8, అక్టోబర్ 2024, మంగళవారం

హైందవం వర్ధిల్లాలి 24*

 *హైందవం వర్ధిల్లాలి 24*


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు,  పీఠాధిపతులు,  హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి*. v):-  భారతదేశ ప్రజలలో చైతన్యము మరియు ఐకమత్యము లోపించిందా అంటే లేదనే చెప్పాలి.  ఐకమత్యం  అర్థాలు లోగడ వ్యాసాలలో పరిశీలించాము. ప్రస్తుత పదం *చైతన్యం* యొక్క సాధారణ అర్థాలు చూద్దాము = ఎరుక, తెలివి,  స్పృహ, కదలిక,  జాగృతి, మెచ్చదగిన మార్పు. విశేష నిర్వచనము =  ప్రత్యేకమైన ఆలోచనలు, స్థిరమైన భావాలు, అవసరాలపై ప్రత్యేక అవగాహన. చైతన్యం ఎన్ని విధాలో చూద్దాం = ఆత్మ చైతన్యము, స్త్రీ చైతన్యము, కార్మిక చైతన్యము, సామాజిక చైతన్యము ఇత్యాది. ఐకమత్యం ఎన్ని విధాలో పరిశీలిద్దాము =  హక్కుల సంఘాలు,సహకార, గ్రహ, ఉద్యోగ, మహిళా, కార్మిక, వయోవృద్ధ ఈలా ఎన్నెన్నో సాధన సంఘాలు. 


ఈలా ఇవన్నీ నిర్మించుకోవడానికి ప్రవచనకారులు, ధర్మ ప్రచారకులు లాంటి పెద్దలెవరైనా *హితవు* పలికారా అంటే  లేదనే చెప్పాలి. ప్రజలలో ఇంత చైతన్యానికి, ఐకమత్యాన్నికి కారణం గమనిస్తే అవసరాలు, హక్కుల పోరాటానికి సన్నద్ధత, వారి వెనుక ఉన్న సంబంధిత కుశాగ్ర ధీశాలురు. ఈ పోరాట సంఘాలు దేశాన్ని ఏలా మరియు ఎంత స్పందింపజేస్తావో సర్వులకు విదితమే. హక్కులు సాధించే వరకు వారి ప్రయత్నాలు విరమించరు, జరిగే కాల, ధన, జన నష్టాన్ని గూడా ఖాతరు చేయరు. గత సంవత్సరం దేశ ముఖ్య పట్టణం "డిల్లీలో" వ్యవసాయదారుల  అసత్య దీక్షలు ఎంత సంచనలకరమో మనందరికీ విదితమే. *పెద్దలు అంటూ ఉంటారు చైతన్యము మరియు ఐకమత్యం "ఒక్కొక్కసారి" దుర్వినియోగం పాలవుతున్నదని*.

చైతన్యానికి  వృద్ధాప్యం ఉండదు, నిరంతరం ఈ స్రవంతి సాగుతూనే (ముందుకు) ఉంటుంది.


దేశం సంస్కృతి, సంప్రదాయాలు మరియు ధర్మానికి హాని జరుగుచున్నపుడు, మరియు తోటి జనుల జీవనం చిన్నాభిన్నమవుతున్నప్పుడు, వీటితో పాటు దేశ  శాంతి భద్రతలకు, ప్రతిష్టకు భంగం కల్గుతున్నప్పుడు పైన ఉదహరించబడిన  చైతన్య మరియు ఐకమత్య ధృఢ సంకల్ప ప్రజలలో *నీరసము, నిస్త్రాణత, ఉదాసీనము, స్థావరత, క్రియాశూన్యత, అనిర్ణీత, అయిష్టత, వ్యాకులతగా* చోటుచేసుకుంటున్నది.

 వారు దేశ పరిస్థితుల గురించి పట్టించుకోని వైనం  *ఆ సంఘ పెద్దలు మరియు మేధావులు ప్రజలకు తెలియజేయవల్సి ఉంటుంది*.  ఇంత పరపతి ఉన్న పెద్దలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించ వచ్చును. *హక్కులేనా ముఖ్యం బాధ్యతలు గూడా ముఖ్యమే గదా*. కావున మన హైందూ ధర్మానికి, సంస్కృతికి  ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. 


ధన్యవాదములు.

*(సశేషం)*.

కామెంట్‌లు లేవు: