29, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ఆచార్య సద్భోదన*



ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక ఆదర్శంపై అభిరుచి కలిగే తీరుతుంది. అప్పుడు వారికి ప్రపంచంలో ఏదీ సంతృప్తిని ఇవ్వదు. ఆ ఉన్నత ఆదర్శాన్ని ప్రాప్తించుకునే వరకూ వారికి మనశ్శాంతి లభించదు. ఈ వ్యాకులత, అంతరంగిక జాగృతి ఇవే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి. ఆధ్యాత్మిక ఆదర్శం వారిని ప్రబలంగా ఆకర్షించి, జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ విధంగా ప్రాపంచికమైన ఆదర్శాలను వదలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించడమే ఆధ్యాత్మిక పరివర్తన. దీనితోనే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమౌతుంది. ఈ పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే మరి కొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది.


అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెబుతాడు.

"అనేక వేలమంది మనుజులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేకమందిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవముగా తెలిసికొనగల్గుతున్నాడు." 


వేలకొద్ది జనులలో చాలా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులౌతారు. అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహుకొద్ది మందికి మాత్రమే అత్యున్నతమూ, చైతన్యానికి కూడా అతీతమూ అయిన సాక్షాత్కారం లభిస్తుంది.


కానీ మనం నిరాశ చెందకుండా, ఆ ప్రయత్నించే కొద్దిమందిలో మనం కూడా ఉన్నామని భావించుకుని, ఆ ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాం.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: