29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఈనాడు సుప్రీం చెప్పింది…...

 

ఆనాడు మన చలంగారు చెప్పిందే !!


"పరస్పర అంగీకారంతో స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు ".... గౌ!!సుప్రీం కోర్టు


సుప్రీం చెప్పింది..సుమారు వందేళ్ళకుముందే మన చలం గారుచెప్పేశారు...అంటే మన చలం గారు

ఎంత "దార్శనికుడో" కదా!!


వందేళ్ళు కావస్తున్నా...చలం వారసత్వం సుప్రీం తీర్పు రూపంలో ఇంకా బతికే వుంది.అందుకే 

విశృంఖలతకుపచ్చజెండా ఊపింది.మనంఅనుకుంటాం గానీ..సమాజం తొక్కా..తోలు అని...,

కానీ....అభ్యుదయం ముసుగులో చెలామణి అవుతున్న చాలా..చాలా మందికి సుప్రీం తీర్పు 

గొప్ప వరం.


ఇక ఊరేగుతుంది ఈ తరం.జిందాబాద్..ధర్మదేవత.


*ఓ చిన్న డౌటు..?


అతడు లేక ఆమె డబ్బిచ్చి..పరస్పరఅంగీకారంతో ప్రకృతికార్యంలో పాల్గొన్నారు.ఇప్పుడువాళ్ళు 

చేసింది వ్యభిచారమా?శృంగారమా?ఏదైనా పరస్పరఅంగీకారంతోనే జరుగుతుంది. కాబట్టి రెండూ 

న్యాయబధ్ధమైనవే అనుకోవాలి. అలాగైతే మనం వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నామా?వ్యతిరేకిస్తు

న్నామా?.....ఏంటో ఈ చిన్ని బుర్రకు ఓ పట్టాన అర్థం కాదుకదా?!!


*బోలో హిప్ హిప్ హుర్రే..!!


సరదాలు పెంచేసెయ్

పరదాలు చించేసెయ్

బంధాలు తెంచేసెయ్

అచ్చోసినఅంబోతులల్లే

ఊరేగేద్దాం.......

ఇక అంతా " అతి"చరామే


తిలోదకాల వెల్లువలో

సంస్కృతీ సంప్రదాయం

ఇకపై పెళ్ళీ గిళ్ళీ జాన్తానై

మానం శీలం అంతా ట్రాష్


చిత్తకార్తి పిచ్చికుక్కలమల్లే

ఎపుడైనాఎక్కడైనా బొర్లేద్దాం

రవికలు లేకుండానే.....

ఇక రోజూ పండగ జరిపేద్దాం


ఆది మానవుల వారసులం

అనాగరిక చేష్టలకు దాసులం

చలం మేస్టారి నిశానులం

సుప్రీంకోర్టు పూజారులం


బోలో హిప్ హిప్ హుర్రే...

జై బోలో సుప్రీం తీర్పుకు!!


(సమాజం ఎటువెళుతుందో?

 ఆంక్షలు ఉంటేనే...అంతంత

 మాత్రం...ఇక లేకుంటే ??)


*ఎ.రజాహుస్సేన్!!

కామెంట్‌లు లేవు: