9, ఆగస్టు 2020, ఆదివారం

గ్రుహస్థుని ధర్మములు


1. గ్రుహస్థుడు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసులను, పోషించుటతో పాటు కుటుంబ సభ్యుల ను, జంతువులను, పోషించడము వల్ల అన్ని ధర్మములు నెరవేరినట్లే, ఆశ్రమం లోనికి గ్రహస్థాశ్రమము శ్రేష్ఠమైనది.
2. వేదాధ్యయనం చేత, ఋషి పుంగవులను, హోమముల ద్వారా, దేవతలను, శ్రాద్ధములచే పిత్రదేవతలను, అన్నం చేత అతిథులను, బలియొసగుటచేత, పవిత్ర జంతువులను పూజించుచూ తన జీవితాన్ని ధన్యతపరచుకోవాలి.
3.పిత్రుయఙ్ఞ నిమిత్తం ఒక్క బ్రాహ్మణునికైననూ భోజనము పెట్టాలి.
4.భూత యఙ్ఞములో ఒక్క బ్రాహ్మణునికైననూ భోజనం పెట్టాలి. అలా కాకపోతే బలి మాత్రకైనూ ఇవ్వాలి (జంతుబలి కాదు, అన్నం బలి రూపం లో ఇవ్వాలి.)
5.దేవతల కోసం గ్రుహాగ్నిలో హోమం ప్రతీ రోజూ చేయాలి. (ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారో లేదో తెలియదు. పూర్వం చేసేవారు.)
6.తనకున్నంతలో బీదలకు, రోగులకు, పశుపక్ష్యాదులు కు ఆహారం ఇవ్వాలి.
7.ముందు అతిథిని, పిదప సన్యాసి కి, ఆ పిదప బ్రహ్మచారి కి ఆహారమివ్వవలెను. ఈ విధంగా అన్నదానం చేసిన వారికి గోదాన ఫలితం దక్కును.
8.అతిథి భగవత్స్వరూపుడు కాబట్టి, ఇంటికి వచ్చిన అతిథి కి కాళ్ళు కడిగి, కూర్చునుటకు, ఆసనమిచ్చి, త్రాగుటకు మంచి నీళ్ళు ఇచ్చి, మ్రుష్టాన్నములతో భోజనం పెట్టాలి.
9.విప్రులును,అతిథులను, సేవకులు, భోజనం చేసిన తరువాత దంపతులు ఇద్దరూ భుజించాలి. 🌸
**************************

కామెంట్‌లు లేవు: