9, ఆగస్టు 2020, ఆదివారం

*పిల్లలందరికీ నాలుగు మాటలు*

ఏమిటంటే?
1.
మీరు భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
మీకు హితమైందే తినాలి. మితంగా తినాలి.
హితం కాని ఆహారాన్ని తినకూడదు.
మితాన్ని దాటి తినకూడదు.

2.
మీరు గాలి పీల్చి విడిచిపెడుతున్నారు కాబట్టి,
గాలి పీల్చి విడిచిపెట్టడాన్ని,
క్రమబద్ధమైన పద్ధతిగా గాలి పీల్చి, విడిచిపెట్టడాన్ని 'ప్రాణాయామం' అంటారు.
ఒక క్రమం లేకుండా చేస్తే, అది ప్రాణాయామం కాదు.
దాని వల్ల నీకేమీ ప్రయోజనం లేదు.
"నీకు రకరకాలైనటువంటి ఆవేశకావేశ క్రోధాలు రావడానికి కారణం,
నువ్వు సరైనటువంటి శ్వాస గమనాన్ని క్రమబద్ధీకరించుకోకపోవడమే"!
- అని మన యోగశాస్త్రం స్పష్టంగా చెప్పింది కాబట్టి,
పిల్లలందరూ చిన్నప్పటి నుంచి, ఈ ప్రాణాయామాన్ని....
ప్రధానంగా అనులోమ, విలోమ, సమ ప్రాణాయామాన్ని...
చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకోవాలి.
దానివలన మీరు 'ఉచ్ఛారణ' ఎక్కువ సేపు నిలుపుకోగలుగుతారు.
ముఖ్యంగా పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద పద్యాలు...
అట్లా పాడేటప్పుడు, కీర్తనలు పాడేటప్పుడు...
ఎక్కువ సేపు శ్వాసను నిలుపుకోవల్సిన అవసరం వుంటుంది.
అది మీకు అప్పుడు సాధ్యమౌతుంది.
కాబట్టి, రోజులో తప్పనిసరిగా,
5, 10, 15 నిమిషాల పాటు ప్రాణాయామానికి కేటాయించి,
దాని మీద దృష్టి పెట్టి, అభ్యాసం చేస్తే,
అది మీకు జీవితమంతా ఉపయోగపడుతుంది.
ఇది రెండవ మాట.

3వ మాట:-
సరియైనటువంటి జపం.
మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు.
ఆ ఇష్టదైవ నామస్మరణ ఒక ఐదు నిమిషాలు
తప్పక రోజూ నిద్రపోయే ముందు, నిద్రలేవగానే...
తప్పక నామస్మరణ (జపం) చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇది 3వ మాట.

4వ మాట:-
తప్పక సరియైనటువంటి గ్రంథాలు చదవటం.
సరియైన గ్రంథం చదివితే,
అది 100 మంది స్నేహితులతో సమానమైనటువంటిది.
మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నా,
ఒక గ్రంథం అందించేటటువంటి,
ప్రామాణికమైన గ్రంథం అందించేటటువంటి,
ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం,
ఒక మహర్షుల చరిత్రలు, ఒక రామకృష్ణ బోధామృతం,
ఒక అరవింద సూక్తులు,
ఒక భగవాన్‌ రమణుల యొక్క ఉపదేశ సారం...
వారి యొక్క సద్దర్శనం,
అరవిందుల యొక్క పూర్ణయోగం...
ఇట్లాంటి అనేకమైన గ్రంథాలు,
వీటన్నింటిని మన సనాతన ధర్మం మనకు అందించింది.
(వీటిని తప్పక మనం....)
ఆది శంకరులు అందించినటువంటి
అద్వైత స్తోత్ర రత్నాలు ఎన్నో వున్నాయి!
వీటన్నింటినీ తప్పక మీరందరూ...
రాబోయే రోజులలో, భవిష్యత్‌ కార్యక్రమాలలో....
మీరందరూ నేర్చుకుని,
భావితరాలకి ఆదర్శవంతమైనటువంటి,
మహానుభావులుగా తీర్చిదిద్దాలని,
జ్ఞాన వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని,
ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ....

హరిః ఓం
శ్రీ గురుభ్యోన్నమః
హరిః ఓం

కామెంట్‌లు లేవు: