*శ్రీమాత్రేనమః*
*634వ నామ మంత్రము*
*ఓం శైలేంద్రతనయాయై నమః*
పర్వతరాజ కుమార్తె అయిన జగన్మాతకు నమస్కారము.
అమ్మకు సహస్ర నామావళి ఉంది. అంతేనా అష్టోత్తర శతనామావళి ఉన్నది. ఖడ్గమాలాస్తోత్రం అంటూ శ్రీచక్రాధిష్ఠాన దేవతలనందరినీ స్తుతిస్తూ బిందు మండలం వరకూ వెళ్ళి త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరీ, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురాంబ, మహాత్రిపురసుందరీ, మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రసమ్రాజ్ఞీ నమస్తే నమస్తే నమస్తే నమః అని అంటూ ఆ తల్లిని ఎన్నెన్నో నామాలు వల్లిస్తున్నాము. ఇంతేనా? ఎన్నో ఉన్నాయి. అఖిలాండేశ్వరిని వర్ణించడానికి ఎన్నికోట్లనామాలైనా చాలవు. అంటే అమ్మ హిమగిరి తనయ. హిమవన్నగ మెంతటి ఉన్నతమో, మరెంత విశాలమో, ఎన్నెన్ని పుణ్యతీర్థములుగలవో, ఎచ్చట మానస సరోవరమున్నదో అంతటి మహామహా హిమవన్నగ పుత్రికయైన హిమగిరితనయ, శైలేంద్రతనయ అయిన శ్రీమాతను *శైలేంద్రతనయా* అని నామ మంత్ర తత్త్వవిచారణ ఎంత చేసినా తక్కువే. మనవల్ల సాధ్యమా? అంతటి వారెవరున్నారు? హిమవంతము, నషిదము, వింద్యము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హేమకూటము అను సప్తశైలములు గలవు. ఇందులో హిమవత్పర్వతము ముఖ్యమైనది. కావున *శైలేంద్రతనయా* అను నామము జగన్మాతకు ఉన్నది. ఈ పర్వతరాజము పుత్రిక అయినందున శైలేంద్ర తనయా అని భావము.
తన తండ్రి చేయు యజ్ఞములో శివనింద భరించలేక యోగాగ్నిలో తన దేహాన్ని చాలించి మళ్ళీ పరమేశ్వరిగా తనకు పరమ భక్తుడైన హిమవంతునికి కుమార్తెగా అవతరించి నాటినుండి శ్రీదేవి, హైమవతి, శైలజ, శైలేంద్రతనయా అని ఇంకనూ ఎన్నో నామములతో పిలువబడినది.
అటువంటి శైలేంద్రతనయకు నమస్కరించునపుడు *ఓం శైలేంద్రతనయాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక
🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి