ప్రయోగిస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. తద్ద్వారా మనకు పరిపూర్ణ ధ్యాన ఫలితం దక్కుతుంది.మనం నిత్య నిర్మల మనస్కులమవుతాము.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ప్రాతర్వేళల కేలుమోడ్చి

 శా॥

ప్రాతర్వేళల కేలుమోడ్చి మదిలో ప్రార్థింతు శ్రీశర్మదన్ 

భూతిం గూర్చగ భూతజాలముల నే స్ఫూర్తిం గృపం జూపగా 

వ్రాతల్ మార్చగ సౌఖ్యమందునటులన్ పారంగ దారిద్ర్యమున్ 

భూతేశేశ్వరి! పావనీ! వివిధమౌ మోహమ్ములం ద్రుంచవే! 

*~శ్రీశర్మద*

8333844664

తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్*

 *తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్* (01/07/2024):


 1. సాధారణ నేరం:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹500



 2. రెడ్ లైట్ ఉల్లంఘన:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹500



 3. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹2000



 4. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 5. అతివేగం:

    - మునుపటి జరిమానా: ₹400

    - ప్రస్తుత జరిమానా: ₹1000



 6. ప్రమాదకరమైన డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా₹1000

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 7. మద్యం ప్రభావంతో డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా₹2000

    - ప్రస్తుత జరిమానా: ₹10000



 8. రేసింగ్ మరియు స్పీడింగ్:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 9. హెల్మెట్ ధరించకపోవడం:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు



 10. సీట్‌బెల్ట్ ధరించకపోవడం:

     - మునుపటి జరిమానా:₹100

     - ప్రస్తుత జరిమానా: ₹1000



 11. అత్యవసర వాహనాలను నిరోధించడం:

     - మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు

     - ప్రస్తుత జరిమానా: ₹10,000


 12. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్:

- జరిమానా: ₹1200


 13. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం:

     - ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలు పెంపు.


 14. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్:

     - మునుపటి జరిమానా:₹100

     - ప్రస్తుత జరిమానా: ₹2000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.




 15. బీమా లేకుండా డ్రైవింగ్:

    -మునుపటి జరిమానా:₹1000

     - ప్రస్తుత జరిమానా: ₹2000



  *సమాచారం ప్రామాణికమైనది. దయచేసి అప్రమత్తంగా ఉండండి*!

3, జులై 2024, బుధవారం

*శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 367*


⚜ *కర్నాటక  : హరనహళ్లి - హసన్*





⚜ *శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం*



💠 శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ..

ఇది భారతదేశంలోని కర్నాటకలోని హరన్‌హళ్లిలో మనుగడలో ఉన్న రెండు ప్రధాన చారిత్రక హిందూ దేవాలయాలలో ఒకటి . 

ఇది విష్ణువుకు అంకితం చేయబడిన త్రిగుణాలయం కాగా , మరొకటి - సోమేశ్వర ఆలయం, హరన్హల్లి తూర్పున కొన్ని వందల మీటర్ల దూరంలో శివునికి అంకితం చేయబడింది . 

రెండు దేవాలయాలు వేసారా-శైలి హొయసల నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి మరియు 1230లలో ముగ్గురు సంపన్న సోదరులు - పెద్దన్న హెగ్గాడే, సోవన్న మరియు కేసన్నలచే పూర్తి చేయబడ్డాయి. 


💠 కేశవ దేవాలయం అని కూడా పిలువబడే లక్ష్మీనరసింహ దేవాలయం 13వ శతాబ్దపు హొయసల శిల్పకళకు పూర్తి మరియు మంచి ఉదాహరణ. 


💠 విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని 1235 లో హోయసల రాజు వీర సోమేశ్వరుడు నిర్మించాడు. 

13వ శతాబ్దానికి చెందిన ప్రముఖ హొయసల శిల్పులలో ఒకరైన మల్లితమ్మ, కేశవ ఆలయానికి ప్రధాన శిల్పి. 

ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్ణాటక రాష్ట్ర విభాగం కింద ఒక రక్షిత స్మారక చిహ్నం.



💠 ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మూడు వేర్వేరు రూపాలలో శ్రీమహా విష్ణువుని ప్రత్యేక గర్భగుడిలో ఉంచబడింది. వారు వరుసగా కేశవ, వేణుగోపాల మరియు లక్ష్మీ నరసింహులు. 


🔆 ఆలయ చరిత్ర


💠  హరన్‌హళ్లి చరిత్రలో, ముగ్గురు ప్రముఖ సోదరులు, నిజేశ్వరభట్ట, సంకన్న మరియు గోపన్న, 1234 లో హరన్‌హళ్లి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని నిర్మించారు. 

ఈ ఆలయాన్ని నిర్మించడానికి సోదరులు స్థానికుల నుండి ఉచితంగా భూములు పొందినట్లు రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇంకా, హోయసల పాలకుడైన రాజు నరసింహ II, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సోదరులకు మరిన్ని భూములను మంజూరు చేశాడు.


💠 పై సమాచారంతో పాటు, హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయాన్ని మొదట్లో కేశవ దేవాలయంగా పిలిచారని, ఆ తర్వాత వేణుగోపాల ఆలయంగా పిలవబడిందని కూడా శాసనాలు పేర్కొంటున్నాయి. 

యుద్ధంలో గెలిచిన తర్వాత వీర నరసింహ అనే రాజు ఇక్కడ మందిరాన్ని నిర్మించినప్పుడు దీనికి లక్ష్మీ నరసింహ ఆలయం అని పేరు వచ్చింది. 

ఈ వివరాలు మైసూర్‌లోని ఆర్కియాలజీ మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిస్‌ప్లే బోర్డులో ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్నాయి.


💠 ఆలయ నిర్మాణం : 

లక్ష్మీ నరసింహ దేవాలయం, హరన్‌హళ్లి, హోయసల నిర్మాణ శైలిని వెసర శైలిని కలిగి ఉంది. 

ఆలయం మూడు గర్భాలయాలను ప్రదర్శిస్తుంది, అయితే, వెలుపలి నుండి, ఇది ఒకటి మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. 


💠 కేశవ, వేణుగోపాల మరియు లక్ష్మీ నరసింహ, అందరూ శ్రీమహావిష్ణువు యొక్క రూపాలు, మూడు వేర్వేరు గర్భాలయాలలో ప్రతిష్టించారు. 


💠 కర్నాటకలోని నగ్గెహళ్లి , హోసహోళాలు మరియు జావగల్లులో ఉన్న ఇతర నరసింహ ఆలయాల మాదిరిగానే హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం నిర్మించబడింది  .

ప్రముఖ శిల్పి మల్లితమ్మ హోసహోలాలు, నుగ్గేహళ్లి మరియు సోమనాథపుర దేవాలయాలలో పనిచేయడమే కాకుండా ఈ ఆలయంలో తన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాలను ఉపయోగించారు. 

మిగతా వాటితో పోల్చితే అలంకారంలో సాధారణ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం వాస్తవికతను ప్రదర్శిస్తుంది.


💠 లక్ష్మీ నరసింహ దేవాలయం, హొయసల ఆర్కిటెక్చర్. మూలం దినేష్కన్నంబడి

నరసింహ దేవాలయం ఒక వేదికపై స్థావరం కలిగి ఉంది, ఇది దృశ్యమాన ఆకర్షణను అందిస్తుంది మరియు ఆలయాన్ని ప్రదక్షిణ చేయడానికి భక్తులకు మార్గంగా పనిచేస్తుంది.


💠 హొయసల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ పుణ్యక్షేత్రాల గోడలు మరియు మందిరాలు అలంకారంగా ఉంటాయి. 

హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం సోమేశ్వర ఆలయానికి పశ్చిమాన కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయం పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా యొక్క కర్ణాటక రాష్ట్ర విభాగం పాలనలో ఉంది.


💠 లక్ష్మీ నరసింహ ఆలయం, హరనహళ్లి సమయాలు :  

పర్యాటకులు హరన్‌హళ్లిలోని లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు అలాగే ఆలయ ప్రవేశం కూడా ఉచితం.


💠 ఇది హాసన్ నగరానికి 36 కి.మీ, హళేబీడు నుండి 30 కి.మీ, మైసూర్ నుండి 135 కి.మీ, బెంగుళూరు నుండి 194 కి.మీ. 

హరన్‌హళ్లి నరసింహ ఆలయానికి రైలులో చేరుకోవడానికి అర్సికెరె రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది.

పసుపును ప్రసాదంగా

 🙏పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....?


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు.


🌸 శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. 

వాటికి మైల ఉండదు. అవేమిటంటే...


🌷1. పసుపు, 

🌷2. కుంకుమ,

🌷3. పూలు, 

🌷4. పళ్లు, 

🌷5. తమలపాకు, 

🌷6. వక్క, 

🌷7. పాలు, 

🌷8. పెరుగు, 

🌷9. నేయి, 

🌷10. తేనె, 

🌷11. కూరగాయలు,

🌷 12. తులసి, 

🌷13. గంధం అరగదీసే సానరాయి, 

🌷14. గంధం చెక్క


🌿వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. 


🌸అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.


🌿పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.


🌸దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. 


🌿గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు?


🌸పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. 


🌿అయితే ఇకపై అలా చేయవద్దు.

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:


🌸1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.


🌿2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి.

 పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.


🌸3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.


🌿4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.


🌸5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.


🌿6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.


🌸7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.


🌿8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.


🌸9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.


🌿10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కల్కి

 #కల్కి

తన ముద్దుల చెల్లెలు, గారాలపట్టీ అయిన దేవకీదేవిని, బావగారు వసుదేవుణ్ణీ రథాన తీసుకుని వెళుతుండగా అశరీరవాణి కంసుడితో చెబుతుంది...

‘మూర్ఖుడా, నీ చెల్లెలి అష్టమగర్భాన జన్మించబోయే కుమారుడు నీపాలిట యముడవుతాడు. అతని చేతిలో నీ మరణం తథ్యం!’

అక్కడినుంచి కంసుడికి ప్రాణభయం పట్టుకుంటుంది. చెల్లీబావలను చెరసాలలో పడేస్తాడు. వారికి జన్మించిన బిడ్డలందరినీ ఖండిస్తాడు. 

దేవకీవసుదేవులు తమ ఏడవ సంతానాన్ని రోహిణీగర్భానికి బదిలీ చేయిస్తారు. ఎనిమిదోవాడిని నందుని ఇంట్లో పెంపకానికిచ్చేస్తారు. లెక్కప్రకారం ఎనిమిదో గర్భాన్ని చంపాలని చూస్తే అదికాస్తా ఆడపిల్లయి కనబడుతుంది. జరిగిన మోసం అర్ధమైన కంసుడు కేవలం మధురలోనే కాకుండా యావత్ సామ్రాజ్యంలో ఉన్న పసివాళ్ళనందరినీ మట్టుబెట్టమని పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలైన రాక్షసులందర్నీ పంపిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే.

దాదాపుగా ఇదే మూలాధారం చేసుకుని కలిపురుషుడి పాత్రను సృష్టించారనిపిస్తుంది.

కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వందలకొద్దీ స్త్రీలను గర్భవతుల్ని చెయ్యడం, వారినుంచి సీరమ్ సేకరించి తనలోకి ప్రవేశపెట్టుకోవడం కలిపురుషుడి తపన. అతనికి తెలుసు, కల్కి అవతరించబోతున్నాడని, అతను అత్యంత శక్తిమంతుడని. 

అనుకున్నట్లుగానే ఒకేఒక చుక్క సీరమ్‌తో తన వికృతరూపుని పోగొట్టుకుని, పూర్తి యవ్వనాకారాన్ని సాధించగలగడం చూస్తే అర్ధమవుతుంది రెండోభాగం ఎలావుండబోతుందో.

హిందూపురాణాల్ని ఆధారంగా చేసుకుని కథ రాసుకున్నారు. ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు మన కళ్ళకు కనబడతారు. కృష్ణుడు మాత్రం వినబడతాడు.

ఇంతకుమించి కథావివరాల్లోకి వెళ్లొద్దు.

అంతా బానేవుంది. కానీ ఈ మరియం, కైరా, రాయా, యాస్కిన్, రాక్సీ, రూమి, ల్యూక్, లిల్లీ, బానీ, సిరియస్, రోనీ, యూరీ, లియాన్.... ఏవిఁటీ పేర్లన్నీ?

చక్కగా లలిత, కమల, మాధురి, వైదేహి, నారాయణ, మోహన్, ప్రకాష్ అంటూ మనవాళ్ళ పేర్లే పెట్టొచ్చుగా? 

అంటే వాళ్లందరూ ఈ పానిండియా ప్రజలని మనం అర్ధం చేసుకోవాలా?

ఎక్కడ చూసినా ఇసక, దుమ్ము, ఇనుము. ఒక్క చుక్క నీటికోసం విలవిలలాడే ప్రజలు. కాంప్లెక్స్‌లో పనిచేసే కార్మికులు మాత్రం ఏ విప్రోనో, టీసీఎస్సో ఎంప్లాయిస్‌లా యూనిఫారాలేసుకుని లిఫ్టెక్కి పోతుంటారు.

అందరికీ అతీంద్రియ శక్తులుంటాయి. గాల్లో ఎగురుతుంటారు. వందలమంది యోధుల్ని మట్టికరిపించేస్తుంటారు. కానీ ‘ఇంటద్దె’ కట్టడానికి డబ్బులుండవు. అదియొక ప్రహసనము.

గర్భవతులందరూ మా ఎస్ఎన్‌సియూ ఇంక్యుబేటర్లలో చంటిపిల్లల్లా పడుకునివుంటారు. అక్కడే అన్నీ. విపరీతంగా రక్షణవలయం ఉంటుంది. 

ఇక సంబాలా అనే ద్వీపంలో జువ్వలు, విష్ణుచక్రాలు, భూచక్రాల్లాంటి ఆయుధాలతో వందలమంది మందలుమందలుగా ఉంటారు. ఒక చెట్టుకి దీపాలెట్టి ఏదో క్రైస్తవ భక్తిగీతం ట్యూనులో పాటపాడతారు. అది ఏ భాషాగీతమో తెలియరాలేదు.

వారందరికీ ఆధిపత్యం వహించేది మరియం అనబడే శోభన. ఆవిడని కమాండర్ మానస్ ఒకసారి అడుగుతాడు ‘మీ రెబల్స్ లక్ష్యం ఏమిట’ని

‘నీ అందం!' అంటుంది శోభన. 

కొంపదీసి ఈ శోభన ఆ మానస్‌గాడి ‘అందం’ చూసి ప్రేమించి మోసపోయిందేమో అదే ఫ్లాష్‌బాకేమో అనుకుని తనకు టూకీగా అప్పటికప్పుడు అల్లేసి ‘ఇదీకథ’  అని చెప్పేశాను కూడా.

తను నా డొక్కలో ఒక్క పోటు పొడిచి నవ్వుతూ అంది. 

శోభన అన్నది ’నీ అంతం!’ అనిట. 

ఏమి ఖర్మమొచ్చి పడినదిరా నా తెలుగుకు? 

ఇక సినిమా మొత్తం తెలుగు భాషను మేకలు చింపిన వాల్‌పోస్టరులా తయారుచేసి పడేశారు. ఒక్కరంటే ఒక్కరికీ భాషపట్లసరైన అవగాహన, గౌరవం లేవు. ఎన్నో తెలుగు చిత్రాలను నందమూరి, అక్కినేని, నటశేఖరవంటి దిగ్గజాలతో నిర్మించిన నిర్మాత అశ్వనీదత్తు గారు ఏదీ వినబడకుండా మర్యాదపూర్వకంగా మార్షల్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నట్టున్నారు. ఈ గొడవంతా ఆయనకు అనవసరమనేమో?

మనం నిజంగానే అదేదో గ్రహంలో ఉన్నామన్న భావన కలిగించడంలో దర్శకుడు ఈ డైలాగుల ద్వారా నూటికి రెండువందలపాళ్ళూ విజయం సాధించాడు.

మన కారుణ్య, హేమచంద్ర, రేవంత్, అనురాగ్‌లాంటి అచ్చతెలుగు గాయకులుండగా ఆడెవడో ఎదవ ‘మాదవా...!’ అని ఏడుస్తుంటే ఐనాక్సులో సీట్లు కోసెయ్యాలనిపించింది. డిస్గస్టింగ్!

బ్రహ్మానందం ఇక కామెడీకి పనికిరారని నాలుగేళ్లక్రితమే ఒక పోస్టులో వాపోయాను. ఆయననలా ఇబ్బంది పెట్టి, తద్వారా మనందరినీ విసిగించి, ఆఖర్న పాప్‌కార్న్ సైతం డోక్కునేలా చెయ్యగలగడం అవసరమా అధ్యక్షా?

సినిమాలో ఏదైనా బాగుందీ, ఉత్సుకత రేపిందీ అంటే అది కమలహాసన్ సన్నివేశాలు మాత్రమే. భయపెట్టాడు నిజంగానే!

అమితాబ్. ఆ వయసులో ఆయన చింపేశాడు, చంపేశాడూ అంటూ రివ్యూలు రాస్తుంటే ఏమిటో అనుకున్నాను. నూటికి తొంభైతొమ్మిది శాతం ఫైటింగ్ సన్నివేశాలే ఆయనవి. అవన్నీ గ్రాఫిక్సే కదా? ముఖంలో హావభావాలు చూపే సన్నివేశాల్లో ముఖం చుట్టూ గోనెపట్టా కప్పుకుని ఉంటాడు. ఇక ఏముంది చింపడానికి?

దీపికా పడుకొనే ఎప్పుడూ పడుకునే ఉంటుంది. కాసేపటి తరవాత బయటపడి కథను ముందుకు నడిపిస్తుంది. తనకు శోభిత డబ్బింగుట! 

కృష్ణుడికి అర్జున్‌దాస్ డబ్బింగ్ చెప్పాడు. అతగాడి వాయిస్ మహాద్భుతంగా ఉంటుంది. కానీ సాంబార్ వాసనేస్తూ తమిళయాసలో వినబడింది. అదేపని హేమచంద్ర చేసివుంటే చాలా చాలా బావుండేది.

విజయ్ దేవరకొండ కాసేపే కనబడి రిలీఫిచ్చాడు. చూట్టానికి అర్జునుడిలా చాలా బావున్నాడు.  రెండో భాగంలో ఏరకంగా మాటాడబోతున్నాడో ఊహించుకుని ఇప్పట్నించీ దడుపు జొరాలవీ తెచ్చుకోవడం అనవసరం.

పశుపతి, అన్నాబెన్‌ల సన్నివేశాలన్నీ మాడ్‌మాక్స్ సిరీస్‌లో కనబడేవే! మనం కూడా తియ్యగలమని నిరూపించుకోవాలని తాపత్రయపడినట్లున్నాయి అవన్నీ!

దిశా పఠానీయో, పల్లీ బఠానీయో, ఓ సాంగేసుకుని వెళిపోయింది. అంతే! ఏదో ఆ కాసేపూ పువ్వులూ, నీళ్ళూ కనబడ్డాయని ఆనందంతో కేరింతలు కొట్టింది తను.

సంబాలా వారి రహస్య స్థావరం, వారి వివరాలను చెప్పమంటూ వేధించడం, వారికోసమై ఒకరు పుడతారని ఎదురుచూడటం.... ఇదంతా నార్నియా సినిమాను గుర్తుకుతెస్తుంది. 

మొత్తానికి కల్కి చిత్రం మాకు తిక్కరేగేలా చేసింది. భారీతనం అడుగడుగునా కనబడినా అదంతా మనకు అర్ధంకాని రీతిలో ఉంటుంది. మధ్యమధ్యలో ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తూ ఉంటారు. అన్నీ యంత్రాలు. ఒక ముసలమ్మ తమలపాకులు తింటూవుంటుంది. చిలకజోస్యం చెప్పేవాడుంటాడు. 

ఎఆర్, విఆర్, ఎఐ.... అంటూ అన్నిరకాల టెక్నాలజీలనీ వాడేశారు. కానీ కంటతడి తెప్పించలేకపోయారు.

నానాజాతిసమితిలా లబ్ధప్రతిష్టులందరినీ పెట్టుకున్నారు. కానీ మనసారా నవ్వించలేకపోయారు.

ఇక రెండోభాగమంటూ ‘రేపటికోసం’ ఎదురుచూట్టం అనవసరం.  

ఇది కేవలం నా అభిప్రాయం. చీల్చి చెండాడి, తగువులకి రాకండి. నాకంత టైము లేదు. కొట్టడానికి బస్సులేసుకుని కాంప్లెక్సుకి వచ్చెయ్యకండి. అనవసరంగా యూనిట్లు దండగ! 

.......కొచ్చెర్లకోట జగదీశ్

నీలకంఠ దర్శనం

 "నీలకంఠ దర్శనం " 


చప్పుడు కాకుండా గేట్ తీసి, వరండా లో పేపర్ చదువుకుంటున్న సీతారామయ్య ఎదురుగా నించుని, చాలా మెల్లిగా " నాన్నా" అన్నాడు గౌతమ్. ఉలిక్కిపడి తలెత్తి చూసారు ఆయన. ఎదురుగా పెద్ద కొడుకు నవ్వుతూ నించున్నాడు. ఆయన మొహం విప్పారింది సంతోషంతో. 

"యశో, ఎవరొచ్చారో చూడు" అంటూ కేకవేసారు 

బయటకువచ్చినయశోదనుభుజాలచుట్టచేతులువేసి"అమ్మా,ఎలావున్నావు?"అడిగాడు. 

యశోద కొడుకు రెండు చెంపల మీద చేతులు ఉంచి, గౌతమ్ తలను వంచి నుదిటి మీదా, తల మీదా ముద్దుపెట్టింది. 

సీతారామయ్య , " ఇద్దరు బిడ్డల తండ్రి నీ పెద్ద కొడుకు" అన్నారు నవ్వుతూ. 

అయితే ఏం, నా కొడుకు నా కెప్పుడూ చిన్నవాడే" అంటూ "మీరుకూడా రండి, ముగ్గురం కాఫీ తాగుదాం " అంది వంటింట్లోకి వెళుతూ. 

"కోడలు,పిల్లలేరి రా" అడిగింది యశోద.

" అబ్బా, అమ్మా, వచ్చిన నన్ను పట్టించుకోకుండావాళ్ళ గురించి భాదపడతావేం? ,వస్తారులే రెండ్రోజులు ఆగి" నవ్వుతూ అన్నాడు గౌతమ్.

కాఫీ తాగాక, "పద నాన్న ఇల్లు చూద్దాము" అంటూ లేచాడు గౌతమ్. .

సీతారామయ్య కో ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులు ఆయనకు. పెద్దవాడు గౌతమ్, రెండోవాడు శరత్. ఇద్దరూ టీచర్లుగా స్థిరపడ్డారు. సీతారామయ్యకు పెన్షన్ తక్కువ, మిగతా పెర్క్స్ ఎక్కువ, తండ్రి ద్వారా తనకు సంక్రమించిన నాలుగెకరాల భూమిని , పెద్ద పెంకుటింటినీ జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చాడాయన. ఆయన తక్కువ రెంట్ కి ఇంటిని అద్దెకిచ్చి, ఇల్లు పాడవకుండా చూసుకున్నాడు. ఆరువందల గజాల్లో ఉన్న ఇల్లు అది. రిటైర్ అవగానే పల్లెటూరులో ఉన్న తన ఇంటికి మారిపోయాడు. కొడుకులిద్దరూ తమ దగ్గిర ఉండమన్నారు,ఆయన సున్నితంగానే వాళ్ళ కోరికను తిరస్కరించి, సొంత గూటికి చేరుకున్నారు. 

వుద్యోగం చేస్తున్నంత కాలం అద్దె ఇళ్ళల్లో నానా పాట్లు పడిన యశోద, మరోమాట లేకుండా ఆయనను అనుసరించింది. గృహ ప్రవేశానికి వచ్చారు గౌతమ్, శరత్ , మళ్ళీ ఇప్పుడే గౌతమ్ రావటం.

గృహప్రవేశానికివచ్చినప్పుడుసరిగాగమనించలేదకానీ,ఇల్లుపెద్దగానేఅనిపించిందతనికి.ముందు బంగాళా పెంకులతో పెద్ద వరండా, తరువాత పెద్ద హాల్, హాల్ కి అటు, ఇటు రెండు బెడ్ రూమ్స్ చిన్న నడవా తర్వాత వంటిల్లు, దేవుడి గది . రెండు బెడ్ రూమ్స్ కి వాటి ప్రక్కన ఉన్న చిన్న గదుల స్థానంలో అటాచెడ్ బాత్ రూమ్స్ కట్టించారు సీతారామయ్య. 

అప్పటికప్పుడు పూరీ, కూరా చేసింది యశోద. టిఫిన్ తిని తీరిగ్గా ఇల్లు చూడటానికి వెళ్ళాడు గౌతమ్. పెరటి లో బావివుంది.వంగి బావి లోకి తొంగి చూసాడు , నీళ్లు స్వచ్ఛంగా, పై దాకా వున్నాయి.బావి చుట్టూ చప్టాకట్టి వుంది. దాని ప్రక్కనే అరటి చెట్లు, నీళ్లు తోడి,వాడితే వాటికి వెళ్లే నీళ్లతో, పచ్చగా వున్నాయి. 

కూర అరటి, పండు అరటి రెండూ వున్నాయిరా, కూర అరటి గెలని మీరంతా దసరాకి వచ్చినప్పుడు కొద్దామన్నది అమ్మ, పండు అరటి దసరాకి మగ్గ పెడుతుందట మీ అమ్మ"

సీతారాం గారు చెబుతున్నారు. యశోద వాళ్ళ వెనక నుంచుని, "రెండూ మీరంతా వస్తాయని కాసాయిరా " అన్నది నవ్వుతూ. 

తల్లి కళ్ళల్లోకి చూసాడు గౌతమ్, దసరా కి అంతావస్తారన్న ఆశ, సంతోషం ఆ కళ్ళల్లో. , 

పెరట్లో గోడవారగా వరుస పందిళ్లు, కాకర, బీర, సొర, పొట్ల అన్నీ వున్నాయి. వంగ, టమాటా, మిర్చి రెండేసి వరుసలు వేశారు. అన్ని రకాల ఆకు కూరలు చిన్న, చిన్న మళ్ళలో వేశారు. 

వుత్తరం వైపు రెండు మామిడి చెట్లు , సపోటా, నిమ్మ వున్నాయి. మూడో మామిడి చెట్టు కొంచం చిన్నగా ఉందికానీ కాయలతో వున్నది. 

" ఆది పునాస మామిడి రా , నాన్న వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క నాటి వచ్చేవారట, ఇప్పుడివన్నీ మనకు చక్కగా అన్ని ఫలాలు ఇస్తున్నాయి" అమ్మ కళ్ళలో అంతులేని తృప్తి. ఇంటి ముందుకెళ్లారు. ఓ మూల పారిజాత మొక్క వున్నది, నిండా మొగ్గలతో. దాని క్రింద చాప పరిచి వుంది .గౌతమ్ చాప కేసి చూస్తుంటే, " అమ్మ పొద్దున్నే పారిజాతాలు అన్నీ ఏరి, మాల కట్టి కృష్ణ విగ్రహానికివేస్తుంది ఓపిగ్గా" అన్నాడు ఆయన నవ్వుతూ.

కనకాంబరాలు, బంతి చామంతి ఓ పద్ధతి ప్రకారం చిన్న, చిన్న మళ్ళలో వేశారు.రంగు, రంగుల గులాబీలు అక్కడక్కడా విరగపూసి వున్నాయి. సన్నజాజి, విరజాజి, మల్లె గోడవారగా పెద్ద పందిళ్లు వేసి వున్నాయి. 

"ఇది ఇల్లా లేక ఏదైనా పుష్ప వాటికా" అనుకొంటూ ఆశ్చర్యం తో చూస్తుండి పోయాడు గౌతమ్. 

హఠాత్తుగా అతనికి అలెగ్జాండర్ పోప్ రాసిన "ode on solitude " గుర్తుకు వచ్చింది.

 అది పోప్ పన్నెండో ఏట రాసిన పోయెమ్. 


" Happy the man whose wish and care 

a few paternal acres bound 

content to breath his native air

in his own ground "   


పుట్టి పెరిగిన వూరిలో పచ్చి గాలి పీలుస్తూ, ప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనకు అవసరమైన ఆహారాన్ని తానే పండించుకుంటూ ఉండేదే అసలైన జీవితమంటాడు కవి. ఇక్కడ solitude అంటే భాదాకరమైన ఒంటరితనం కాదు, పరిపూర్ణమైన జీవన శైలితో కూడిన పచ్చని జీవితమని " తన తల్లీ తండ్రీ సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తున్నారని అర్ధమయ్యింది గౌతమ్ కి. 

మధ్యాహ్నం అరటి ఆకులో భోజనం. యశోద తండ్రీ కొడుకుని వంటిట్లోనుంచి కదలనీయలేదు. పెరటిలోని గోంగూర తో పచ్చడి, ముద్దపప్పు, కాచిన నెయ్యి, ఆవకాయ, ఫ్రెష్ మెంతి కూర వేసి వండిన వంకాయ కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొగలు కక్కుతున్న పొలంలో పండిన బియ్యపు అన్నం, గడ్డ పెరుగు , ఎన్నో రోజుల తర్వాత కమ్మటి భోజనం తిన్నానన్న తృప్తితో లేచి చేయి కడుక్కున్నాడు గౌతమ్. 

సాయంత్రం వీధి గుమ్మానికి అటూ, ఇటూ వేసిన అరుగుల మీదపెద్దవాళ్ళు కూర్చుని చీకటిపడిందాకా మాట్లాడుకుంటున్నారు. అమ్మ ఫ్రెండ్స్ అమ్మకి వున్నారు. తండ్రి అన్ని పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడూ అంతే.

ఆ రాత్రి బాగానే నిద్ర పట్టింది గౌతమ్ కి. కానీ తెల్లవారుఝామున ఒక కల. ఆ కలలో  

తల్లీ, తండ్రీ తనెంత ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇద్దరూ వయసు మీదపడి వంగిపోయి నడుస్తున్నారు. వాళ్ళిద్దరి రూపంలో ఎంతో మార్పు, చాలా దయనీయంగావున్నారు. నాన్న, వంగిపోయిన అమ్మ చుట్టూ చేయి వేసి , :మాకు మేము ఒకరికొకరం ఆసరా" అన్నట్టుగా నడుస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గౌతమ్.

చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.. తర్వాత లేచి, లైట్ వేసి తమ్ముడు శరత్ కి మెసేజ్ పెట్టాడు.

"శరత్ నువ్వు, నేను మన భార్యల ఆలోచన సబబే అనుకుంటూ నాన్నని పొలం, ఇల్లు అమ్మి మనదగ్గిర ఉంచుకోవాలని, అలా వచ్చిన డబ్బుతో పెద్ద అపార్ట్మెంట్స్ కొని వాళ్ళని మనతో పాటు ఉంచుకొని చూసుకోవాలని అనుకొన్నాము. కానీ ఇక్కడికొచ్చాక అది ఎంత తప్పుడు ఆలోచనో నాకు ర్ధమయ్యింది. 

నాన్న , మనిద్దరినీ ప్రేమతో పెంచి, చదువు చెప్పించాడు. మన కోసం వాళ్లిద్దరూ ఎంత పొదుపుగా జీవించారో నీకూ తెలుసు. నాన్న తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎంతో గౌరవం తో ప్రేమతో నిలబెట్టుకున్నాడు. ఈ ఇంటిలో కానీ, పొలం లో కానీ మనకు ఏ హక్కు లేదురా. వాళ్లకు మన అవసరం కలిగినప్పుడు మనం వాళ్ళని బాగా చూసుకొందాము. వాళ్ళ రూట్స్ ని మనం పెకిలించే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమనిపించింది నాకు. ఈ అందమైన ప్రకృతి వడిలో వాళ్ళు ఈజీగా ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతుకుతారు. రేపు వెళ్లి వదినా, పిల్లలని తీసుకొస్తాను.సెలవలు రాగానే నేను వచ్చేసాను, నువ్వు నీ ఫ్యామిలి తో వెంటనే బయల్దేరి రాగలవు" అంటూ ముగించాడు.

 అనుకున్నట్టుగానే శరత్ కూడా వచ్చేసాడు. గౌతమ్ మణి నీ, శరత్ సౌమ్య నీ తాము అనుకొన్న ఏ విషయాన్నీ పెద్దవాళ్ళతో చెప్పవద్దని హెచ్చరించారు. యశోద, సీతారామయ్య సంతోషానికి అవధులు లేవు. పిల్లలు ఎంతో కుతూహలంగా తిరుగుతున్నారు తోటంతా. వాళ్ళ అంతులేని ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులిస్తున్నాడు తాత. అంతలో ఆయన దృష్టి మామిడి చెట్టుమీద పడింది. మామిడి కొమ్మల్లో పాలపిట్ట. ఆయన పిల్లలని అరవవద్దని చెప్పి, పెద్ద మనవడిని అందర్నీ రమ్మనమని చెప్పారు.

పాలపిట్టను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో అది ఎక్కడా కనపడటమే లేదు. యశోద సంతోషం తో అన్నది" ఎంత అదృష్టం, ఇంకా దసరా వారం ఉండగానే మనకు ఈ నీలకంఠ పక్షి దర్శనమయ్యింది.శంకరా" అంటూ చేతులెత్తి నమస్కరించింది. అప్రయత్నగా అంతా నమస్కరించారు. ".

పిల్లలకు పాల పిట్టకు రామాయణ, మహాభారతాలలో ఎంత ప్రాశస్త్యం ఉందొ , అదే మన రాష్ట్ర పక్షి "అని వివరిస్తున్నాడు సీతారామయ్య. 

గౌతమ్ అనుకున్నాడు" అవును, నిజంగా అదృష్టమే, విజయానికీ, శాంతికి , శుభసూచకం ఈ పక్షి కనబడటం, అమ్మా,నాన్న గురించి తమకున్న ఆందోళనీ ఆలోచనల లోని అశాంతిని తొలగి పోయేలా దర్శనమిచ్చింది i " అనుకొంటూ ఆ పక్షి కేసి చూస్తూ నమస్కరించాడు. 


*భవానీ కుమారి బెల్లంకొండ*

03.07.2024. బుధవారం

 *భరత మాతకు జయము*

*శుభోదయం..🚩🚩*


03.07.2024.       బుధవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు జ్యేష్ఠ మాస బహుళ పక్ష *ద్వాదశీ* తిథి ఉ.07.10 వరకూ తదుపరి త్రయోదశి తిథి,*రోహిణి* నక్షత్రం రా.04.07 వరకూ తదుపరి *మృగశీర్ష* నక్షత్రం,*శూల* యోగం ఉ.09.02 వరకూ తదుపరి *గండ* యోగం, *తైతిల* కరణం ఉ.07.10 వరకూ, *గరజి* కరణం సా.06.29 తదుపరి *వణిజ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి*: మిథున రాశిలో  (ఆరుద్ర నక్షత్రంలో)

*చంద్ర రాశి*: వృషభం లో.

*నక్షత్ర వర్జ్యం*: రా.08.18 నుండి రా.09.52 వరకూ

*అమృత కాలం*: రా.1.00  నుండి రా.02.33 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.46

*సూర్యాస్తమయం*: సా.06.55

*చంద్రోదయం*:రా.03.52

*చంద్రాస్తమయం*: సా.04.39

*అభిజిత్ ముహూర్తం*: లేదు

*దుర్ముహూర్తం*: ఉ.11.54 నుండి మ.12.47 వరకూ.

*రాహు కాలం*: మ.12.21 నుండి మ.01.59 వరకూ

*గుళిక కాలం*: ఉ.10.42 నుండి మ.12.21 వరకూ

*యమగండం*: ఉ.07.25  నుండి 09.03 వరకూ


నిన్న ఏకాదశీ ఉపవాసం ఉన్నవారికి, ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండీ  ఉదయం 07.10 వరకూ ఉంటుంది.


శుక్ల యజుర్వేదం,వాజసనేయీ సంహిత, కన్వ అధ్యాయం ప్రకారం, జ్యేష్ఠ బహుళ పక్ష ద్వాదశీ రోజు *కూర్మ జయంతి*. కాబట్టి శుక్ల   యజుర్వేదికులు ఈరోజు కూర్మ జయంతిని జరుపుకుంటారు.


ఈరోజు *మాస రోహిణీ వ్రతం*. జైన స్త్రీలు ప్రతి నెలా వచ్చే రోహిణీ నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉపవాసం ఉంటారు.


ప్రదోష సమయం లో త్రయోదశి తిథి ఉన్న కారణం గా, ఈ రోజు  *ప్రదోష వ్రతం*. శివ భక్తులు ప్రదోష సమయం లో రుద్రాభిషేకం చేస్తారు.


*సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు పూర్తి గా ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్:6281604881.

జాగ్రత్త

 😭🙏::_*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*_


*హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.


SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.


అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

________________________________

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి  షేర్ చేద్దాం మిత్రులారా.......

అనురాగం కోరుకుంటారు

 *2028*

*కం*

రోగము లేనట్టి తతుల

రోగులనట ఛీదరించు రుగ్మత నున్నన్

రోగము తానొందగ నను

రాగము కోరుదురు జనులు  రయమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! రోగము తనకి లేనప్పుడు రోగులను చీదరించుకున్ననూ తనకు రోగం వచ్చినప్పుడు మాత్రం వెంటనే అనురాగం కోరుకుంటారు.  (తతి= సమయం/తరుణం).

*సందేశం*:-- రోగులను చూసి జాలిపడకపోయినా అసహ్యించుకోకుండా ఉంటే మనకు రోగం వచ్చినప్పుడు కనీసం అనురాగం పంచేజనులు దగ్గర కు రాగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

గుండెపోటుమరణాలు

 భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.

 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.

 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.

 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.

 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.

 ●●●●●●●●●●●●●●●●

 ఆయుర్వేద చికిత్స●

 *అల్లం రసం -* 

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.●

 *వెల్లుల్లి రసం* ●

 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.●

 *నిమ్మరసం* ●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.

 ●ఈ దేశీయ ఔషధాలు

ఇలా ఉపయోగించండి ●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి.

 ●ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.

 ●●●●●●●●●●●●●●●●

 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.

 సహాయం వచ్చే వరకు

  ప్రక్రియ పునరావృతం చేయాలి.

 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా 

గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

బిగ్గరగా దగ్గడం వల్ల

 గుండె కుంచించుకుపోయి

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

ఉత్తమమైనది

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 *భీతేభ్యశ్చాభయం దేయం*

       *వ్యాధి తేభ్యః స్తధౌషధం* |

      *దేయ విద్యార్థీనాం విద్యా* 

      *దేయ మన్నం క్షుధార్థినాం* ||


తా𝕝𝕝 *భయము చెందిన వానికి అభయదానము, రోగ పీడితులకు ఔషధ దానము, విద్యార్ధులకు విద్యాదానము, ఆకలిగొన్న వారికీ అన్నదానము చేయుట ఉచితమైనది, ఉత్తమమైనది*.....


 ✍️🌷🌹💐🙏

దుర్యోధనుని కూతు

 🙏🙏🙏🙏🙏

దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో మరి.

🦚🦚🦚🦚🦚

శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. వారిపేర్లు (1) రుక్మిణి, (2) సత్యభామ, (3) జాంబవతి, (4) నగ్నజితి, (5) కాళింది, (6) మిత్రవింద, (7) భద్ర, (8) లక్ష్మణ. వీరినే అష్టభార్యలంటారు 

శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు.

వారెవరంటే 


పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి (1) ప్రద్యుమ్నుడు, (2) చారుదేష్ణుడు, (3) సుదేష్ణుడు, (4) చారుదేహుడు, (5) సుబారుడు, (6) చారుగుప్తుడు, (7) భద్రకారుడు, (8) చారుచంద్రుడు, (9)  విచారుడు, (10) చారుడు అనే కొడుకులు కలిగారు. 


వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే  శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.


సత్యభామ వల్ల కృష్ణునికి (1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు, (4) ప్రభానుడు, (5) భానుమంతుడు, (6) చంద్రభానుడు, (7) బృహద్భానుడు, (8) అతిభానుడు, (9) శ్రీభానుడు, (10) ప్రతిభానుడు అనువారు కలిగారు.


జాంబవతీ శ్రీకృష్ణులకు (1) సాంబుడు, (2) సుమిత్రుడు, (3) పురజిత్తు, (4) శతజిత్తు, (5) సహస్రజిత్తు, (6) విజయుడు, (7) చిత్రకేతుడు, (8) వసుమంతుడు, (9) ద్రవిడుడు, (10) క్రతువు  కలిగారు. 


సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధనచక్రవర్తి తన గురువు  బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన  కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు.ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.


సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.

 

నాగ్నజితి, శ్రీకృష్ణులకు (1) వీరుడు, (2) చంద్రుడు, (3) అశ్వసేనుడు, (4) చిత్రగుడు, (5) వేగవంతుడు, (6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత  అనువారు కలిగారు. 


శ్రీకృష్ణుడికి కాళింది వలన (1) శ్రుతుడు, (2) కవి, (3) వృషుడు, (4) వీరుడు, (5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8)  దర్శుడు, (9) పూర్ణమానుడు, (10)  శోమకులు  జన్మించారు. 


లక్షణకు, శ్రీకృష్ణుడికి (1) ప్రఘోషుడు, (2)  గాత్రవంతుడు, (3) సింహుడు, (4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు అనేవారు కలిగారు.


మిత్రవింద, శ్రీకృష్ణులకు (1) వృకుడు, (2) హర్షుడు, (3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, (8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి  పుట్టారు.


శ్రీకృష్ణ భద్రలకు   (1) సంగ్రామజిత్తు, (2)  బృహత్సేనుడు, (3) శూరుడు, (4) ప్రహరణుడు, (5) అరిజిత్తు, (6) జయుడు, (7) (9) సుభద్రుడు, (8) వాముడు, ఆయువు, (10) సత్యకుడు అనేవారు కలిగారు.


శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య > 80.

🙏🙏🙏🙏🙏

మహాపాత కాలను పోగొట్టే

 🙏🙏🙏🙏🙏

🌼పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం🌼


పారిజాత పుష్పాలు 9రకాలు

🌼🌼🌼🌼🌼


1.ఎర్ర(ముద్ద)పారిజాతం

2.రేకు పారిజాతం

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)

4.పసుపు పారిజాతం

5.నీలం పారిజాతం

6.గన్నేరు రంగు పారిజాతం

7.గులాబీరంగు పారిజాతం

8.తెల్లని పాలరంగు పారిజాతం

9.ఎర్ర రంగు పారిజాతం


ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు.

ఎరుపు తమోగుణం

విష్ణువు సత్వగుణం.


పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.

చెట్టు నుండి కోసి వాడరాదు.


పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.


రంగు,..వైశాల్యం,..గుణం,దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.


ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.

ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.


భూ స్పర్శ,

మృత్తికా(మట్టి)స్పర్శ

జల స్పర్శ

హస్త స్పర్శ

తరువాత స్వామి

స్పర్శ.

ఈ 5 స్పర్శల తోను

పంచ మహా పాతకాలను

పోగొట్టేదే పారిజాతం.

🌼🌼🌼🌼🌼

ముఖ్యమైన విషయాలు

 🙏🌟🌟🌟🙏

*కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు...*


*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 


అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.


*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.

మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.


(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.


*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.


*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 


పూజగది.

🙏🌟🌟🌟🙏

మనం_హిందువులం

 హిందూ బంధువులారా ...#మనం_హిందువులం అన్న మాటే గానీ ఇంతవరకూ మనలో చాలా మందికి మనదేశంలో మరియు వేరే ఇతర దేశాల్లో మన #హిందూ_సంస్థలు ఎన్ని? ఎంత వరకు పనిచేస్తున్నాయో? వాటి #ఉద్దేశాలేమిటి? అన్న అంశాలే  తెలియదంటే #హాస్యాస్పదమే! అంతెందుకూ... మన ఉభయ తేలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు కూడా సరిగ్గా తెలియవు #మనలో చాలా మందికి. ఇక్కడ నేను సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని #హిందూసంస్థల పేర్లు చెబుతాను మీకు నచ్చితే మీ దగ్గరలోని కార్యాలయాలకు వెళ్లి లేదా facebook లాంటి మాధ్యమం ద్వారా నైనా సంప్రదించి అక్కడ #సభ్యులుగా చేరండి !


●#RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

●#రాష్ట్రా సేవిక సమితి

●#హిందూ వాహిని 

●#హిందూ యువ వాహిని

●రాష్ట్రీయ సేవా భారతి 

●సహకార భారతి 

●విజ్ఞాన భారతి 

●సంస్కృతభారతి 

●#సంస్కార భారతి 

●#స్వదేశీ జాగరణ్ మంచ్ 

● #VHP = విశ్వహిందూ పరిషత్

●#ABVP=అఖిల భారత విద్యార్థి పరిషత్

●రాష్ట్ర ధర్మ ప్రకాషన్

●వనవాసి కళ్యాణ ఆశ్రం 

●#విద్యాభారతి 

●ఆరోగ్య భారతి

●రామకృష్ణా మిషన్ / మఠం 

● #భజరంగ్ దళ్ 

● గోరక్షా దళ్

● స్వాధ్యాయ్

●#శివశక్తి 

●#హిందూ జనశక్తి 

● #రాష్ట్రీయ శివాజీ సేన

● హిందూ పరివార్

● రామదండు

● ధర్మవీర్

● హైందవ శక్తి

● హైందవ సైన్యం

● పరుశురాం పరివార్ 

● గాయత్రీ పరివార్

● RHS = రాష్ట్ర హిందూ సేన 

● RDS= రాష్ట్రీయ దళిత సేన

● RDS

● RHP

● శ్రీ రామ సేన 

● రాష్ట్రీయ వానర సేన

● కురుక్షేత్రం

● మోక్షగీత

● మన గుడి

● హిందూ చైతన్య సమితి

● హిందూ ధర్మచక్రం

● ధానధర్మ చారిటబుల్ ట్రస్టు, 

● ఆంధ్రప్రదేశ్ హిందు దేవాలయాల పరిరక్షణ సమితి,

● ధర్మ వీర్

● ధర్మ సింధు

● ధర్మ ధ్వజం

● శివాజీ సైన్యం,

● హిందు నేషనల్ ట్రస్టు బ్యాంక్,

● జాంభవ జన జాగృతి సేన,

● జాంభవ సమాజం,

● జాంభవ ఉత్సవ కమీటి,

● హిందుస్థాన్ మోడీజమ్,

● సనాతన ధర్మ వేదిక,

● ఆది జాంభవ శ్రీరామ సైన్యం,

● సనాతన ధర్మం వేధం,

● జాంభవ సేన,

●  ఓ హిందు మేలుకో,

● ధర్మ జాగరణ సమితి ఆంధ్రప్రదేష్

● శ్రీరామ సైన్యం,

● హిందుస్థాన్ సమాచార్ 

● భారత వికాస్ పరిషత్

● అఖిల భారత సాహిత్య పరిషత్

● భారతీయ శిక్షణా మండల్ 

● ప్రజ్ఞా ప్రవాహ్

● #సామాజిక సమరసతా మంచ్ 

● భారతీయ ఇతిహాస సంకలన యోజన 

● పూర్వసైనిక సేవా పరిషత్ 

● భారతీయ కుష్టు నివారక సంఘ్ 

● సక్షమ 

● క్రీడా భారతి 

● లఘు ఉద్యోగ భారతి 

● అధివక్తా పరిషత్ 

● రాష్ట్రీయ సిఖ్ సంగత్ 

● దీన్ దయాళ్ శోభా సంస్థాన

● బాబా సాహెబ్ ఆప్టే స్మారక సమితి

● వివేకానంద కేంద్రం

● బాలకుటీర్ 

● మాతృ మండలి

● ధర్మజ్యోతి సేవా సంఘ్

● బాల సంస్కార కేంద్ర 

● సుదర్శన మహాసేన

● శ్రీ వేద నారాయణ ధర్మ రక్షణ సమితి

●AP రాష్ట్ర సాధు పరిషత్.

● #BJP= భారతీయ జనతా పార్టీ.  

ఇవే గాక ఇంకా 180 హిందూ సంస్థలు పనిచేస్తున్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు?


ఇక్కడ భారతదేశంలో #RSS సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పనిచేసే హిందూసంస్థల పేర్లు 80% చెప్పాను. మిగతావి కూడా  హిందువుల కోసం పనిచేస్తున్న స్వతంత్ర్య భావాలు, స్వంత #సిద్ధాంతాలు గల సంస్థలు. ఇదంతా ఎందుకంటే రానున్న దశాబ్దకాలంలో  "హిందూ జనాభా తగ్గి" అన్యుల జనాభా పెరిగి మనం మైనారిటీలో పడిపోయే ప్రమాదమున్నది కాబట్టే . మాకెందుకులే అనే భావంతో ఇంతకుముందు ఇన్నాళ్లూ ఉన్నారేమో.. రాను రానూ తెలుగు రాష్ట్రాలు కూడా కేరళ, పశ్చిమ బెంగాల్ లా తయారయ్యే అవకాశముంది. కావున... ఇక ముందు మీరలా ఉండే అవకాశం లేదు  ఇప్పటికీ మించి పోలేదూ.. ఏదో ఒక హిందూసంస్థలో సభ్యులుగా చేరండి మనలను-మనం. మన హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఎదో ఒక #హిందూసంస్థల్లో చేరడమే ఉత్తమము .రోజు రోజుకీ హిందుత్వ #కుదించుకు  పోతుందనే భావనతో... 

🌹🌹🌹🌹🌹

(సేకరణ)

రచనలు

 *రచనలు -  సభ్యుల స్పందన*.




మానవ అస్థిత్వములో  రచనలు అత్యంత కీలకమని  జ్ఞాన గ్రహణకు, అవగాహనకు ఇతివృత్తాలు అవసరమని ఇప్పటికే రూఢి అయిన విషయము యధార్థం.


రచన అనేది విశ్వజనీనము. అవి ప్రపంచములో, ఆ దేశపు స్థానాన్ని, ఆ రచయిత  స్థానాన్ని  తెలియ జేస్తాయి.  ప్రజలు ఎలా ఉండాలో గూడా ఉత్తమ, ఆదర్శ రచనలు  నేర్పుతాయి. రచయితల దృక్పథాన్ని రూపకల్పన చేస్తాయి. అందులోని సారాన్ని జనులకు తెలియజేస్తాయి, నైతికాంశాలను ప్రస్తావిస్తాయి.


భారతీయ రచనా సంప్రదాయంలో  రచనలు  మానసికంగా  రచయితలలో జీవిస్తాయి. వాటిని ప్రక్క వాళ్లకు (సమాజానికి) వినిపించటం ఆ రచయిత బాధ్యత.


*కొన్నిటిని మన కొరకు మాత్రమే ఉంచుకోవడము కుదరదు. ముఖ్యంగా ఆహారాన్ని, విద్యను, కళలను, సమాజ హితాన్ని ఇతరులకు గూడా ఇవ్వాలి, పంచాలి*.


రచన అనేది కేవలము వినోదాలకు, ఉల్లాసాలకు, ఉద్రిక్త, భావావేశాలు కల్గించుటకు మాత్రమే కాదు. అది చాలా ముఖ్యమైన సామాజిక బాధ్యత. *రచనలు సమాజ ఉద్ధరణకు తోడ్పడాలి*.


*రచనలలో  వేద, పురాణ, ఆధ్యాత్మిక అంశాలపై భాష్యాలు, అర్థ సహిత తాత్పర్యాలు, కథలు, గాథలు, అనువాదములు, కల్పితాలు, చారిత్రకాలు, పరిశోధనా గ్రంథాలు, ఆత్మ కథలు, సృజనాత్మకాలు,  గేయాలు, కావ్యాలు వగైరా వగైరా* 


*మన వద్ద నున్న ఊహాశక్తిని, జ్ఞానాన్ని  అందరికీ పంచక పోతే మనము సామాజిక బాధ్యతను విస్మరించినట్లే*.

 కథలు, నాటకాలు, రచనలు చదువరుల అనుభూతులకు సంబంధించినవి, వారిలోని చిత్తాన్ని  ప్రక్షాళన గావించి, కల్మశాన్ని తొలగించి ఆ వ్యక్తిని అజ్ఞానము నుండి విముక్తుడిని చేస్తాయి.


మూల్యాంకనము, పునర్మూల్యాంకనము, నిర్ధారణ, పునర్నిర్ధారణనలు, ప్రగతి మార్గంలో పయనించే వ్యక్తులు చేసే పనులు.

*సాహితీ మార్గములో ఈ పనులు చేసేది విమర్శకుడు*. సృజన కారుడికి ఉన్నట్లే విమర్శకునికి గూడా ఒక ధృక్పథం ఉంటుంది. *మెరుగైన సాహిత్య ప్రస్థానము కోసమే విమర్శ*.  రచనకు  సంబందించిన విషయ పరిచయం, సమీక్ష, విశ్లేషణ, విమర్శ అనే పేరు మీద జరిగే తతంగమే విమర్శ. *రచనలు ఎట్లున్నవో, ఎట్లా ఉండాలో చెబుతుంది విమర్శ*.కవులు, రచయితలకంటే నిశ్చయంగా *విమర్శకుడు* (CRITIC) అధికుడు.


సమాజము - సాహిత్యము రెండు వస్తు - శిల్పాలాగా పరస్పరాధారితాలు. 

ఈ మధ్యన చాలా వరకు శిల్పాన్ని వదిలి  వస్తువు గురించి మాట్లాడుతున్నారు.

"వస్తువు" కళగా మారటంలో తోడ్పడేది "శిల్పము". "వస్తువు" సాహితీ రూపంగా మారడానికి దోహద పడేది కూడా "శిల్పమే". *వస్తువును గ్రహించడము కొంత సులభమే, కానీ శిల్పాన్ని సాధించడము కష్టము*.అవుతే ఈ మధ్యన *శిల్పముపై* దృష్టి పెట్టే రచయితలు తక్కువగా కనిపిస్తున్నారు.


ఎవరో మెచ్చాలని పూవు పూయదు, పరిమళించదు.  పూవు పూయడం, పరిమళించడం దాని స్వభావం. ప్రకృతి తన సహజ పద్ధతులలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఆలాగే రచయితలు ఎవరో మెచ్చాలని రచనలకుపక్రమించరు. రచయితల వ్యక్తిత్వం, అవగాహన, మూర్తిమతత్వం, సంస్కృతి, ప్రపంచ జ్ఞాన మిశ్రమాలతో రచనలు వెలువడుతాయి. 


రచనలను మెచ్చుకునుట, ప్రోత్సహించుట వలన రచయితలలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను మరింత వెలికితీయడానికి, మరింత సాన బెట్టడానికి దోహదం చేస్తాయి. చదువరుల ప్రశంస మరియు మెప్పుదల రచయితకు శక్తికారకాలు. *ఇంతే కాకుండా రచనలను మెచ్చుకునుట వలన ఆయా విషయాలపై మనకున్న అవగాహన, మన ప్రతిభ, మన సంస్కారము కూడా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి*. 


సంప్రదాయ పరిరక్షణ, సమాజ నిర్మాణ,  సమాజ జాగృతి, సమాజాభివృద్ధి రచనలను ప్రత్యేకంగా  ఆదరిద్దాము, రచయితలను ప్రశంసిద్దాము.


ధన్యవాదములు.

2, జులై 2024, మంగళవారం

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

Panchaag


 

సాంద్ర బవదీయ సాంబలింగ..

 "



" పూయ గంధము లేదు భూతి పూతే గాని, ఎక్క గుఱ్ఱము లేదు ఎద్దె గానీ త్రాగ కంచము లేదు తలపుర్రెయే గాని మణులు సొమ్ములు లేవు ఫణు లె గాని కొండ మీదే గాని ఉండ చోటులేదు తలను పువులు లేవు జఢలె గాని గజ చర్మమే గాని కట్ట వస్త్రములేదు జోగి రూపమే గాని సొగసు లేదు... ""

. ఇట్టి నిరుపేద యైన నిన్నెరిగి ఎరిగి బ్రాంతి పడి ఎట్లు పెండ్లాడే పార్వతమ్మ ఐన.. నీ భాగ్య మేమని పొగడ వచ్చు భక్త జన సాంద్ర బవదీయ సాంబలింగ..

సర్వం శివార్పణం..

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

యోగినీ ఏకాదశి వ్రతం

 *నేటి యోగినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి...?*


*యోగినీ ఏకాదశి..!*





ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ మతంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి ,జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది. 


యోగినీ ఏకాదశిపై పురాణ కథ

కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.















*కుబేరుడి శాపం*

నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి. 


ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.


ప్రయోజనాలు

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.

కన్యా వరయతే రూపం

 శ్లోకము:


కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం


బాంధవాః కులమిఛ్చంతి మృష్టాన్నమితరే జనాః


మిత్రులు ఈ శ్లొకానికి వివరణ ఇవ్వగలరు. నేటికాలానికి ఇది అనుసరణీయమేనా తెలుపగలరు

మహాత్ముడు

 *లోకంలో ఈ రెండింటి మొహానికి ఎవ్వరూ గురవ్వకూడదు* 


ప్రపంచంలో మనిషి "ఆకర్షితుడయ్యే" రెండు విషయాలు ఉన్నాయి.  అవి *"ఆడ"* మరియు *"బంగారం"*.  ఈ రెండింటిపై మోహానికి గురైన వ్యక్తి తప్పులు చేయడం ప్రారంభిస్తాడు.  ఈ రెండింటిలో దేనిపైనా కోరిక లేనివాడు *"మహాత్ముడు"* అని పిలువబడతాడు. 

రావణుడు సీతను తప్పుగా చూశాడు.. నశించాడు.   ప్రపంచంలో ఏ స్త్రీని తప్పుగా చూడకూడదని దీని అర్థం.  మన భారతీయ సంస్కృతిలో కూడా *“ప్రపంచంలోని స్త్రీలందరినీ తల్లులతో సమానంగా చూడాలి”* అని చెప్పబడింది!  ఎంత దుర్మార్గుడైనా తన తల్లి పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉండడు.  ఆడవాళ్లందరినీ తల్లుల్లాగా చూసుకుంటే మనసులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. 


దేవీమాహాత్మ్యంలో, దేవతలు స్త్రీ స్వరూపిణి రూపంగల శ్రీమాతను స్తుతించినప్పుడు, *"స్త్రీలందరూ నీ రూపమే"* అని అంటారు.  

ఆ పద్ధతిని అనుసరించే మార్గాలను మన పూర్వీకులు  మనకు నేర్పించారు.  అందుకు విరుద్ధంగా చేస్తే ఘోర తప్పిదం అవుతుంది. అలాగే ఇతరుల ఆస్తులను మనం ఆశించకూడదు.  వీధిలో ఎన్ని రాళ్లు, ధూళి పడి ఉన్నా ఎవరి హృదయం అయినా ఆ రెంటినీ కావాలనుకుంటుందా..?  లేదే.. అలాగ్గే ఇతరుల ఆస్తి పట్ల మనమూ అదే వైఖరిని కలిగి ఉండాలి.  ఈ అలవాటు లేని వారికి, ఇతరుల ఆస్తిని దోచుకోవాలని ఆలోచించే వారికి దుర్యోధనుడి కథ ఒక హెచ్చరిక!  దుర్యోధనుడు తన ముత్తాత పిల్లలకు ఆస్తిని ఇవ్వకుండా అంతా తానే అనుభవించాలనే దురాశ;  అతను దాని ఫలితాన్ని అనుభవించాడు. ధనవంతుడు కావడం ఆనందం కాదు. దుఃఖం లోనే ధనవంతుడిలా ఉండటం గొప్పతనం. ఇది సత్య హరిచంద్రుడు కధ తెలియచేస్తుంది. ఉన్నదానితోనే సంతృప్తి చెందాలి. పరాయివాటిపై వ్యామోహం వద్దు. ఈ విధానం ఏసందర్భంలోనైనా సౌకర్యవంతంగా ఉంటుంది.  

ఈ తత్వాన్ని విస్మరిస్తే అధర్మం, అన్యాయం పెరుగుతాయి.  దీనికి బద్ధంగా, "బంగారం" కోసం మోహాన్ని తొలగిస్తే, మనకు సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితంగా లభిస్తుంది.. జీవితం సుఖమయంగా ఉంటుంది.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కేశతైలం

 ప్రియమితృలకు నమస్కారం , 


     

       కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .


గమనిక  - 


      రెండు నుంచి మూడు నెలలపాటు ఆపకుండా వాడటం వలన ఇంకా గొప్ప ఫలితాలు చూడగలరు . వేడి నీటితో తలస్నానం నిషిద్ధం . 


        కేశవృద్ధి తైలం మరియు షాంపు కావలసిన వారు 9885030034 ఫోన్ నంబర్ నందు డైరక్టుగా సంప్రదించగలరు . 


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

రజత గద

 



ఇటీవల విజయ యాత్రలో శ్రీ సన్నిధానం వారికి ఒక భక్తుడు సమర్పించిన ఈ రజత గదను ఉద్దేశించి ఇలా భాషణం చేశారు..

"గద అంటే ఒక ఆయుధం.ఇది ప్రముఖంగా శ్రీ ఆంజనేయస్వామి వారి ఆయుధంగా ప్రాచుర్యం పొందింది..దీనితో స్వామివారు దుష్ట సంహారంచేసి, శిష్ట రక్షణ చేశారు. అలాగే ఈ కాలంలో ఈ గదతో అదే స్వామివారు అధర్మం మీద, అన్యాయం మీద, కష్టాల మీద, సంకష్టాల మీద,అపమృత్యు భయాల మీద, అవినీతి మీద, హిందూమతాన్ని,సనాతన ధర్మాన్ని ద్వేషించే వారిమీద, గోవధను చేసే దుర్మార్గులమీద ఈ గదను ఉపయోగించి వాటన్నిటినీ రూపుమాపి భక్తులను, ఈ వేదభూమి ఐన భారతావనిని రక్షించాలని శ్రీ ఆంజనేయస్వామి వారిని వేడుకుంటున్నాను.

*-జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.*

సాహితీదుగ్ధమాధురీరుచి

 మత్తకోకిల:

సాహితీదుగ్ధమాధురీరుచి చాలినంతగ గ్రోలగా 

దేహమంతయు పుల్కరింతల తేలిపోవుగ హాయిగా 

సాహసింపదు మానసంబిక సన్నుతింపగ నన్యమున్ 

పాహి నీవని ప్రార్థనమ్మిడు భవ్యసాహితి నెప్పుడున్ 

*~శ్రీశర్మద*

8333844664

*శక్తి స్వరూపం

 *శక్తి స్వరూపం ఒక్కటే..*

"దేవత వేర్వేరు పనులు చేసినా, ఆమె నామాలూ, రూపాలు భిన్నంగా ఉన్నప్పటికీ, చైతన్యశక్తి ఒకటే.

*లక్ష్మీప్రదానసమయే నవవిద్రుమాభాం* *విద్యాప్రదానసమయే శరదిన్దుశుభ్రామ్ ।* *విద్వేషివర్గవిజయే చ తమలనీలాం దేవిం* *త్రిలోకజననీం శరణం భజామః ॥*

మనకు సంపదలను అనుగ్రహించే దేవతగా లక్ష్మిదేవి రూపంలో, మనకు జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు సరస్వతి లేదా శారదా అమ్మవారిగా, శత్రువులను సంహరించి, ఆపదలను తొలగించి మనలను రక్షించేటప్పుడు దుర్గ స్వరూపిణిగా అమ్మవారిని పూజిస్తాం. కానీ, అమ్మవారి రూపాలు వేర్వేరు అయినప్పటికిన్నీ

ఈ అన్ని రూపాల ద్వారా మనలను ఒకే ఒక్క దివ్యమాత, ఒకే శక్తి స్వరూపం అనుగ్రహిస్తుందనే ఈ అవగాహనతో మనం అమ్మవారి ఉపాసన చేయాలి."

అంటే అమ్మవారు ఒక్కటే.రూపాలు,నామాలు,

అలంకారాలు,చేతబూనిన ఆయుధాలు మాత్రమే వేరువేరు.

*-జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారు*

ఒకే వస్తువును

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝  *ఏకామిషాభిలాషా హి బీజం వైరమహాతరోః* ।    

       *తిలోత్తమాభిలాషో హి యథా సుందోపసుందయోః* ॥


                     *--- _సూక్తిరత్నావళిః_ ---*


తా𝕝𝕝   ఒకే వస్తువును ఇరువురు కోరుటయే వైరమను మహావృక్షమునకు బీజమగుచున్నది.... ఎట్లనిన సుందోపసుందులు ఇరువురూ తిలోత్తమను కోరుకున్నవారై వైరమును కొనితెచ్చుకున్నారుగదా....

పుట్టువు లేని నీ కభవ పు

 శు  భో  ద   యం🙏


పుట్టుకలేనివాడు!

ఉ.

పుట్టువు లేని నీ కభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే?

యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందవిద్య దాఁ/

 జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం/

జుట్టఁగలేమిఁ దత్క్రియలఁ జొక్కనియెక్కటి వౌదు వీశ్వరా!


రచన:-పోతనమహాకవి.

భాగవతం-10స్కం-90పద్యం.


పుట్టుట ఎరుగని నారాయణా! నీకు పుట్టుక అంటు వేరే లేదు. అటువంటినీవు ఇలా పుట్టడం నీకు క్రీడ లాంటిదిఅది ఎలా అంటే జన్మ , మరణం మొ/నవన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తు వుంటాయి. కాని నిన్ను మాత్రం ఆమాయ స్ప్రుశించలేక దూరంగా వుండిపోతుందీ కనుక ఆమాయామయమైన క్రియలు వేటిలోను చిక్కు కొనకుండా ఏకైక మూర్తిగా నిలబడి పోతావు.కనుకనే ఈజగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు.

           నమో నారాయణాయ!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు

 *తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు శుభవార్త.*

ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు ఆ దేవదేవుడు, తిరుమల వేంకటేశ్వర స్వామి మన కోసం నిలబడి మన బాధలు తీరుస్తూ కల్పవృక్షం గా తిరుమల లో వెలిశారు. *శ్రీహరి భక్తులకు సేవ చేస్తే చాలు శ్రీ హారి మనకు అనుగ్రహిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి.  

 సాక్షాత్తు జగద్గురువులు *శ్రీ శృంగేరి భారతి తీర్థ స్వామి* అసిస్సుల తో  మరియు వారి అనుగ్రహం తో  *తిరుమల శృంగేరి మఠం* వారు మన బ్రాహ్మణులకు ప్రతి రోజు *అన్న ప్రసాద వితరణ ను ప్రారంభించారు.*

 *శ్రీ శారద అన్న ప్రసాదం అనే పేరు తో  కార్యక్రమాన్ని ప్రారంభించారు*. 

శుచిగా శుభ్రంగా బ్రాహ్మణుల చేత వండించి వితరణ చేస్తారు. ఇది బ్రాహ్మణులకు శుభవార్త.

ఈ సృష్టిలో విశిష్టమైనది మానవజన్మ. 

ఈ జన్మకు సార్థకత చేకూర్చేది వితరణ. 

ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకుని స్వామి దర్శనం కోసం ఆర్తి తో ఎదురుచూస్తున్న భక్తులకు, కాస్త ఆకలి తీర్చే కార్యక్రమం శృంగేరి మఠం వారు చేస్తున్న అన్న ప్రసాద వితరణ. 

ప్రతి రోజూ ఈ కార్యక్రమం స్థానిక శృంగేరి మఠం నందు జరుగుతుంది . ఇది గొప్ప యజ్ఞం.  ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్న వారు *శ్రీమాన్ కే చంద్ర శేఖర్ గారు ధర్మాదికారి, శృంగేరి మఠం*. తిరుమల శృంగేరి మఠం వారికి మనం అందరం సహకరించాలి. 

కాబట్టి ఈ సమాచారం అందరికీ అందించండి. వారి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ రాక ను ముందే వీరికి తెలియజేయగలరు . 0877 2277269, 9440271698.


మీ

*Dr K Chandrasekhar Sastry*

Dharmadhikari

Sri sringeri mutt, Tirumala

🌹 *జూలై 02, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🍁 *మంగళవారం*🍁

    🌹 *జూలై 02, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                


          *ఈనాటి పర్వం:*

  *సర్వేషాం యోగిన్యేకాదశి*

    ఉపవాసం ద్వాదశి పారణ 

 రేపు ఉ 05.39 - 08.16 వరకు


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : ఏకాదశి* ఉ 08.42 వరకు ఉపరి *ద్వాదశి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : కృత్తిక* రా 04.40 తె వరకు ఉపరి *రోహిణి* 

*యోగం : ధృతి* ప 11.17 వరకు ఉపరి *శూల*

*కరణం : బాలువ* ఉ 08.42 *కౌలువ* రా 07.54 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 12.30  మ 02.30 - 03.30*

అమృత కాలం :*రా 02.20 - 03.53*

అభిజిత్ కాలం :*ప 11.45 - 12.38*

*వర్జ్యం : సా 05.03 - 06.36*

*దుర్ముహుర్తం : ఉ 08.16 - 09.08 రా 11.06 - 11.50* 

*రాహు కాలం : మ 03.28 - 05.06*

గుళిక కాలం :*మ 12.12 - 01.50*

యమ గండం :*ఉ 08.55 - 10.33*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.39* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల  :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం :*ఉ 05.39 - 08.16*

సంగవ కాలం :*08.16 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి:జ్యేష్ఠ బహుళ ద్వాదశి*

సాయంకాలం :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.55*

నిశీధి కాలం :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.55*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌀🌀🌀 హనుమంతుని*  

     *ప్రదక్షిణాలు 🌀🌀🌀*


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. 

ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు , పసుపుకొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


*'శ్రీ హనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*


*శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం*

*తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం*


*శ్లో|| మర్కటేశ మహోత్సాహ -  సర్వశోక వినాశన*

*శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||*


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


*''యాకృత్తె రేభి: ప్రదక్షిణణై|*

*శ్రీ సువర్చలా సమేత* *హనుమాన్ సుప్రీతస్సుప్రసంనో వరదో* *భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''*


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిరస్స్నానం , నేలపడక , సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

 🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

1, జులై 2024, సోమవారం

Panchang


 

*శ్రీ నాగేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 365*






⚜ *కర్నాటక  : మోసలే - హసన్*


⚜ *శ్రీ నాగేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయం*



💠 మోసలే అంటే కన్నడలో మొసలి అని అర్ధం మరియు శ్రీ పరశురాముని తండ్రి అయిన రిషి జమదగ్ని అతని ఆశ్రమ స్థలంగా పరిగణించబడుతుంది.


💠 ఈ పవిత్రమైన గ్రామంలో సమ్మేళనం ఏకకూట దేవాలయాల యొక్క రెండు సారూప్య నిర్మాణాలను కలిగి ఉంది, హొయసల శిఖరం యొక్క హాల్ గుర్తుతో, మూడు అంచెల శిఖరం నుండి ఆదిస్థానం వరకు అత్యంత అలంకరించబడినది.


💠 మోసాలే హాసన్‌లో ఉన్న ఒక చిన్న గ్రామం.  ఈ గ్రామంలో హోయసల కాలం నాటి రెండు అందమైన దేవాలయాలు ఉన్నాయి.  

ఈ జంట దేవాలయాలు ఒకే సముదాయంలో ఉన్నాయి.  

ఈ దేవాలయాలను 12వ శతాబ్దంలో హోయసల అధిపతి వీర బల్లాల II నిర్మించినట్లు చెబుతారు.  

రెండూ ఏకకూటాచల దేవాలయాలు.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిలో ఒకటి శివునికి, మరొకటి విష్ణువుకి అంకితం చేయబడింది.


💠 దక్షిణాన ఉన్న ఆలయంలో ప్రధాన దేవతగా నాగేశ్వరుని రూపంలో మహాదేవుడు & ప్రక్కనే మరియు సమాంతరంగా చెన్నకేశవ రూపంలో ఉన్న మహావిష్ణువు ఆలయం ఉంది


💠 శంఖ చక్ర గధ పద్మం యొక్క స్థానం ఆధారంగా, మనం విష్ణువు యొక్క 24 రూపాలను కనుగొనవచ్చు.  వాటిని చతుర్వింశతి రూపంగా పేర్కొంటారు.

వారిలో మొదటి రూపం కేశవ.  

ఇక్కడ శ్రీ విష్ణువు ఎగువ కుడి మరియు ఎడమ చేతిలో శంక మరియు చక్రాన్ని మరియు దిగువ కుడి మరియు ఎడమ చేతిలో పద్మ మరియు గాధను కలిగి ఉన్నాడు.  

విష్ణువు యొక్క ఈ రూపం హోయసల దేవాలయాలలో సర్వసాధారణం. 

 బేలూరుకు చెందిన చెన్నకేశవ స్వామిగా ప్రసిద్ధుడు.


💠 శిల్ప వర్ణనలు శైవ, శాక్త మరియు వైష్ణవ ప్రతిమాలను వివరిస్తాయి.  

నాగేశ్వర దేవాలయంలోని చిత్రాలలో నాథ, శ్రీదేవి, లక్ష్మీదేవి, గౌరీ, మహేశ్వరి, బ్రహ్మ, సదాశివమూర్తి, చిత్రధార మరియు భూమిదేవి వంటి పీఠాలపై వారి పేర్లు ఉన్నాయి. 


💠 చేన్నకేశవ ఆలయంలో భూదేవి, శ్రీదేవి, చామరధారిణి శిల్పాలతో పాటు గరుడ, కేశవ, సంకర్షణ, జనార్దన, వేణుగోపాల, అనిరుద్ధ, మాధవ శిల్పాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో వైష్ణవ మరియు శైవుల విగ్రహాలతో పాటు వేద దేవతలు మరియు శాక్త ఆరాధనల చిత్రాలు కూడా ఉన్నాయి.


💠 చెన్నకేశవ దేవాలయం ముందు, ద్వారం దగ్గర ఉన్న ఏకైక శాసనం, 1578లో 2 వ్యక్తుల గౌరవార్థం ఆలయానికి మంజూరు చేయబడిన కొన్ని దానాల గురించి ప్రస్తావించింది.

అంతేతప్ప ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది అస్పష్టంగా ఉంది, పునాది రాయి లేదు మరియు ఇతర శాసనాలు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.

ఆలయ ప్రతిష్ఠాపన గురించి ఎటువంటి పునాది రాయి మరియు శాసనాలు లేనందున, నిపుణులు ఆలయ శైలి మరియు ఆ కాలపు దేవాలయాలకు సంబంధించి నిర్మాణ ఆవిష్కరణల ఆధారంగా ఈ  జంట దేవాలయాలను 12వ శతాబ్దంలో హోయసల అధిపతి వీర బల్లాల II నిర్మించాడని చెబుతారు.  


💠 గర్భగృహం, శుకనాసి, నాలుగు స్తంభాల నవరంగ మరియు ప్రవేశ ద్వారం కలిగి ఉండటంలో అవి ఒకదానికొకటి సమానంగా ఉంటాయి.  

నవరంగ లోపల ఉన్న రెండు దేవాలయాలు ఉత్తర, దక్షిణ మరియు పడమర గోడలలో ఒక్కొక్కటి రెండు దేవకోష్ఠాలను కలిగి ఉన్నాయి.  

ఎత్తులో ఉన్న దేవాలయం యొక్క నక్షత్ర అధిష్ఠానం రెండింటికీ సాధారణమైన అచ్చులను కలిగి ఉంటుంది. 


💠 రెండు దేవాలయాలు మనోహరమైన గోపురాలను కలిగి ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి పైన హోయసల శిఖరం ఉంటుంది. 

ఈ ఏక కూట దేవాలయాల గోపురాలు మంచి స్థితిలో ఉన్నాయి. 


💠 జంట దేవాలయాలు హొయసల వాస్తుశిల్పం యొక్క ప్రామాణిక లక్షణాలతో నిర్మించబడ్డాయి, అయితే కొన్ని దేవతల పేర్ల కారణంగా అవి విలక్షణమైనవి.


💠 సోమనాథపూర్ వంటి ఇతర హోయసల దేవాలయాలలో వలె, ఈ శిల్పాలు వాటి శిల్పుల పేర్లను వెల్లడించవు. 

నిశితమైన పరిశీలకుడు మాత్రమే శిల్పి పేరు యొక్క ప్రస్తావనను చూడగలరు. 

మరోవైపు, తరువాతి కాలంలోని దేవాలయాలు ఏ శిల్పాలపై దేవతల పేర్లను పేర్కొనలేదు. దేవాలయాల పైకప్పులన్నీ సంక్లిష్టమైన నమూనాలు మరియు డిజైన్లతో చెక్కబడి ఉన్నాయి. 


💠 విష్ణు దేవాలయంలోని గర్భగుడి ద్వారం గజలక్ష్మి బొమ్మను కలిగి ఉంటుంది.

6 అడుగుల ఎత్తైన చెన్నకేశవుని చక్కగా చెక్కిన  చిత్రం క్రింద వైపులా శ్రీదేవి మరియు భూదేవితో కలిసి ఉంది. 

శివాలయం వెలుపలి గోడలపై వివిధ రూపాల్లో శివుని ఆసక్తికరమైన శిల్పాలు ఉన్నాయి. వాటిలో చాలా దురదృష్టవశాత్తు దెబ్బతిన్నాయి. 


💠 శివుడు, లింగ రూపంలో, గర్భగుడి లోపల ఒక పీఠంపై నిలబడి ఉన్నాడు.



💠 హాసన్ నుండి 15 కి.మీ దూరం

కర్ణుడు

 కర్ణుడు..


కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం "సంతాన సాఫల్య మంత్రం". ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు, అంటే ఆమెతో సంభోగం చేసి గర్భం చేసి వెళ్లడం కాదు వారి అంశతో ఒక పాపని సృష్టించి ఇచ్చి వెళ్లడం తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. 


ఇక విషయంలోకి వెడితే...

పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీమహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నరనారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. 


హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత  నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం నరుని’గానూ., ‘సింహ’ రూపం నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నరనారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై  తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నరనారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నరనారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.


నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు. 


నరనారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు  సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. 


ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను, నరనారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నరనారాయణులిరువురూ కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.


ఇది కర్ణుని వృత్తాతం.

శంఖము

 శంఖము

--------

సనాతన ధర్మములో శంఖానికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.

దేవుళ్ళు, దేవతల చేతులలో శంఖము ఉన్నట్టు వర్ణింపబడి ఉంటుంది. శంఖాన్ని పూరించడము వలన అత్యంత శుభములు కలుగుతాయి.

క్షత్రియులకు శంఖము ఎలాగ యుద్ధపరమైన ఒక ఆభరణమో, బ్రాహ్మణులకు ఆది ధార్మికపరమైన ఆభరణము.

.

చండీ సప్తశతిలోనూ, భగవద్గీతలోను, ఇతర పురాణాలలోను , దేవతలు దానవులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు , పాండవులు కౌరవులతో మహా సంగ్రామము చేసినపుడు, ప్రతి దినమూ  ఆరంభములో శంఖనాదము చేసి గానీ యుద్ధము మొదలు పెట్టరు అని చదువుతాము. అలాగే యుద్ధాని విరమించే సంకేతముగా కూడా శంఖనాదము చేస్తారు.

.

బ్రహ్మవైవర్త పురాణములో, శ్రీకృష్ణ పరమ భక్తుడైన గోప సుదాముడు శాపవశమున శంఖచూడుడు అను రాక్షసుడిగా జన్మించి, దేవతలను బాధించుటచే, శంకరుడు అతడిని వధించెననీ, ఆతడి అస్థికలనుండీ మహా శంఖము ఆవిర్భవించెననీ చెప్పబడి ఉంది. దానిని విష్ణువు సంగ్రహించి తన వద్ద ఉంచుకున్నాడు.

.

మరొక కథనము ప్రకారము, " పంచజన " అనే భయంకరుడైన దానవుడు, సూక్ష్మ రూపములో సముద్ర గర్భములోని ఒక శంఖములో నివశించేవాడు. అవసరమైనపుడు తన నిజరూపము దాల్చి, బయటకు వచ్చి, దేవతలను, మనుషులను పీడించేవాడు.

.

ఒకసారి వాడు, ’ సాందీపని ’ మహర్షి యొక్క ఏకైన కుమారుడిని అపహరించుకొనిపోయి మింగేసినాడు.  అటుతరువాత కొంత కాలానికి, శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని మహర్షి గురుకులములో విద్యాభ్యాసము పూర్తి చేసిన తరుణములో, గురువు గారిని ’ గురుదక్షిణ స్వీకరించవలసినదనీ, ఏమి అడిగినా ఇచ్చుటకు తాము సిద్ధమనీ ’  ప్రార్తిస్తారు. అప్పుడు సాందీపని మహర్షి, పంచజనుడు ఎత్తుకుపోయిన తన కుమారుని రక్షించి తీసుకురమ్మని గురుదక్షిణగా అడుగుతాడు.

.

బాలకుని వివరాలు అన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు, సముద్రములోకి దూకి, పంచజనుడిని వెదకి వెళ్ళి పట్టుకుని చంపేస్తారు. అతడు నివసిస్తున్న శంఖాన్ని సంగ్రహించుకుని వస్తారు. అయితే బాలకుడు అప్పటికే మరణించాడని తెలుసుకుని, యమలోకానికి వెళ్ళి, ఆ బాలకుడిని బ్రతికించుకుని  తీసుకువచ్చి గురువుగారికి అప్పజెపుతారు.

పంచజనుడి నుండీ వచ్చింది కాబట్టి ఆ శంఖానికి ’ పాంచజన్యము ’ అనే పేరు వచ్చింది.


అందుకే, || త్వం పురా సాగరోత్పన్నః, విష్ణునా విధృతః కరే, దేవైశ్చ పూజితస్సమ్యక్ పాంచజన్య నమోఽస్తుతే || అను శ్లోకము ప్రకారము, మనము పూజించే శంఖము పాంచజన్యమే .

ఈ పాంచజన్యము అనే శంఖమును కృష్ణుడు సంగ్రహించి తనవద్ద ఉంచుకొన్నాడు.

.

శంఖము లో బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. గంగా , సరస్వతీ నదులు మొదలుకొని అనేక తీర్థాల ఆవాస స్థానమే ఈ శంఖము.

అందుకే, శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని వింటే సముద్రపు హోరు వినిపిస్తుంది. మరే ఇతర వస్తువును పెట్టుకున్నా ఆ హోరు వినపడదు.

.

ఒక అతి ముఖ్యమైన విషయము మీరు గమనించి ఉంటారు.

కలిప్రభావము అని చెప్పినా కూడా, ఈ తరములో విపరీత భావాలు, రాక్షస ప్రవృత్తి గల వారు అధికముగా పుట్టుకొని వస్తున్నారు. ఒక తరము వెనుక ఇంతటి సంఖ్య లో ఉండేవారు కాదు. ఇంకా వెనుకటి తరాలలో అస్సలు ఇటువంటి మనుషులు ఉండేవారు కాదు.

.

దీనికీ, శంఖానికీ ఒక అతి దగ్గర సంబంధము ఉంది.

శంఖాన్ని పూజించేటప్పుడు చెప్పే శ్లోకాలలో,

|| గర్భా దేవారి నారీణాం విశీర్యంతే సహస్రశః |

తవ నాదేన పాతాళే పాంచజన్య నమోఽస్తుతే ||

అని పూజిస్తాము.

శంఖాన్ని గట్టిగా పూరిస్తే, ఆ నాదానికి రాక్షసులు , దానవులు, దైత్యులు బెదరి పారిపోవడమే కాదు, ఆ నాదము విన్న ఆయా రాక్షసుల భార్యలు గనక గర్భవతులై ఉంటే, వారి గర్భాలు విఛ్ఛిన్నమై పోయి పాతాళములో పడిపోతాయి.

.

సనాతన ధర్మములో చేసే పూజలలో శంఖ పూజ, శంఖనాదము చాలా ముఖ్యమైనవి.

ఇప్పటికీ కాశీ వంటి శివ క్షేత్రాల్లో , పూజలో అందరూ శంఖాన్ని పూరిస్తారు. జంగమ దేవరలు ఇంటింటికీ వచ్చి శంఖాన్ని పూరించేవారు. ఇప్పుడేదీ? శంఖాన్ని చూచిన వారు ఎందరు ? ఇంట్లో పెట్టుకున్నవారు ఎందరు ? పూజించేవారు, పూరించే వారు ఎందరు ?

.

శంఖ భయమనేది లేక పోవడముతో, ఇళ్ళలో శంఖ నాదాలు వినపడకపోవడముతో, , దానవ అంశతో , దానవ వాసనలు గల ఆత్మలు నిర్భీతిగా, నిరాటంకముగా మనుషులకు సంతానముగా పుడుతున్నాయి. అందుకే ఇటువంటి విపరీత ధోరణులున్న మానవులు పుట్టుకొస్తున్నారు.

శంఖములో నుంచిన నీరు దేవతలకు ప్రీతి పాత్రములు. శంఖనాదము దేవతలకు ఆహ్వానము వంటిది.  శంఖము ప్రతిధ్వనించు ప్రదేశమున శ్రీమహాలక్ష్మి సుస్థిరముగా ఉంటుంది. శంఖజలముతో స్నానము చేయువారు సర్వ తీర్థములలోను స్నానము చేసినట్లే. శంఖము ఉన్నచోట అమంగళములు ఉండవు.

.

శంఖములో పోసిన నీటికి అత్యంత ప్రాశస్త్యము కలదు. అది అతి పవిత్రమైనది. సర్వ దోషములను పోగొట్టగల జలమే, శంఖ జలము. అందుకే శంఖములో పోస్తే గానీ తీర్థము కాదు అన్నారు.


ఇక ఈ శంఖాలలో అనేక రకాలున్నాయి

వామావర్తము[ శంఖ మూలాన్ని పైనుండీ చూస్తే, ఎడమవైపున తెరచుకొని ఉండేది ], దక్షిణావర్తము [ కుడివైపున తెరచుకొని ఉండేది ] అని రెండు రకాలు. వీటిలో దక్షిణావర్తము ప్రశస్తమైనది అని చెపుతారు.

ఇవి కాక, నాలుగు వర్ణాల వారికీ నాలుగు రకాల శంఖాలు చెపుతారు.

.

కృష్ణుడి శంఖము పేరే పాంచజన్యము.

 అర్జునుడి శంఖము పేరు ’ దేవదత్తము ’

యుధిష్టిరుడి శంఖము పేరు ’ అనంత విజయము ’

భీముడి శంఖాన్ని ’ పౌండ్ర ’ అంటారు.

కుబేరుడికి ఉన్న నవ సంపదలలో  శంఖము కూడా ఒకటి.

.

శంఖాలు ఇంకా అనేక ఆకృతుల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. కొన్ని ’ గోముఖ ’ ఆకారంలో సహజంగా ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ’ గోముఖ శంఖము ’ బొమ్మ మాయింటిలోనిది. ఇందులో కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. దీనినే గణేశ శంఖము అని కూడా అంటారు.