*శ్రీమాత్రేనమః*
*633వ నామ మంత్రము*
*ఓం ఉమాయై నమః*
అర్ధనారీశ్వరతత్త్వంతో విరాజిల్లు ఉమామాతకు నమస్కారము.
శ్రీ లలితా సహస్ర నామావళి యందలి *ఉమా* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం ఉమాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు అనిర్వచ నీయమైన ఆత్మానందమును చేకూర్చి ఆ జగదీశ్వరి నామస్మరణమందు ధ్యానముండునట్లుజేసి తద్వారా తరింపజేయును.
పరాశక్తి పార్వత రాజపుత్రిక పార్వతీదేవిగా అవతరించ వలయునని బాల్యమునుండియే కఠోర తపమాచరించబోగా ఆమె తల్లియైన మేనాదేవికి బాధ కలిగి *ఉ* ఇక తపస్సు చాలు ఆపుము, అనినా, ఆమె తపస్సు మాననందున *మా* (అమ్మా అని కూతురిని పిలిచే ఆప్యాయమైన పిలుపు) ఇంక వద్దు తపస్సు అని అనురాగంగా అన్నదని కాళిదాసు మహాకవి తన కుమారసంభవమందు చమత్కరించారట. అలా మొదట అన్న *ఉ* రెండవసారి అన్న *మ* తో చేరి *ఉమ* అను సార్థకనామాంకిత అయినదని అంటారు.
అలాగే ఈ *ఉమ* అను నామములో *అ* కార *ఉ* కార *మ* కారములు ప్రణవరూపమగుటచే శ్రీమాత ప్రణవస్వరూపిణి గనుక ఆ తల్లికి *ఉమ* అను నామము సార్థకమయినది.
కేశోపనిషత్తులో ప్రతిపాదింపబడిన అమ్మవారే లతితాదేవి *ఉమ* అనియు మరికొందరు విజ్ఞులు *ఉ* కారము శివునికి, *మ* కారము శక్తికి, ఆ శక్తే పార్వతి గనుక శివుని అర్ధనారీశ్వరతత్త్వమును తెలియజేసేదే ఈ *ఉమ* నామమని అంటారు. అందుకు జగన్మాత *ఉమా* నామాన్వితురాలుగా ఈ నామంలోని భావము అయిఉన్నది.
అటువంటి *ఉమా* నామాన్వితురాలైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఉమాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319
*****************

|
Sat, 8 Aug, 12:51 (21 hours ago)
| |||
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*57వ నామ మంత్రము*
*ఓం చింతామణి గృహాంతస్థాయై నమః*
చింతామణులచే నిర్మింపబడిన గృహంలో నివసించు పరమేశ్వరికి నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చింతామణి గృహాంతస్థా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చింతామణి గృహాంతస్థాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసన చేయు భక్తులకు ఆ జగన్మాత కరుణచే అన్నిటికన్నా ముఖ్యమైన సుఖసంతోషములు అందుకు కావలసిన ఆయురారోగ్యములు ప్రసాదించి ఆత్మానందానుభూతితో జగన్మాత పాదసేవా పరాయణత పెంపొందించి తరింపజేయును.
చింతామణి అనేది ఒక రత్నము. ఆ మణి ఒకటి ఉంటే ఎన్నోకోరికలను తీరుస్తుంది. అటువంటి చింతామణులతో నిర్మించిన గృహంలో జగన్మాత నివసిస్తోంది. మానవుని శరీరంలో చింతామణి గృహం సహస్రారంలో ఉంటుంది. సాధకుడు తన సాధనలో మూలాధారం నుండి సహస్రారం చేరుకుంటే సిద్ధిపొందినట్లే. ఇంక ఏకోరికలూ ఉండవు. నిష్కాముడై బ్రహ్మత్త్వానికి చేరుకుంటాడు.
దీనినే మహాజ్ఞానులు, సిద్ధులు ఏం చెప్తారంటే *శ్రీచక్రంలో బిందు మండలమున శ్రీదేవి వసిస్తుంది. మూలాధారగత కుండలినీ శక్తి జాగృతమై బిందుమండలము చేరినచో ఉపాసకుడు జగన్మాత సన్నిధికి చేరినట్లే. అంటే సంకల్పసిద్ధుడైనట్లే. అదే చింతామణి తత్త్వము* ముఖ్యంగా జీవునికి ఉండే అన్ని చింతలను దూరంచేసి బ్రహ్మానందభరితుడిని చేస్తుంది. అంతటితో ఆ జీవుడు నిష్కాముడౌతాడు. సుమేరుశృంగ మధ్యమందు, మహాపద్మాటవిలో చింతామణిగృహంలో ఉండి సాధకుని సిద్ధింపజేస్తుంది. *కల్పవృక్షం* అంటే చింతామణితో కూడిన సంకల్పం. *కామధేనువు* అంటే చింతామణితో కూడిన వాక్కు అని విజ్ఞులు చెపుతున్నారు. అటువంటి సంకల్పం, అటువంటి వాక్కును సాధకునికి కలుగజేస్తుంది జగన్మాత. అందుకే ఆ తల్లి *చింతామణి గృహాంతస్థా* అను నామముతో స్తుతింపబడుచున్నది.
కోరినవి ఇచ్చే చింతామణి గృహంలో శ్రీమాత వసించుతూ, ఆ ఇంటి ఇల్లాలైన జగన్మాత ఎంతటి అనుగ్రహప్రదాయనియో మనం ఊహించితే వర్ణనాతీతమేగదా. అంతటి చింతామణి గృహాంతస్థకు నమస్కరించునపుడు *ఓం చింతామణి గృహాంతస్థాయై నమః* అని అనవలెను.
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
నేడు శని (స్థిర) వారముఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినముశ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక ఓం నమో వేంకటేశాయ.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ReplyForward
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి