8, అక్టోబర్ 2024, మంగళవారం

మనిషి విలువ

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *మనిషి విలువ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒకరోజు ఒక మనిషి గురు నానక్ దగ్గరకు వెళ్లి,  గరూజీ మనిషి  బ్రతుకు వెల యెంత? అని అడిగితే ఆయన తన దగ్గర ఉన్న ఓ రాయిని ఆ వ్యక్తికి యిచ్చి దాని వెల ఎంతో కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. ఐతే ఎట్టి పరిస్థితులోను దాన్ని అమ్మరాదని షరతు విధించారు.*


*ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని వెడుతుంటే, ఓ పళ్ల వ్యాపారి ఎదురుగా వచ్చాడు. వ్యాపారి రాయిని చూసి,  అది ఇస్తే 12 పళ్లు యిస్తానన్నాడు. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.*


*ఈసారి కూరల వ్యాపారి తారసపడ్డాడు. రాయిని పరీక్షగా చూసి, ఓ బస్తా బంగాళా దుంపలు యిస్తానన్నాడు.  ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.* 


*ఈసారి  బంగారం వ్యాపారి ఎదురుపడ్డాడు. అతను రాయిని అటూ ఇటూ తిప్పిచూసి,  అయ్యా,  ఇది విలువైన వస్తువు. నేనిచ్చుకోలేను కానీ, కోటి రూపాయల పైవరకు తూగుతుంది. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.* 


*చివరకు ఓ రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్లి రాయిని చూపించాడు. అతను పరిశీలన చేసి, అయ్యా, దీనికి వెలకట్టగల వారు లేరు. అత్యంత విలువైన రాయి అని చెప్పాడు. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, ఆ వ్యక్తి తిరిగి నానక్ గారి దగ్గరకు వచ్చి జరిగినదంతా వివరించాడు.*


*నానక్ గారు నవ్వుతూ, "పళ్ల వాడు 12 ఫలములు,  కూరల వాడు ఓ బస్తా బంగాళా దుంపలు, స్వర్ణాచారి కోటి రూపాయలు,  రత్నాల వ్యాపారి వెలకట్టలేమనీ నిర్ణయించారు.*


*ఈరాయి లాగే ప్రతీ మనషి ఓ రత్నం లాంటి వాడే. మనిషి విలువ ముందరగల వ్యక్తి తమ తమ అనుభవాలమేరకు,  తమ తమ స్థాయి మేరకు అంచనావేస్తారు. అందుమూలమున,  నిన్ను తక్కువ చేస్తే ఆందోళన చెందవద్దు. నీ విలువను గుర్తించగలవారు తప్పక తారసపడతారు. ఆరోజు వస్తుంది. నిన్ను నువ్వు గౌరవించుకో. ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ప్రత్యేకం" అని బోధించి పంపారు.*


*శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: