9, ఆగస్టు 2020, ఆదివారం

సాధారణ విషయాలు - నియమాలు :-


1. గ్రహస్తు పై వస్త్రం లేకుండా భోజనం చేయరాదు.

2.నగ్నముగా స్నానం చేయరాదు.

3.నిప్పును,వెదురు గొట్టం, విసనకర్ర తో ఊదవలెను కానీ
నోటితో ఊదరాదు. (అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.)

4.అగ్నిని దాటి వెళ్ళకూడదు.

5.శీతాకాలములో మంచము క్రింద కుంపటి మొదలైనవి ఉంచుకొని పడుకోరాదు.

6.సంధ్యాకాలంలో భుజించరాదు. (సూర్య కిరణములనుంచి 'కాస్మిక్' వల్ల పదార్థాలు విషపూరితమౌతాయి. అందువలన సంధ్యా కాలంలో ఏ పదార్థాలను తిన్న అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.)

7.పాడుబడిన ఇంట్లో ఏకాంతంగా నిద్ర పోరాదు. (ఏ విధమైన ప్రమాదం జరిగిన ఎవరి కీ తెలియదు.)
8.తన్ను పిలవకపోయినా ఋత్విజుడు యాగకర్మకు వెళ్ళ కూడదు.
9.కంచుపాత్రతో కాళ్ళు కడుగ రాదు.
10.ఇంద్రధనస్సు ఆకాశములో చూడరాదు. చూసిన ఇతరులకు చెప్పకూడదు.
11.కడుపున పదార్థాలు తో సగభాగం ను, నీళ్ళు తో ఒక పావు భాగంను నింపి, మిగిలిన పావు భాగం వాయుసంచారము నకు వదలవలెను. (ఇది ఆయుర్వేదం వైద్యులు చెప్పిన విషయం. ఇలా చేస్తే డాక్టర్ ల చుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర లేదు. ఒబేసిటీ సెంటర్లు ను ఆశ్రయించనక్కరలేదు.)
12.పాదరక్చలు,బట్టలు ఒకరు ఉపయోగించి నవి మరొకరు ఉపయోగించకూడదు. (చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.)
13.గోళ్ళను దంతములతో కొరికి తీయరాదు. (దీని వలన గోళ్ళలో క్రిములు కడుపులో కి చేరి అనారోగ్యం రావచ్చును.)
14.ఆడవారు జుట్టు కు వెలుపల తెలియునట్లు పూలదండలు ధరింపరాదు.
15.గోవుల వీపు మీద కూర్చుని స్వారీ చేయరాదు.
16.రాత్రివేళ చెట్టు కింద నివసించ రాదు. (చెట్టు మీద విషక్రిములు దాడి లేదా చెట్టు మీద నుండి ఏదైనా పడే ప్రమాదం ఉంది)
17.పాచికలాటలను ఆడరాదు.
18.తనకాలి చెప్పులను చేతితో పట్టుకోరాదు.
19.మంచము మీద కూర్చుని భోజనం చేయరాదు. 

కామెంట్‌లు లేవు: