29, సెప్టెంబర్ 2020, మంగళవారం

కలిసి ఉండేవారే ఆత్మీయులు

 ऊँ शिवाय गुरवे नमः।


సరసి శోషే జలఖగవ-

ద్ధావంతో న బాంధవాః విపది।

కిం తూత్పల కుముదాంబుజవత్

సమ్మిళితా స్తదాऽపి చ స్వజనాః।।

----------------------------------------

    సరసి- సరస్సు,

శోషే- ఎండిపోతే,

జల ఖగవత్- నీటి 🐦పక్షులవలె, 

విపది-ఆపదయందు,

ధావంతః- పారిపోయేవాళ్ళు,

న బాంధవాః- బంధువులు కారు.

కిం తు- కానీ,

ఉత్పల-కలువలు,

కుముద-ఎర్ర తామరలు,

అంబుజవత్-పద్మములవలె,

తదా అపి చ-అప్పుడు కూడా,

సమ్మిళితాః- కలిసి యున్నవారే,

స్వజనాః- తనవారు/ఆత్మీయులు సుమా।।

*************************

   సరస్సు ఎండిపోయినప్పుడు నీటిపక్షులవలె, కష్టకాలం (ఆపద)లో ఉన్నప్పుడు వదలి పారిపోయేవాళ్ళు బంధువులు అనిపించుకోరు.

      కానీ ఆ కష్షకాలంలో కూడా కలువలు,తామరపువ్వులు,పద్మాల వలె కలిసి ఉండేవారే ఆత్మీయులు తనవారు సుమా।।

*************************

 २९-९-२०२० रेण्टाल.

కామెంట్‌లు లేవు: