31, జులై 2020, శుక్రవారం

ఖమ్మం లో వేద స్మార్త విద్యాలయం

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ  మహాసన్నిధానం   వారు మరియు  శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర సన్నిధానం వారులదివ్య  ఆశీస్సులతో
 ఖమ్మం నగరం  లో  మామిళ్ళ గూడెం బస్ డిపో  వెనుక గల శ్రీ సీతరామచంద్రస్వామి స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో  శ్రీ విజ్ఞాన నంద భారతీ తీర్థ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో దివ్య  ఆశీస్సుల తో వారి కరకములచే బుధవారం 29/07/2020 రోజున  శంకర వేద స్మార్త విద్యాలయం ప్రారంభము జరిగినది.
ఈ విద్యాలయం యందు శ్రీకృష్ణయజుర్వేదం స్మార్తం విద్యలను బోధించబడును.  ఈ  విద్యాలయం స్థాపన తో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో  వేదాభ్యాసానికి  అవకాశం కలిగి పిల్లలను చాలా దూరాలు  వేరే రాష్ట్రాలకు పంపే ఇబ్బందులు తొలిగినవి. ఈ అవకాశాన్ని పెద్దల ఆశీస్సులతో   భారతిశంకరపీఠం  హైందవ ధర్మ సంస్క్రుతి పరిరక్షణ ట్రష్ట్ రి నెం 157  వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు  ముందుకు వొచ్చి ఉచితంగా  వేద స్మార్త  విద్యలను బోధనకు అంగీరించడంతో లభించింది. ఈ అవకాశం కల్పన జిల్లా బ్రాహ్మణ ప్రముఖులు
 శ్రీ జమలాపురం రామకృష్ణ గారు
శ్రీ నామవరపు శ్రీనివాస శర్మ గారు
ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ
పొన్నూరు మదన్మోహన్ గారు
తుంగతుర్తి యుగంధర శర్మ గార్ల సహకారంతో ఎర్పాటు కావించబడ్డది. ప్రారంభ కార్య్రమానికి
 గౌరవ అధ్రక్షులు
శ్రీ అవధానుల పరమేశ్వర ప్రసాదు అవధాని
గారు,శ్రీ ఐతపు వేంకటేశ్వర శర్మ గారు
శ్రీ యడవల్లి సత్యం బాబు గారు
శ్రీ వడ్లమాని లక్ష్మీనారాయణ అవధానిగారు
శ్రీ సర్వదేవరభట్ల సోమశేఖశఖర శర్మ గారు
శ్రీ బుద్దరాజు వెంకట ఫణికృష్ణ మోహన్ గారు
శ్రీ తాటికొడాల సీతారామశాస్త్రి గారు
శ్రీ సొలసా దుర్గాప్రసాదు గారు
శ్రీ సరస్వతిభట్ల శ్రీధర్ గారు
శ్రీ అన్నావజ్జుల ప్రసాదు గారు
మరియు పట్టణ పురోహితులు
శ్రీ అవధానుల కృష్ణ శర్మ గారు
శ్రీ గడ్డం వెంకటేశ్వర శర్మ గారు
శ్రీ అయితపు శ్రీనివాస శర్మ గారు
శ్రీ కేదార శర్మగారు
శ్రీ యడవల్లి భాస్కరు గారు
పాల్గొనటం జరిగినది.
ఈ బృహత్తర కార్యానికి, సనాతన వైదిక ధర్మం పెద్దలు, దాతలు పూర్తి సహాయ సహకారములు అందించి ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని కోరుతున్నారు.

ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..*



       తప్పకుండా ఆలోచించాల్సిన

       అంశాలు ...

       ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...

       కొంత హిస్టరీలో కి వెళ్దాం...

       30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.

       డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..

       అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..

       దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.

       అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.

       ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు. 

       కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు.

       తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు.

       మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు.

       అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు.

       మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు.

       వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.

       తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం ...

       కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.

       కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు.

       దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?

       ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి.

       మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?

       అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి.

       ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది.

       కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు.

       కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది.

       కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.

       ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది.

       అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.

       మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?

       వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?

       దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...

       ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి... 

       ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.

       ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు.

       అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.

       కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.

       ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. 

       ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!

       అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. 

       ‌ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది.

       కష్టం చేసుకునే ప్రజల పిల్లలు.. 

       ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు..

       ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు.

       వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి  తీసుకెళ్లిపోయారు.

       ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది. 

       ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..

       ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.

       పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.



       ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది. 

       1. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం

       2. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం.

       3. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం

       4. ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.

       5. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..



       ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.



       ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?  ‌రాదు... 

       ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...

       అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?



       అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...

       ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.

       నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?

       ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!

       ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ...

       ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.

       నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..

       ఎడారిలో పండించండి ...

       మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.

       వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.

       నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.

       నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.

       వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.

       ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు.

       ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.

       మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..

       నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...

       అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..

       ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...

       పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..

       ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి.. 

       పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..

       ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.

       మేము చేర్చుకుంటాం...

       ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..

       మేము రానిస్తాం...

       ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..

       మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..

       ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.

       మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..

       ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.

       మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.

       ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.

       ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.

       మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.

       ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.

       మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...

       ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు.  ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.

       ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..

       మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...

       ★ మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...

       మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...

       ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...

       అవన్నీ మీకు కూడా తెలుసు...

       వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.

       అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు..

       లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...

       మరి మిగతా వాళ్ల సంగతేంటి..?

       మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..

       ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.

       ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది..

       అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.

       దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.

       నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే(share) అంత మంచి చేసినవారు అవుతారు......

గోదావరి - గేయం

మనసున్న తల్లి మా తూర్పు గోదావరి - గేయం
----------------------------------------
రచన: నూజిళ్ళ శ్రీనివాస్ గానం: శ్రీ సాకేత్ నాయుడు, సంగీతం: శ్రీ కిరణ్ కుమార్ ; ఎడిటింగ్: శ్రీ కృష్ణ, దేవి మణికంఠ కలర్ ల్యాబ్, రాజమహేంద్రవరం;
------------------------
అందరికీ నమస్కారం🙏🙏

ఇది గోదావరి పై నేను రాసిన తొలిపాట - సుమారు పది సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు, జిల్లా గీతం ఎంట్రీ గా రచించి, మద్రాస్ లో మిత్రులు, ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్, సంగీత దర్శకులు శ్రీ కిరణ్ కుమార్ గారి సంగీత సారధ్యం లో సిని నేపథ్య గాయకులూ శ్రీ సాకేత్ నాయుడు (పరుగు సినిమా ఫేం) గారి గానంతో రూపొందిన ఈ గీతం ఇన్నాళ్ళకు విడుదలకు నోచుకొంటున్నది.

జన్మనిచ్చిన ప్రాంతాన్ని (ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం... ఏదైనా) తలచుకొంటే పులకించని మనసు ఉండదు. అటువంటి పులకింతతో, ఆరాధనా భావంతో నేను పుట్టి, పెరిగి, తిరిగి చేరిన తూర్పు గోదావరి జిల్లా పట్ల నా భావాల సంకలనం ఈ పాట.

ఆయ్ మేం గోదారోళ్ళమండి... అన్న పాటను ఎటువంటి ఎల్లలు లేక, తెలుగు వారు అందరూ ఆదరించి, ఆశీర్వదించారు. అదే రీతిలో ఈ గీతాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ అవనిలో అన్ని ప్రాంతాలు ప్రత్యేకమైనవే.. సుందరమైనవే... మమతలను పంచేవే..   అందువల్ల, ఈ గీతాన్ని నా జిల్లా పట్ల నా కృతజ్ఞతాపూర్వక సమర్పణ గానే చూసి, తెలుగు వారు అందరూ ఆదరిస్తారని భావిస్తూ, వినమ్రంగా  ఈ పాటను సమర్పించుకొంటున్నాను.

Please Listen, Like, Comment, Share and Subscribe.😊

స్వస్తి

నూజిళ్ళ శ్రీనివాస్
ఫోన్: 7981862200
https://youtu.be/DBg101Opep8

సదు వొద్దు....

నాడు నేను స దువొద్దు
బాబా... బాబా...అంటే...
స దు కోరా   బిడ్డా... బిడ్డా...అనే పెద్దోళ్ళు
సదు వు వొద్దే...
సదిగి నోడు ఏం చెయ్యాలా అంటే ...
సదూ. కుంటే జరా
మంచిగా కొలువ్
దొరుకుద్దిరా బిడ్డా అనే..
నే నం టీ... యెట్టి చాకిరీ
తప్ప ఏరే కొలువెందే అనే...
అయిననూ.. చదూ కుంటే  జరా మంచిగా
ఏదో ఒక కొలువు
దోరుకుద్దిరా అనే...
మరి నేడో...
సతికీ సతకని సదువు తో అంటీ అంటని అక్ష రాల్ని బట్టుకుని ఏలాడి
చివరికి యెట్టి చాకిరీ చేసే
కార్మిక న్న పట్టం గట్టి
సర్కరోల్లు నను సంపు
తుండ్రు
అది జూసి నా తల్లీ దండ్రీ
ఆలీ బిడ్డా కూడా నడి మద్దెన అటు చెప్పాలేక
ఇటు వేరే దారి కానరాక
మగ్గుతుండ్రు
ఎందుకంటే......
వారికీ తెలిసింది నేటి
వెట్టి చాకిరీ కి అర్ధం
అందుకే సదువు వొద్దు
సదివితే నువ్వు మొద్దు.

మిడి మిడి చదువు. ల తో. కార్మికులు గా బ్రతికే
వారి మనివ్యధావి ష్కరణ ఈ సదువొ ద్దు.
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

****************

ప్రైవేటు బడిపంతులు

బ్రతుకు పోరాటంలో
       ప్రైవేటు బడిపంతులు
               *   *     *
కరోనా !
వేశావు
ప్రైవేటుపై విషపు కాటు
చేశావు
అక్షరాన్నినడ్డివిరిచి
నడిరోడ్డు చేటు !
దశాబ్దాల అనుభవముంటేనేమి
ఆత్మాభిమానంతోనే
బ్రతుకుతున్నారు
అరిగిన చెప్పుల్లోనైనా !
బాలల విద్యా తోటమాలియై
విజ్ఞాన భాండాగారమై
శక్తి కణాలను
ఒక్కొక్కటిగా దానం చేసి
నిస్సహాయకులై
రోజు కూలీలయ్యారు !
ఓనమాలు
దిద్దించే బ్రతుకు
చితికి పోతుండె
ఆహారన్వేషణలో !
ముద్దకోసం
తడిసి ముద్దయిపోతుండే
అక్షరాలు
చెమట చుక్కల్లో !
పరుషాలు నేర్పడమే కానీ
పరుషంగా
మాట్లాడనేరడు
నీతి శతకాలు
బోధనయే కానీ
అవినీతి
చేయనెరుగడు !
అక్షర కిరణాలతో
అజ్ఞానంధకారాన్ని
పారద్రోలు -గురువు !
అందలేని దానికై
ఆరాటపడక
పొందలేని వాటికై
ప్రాకులాడక
అందిన దానితో ఆనందిస్తూ...
పొందిన వాటితో పరవసిస్తూ...
ఆకాశమంత విశాల చీకటిలో
మిణుగురంత ఆశతో
బ్రతుకీడుస్తున్న
ఓ దివ్వె-గురువు !
ఎడారి జీవితంలో
అవకాశాలు
ఎండమావులైనా....
కన్నీళ్ళు ఒడిసిపట్టి
కుటుంబ దాహార్తిని తీర్చే
ఒయాసిస్సు -గురువు !
పూలమ్మిన చోటే
కట్టెలమ్మే పరిస్థితి
సర్కారైనా ఏకాక్షితో
ఓరచూపు చూడని దుస్థితి !
''విద్వాన్ సర్వత్రా పూజ్యతే''
నేటి కరోనావస్థలో
బరువులు మోస్తున్న
గురువు శోకాన్ని చూసి
శ్లోకాన్ని సవరించుకుంటున్నాయి
పురాణాలు !
నల్లబల్లపై
తెల్లని వర్ణాలు వ్రాసేటి
శిధిల సౌధం తెల్లని జీవితంలో
అలుముకున్నాయి
నల్లనిచ్ఛాయలు !
నిత్య కృత్య భూభ్రమణంలో
పాఠశాల చుట్టూ సాగిన
పరిభ్రమణం
అక్షరాలు అక్షం మారి
ప్లూటో గ్రహాలయ్యాయి !
తప్పించేదెవరు ఈ ఘోరం
భగవంతునికి తప్పదు భారం !!

రామాయణమ్ 15


..
అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!
ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.
.
అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!
వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.
.
మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.
.
ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.
 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!
.
యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !
.
ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!
.
ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.
.
యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !
ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .
.
పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.
.
((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్
( భాస్కర రామాయణం నుండి)
.
లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..
(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)
.
వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !
అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.
.
మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !
మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!
.
యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

పోత‌న త‌ల‌పులో‌ ...(4)


ప్రణవ స్వరూపుడు , ప్రమద గణాధిపతి ,పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన  గ‌జ‌ముఖుడి రూపాన్ని గుండెనిండా నింపుకున్న‌ పోత‌న త‌న ఘంటం నుంచి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం, ఈ గ‌ణేశుడి ప‌ద్యం.
                 ****
ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - బ్రపన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

                   ****
హిమగిరినందిని  హృదయానురాగాన్ని పొందినవాడు, కలిపురుషుని  దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నాల‌ను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయకుని నేను స‌భ‌క్తికంగా మ్రొక్కుతున్నాను. అంటూ తెలుగుజాతి చేత ఆనాటినుంచి గ‌ణ‌ప‌య్య‌కు ఈ ప‌ద్యంతో మ‌నచేత అక్ష‌రార్చ‌న చేయిస్తున్నాడు పోత‌న‌.

*Happy Friendship day*




స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఒకరోఇద్దరో స్నేహితులందరికీ ఉంటారు. కాస్త నడక, మాట వస్తే చాలు స్నేహం కోసం ఆ ప్రాణి ఎదురుచూస్తుంది. కేవలం మనుషులకే కాదు జంతువుల్లో కూడా స్నేహాన్ని చూస్తుంటాం. నోరు లేని ప్రాణులే  స్నేహం కావాలనుకొంటే ఇక మనసు, నోరున్న మనం స్నేహం కోసం అర్రులు చాస్తాం అంటే వింతేమ్తుంది? విచిత్రమేముంది?     స్నేహమేరా జీవితం! స్నేహమేరా శాశ్వతం !!         అని పాడుకున్నదే అందుకుకదా!?
స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. 98 ఏళ్ల వృద్ధునికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురైతే చాలు అప్పటిదాకా కదలలేక పడి ఉన్నా సరే చిటుక్కున  లేచి కూర్చుంటాడు. చిరునవ్వుతో పలుకరిస్తాడు. అంతటి శక్తి స్వచ్ఛత   ఒక్క స్నేహానికే ఉన్నయ్.
స్నేహం గురించి కేవలం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటే లౌకికంగానే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు కూడా మాట్లాడుతారు.
చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పెంచే శక్తి ఒక్క స్నేహానికి మాత్రమే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే   బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటారు. అమ్మనాన్న, ఉపాధ్యాయులు , అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం.
ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. స్నేహంలో ఎక్కువతక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు.
స్నేహానికి కాలంతో కూడా పట్టింపుండదు. వయస్సు తేడా రాదు. ఎవరి హృదయమైనా స్నేహం అనే మాటను పలికితే చాలు ఆ స్నేహమాధుర్యంతో ఆ హృదయశోకమంతా మాయమైపోతుంది. స్నేహం ఒక్క తరానితో ఆగిపోదు. తరతరాలకు తరగని గనిలా అందుతుంది.
మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. స్నేహానికి అవధులుండవు

🤝🤝🤝🤝🤝🤝🤝
*స్నేహితులు దినోత్సవ.. శుభాకాంక్షలు*💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹

వ్యాస భాగవతం

వ్యాస భాగవతం ద్వితీయ స్కంధము 4 అధ్యాయము లోని ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

భాగవతం 2-4-22

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో. (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో.
స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు, హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం) ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక

*అదిరిపోయే కామెడీ*



ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.
 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.

 "చెయ్యలేదు"

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.

"ఈ రోజు ఎంత మంది customers కి  సేల్స్ చేశావు?".

 "Sir ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.

 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"

 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్.

"What !!" 😳🤔 అదిరిపడ్డాడు  బాస్.

"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు.

"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."

"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.       

"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను.
ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేను అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4   డీలక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్ , దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి ప్యాక్ చేయించాను.”

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా

 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు మన సేల్స్ మాన్.

"మరి ? "  అన్నాడు బాస్.

 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను."

బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"

అప్పుడు మన సేల్స్ మాన్ చెప్పాడు ,
"ప్రీచైతన్య -పారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."

"టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్

"ఏ,బీ,సీ,డీ లు నేర్పమని వస్తే ,
పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ర్యాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం"... అని ఆన్సర్ ఇచ్చాడు ...

😜😁😁

మంత్రాలకు_అర్థం

మంత్రాలకు_అర్థం, మంత్రం_వెనుకున్న_మర్మం -:

అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రానికి ఉన్న అర్థమేమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.

ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలు, ఈ బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.

అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.

అసలు బీజాక్షరాలు అంటే... భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.

అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.

ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.

అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!డైలీ విష్

మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా? మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?

ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.

దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.

జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే.

*మేరా భారత్ మహాన్*

మన దేశ పరిస్థితిని చక్కగా వివరించిన కధనం

_*ఆలోచించ వలసిన విషయమే.*_                                                                                           
                                                                                                                 _*మేరా భారత్ మహాన్*_

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా...

_*"పేదరికాన్ని నిర్మూలిస్తాం"*_

70 సంవత్సరాలలో 70% పథకాలన్నీ దీనికే...

ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టారో లెక్కే లేదు...

నాకు అర్థమవని విషయమేంటంటే...

అసలు పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజానికి ఏమిటి?

ప్రతి మనిషి ఎవరి కష్టం మీద వాళ్ళు బ్రతుకేటప్పుడు,
మద్య తరగతి వాడి కష్టం - పేదవాడి కష్టం కన్నా ఏ విషయం లో తక్కువ?

ఈ పేదవాడు అన్నవాడు  ప్రభుత్వ దత్తపుత్రుడు ఎందుకవుతున్నాడు?

ప్రభుత్వం అందరిదీ అయినప్పుడు, మద్య తరగతి వాడి  పొట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు?

సమాజం సంవృద్దికి, అభివృద్ధికి పేదవాడి సహకారం ఏమిటి?

🚩వీడు టాక్స్ కట్టడు.
🚩పొదుపు చెయ్యడు.
🚩కుటుంబ నియంత్రణ పాటించడు.
🚩చట్టాన్ని గౌరవించడు.
🚩ఆరోగ్య సూత్రాలు పాటించడు.
🚩వీడికసలు కుటుంబ భాధ్యతే ఉండదు.
🚩వీడింట్లో పిల్లలకు అరటి పండుకి డబ్బు లుండవు కానీ మత్తిచ్చే మందుసీసాలకి లోటుండదు.
🚩అసలు వీడు అన్నింటిలోనూ భాధ్యతారహితమే.
🚩తూలుతూ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతాడు.
🚩సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు.
🚩సమాజ శ్రేయస్సు తో సంబంధం లేదు.
🚩సామాజిక భాధ్యత ఉండదు. 
🚩వీడికన్నీ ఉచితంగా కావాలి. 
🚩వీడికి అవినీతి తప్పు కాదు పైగా సమర్ధిస్తాడు.
🚩ఎవడు ఉచితాలు, డబ్బులెక్కువిస్తే వాడికే ఓటేస్తాడు.

అసలు మతలబు ఇక్కడే ఉంది...

రాజకీయ నాయకులకు కావలసింది ఆలోచించి ఓటేసేవాడు కాదు. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని స్వార్ధం తో ఓటేసేవాడే కావాలి. ఈరోజు ప్రభుత్వాలను పేదవాళ్ళే నిర్ణయిస్తున్నారు.

వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే, అవినీతిపరులు అంత సులభంగా అధికారం లోకి రావచ్చు.

అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు.

ప్రజాస్వామ్యం లో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతోంది.

అందుకే...

_*దేశంలో అన్యాయమౌతోంది పేదవాడు కాదు, మద్య తరగతి వాడు*_

_*పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరం లేదు. ఎందుకంటే ఉచితాలు పోతాయి*_

_*రాజకీయ నాయకులకూ పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగం లేదు*_

_*కాబట్టి పేదరికం ఎప్పటికీ నిర్మూలించబడదు*_

టాక్స్ లు కడుతున్న వెంగళప్పలు మాత్రం  రూ. ఇరవై పెట్రోల్ ని డెబ్బైకి కొనుక్కొని తింగరోళ్లలా తలదించుకుని ఉరుకుల పరుగులతో బ్రతుకీడుస్తుంటారు.

మౌలిక సదుపాయాలుండని  గతుకుల రోడ్ల పై తిరుగుతూనే ఉంటారు.

పైన చెప్పినట్లు.  పేదవాడు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తూ, సంక్షేమ పధకాలన్నీ పొందుతూ, మోటార్ సైకిల్, టివి, ఫ్రిజ్, మిక్సీ, కూలర్/ఎసి, స్మార్ట్ ఫోన్ (వీటన్నిటికీ కరెంటు ఫ్రీ)  లాంటివి అన్నీ ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు, ఉన్నా వాడరు...

వీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడి గా ఉంటారు. అలానే తూలుతుంటారు.

అసలు కారణం ఏమిటంటే ఆ ఇంట్లో నాలుగు ఓట్లుంటాయి మరి.

దేశం చుట్టూ సైనికలు రేయింబగళ్లు, ఎండా, వాన, మంచుల్లో మాత్రం పహరా కాస్తూనే ఉంటారు.

స్థూలంగా ఈ దేశంలో వెంగళప్పలు ఎవరయా అంటే -  బ్యాంక్ ఋణాలు ఎగ్గొట్టకుండా, నిఖార్సుగా వాయిదాలు కడుతూ, ట్యాక్స్ లు కట్టే మధ్యతరగతి మనిషి, నా దేశం అంటూ వీరస్వర్గం పొందే సైనికుడు, దేశానికి అన్నం పెట్టే  విలువ లేని రైతునూ...

కానీ... నాయకులు, ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయి వేసుకుని రాజరికం వెలగబెడుతూ కార్పోరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు.

🇮🇳 _*మేరా భారత్ మహాన్*_ 🇮🇳

సర్వసంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|

శుద్ధ సత్త్వస్వరూపే చ కోపాది పరి వర్జితే||

ఉపమే సత్త్వసాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|

త్వయా వినా జగత్సర్వం మృత తుల్యం చ నిష్ఫలమ్|

సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ|

రామేశ్వర్యధిదేవీ త్వం త్వత్కళాసర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా|

స్వర్గే చ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠే చ మహాలక్ష్మీ ర్దేవదేవీ సరస్వతీ|

గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా||

కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికాస్వయమ్|

రాసేరాసేశ్వరీ త్వం చ వృందా వృందావనే  వనే||

కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే|

విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ|

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే|

కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే||

కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ|

రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీః గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|

రురుద్దుర్నమ్ర వదనా శుష్క కంఠో తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|

యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|

సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||

కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|

హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||



ఇది మహాలక్ష్మీ స్తోత్రం. మహాప్రభవ సంపన్న మైన స్తోత్రం. దేవత లంతా కలసి ఆ జగజ్జ ననిని స్తోత్రించిన మహా వాక్యాలివి. శ్రీ



మహాలక్ష్మి సంపద లకి శ్రే ష్ఠ త్వానికి, కాం తి కీ ,

 ఇది ముఖ్యంగా పురుషులకు ఉత్తమమైంది స్త్రీలకు ఎట్లాగో అన్ని స్తోత్రాలు ఉన్నాయి



ఇది వివాహం కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఈ అందరూ చదువుకునేది రోజు 41 రోజులు కలవాలి నైవేద్యం పెట్టాలి పాయసం దీని విశేషమైంది దీనికి నియమాలేవీ లేవు



***********

30, జులై 2020, గురువారం

పుత్రదా ఏకాదశి_*

జై శ్రీమన్నారాయణ
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*


శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుంటే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకీ దీనిని *పుత్రాద ఏకాదశి* అని అంటారు .

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ

పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు . అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను , పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు .

చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాదలు ఏంటి , నువ్వు చేసిన పాపా కర్మములు ఏంటి అని అడగగా అప్పుడు తన పుర్వహృత్తంతం అంత చెప్పగా దయర్తా హృదయడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పేదను అని చెప్పి శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు .

పూర్వం రాజు వర్తక వ్యపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవు ని నిల్లలోకి తోసేసాడట దానికి పాపా పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం .
మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు . ఆ తరువాత రాజు గారి మంచి సంతానం కలుగుతుంది . దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు , రాజ్యం లో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట .
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపా లు అన్ని హరిస్తాయని , మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి . భవిస్య పురాణం లో వివరించడం జరిగింది .

*🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹*
*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*
****************

ఋణానుబంధం

ఒక యోగి  ఒక్కనాడు   ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు.

జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు.

ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.

వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.

వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు.

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.

 పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు.

రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.

అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో.....

అనే అర్ధంలో ఇస్తాడు.
దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు.

ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు.

ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు..

రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.

మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.

 పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.

అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.

వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
         అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
                                     
 స్వస్తి.....

*******************

రామాయణమ్ 15

అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!
ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.
.
అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!
వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.
.
మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.
.
ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.
 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!
.
యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !
.
ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!
.
ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.
.
యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !
ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .
.
పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.
.
((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్
( భాస్కర రామాయణం నుండి)
.
లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..
(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)
.
వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !
అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.
.
మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !
మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!
.
యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

పోత‌న త‌ల‌పులో‌ ...(4)

ప్రణవ స్వరూపుడు , ప్రమద గణాధిపతి ,పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన  గ‌జ‌ముఖుడి రూపాన్ని గుండెనిండా నింపుకున్న‌ పోత‌న త‌న ఘంటం నుంచి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం, ఈ గ‌ణేశుడి ప‌ద్యం.
                 ****
ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - బ్రపన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

                   ****
హిమగిరినందిని  హృదయానురాగాన్ని పొందినవాడు, కలిపురుషుని  దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నాల‌ను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయకుని నేను స‌భ‌క్తికంగా మ్రొక్కుతున్నాను. అంటూ తెలుగుజాతి చేత ఆనాటినుంచి గ‌ణ‌ప‌య్య‌కు ఈ ప‌ద్యంతో మ‌నచేత అక్ష‌రార్చ‌న చేయిస్తున్నాడు పోత‌న‌.

🏵️పోత‌న ప‌లుకులు---భ‌క్తిర‌స గుళిక‌లు🏵️

ద్వితీయ స్కంధము 4 అధ్యాయము

వ్యాస భాగవతం ద్వితీయ స్కంధము 4 అధ్యాయము లోని ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

భాగవతం 2-4-22

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో. (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో.
స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు, హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం) ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక

స్నేహితుల దినోత్సవం

స్నేహితుల దినోత్సవం   శుభాకాంక్షలు
చెలిమి నీవెక్కడ అంటే
నిర్మల మైన మనసులో
నిష్కల్మషమైన ప్రేమలో
ఉంటానంది
చెలిమి నీవెక్కడ అంటే
చెలిమికై ప్రాణం ఇవ్వకున్నా
మాటలతో చేతలతో గాయం చేయని
మంచి మితృల మదిలో
ఉంటానంది
మన చెలిమి ఈజన్మకే కాదు
ఎన్ని జన్మలెత్తిన ఉండాలి అంది
సృష్టి లో తీయని ది మన స్నేహం కావాలంది
మల్లెపూలు వాడి పోయినా
మన స్నేహం వాడిపోలేనిదై
ఉండాలి అంటుంది
చెలిమి నీవెక్కడ అంటే
చంద్రునికైనా మచ్చ ఉండవచ్చు కానీ
మన స్నేహానికి ఉండకూడదు
అంటుంది
ఇలాంటి లక్షణాలు కలిగిన
స్నేహితులు అందరికీ
నా కవిత అంకితం
ధన్యవాదాలు
****************

29, జులై 2020, బుధవారం

*జీవిత* *సత్యం*

:చాలామంది అనుకుంటారు...
ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత...
స్నానం చేసి పూజ చేయొచ్చు అని.‌..
ఇంట్లో పని అంతా అయిపోయి...
అలసిపోయి , అప్పుడు స్నానం చేసి...
ఏకాగ్రత లేని మనసుతో పూజను చేస్తారు...
కానీ అది చాలా పొరపాటు...
కనీసం ఉదయం ఆరుగంటల లోపు లేచి...
ముందుగా కాలకృత్యాలు తీర్చుకోవాలి...
ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు...
మనలో ఉన్న చెడు పదార్థాలన్నీ...
నూనె రూపంలో బయటకు వస్తాయి...
నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం వలన...
ఈ చెడు పదార్థాలు అన్నీ బయటకుపోయి శరీరం శుభ్రం అవుతుంది...
ఆ తరువాత ముందుగా దీపారాధన చేయాలి...
ఆ తర్వాతే స్తోత్రాలూ...
నైవేద్యాలూ అన్నీ సమర్పించాలి...
అన్నిటికన్నా దీపారాధన ముఖ్యం...
ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం...
భగవంతుడు జ్యోతి స్వరూపుడు...
మనలో ఉన్న ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే...
అందుకని మనం ఏమి సమర్పించినా కూడా...
ఆయన ఈ దీపారాధన ద్వారానే స్వీకరిస్తాడు...
అంతే కాకుండా...
ఈ దీపారాధన వల్ల పరిసరాలు పరిశుభ్రమై...
ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది...
రోజూ ఆవునేతితో దీపం వెలిగించడం...
ఎంతో శ్రేయస్కరం...
ఆరోగ్యదాయకం...
చాలామంది దీపాలకే కదా అని నాసిరకం నూనె వాడేస్తుంటారు...
కానీ దానివల్ల ఇంకా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది...
మనం పదార్థాలను తింటే వచ్చే శక్తి కన్నా...
వాయు రూపంలో పీల్చడం వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది...
అందువల్ల దీపానికి వాడే నూనె పట్ల శ్రద్ధ వహించాలి...
మంచి విషయం అయితే తొందరగా తెలియదు గాని...
చెడు విషయాన్ని ఉదాహరణగా తీసుకుందాం...
ఒక విష పదార్థాన్ని తినేకన్నా...
విషవాయువులు పిలిస్తేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది...
అదేవిధంగా ఇది కూడా...
అందరూ సూర్యోదయానికి ముందే...
ఈ దీపారాధన చేసే విధానం వల్ల...
మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది...

 *సర్వేజనా* *సుఖినోభవంతుః* 🙏

 *జై* *శ్రీ* *కృష్ణా* ...💐🙏

త్వమేవాహమ్‌*

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 
సాగే ప్రస్థానం.......
పేరే......

             *నేను =I*

*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ 
*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

*ఈ "నేను"* లోంచే 
*నాది* అనే భావన పుడుతుంది!

*ఈ *నాది* లోంచే....

1.నా వాళ్ళు, 
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ, 
7.నా ప్రజ్ఞ, 
8.నా గొప్ప... 

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              *EGO అహం* 

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.

*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*

1. పంతాలతో 
2. పట్టింపులతో, 
3. పగలతో, 
4. ప్రతీకారాలతో...... 

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య, 
2.కౌమార, 
3.యౌవన, 
4.వార్ధక్య,  

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*

 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*

 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*

*1.నేనే*  శాసన కర్తను, 

 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని, 

*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* 
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.

*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!

   *అది శాశ్వతం కానే కాదు*

ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 
*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.

*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.

*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*

*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*

*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*

*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా, 
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో, 
5.భగవత్‌ ధ్యానం 

తో జీవించమనేదే
*వేదాంతసారం*.

*అహం బ్రహ్మాస్మి* అంటే 
*అన్నీ నేనే* అనే స్థితి నుంచి
*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని 
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత* 

భిక్షగాడు- కోటీశ్వరుడు

*డబ్బు గురించి పొదుపు/పిసినారి తనం గురించి గొప్ప సత్యాన్ని నేర్పించే రాజు – బిచ్చగాడి కథ..!*
అది ఓ రాజ్యం. రాజు, మంత్రి ఇద్దరు మాట్లాడు కుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజుతో ఓ మాటంటాడు. రాజా.. మీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. చివరకు అడుక్కునే వాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు మీ రాజ్యంలో అన్నాడు మంత్రి. 

 దీంతో రాజు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. చాలా తెలివి ఉన్న ఆ రాజు.. అవునా.. నా రాజ్యంలో బిచ్చగాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడా? సరే.. పదా! మంత్రి ఓసారి రాజ్యం చూసొద్దాం అని రాజు, మంత్రి ఇద్దరూ మారు వేషంలో రాజ్యంలో అడుగుపెట్టారు. 

ఓ చెట్టు కింద అడుక్కునే వ్యక్తి హాయిగా నిద్ర పోతున్నాడు. ఉదయం అడుక్కొని తిని నిద్ర పోతున్నాడు. మళ్లీ సాయంత్రానికి అడుక్కో వడానికి వెళ్తాడు. మళ్లీ రాత్రి అక్కడే నిద్రపోతాడు. అదే అడుక్కునే వాడి జీవితం. ఎటువంటి బాదరబందీ లేకుండా హాయిగా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. మారువేషంలో ఉన్న రాజు, మంత్రి ఇద్దరూ ఆ చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి రాజు.. మంత్రిని 90 రూపాయలు ఇవ్వాలంటూ అడిగాడు. దీంతో అదేంటి.. రాజు అటూ ఇటూ కాకుండా 90 రూపాయలు అడిగాడు అంటూ కాస్త అనుమానంతోనే ఇచ్చాడు.
వెంటనే రాజు 90 రూపాయలను ఆ బిచ్చగాడి దగ్గర పడేశాడు రాజు.

 నిద్రలేచిన తర్వాత ఆ బిచ్చగాడు 90 రూపాయలను చూసి అబ్బ.. 90 రూపాయలు.. వీటికి ఓ 10 రూపాయలు చేరిస్తే… 100 రూపాయలు పొదుపు అవుతాయి .. అని అనుకున్నాడు. 

వెంటనే బయలుదేరాడు. అక్కడా ఇక్కడా అడుక్కున్నాడు. అటూ ఇటూ చేసి 100 రూపాయలు చేశాడు వాటిని. వాటిని దాచుకొని అదే చెట్టు కింద పడుకున్నాడు. తెల్లారి లేచి 100 రూపాయలను చూశాక ఆ బిక్షగాడికి మరో ఆలోచన వచ్చింది. వీటిని ఖర్చు పెడితే వెంటనే ఖర్చయి పోతాయి. వీటికి 900 కలిపితే.. 1000 రూపాయలు అవుతాయి కదా అనిపించింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కష్టపడ్డాడు. వాళ్లను వీళ్లను అడుక్కున్నాడు… వెయ్యి రూపాయలు చేశాడు.

 తర్వాత మరో ఆలోచన వచ్చింది. 99000 వీటికి చేర్చితే.. లక్ష రూపాయలు అవుతాయి కదా… అనిపించింది. అలాగే ఈసారి తీవ్రంగా శ్రమించాడు. లక్ష అయింది. ఇంకా కష్టపడి 99 లక్షలు చేర్చితే కోటి అవుతుంది కదా అనిపించింది. ఇంకా తీవ్రంగా శ్రమించాడు. కోటి చేశాడు చివరకు. కోటీశ్వరు డయ్యాడు. 

బిక్షాధికారిగా ఉన్న ఆ వ్యక్తి లక్షాధికారి.. అట్నుంచి కోటీశ్వరుడయ్యాడు.
డబ్బు వచ్చాక మనిషి ఎలా అవుతాడో తెలుసు కదా. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు.. మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అంతా బాగుంది. కానీ.. మనోడిలో ఏదో ఒక అసంతృప్తి. డబ్బు, పెళ్లాం, పిల్లలు.. ఇలా అందరూ ఉన్నా.. మనోడికి ప్రశాంతత లేదు.. సంతృప్తి లేదు. దీంతో తాను బిచ్చగాడిగా ఉన్నప్పుడు ఉన్న అదే చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు. రాజు, మంత్రి అదే చెట్టు మీద మారువేషంలో పైనున్నారు. వాళ్లు కిందికి దిగి.. చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూసి.. అయ్యో.. మీరు కోటీశ్వరులు కదా ఇక్కడ కూర్చున్నారేంటంటూ రాజు అతడిని ప్రశ్నించాడు.


దీంతో ఆ కోటీశ్వరుడు గా మారిన బిక్షగాడిలా అన్నాడు. ఇదే చెట్టు కింద ఏమీ లేకుండా అప్పుడు కూర్చున్నా. నా దరిద్రం… ఏంటంటే.. 90 రూపాయలు ఇక్కడే దొరికాయి నాకు. ఆ 90 రూపాయలే నా కొంప ముంచాయి. 90 రూపాయలకు 10 రూపాయలు కలిపి 100 చేశా. ఆ వందకు 900 కలిపి వెయ్యి చేశా. వెయ్యికి 99 వేలు కలిపి లక్ష చేయాలనిపించింది. అలా పొదుపుగా కోటి రూపాయలు  సంపాదించా. డబ్బు అయితే సంపాదించా కానీ.. మనసు ప్రశాంతంగా లేదు. ఏదో లోటుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నోట్ల  కట్టలు, నా కష్టాలూ ఉన్నాయి తప్పితే.. సంతోషం, ఆనందం లేవు. అవి కోల్పోయాను అంటూ రాజుతో చెప్పాడు ఆ వ్యక్తి.

 అప్పుడు బేఫికర్ గా ఉండే వాడిని. నా దగ్గర ఏదీ లేదు.. ఇదే చెట్టు కింద హాయిగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ.. హాయిగా నిద్రపోలేక పోతున్నాను.. అంటూ చెప్పడంతో... అప్పుడు మంత్రికి రాజు ఎందుకు అప్పుడు 90 రూపాయలు కింద పారేశాడో అర్థమయిందట. 


ఇందలి నీతి: *మనిషికి జీవితంలో పొదువు అవసరమైన అంశమే గానీ మనిషి యొక్క కనీస జీవితం అవసరాలకు కూడా ఖర్చు పెట్టకపోతే అట్టి వాని జీవితం పై కథలలోని బిక్షగాడి మాదిరిగా నరకప్రాయ మవుతుంది.

*సత్సాంగత్యము - ప్రభావం

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దేవర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.
(ఒక జ్ఞాని పంపిన పోస్టు)

*సత్యవ్రతమహారాజు*



కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు....

సినారె #ముద్ర



నా చిన్నప్పుడు వేంకటపార్వతీశ్వరకవుల రచనలైన ‘పిల్లల బొమ్మల రామాయణం, భారతం..’ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పుడు (1958 ప్రాంతాల్లో) అప్పటికింకా తెలంగాణాగురించి మాకెవరికీ సరిగా అవగాహనే ఉండేది కాదు. ఒక రోజున మా నాన్నగారు చెప్పారు - “ఒరేయ్! తెలంగాణాలో దాశరథి, నారాయణరెడ్డి అనే ఇద్దరు యువకవులు కూడా ఈ బొమ్మల గ్రంథాలను చాలా బాగా వ్రాశారురా!” అని. అదీ నేను మొదటిసారి వీరిరువురి పేర్లూ వినడం.

తరవాత ఇద్దరి రచనల పేర్లు మాత్రమే విన్నాను మరికొన్నాళ్ళు.

1962లో అనుకుంటా - ‘ఇద్దరు మిత్రులు’ ఒక ప్రక్కన, ‘గులేబకావళి’ మరొక ప్రక్కన పోటీగా ఆడుతున్నాయి. ఒక రోజున (కొవ్వూరులో) మా ఇంటి వెనకాల ఏదో కార్యక్రమానికి సినిమా రికార్డులు వేస్తున్నారు. (నాకేమో ఎన్టీ-ఆరంటే ఒక పిసరు అభిమానం ఎక్కువే!) అందులోని పాట “నన్ను దోచుకొందువటే” (అది భీంప్లాస్ రాగంలో ఉందని తరవాత తెలిసింది) విని, దాదాపు నాకు మతిపోయినంతపనయింది! ఆ రికార్డు వేస్తున్నతడిని మంచిచేసుకుని, అక్కడ 3 గంటలపాటు కూర్చుని, ఒక ఏడెనిమిది సార్లు విని ఉంటాను! అంతగా నచ్చేసింది ఆ పాట నాకు. (మరొక రెండు నెల్లో మల్టీపర్పస్ పరీక్షలు (12th) మాకు!)

సుమారు మరొక 30 సంవత్సరాల తరవాత  సినారె తన ఆత్మకథను వ్రాసుకున్నపుడు ఈ సినిమాకు పాటలు వ్రాసే అవకాశం ఎలా కలిగిందో వ్రాసుకున్నాడు.

(ఈయన తన అగ్రజుడని పిలిచే దాశరథి సినీరంగంలోకి చేరాడు అప్పటికే. ఆత్రేయ తీసిన సినిమా ‘వాగ్దానం’లోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా!’తో ఆయన రంగప్రవేశం చేశాడని విన్నాను.) ఎన్టీ ఆర్ కు ఈయన ప్రతిభాపాటవాలగూర్చి తెలిశాక, ఎవరో ఆయనకు ఈయన్ను పరిచయంచేశాడట! ఇద్దరూ మాట్లాడుకుంటూంటే ‘మాకొక పాటతో సినీరంగప్రవేశం చేయండి!’ అని ఆయన అడగ్గా ఈయన “సింహద్వారంగుండా ప్రవేశంచేయాలని ఉందండీ నాకు!” అన్నాడట. (అంటే ఒకే చిత్రానికి అన్ని పాటలనూ వ్రాయడమన్నమాట!) “సరే, ఆ అవకాశం మేమే ఇస్తామేమో!” అని నవ్వుతూ ఎన్టీ ఆర్ అన్నాడట.

అనుకోకుండా ఒకరోజు ఈయనకు ఫోనొచ్చిందట మద్రాసునుండి - ‘రామారావుగారు మీతో మాట్లాడాలంటున్నారు!’ అని, ఒకాయన హైదరాబాదులో ఈయనకు ఫోనివ్వడం, ఆ హీరోగారు ‘మా గులేబకావళి చిత్రానికి #మీరే #అన్ని #పాటలూ #వ్రాస్తున్నారు!’ అనడం, ఈయన ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

మద్రాస్ సెంట్రల్ స్టేషనుకి రామారావే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళడం, పది పన్నెండురోజులు ఆయన ఇంట్లోనే ఉండి, ఆయనకు నచ్చినట్లుగా తాను మొత్తం పాటలు వ్రాయడం - ఈ వివరాలనన్నిటినీ సినారె వ్రాసుకున్నాడు తన పుస్తకంలో.

అంతే కాదు, అదే సమయంలో (మద్రాసులో ఉండగానే) నాగేశ్వరరావు సినిమా ఒకదానికి ఒకటిరెండు పాటలను వ్రాయమని కబురొస్తే, ఈయన రామారావుగారిని అడగడానికి జంకాడట. ఆయనే ఈయన ఇబ్బందిని గ్రహించి, ‘బ్రదర్ సినిమాకి వ్రాయడానికి జంకూగొంకూ ఎందుకు? ఆ పని కూడా చేసుకోండి. మీకిక తిరుగుండదు!’అన్నాడట ‘మా’ హీరోగారు.

అంతే ఆ ఆశీర్వచనం ఫలించింది - సినారె సినీ-ప్రస్థానం ఆ  విధంగా మొదలైంది, ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు!

(రామారావు మరణించినప్పుడు #నిజంగా భోరున ఏడ్చినవారిలో సినారె ఒకడు!)

నేను ‘సినారె’ను 1964లో హైదరాబాద్ లోని వైయంసీఏలో చూచాను మొదటిసారి. ఆరోజు సినిమాపాటలలోకి జానపదసాహిత్యాన్ని చొప్పించడంగురించి ఆయన మాట్లాడినట్లు,
‘సెనగచేలో నిలబడి..’ అనే పాట పాడివినిపించినట్లుగా గుర్తు.

ఆయన ‘కర్పూరవసంతరాయలు’ ఖండకావ్యాన్ని, మరికొన్ని ఇతరరచనలనూ మాత్రమే నేను చదవగలిగాను. ఆయన గజళ్ళగురించి నాకు ఎక్కువగా తెలియదు.

ఆయన సినీరచనల్లో నేను మరచిపోలేని కొన్నిటిని క్రింద పేర్కొంటున్నాను:

1) ‘గంగావతరణం’ - బాపు సినిమా “సీతాకల్యాణం”

2) రెండు సినిమా హరికథలు - ‘కలెక్టర్ జానకి’ & ‘స్వాతిముత్యం (రామా! కనవేమిరా?)’

3) ‘ఎంత దూరమో? . ’ - ‘ఏకవీర’  (ఆ చిత్రానికి సంభాషణలు ‘సినారె’వే)

4) ‘చిత్రం! భళారే విచిత్రం!’ - ‘డీవీఎస్’ కర్ణ’

5) ‘పూవై విరిసిన పున్నమి వేళా.. ‘ - ‘శ్రీతిరుపతమ్మ కథ’

6) ‘దాచాలంటే దాగదులే...’ - ‘లక్షాధికారి’ (సంగీతదర్శకుడు చలపతిరావుకు ఈయన ట్యూన్ కూడా కూనిరాగంతో సూచించాడట!)

7) ‘కిలకిల నవ్వులు...’ - ‘చదువుకున్న అమ్మాయిలు’

8) ‘చెలికాడు నిన్నే..’ - ‘కులగోత్రాలు’

9) ‘గోరంత దీపం… (నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి..)’ - ‘గోరంత దీపం’

10) ‘గోగులు పూచే గోగులు కాచే..’ - ‘ముత్యాలముగ్గు’

11)  ‘ఊయలలూగినదోయి మనసే (భానుమతి)’ - ‘బొబ్బిలియుద్ధం’

12) ‘కలల అలల...’ - ‘గులేబకావళి కథ’

అయినా ఎన్నని చెప్పగలను(ము)? అదొక పెద్ద అమూల్యమైన భాండాగారం.

ఆయన జోక్ ఒకటి మరచిపోలేనిది - 'తూర్పు-పడమర' సినిమాలో - "#మీ #బిల్లుకు #నా #పాట #చెల్లు!"

1969లో చోటుచేసుకున్న ‘వేరు తెలంగాణా’ ఉద్యమంలో ‘మాకు కావలసినది #వీర #తెలంగాణా’ అన్న ‘పక్షం’లో ఈయన నిలిచాడు.

అదే సమయంలో ‘తెలుగుజాతి మనదీ..’ (‘తల్లా? పెళ్ళామా?’ సినిమాకి) అనే ప్రసిద్ధమైన పాటను వ్రాశాడు కూడా.

ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన పెట్టించిన విగ్రహాలకు సంబంధించిన వాక్యాలను వ్రాయడంలో కూడా సినారె హస్తం ఉందని విన్నాను.

‘#మార్పు #నా #తీర్పు’ అనే ఒక మకుటంతో వచ్చిన ఆయన కవిత ఒకటి జ్ఞాపకం వస్తుంది తెలంగాణా వేరుపడడాన్ని తలుచుకున్నప్పుడల్లా. ఆయన చివరిరోజుల్లో జరిగిన ఈ ఏర్పాటుపైన  ఆయన ఏ విధంగా స్పందించాడో ఆలోచించడం కూడా గతజల-సేతుబంధనమే!

‘పుట్టినరోజు పండగే అందరికీ …’ అనే పాటలో ఆయనే చెప్పినట్లుగా ‘పుట్టింది ఎందుకో తెలిసిన’ కొందరిలో కచ్చితంగా ఆయన ఉంటాడు, ఇక ఆయన సాహిత్యమంటారా? ఎప్పటికీ నిలచి ఉండేది అది!

భౌతికంగా ఆయన మనమధ్య లేడు గానీ, తెలుగు సాహిత్యంలో తనదైన ఒక చెరగని ముద్ర వేసి మరీ పరమపదించాడు.

విశ్వనాథవారు స్వర్గస్థులైనపుడు మా సాహిత్యమిత్రులం అనుకున్నాం ‘ఒక వటవృక్షం కూలిపోయిం’దని! ఈయన విషయమూ అంతే!
(అయితే, ఈ వటవృక్షాలు వేరే మొక్కలు ఎదగకుండా అడ్డుకున్నవి మాత్రం కావు!)

నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు

భట్టాచార్య

సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

నాద యోగాభ్యాసంలో భాగంగా,  ప్రణవ సాధన చేసేవారికి....మొదటి దశలో, లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష  (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు.......వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. సాధన మధ్య దశలో 1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని...పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం....లాంటి వివిధ నాదాలు....అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి.

  సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే....అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ...పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది.

శ్రేయోదాయక మార్గగామి


తరతరాల వారసత్వ ధార్మిక జీవన వ్యవస్థ మనది ! కోటానుకోట్ల వత్సరాల అత్యద్భత చరిత భరతఖండపు సొంతం ! ఈ పుణ్య స్థలిపై అపౌరుషేయంగా ఆవిష్కరించబడ్డ వేద సంస్కృతి ! భారతీయ సనాతన ధర్మపు మూల స్థంభమై నిలిచిన సంస్కృత భాష ! ప్రతి పదమందున, ఆ భాషా సౌలభ్యం, " సుమైత్రీ భావనాత్మకతా వికాసం, సజ్జన సాంగత్యపు ఆవశ్యకతా నిర్దేశనం ", మన భరత జాతికి గొప్ప వరం ! వేద విజ్ఞానం అనాదిగా నేర్పెడి సఖ్యత, సారూప్యత, విశ్వ ప్రశాంతతకు వెన్నుదన్నై నిలచు ! భారత దేశం, నేటికీ, ఏనాటికీ సకల విశ్వ జీవజగతి శ్రేయోదాయక మార్గగామి ! శ్రుతుల, స్మృతుల, ఉపనిషత్ కథల రూపాన అనుక్షణం వేద సంస్కృతి, సకల లోక స్నేహ చైతన్య స్ఫూర్తి ! వసుధైక కుటుంబక ఆవిష్కరణకు ఏనాటికైనా వలసిన ధర్మం, సుమైత్రీ భావనాత్మకత ! ఆది నుండి ఈ పవిత్ర పృధ్విపై చక్కని కుటుంబ వ్యవస్థకు మారుపేరై నిలిచిన మన భారత దేశం ! ప్రజాస్వామిక వ్యవస్థ మూలాలకు ఆస్కారం, చక్కని సయోధ్య, సుహృద్భావం ! ఈ ధర్మ పద్ధతి విశ్వ వ్యాప్తంగ సదా సర్వదా ఆచరణీయం, అనుసరణీయమన్న సత్య దార్శనికత !                        దురదృష్టకరం, నేటి విశ్వ వ్యాప్త దుర్భర స్థితిగతులు, ఈ ధర్మాన్ని అతిక్రమించడం బహు శోచనీయం ! నేటి విశ్వ విద్వేషాలు, అనుమానవమానాలు తేలేవెన్నటికి సుహృద్భావ, సువ్యక్తిత్వ సానుకూల స్థితిగతులను ఈ ఇలపై ! రానురాను క్రూరత్వం, ఆపై ఉగ్రవాద స్వభావం, విశ్వ వ్యాప్తంగ పెచ్చుమీరుతున్న దుస్థితి ! మానవ సంబంధాలు గతి తప్పుతున్న నేపథ్యంలో నేటి విశ్వ వ్యాప్త జీవన గమనం !                                                   నేటి విశ్వ మానవాళి నందు, సుమనోవిజ్ఞాన స్ఫూర్తితో, సుసంపన్నమైన సమైక్య భావనాత్మక మైత్రి నెలకొనాల్సిన తరుణమిది ! వారి మనమున, " జీవకారుణ్యతా సహృదయ చైతన్య భావన ", ఆవిష్కృతమవాల్సిన నేపథ్యం ! పవిత్ర భారతీయ సనాతన ధర్మపు మూల సూత్రం, " బ్రతుకు, బ్రతకనివ్వు, అనెడి సానుకూల సముచిత సమైక్య చింతన ", మన వేద విజ్ఞానం నేర్పెడి ధర్మబద్ధ జీవన పద్ధతి ! ప్రాతఃకాలపు కుక్కుట నాద మైత్రీ భావనాత్మక స్ఫూర్తి, అనాదిగా ప్రకృతి ఈ విశ్వ జీవజగతికి మార్గదర్శి ! సుస్నేహ సానుకూల సుహృద్భావ మైత్రీ బంధం, ఈ పవిత్ర పృధ్విపై ప్రశాంత జీవన సోపానం ! బ్రహ్మ దేవునిచే ప్రత్యేక విధాన సృష్టించబడ్డ మానవ జాతి, సకల విశ్వ జీవజగతి ప్రశాంత జీవన గమన ఆశాజ్యోతి !                      " యద్భావం తద్భవతి "                             

సర్వే భవంతు సుఖినః ! 
సర్వే సంతు నిరామయా ! 
సర్వే భద్రాణి పశ్యంతు ! 
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! 🙏                                   

సహనావవతు ! సహ నౌ భునక్తు ! 
సహవీర్యం కరవావహే ! తేజశ్వి నావధీతమస్తు ! మా విద్విషావహై !
ఓం శాంతి శాంతి శాంతిః                                               ✍️
గుళ్లపల్లి ఆంజనేయులు

చెణుకులు

రిటైర్డ్ అయి ఇంట్లో కూర్చున్న భర్తలని
హోమియో పతి (Home - o-pati )
అంటారు!

భర్తలు ఇంటికి ఎంత లేట్ గా వచ్చినా
భార్య ఇంట్లోకి రానిచ్చే  ప్రక్రియ ని
అల్లో పతి (allow - pati ) అంటారు! 🤣

భార్యలు ఆఢించినట్టు ఆడే భర్తలను
 నాచ్ రో పతి అంటారు
*************

*ప్రసాదాలలో పోషక విలువలు !!*

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

*జీర్ణశక్తిని పెంచే ' కట్టె పొంగళి*
బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*
బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .!
                         
*మేధస్సును పెంచే దద్యోధనం*
బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది !!     
                   
*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబప్రసాదం*
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి, పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు , పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం!!
                                                     *శ్లేష్మాన్ని తగ్గించే  పూర్ణాలు* "పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .!!

*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*
బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం !!

*కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది. ☘️🙏🏻☘️

Almost all Indian recipes are medicinal , nutritional and healthy.
*****************

సెలవ రోజు

“రేపు ఆఫన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు?" కొంచెం కోపాన్ని మిళితం చేసి సంధించిన ప్రశ్నకి నీళ్ళూ, వక్కపొడీ కలిపి నముల్తున్నాను. 

“నువ్వలా ఈడీవాళ్ళలా ప్రశ్నిస్తే డాడీ ఏంచెప్తారమ్మా? ఆఫ్ ఎప్పుడు తీసుకోవాలా అని సాయంత్రం దాకా డైలమాలోనే వున్నార్ట!" అప్పుడప్పుడు సపోర్టుకొచ్చే పిల్లలు ఆరోజూ వచ్చారు.

మనం ఆఫ్ తీసుకుంటే ఆరోజు ఇల్లు సర్దుకోవడానికి కేటాయిస్తూవుంటాం. ఇది రామాయణకాలంనించీ జరుగుతున్నదే మాయింట్లో.

ఇల్లు సర్దడం విషయంలో ఎన్టీయార్ కి లక్ష్మీపార్వతిలా వుంటుంది నాసహాయం. ఆ సహాయం పనికొచ్చేదో, పనికిరానిదో చెప్పడం కష్టం. బయటివాళ్ళకి చూస్తే సాయంలాగే అనిపిస్తుంది. తనకిమాత్రం నేను తనపనికి అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది.

పిల్లలు ఇప్పుడంటే పెద్దాళ్ళైపోయారుగానీ చిన్నప్పుడు ఏం ఏడిపించారని! స్కూల్నించి రాగానే యూనిఫారాలు మార్చమని చెవినిల్లు కట్టుకుని పోరినా చలించేవారు కాదు.

ఒకవేళ మార్చినా మా రెండోవాడు పాము కుబుసం విడిచిపెట్టినట్టు ఎక్కడ విప్పితే అక్కడే వదిలేసేవాడు బట్టలు! ఉతకాల్సిన బట్టలకోసం ఓ బుట్టుంటుందనీ, అందులోనే వెయ్యాలని చెప్పిచెప్పి అలిసిపోయాం.

ఇక మన సంగతి. స్వతహాగా పుస్తకాల పురుగునవడంవల్ల ఇంట్లో చాలా పుస్తకాలుంటాయి. వాటిలో పనికిరాని చెత్తంతా ఏరేసి పాతపేపర్లవాడికి ఇచ్చేద్దామని తను, ‘అలా ఎలా ఏరేస్తాం?' అని నేనూ కాశ్మీర్ సమస్యలా చాలాకాలంనించీ నానుస్తున్నాం.

పోనీ కష్టపడుతోందికదా సాయంచేద్దామని చిన్న స్టూల్ తెచ్చుకుని పై అల్మైరాలు సర్దుతోంటే...‘పొట్టాడా! పొట్టాడానీ! అవికూడా అందవు! ఓసారి అద్దంలో చూస్కో!' అంటూ ర్యాగింగ్!

మనకి కొన్ని సరదాలున్నాయి. ఇల్లెప్పుడూ ఒకేలావుంటే నచ్చదు నాకు. ఏదో మొనాటనీ కనబడుతుంది. అంచేత తిరపతి కొండమీద ఆఫీసులు మాటిమాటికీ మార్చేసినట్టు మాయింట్లో వస్తువులన్నిటినీ వాటివాటి స్థానాల్ని మార్చేస్తూవుంటాను.

ఓ రెండునెలలు కంప్యూటర్‌ టేబుల్ హాల్లోవుంటే తరవాత బెడ్రూంలోకి చేరుతుంది. మాకిద్దరికీ పెద్దగా ట్రాన్స్‌ఫర్లు లేవుగానీ దానికిమాత్రం తరచూ బదిలీలే!

మంచాల్ని వేరే దిశలోకి మార్చడం, ‘అచ్చం నీమొహంలా వుంది!' అని తనన్న తరవాత మళ్ళీ యథాస్థానంలోకి మార్చెయ్యడం చాలాసార్లయింది. అయినా సరదా తీరదు మనకి!

ఎల్లైసీలు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులూ...ఇవన్నీ ఇప్పుడంటే టాబ్లెట్లో కట్టిపడేస్తున్నానుగానీ ఒకప్పుడు అవన్నీ గుట్టలుగుట్టలుండేవి ఇంట్లో. ఇక మన ఐటీ రిటర్న్స్, ఆఫీసువాళ్ళిచ్చిన లవ్ లెటర్సూ లక్షల్లో వుంటాయి.

‘ఓసారిలా రండి! నేను మీకు డేట్లవారీగా ఇస్తూవుంటాను. వేటికవి ఒకపక్కగా పెట్టండి!' అన్న పిలుపుతో మనం వింటున్న పాటలు ఆపేసి మొత్తం కాగితాలన్నీ పరుపుమీద పరిచేసేవాణ్ణి.

ఆ పనికి ఎప్పుడూ దుర్ముహూర్తమే సెట్టయేది. మొదలెట్టిన మూడునిమిషాల్లో మూడుకేసులున్నాయని ఫోను మోగేది.

ఆమధ్య మాయింట్లో ఎప్పుడు చూసినా ఒక ఎలక్ట్రీషియనో, ప్లంబరో తిరుగుతూ కనబడేవారు. నేనుకూడా వాళ్ళలో కలిసిపోయి వెనకాల వైర్లవీ మెళ్ళో వేసుకుని చాలా బిజీగా ఇల్లంతా తిరిగేస్తూవుండేవాణ్ణి!

ఇంట్లో రకరకాల లైట్లు, ఫోకస్ లేంప్స్, లేజర్ లైట్లు, ఎల్యీడీ లైట్లు వుంటాయి.....అన్నీ పెడితే దసరాలకి మైసూర్ ప్యాలస్ లావుంటుంది ఇల్లు! అదో సరదా!

జీవితానికి రంగులద్దుకోమని చెప్పాడుగా అదేదో సినిమాలో! అంచేత మనకి మనమే అలా కలర్‌ఫుల్ గా మార్చేసుకుంటే తుత్తిగావుంటుంది.

మొత్తానికి రెండింటిదాకా సర్ది, కాస్తంత కడుపులో పడేసుకుని, నిద్రపోదామని గదిలో చేరాను.

మధ్యాహ్నం పూట కాసేపలా కునుకుతీద్దామంటే ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకువాళ్ళూ, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకువాళ్ళూ ఒప్పుకోరు. నా ఆరోగ్యంపట్ల వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ.

‘అలా మధ్యాన్నాలు నిద్దరోతే డాట్రారికి పొట్టొచ్చేస్తుంది! వెళ్ళి లేపండమ్మా!’ అని ఇద్దరమ్మాయిల్ని ఉసిగొల్పి వదిలారు.

మామూలుగానే వాళ్ళు లోనిస్తాననడం, నేనేమో ఆల్రెడీ నాకున్న ఇన్‌స్టాల్మెంట్ల వివరాలన్నీ అష్టోత్తరంలా చదవడం, ఆపిల్ల నేచెప్పిందంతా శ్రద్ధగా విని, ఆనక మళ్ళీ ‘లోన్ తీసుకోండ్సార్!’ అని గోముగా అడగడం.....ఇదంతా మాకు విషాదభరిత వినోదం!

హాల్లోకి వచ్చేసరికి మాటీవీ సీరియల్లో హీరోయిన్ ఏడుస్తోంది. మిగతా అన్ని ఛానళ్ళలోనూ లలితా జ్యూయలర్స్ యాడొస్తోంది. నాకేంచెయ్యాలో తోచక రిమోట్ పట్టుకుని వెర్రిచూపులు చూస్తోంటే తను రెండుకప్పుల్లో కాఫీ పట్టుకునొచ్చింది.

‘నాకు పెద్ద కప్పెందుకిచ్చావు? నాకోసం నీ ప్రమోషన్లన్నీ ఫోర్‌గో అయిపోయావు, పిల్లల్ని స్కేటింగులకీ, ట్యూషన్లకీ బండిమీద తిప్పావు, నాకు హాస్పిటల్‌కి కేరేజీ కూడా చాలాసార్లు మోసుకొచ్చావు. అన్ని త్యాగాలు చేసిన నువ్వు తక్కువ కాఫీ తాగుతావా?’ అన్నాను ఆరాధనగా తన కళ్ళలోకి చూస్తూ!

‘సంతోషించాంలేగానీ, త్వరగా తాగి ఆ ఆంధ్రాబ్యాంక్ పాస్‌బుక్ ఎక్కడుందో వెతుకు. నేను హాలంతా బోర్లించేసాను. కనబడళ్ళేదు!’ అంటూ సున్నితంగా హెచ్చరించింది. తను ఆ రేంజిలో చెప్పకపోతే నేను రెండువేల ముప్ఫై వరకూ కూడా వెతకను. ఆసంగతి తనకి బాగాతెలుసు.

మరిక లాభంలేదని లేచి శోధించడం మొదలెట్టాను. అదేంటో మనం ఏదన్నా వెదకడం మొదలెడితే అదితప్ప చాలా దొరుకుతాయి.

నేను మెడిసిన్ ఫస్టియర్లో రాసిన కవిత ఒకటి కనబడింది.

‘అన్నార్తుల ఆక్రందనలు...
 అభాగ్యుల హాహాకారాలు...
 అల్పజీవుల అష్టకష్టాలు..’

ఇలాసాగింది ఆ కవిత! బాగా గుర్తుంది. ఆరోజు శ్రీకన్యాలో సెకండ్‌షో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా చూసొచ్చాక అర్ధరాత్రి కూచుని రాసానిది. అందులో పురాణం సూర్యని చూసి నాలాగే వున్నాడనిపించి తెగ ఫీలైపోయాను.

అన్నట్టు మీకు ఇంతవరకూ ఎప్పుడూ చెప్పలేదుకదూ? నేను అప్పట్లో నక్సలైటైపోదామని చాలా బలంగా అనేసుకున్నాను. ఒకరోజైతే రెండుజతల బట్టలు సర్దుకుని బయల్దేరిపోయాను కూడా...అక్కడెలాగూ యూనిఫారాలుంటాయి కదా అని!

బస్టాండులో గంటసేపు కూచున్న తరవాత అమ్మానాన్నలు, అన్నయ్యలిద్దరూ, అక్కాచెల్లీ.. అందరూ గుర్తొచ్చి బెంగొచ్చేసింది. అదీకాక అసలెవర్ని కలవాలో, ఎలాచేరాలో తెలీక ‘ఆనక చూద్దాంలే’ అని తిరిగొచ్చేసాను.

ఒకవేళ నేనలా అటేపు వెళిపోయుంటే మీరీపాటికి పేపర్లలో ‘అనంత్ అలియాస్ వెంకట్ అలియాస్ సూర్యం అలియాస్ జగదీష్ అలియాస్ కుమార్ కోసం పోలీసుల గాలింపం’టూ చదువుతుండేవారు. ఆతరవాత ఇక ఆవిషయం లైట్ తీసుకున్నాను.

ఇప్పుడవన్నీ చదివితే ఇరవయ్యారేళ్ళుగా కాపరంచేస్తూ, ఇద్దరు పిల్లల్నీ, మూడిళ్ళని, నాలుగురాళ్ళనీ వెనకేసుకున్న నేనేనా అవన్నీ రాసిందీ? అననిపిస్తుందా లేదా చెప్పండి?

ఇదేదో పెద్దదే కవరుందే? దీన్నిండా బిల్లులు, రసీదులు, గ్యారంటీ కార్డులు.

పదిహేడేళ్ళక్రితం మేం విజయనగరం వచ్చిన కొత్తలో కొన్న సోనీ సీడీ ప్లేయర్ గ్యారంటీ కార్డు కనబడింది. అది కనబడలేదని మాదగ్గర రిపేరు చేసిన ప్రతిసారీ బోల్డు డబ్బులు తీసుకున్న సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు కనబడి ప్రయోజనం ఏఁవుంది?

ఇదేంటిది? మా పెద్దాడు పుట్టిన కొత్తలో తనకి నేరాసిన ఉత్తరంలా వుందే? అప్పుడు మనం తిరుపతిలో వున్నాం.

‘నీవులేక వీణ’....

ఉత్తరానికి పేరొకటీ!! హవ్వ!

‘నువ్వులేని తిరపతి...పరపతిలేని ఎమ్మెల్యేలా వుంది! ఒక్కణ్ణీ వెళ్ళి ఎక్కబోతోంటే మేటరేంటని స్కూటరడుగుతోంది...’ ఇలాసాగిందా ఉత్తరం!

పాపం, అన్నీ నమ్మేసేది తను!

ఇలాక్కాదని చెప్పి మొత్తం ఫోల్డర్లన్నీ మంచమ్మీద పడేసుకుని కూర్చున్నాను. ఒకచిన్న కవర్లో మా నలుగురివీ పాస్‌పోర్టు సైజు ఫొటోలున్నాయి. ఈ పాస్‌పోర్టు ఫొటోలకి మావూళ్ళో ఇంకోపేరుంది.

పాస్‌ఫొటో!

‘మీ పాస్‌ఫొటో  అయిదునిమిషాల్లో తీసి ఇవ్వబడును!’ అని బోర్డుంటుంది. అసలలా పాస్ పోసుకుంటోంటే ఫొటో తియ్యడఁవే తప్పు! మళ్ళీ మనకివ్వడం కూడానూ!

‘కరెంట్ పోయినచో ఫొటో తియ్యబడును!’..ఇంకో లైను! అంటే జనరేటరుందీ, కరెంట్ పోయినా కూడా ఫొటోల్తీస్తామని చెప్పడం వెలుగది!

‘కలర్ ఫొటో ఇచ్చినచో బ్లాక్&వైట్ చేసి ఇవ్వబడును!’..ఇదింకా దారుణం! ఏండీ..అంటే అన్నాఁవంటారుగానీ కలర్ ఫొటో ఇస్తే బ్లాకండ్ వైట్ చేసివ్వడం ఏంటసలు?

ఇలాంటి బోర్డులన్నీ చూసి హాయిగా నవ్వేసుకుంటాం!

సరేసరే..కబుర్లతో పక్కకెళిపోయాను చూసారా! కవర్లోంచి ఫొటోలు తీసి చూద్దునుకదా.. నేరాలూ ఘోరాలూ బయటపడ్డాయి! మేఁవందరం మారేషాల్లో తిరుగుతున్న దొంగల్లా వున్నాం! ఇలాంటివి దాచినందుకు తన్ననాలి!

హాల్లోకెళ్ళి తనని తీసుకొచ్చి చూపించాను ఫొటోలన్నీ! చచ్చాం నవ్వుకోలేక!

‘ఇదంతాసరే, పాస్‌బుక్కెక్కడోయ్ జగన్నాథం?’ అంది కమాండింగ్ గా!

‘అదే కనబడుతుందిలెద్దూ వెధవ పాస్‌బుక్కు! ఇలా హాయిగా నవ్వేసుకుంటే చాలదూ?’ అనేసాను చిదానందస్వామిలా!                 
....... *.జగదీశ్ కొచ్చెర్లకోట*