9, ఆగస్టు 2020, ఆదివారం

*భజ గోవిందం*

 దుఃఖము నుండి విముక్తి పొందాలని సూచించే శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల విరచితమే *భజ గోవింద* శ్లోకాల సంకలనము. మొత్తము శ్లోకాలు 31. అందులో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు వెలువరించినవి 15, శిష్యులు చేర్చినవి 16.
భారత దేశమంతా పర్యటిస్తున్న శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు శిష్య సమేతంగా కాశీ నుండి బదరికాశ్రమము బయలు దేరగా ఆ దారిలోనే గురు శిష్యుల సంవాదము మరియు *వృద్ధ గురువు* గారి పిడి వాదనకు స్పందించిన శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి మందలింపు, పలికిన హితోక్తులే *భజ గోవింద* శ్లోకాలు.
అతి ముఖ్యమైన మూడు శ్లోకాలు జ్ఞాపకము చేసుకుందాము.
*భజ గోవిందం  భజగోవిందం:*
*గోవిందం భజే  మూఢ: మతే: సంప్రాప్తే సన్నిహితే కాలే: నహీ నహీ రక్షతి డుకృణ్ కరణే*
గోవిందుడునీ భజించు, ఓ బుద్ధి హీనుడా గోవిందుడినీ భజించూ. మరణ సమయము ఆసన్న మయినప్పుడు ఈ వ్యాకరణ (డుక్రుణ్, కరణే లాంటి) సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.

*సత్సంగత్వే నిస్సంగత్వం: నిస్సంగత్వే నిర్మోహత్వం: నిర్మోహత్వే నిశ్చల తత్వం: నిశ్చల తత్వే జీవన్ముక్తి*
సత్ పురుషుల తో సాంగత్యము చేయడము వలన, ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి, అనుబంధము తగ్గి పోతుంది. దాని వల్ల మనలో క్రమంగా ఉన్న భ్రమ/వ్యామోహము తొలగి పోతుంది. *మొహం పోతే మనసు భగవంతుని మీద చలించ కుండా నిలుస్తుంది* అప్పుడు సకల కర్మల బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షము, జీవన్ముక్తి.

*భజ గోవిందం భజ గోవిందం: గోవిందం భజ మూఢమతే: నామస్మరణా ధన్య ముపాయము: నహీ పశ్యామో భవ తరణే*
గోవిందుని భజించు. ఓ మూఢు డా, గోవిందుని భజించు. *సంసార సాగరాన్ని దాట డానికి గోవింద నామ స్మరణను మించినది లేదు*

ధన్యోపాయం నామ స్మరణం అని కూడా అంటూ ఉంటాము
********************

కామెంట్‌లు లేవు: