29, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివామృతలహరి



.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

నీవే కర్తయు కర్మయున్ క్రియయు;తండ్రీ !భోజ్యమున్ భోక్తయున్

నీవే; మంత్రము తంత్రమున్ జపతపో నిష్ఠాదులున్ యోగమున్

నీవే; కాలమహాస్వరూపుడరయన్ నీవే ! మహాదేవ! గౌ

రీ వామాంగ ! దయాంతరంగ ! ప్రణతుల్ శ్రీ సిద్దలింగేశ్వరా!


భావం;

స్వామీ! శివా!

చేయించే వాడివి,చేసేది, చేయు పని అంతా నీవే కదా తండ్రీ!

భోజనము నీవే భుజించే వ్యక్తి కూడా నీవే!

మంత్రము, తంత్రము,జపము, తపము,ఆచారము ,యోగము అంతా నీవే!

కాలము అనే మహా స్వరూపం కూడా నీవే!

గౌరీదేవిని ఎడమవైపు శరీరంలో ధరించిన వాడా!

దయగల హృదయము కలవాడా!

నా నమ స్కృతులు స్వీకరింపుము స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: