అనంత ఫలదాయకం "అర్ఘ్య ప్రధానం". .ప్రతీరోజూసూర్యభగవానునికి
మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి ఆర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు. నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా!
సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. రెండు చేతులు దోసిలిగా పెట్టి, ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి మరియు ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో ఆర్ఘ్యం అందించేవారు.వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా సూర్యభగవానుని చూసేవారు.
సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు( నీటి ప్రవాహం చిత్రం)వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి.శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుడు కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు. మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది. మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి(వాయు), నీరు (జల), భూమి(పృథ్వి) , అగ్ని(శక్తి) మరియు అంతరిక్షము(ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం.
పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు ఉదా. గుండె జబ్బులు,కళ్ళు, కామెర్లు, కుష్టు మరియు బలహీనమైన మెదడు. మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది. సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది.సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు. సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగు తుంది.
ప్రతీ రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి ఆర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీసుకుని
సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్ |
పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ ||
సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్ |
ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్ ప్రసీద ||
అని నీళ్లను సూర్యుణ్ణి చూస్తూ విడిచి పెట్టాలి.కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని, పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది ఆలోచించండి. దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయశాన్ని నివేదెన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి.ఓం శనైచ్చరాయనమః

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి