9, ఆగస్టు 2020, ఆదివారం

ప్రశాంత హృదయమే

ప్రశాంత హృదయమే దివ్యత్వపు ఉనికిని మనకు అనుభూతిలో ప్రసాదిస్తుంది.

జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలగాలి, ఇది సదా మనస్సులో నిలిచి ఉండాలి.

మనం చేసే ప్రతీ పని ప్రశాంత వైఖరితో చేయడాన్ని అభ్యసించాలి.

ఇతరులతో మెలిగేటప్పుడు మన నడవడికలో, మాటలో ప్రశాంతత, సమస్థితి నెలకొని ఉండేలా చూసుకోవాలి.

మనస్సు ఉన్నతస్థానంలో లేకపోతే ప్రశాంతత ఏర్పడదు.

అందువలన దానికి ఘనతరమైన బాధ్యతను అప్పగించవలసి ఉంటుంది.

అల్పమైన లౌకిక విషయాల పట్ల గాక స్థిరమైన, శాశ్వతమైన దానిని పట్టుకునే పని అప్పగించాలి.

ఒక మనిషి సాత్త్వికంగా, సున్నితంగా ఉన్నప్పటికీ అతడు మనస్సుని నియంత్రించి దానిని శాంతంగా ఉండేలా చేయగలిగితే, అత్యంత శక్తిమంతుడౌతాడు.

అతడిలోని దివ్యత్వపు ఉనికి వెల్లడి అవడం చేత ఎంతటివారైనా అతడికి దాసోహం అవుతారు.

కామెంట్‌లు లేవు: