భాగవతం ఎంత గొప్పదో,
ఎంత చదివినా, ఎంత విన్నా,
ఎంత తరచి చూసినా అందులో ఎన్నెన్ని సూక్ష్మాలు ఉన్నాయో,
ఆథ్యాత్మికశక్తి ఎంత దాగి ఉందో తెలుసుకోవడం కష్టమని
పోతనగారే చెప్పిన పద్యం ఇది.
***
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత, కన్నంత,
దెలియ వచ్చినంత, దేటపఱతు.
***
చిత్రమేమంటే, భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ,ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.
🏵️*పోతన పద్యాలు -యోగ , భక్తి తత్వ సమన్వితాలు*🏵️

********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి