విద్యార్థి
సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యముసాలని చదవాలి వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఏంటో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తానూ ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నాన్న, భోజనం చేస్తున్నాకూడా తానూ చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తానూ చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేకా జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.
ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |
క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||
నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు ఆ నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి స్టేగురువును ఆశ్రయించు అని ఈ ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది.
సద్గురువు ఎవరు:
కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకాసర్షిస్తున్నారు. వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము. ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది. ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి ఆ గురువు సేవనమే తన జీవిత పరమావధి భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో అనేక ఆశ్రమాలను నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అనుడుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని ఈ సాధకుని అనిపిస్తున్నది. ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది.
ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంటే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు.
సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి. అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే ఏ విషయాలమీద ఆసక్తి, అనురక్తి,మోహము, కామము లేని వాడై ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి
సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తానూ చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే ఉదయిస్తుంది. ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు.
నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే. కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా కుటింటిత దీక్షతో కమ్ము.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి