29, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 34*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                    

                                      *****

         *శ్లో:- అసారే ఖలు సంసారే ౹*

                *సారం శ్వశుర మందిరం౹*

                *హిమాలయే హర శ్శేతే ౹*

                *హరి శ్శేతే మహోదధౌ ౹౹*

                              *****

*భా:- సంసారాన్ని ఒక పారం లేని సాగరంతో పోలుస్తారు కవులు. సాగరాన్నైనా యీద వచ్చునేమో కాని సంసార సాగరాన్ని యీదడం కష్టమని అనుభవసారంతో చెబుతారు. అలాంటి సారం లేని యీ సంసారంలో మనిషికి కాస్త ఊరట, ఉపశమనము, ప్రశాంతత కలిగించేది ఒక్క "అత్తవారిల్లే" నట. అంతా సవ్యంగా ఉంటే అడుగడుగునా అక్కడ జరిగే రాచమర్యాదలు జీవితంలో మరువలేని మధురానుభూతులుగా నిలబడిపోతాయి. ఎలా? పార్వతి తీవ్ర తపో దీక్ష అనంతరము "పరమేశ్వరుడు" ఆమెను వివాహమాడి, ప్రమథ గణాలతో సహా అక్కడే మామ గారైన హిమాలయపర్వతం పైన "కైలాసం" లో కాపురం పెట్టాడు. ఇక *శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన *సముద్రుని కుమార్తె శ్రీమహాలక్ష్మిని ఉద్వాహమాడి, సపరివార సమేతంగా ఆ *పాలసముద్రం"లోనే* *స్థిరనివాసం ఉంటున్నాడు. పైగా స్థానచలనం గాని, పదోన్నతులు గాని లేని శాశ్వత సుప్రతిష్ఠ పదవులు వారిద్దరివి.ఇక సమాజంలో నేటికి ఇల్లరిక వ్యవస్థ పునాదులు పదిలంగానే ఉన్నాయి. దేవతలే అలా ఉంటే, మానవ మాత్రులం మనమెంత ! "ఇల్లరికంలో ఉన్న మజా" అన్న సినీకవి మాటల్లో ఎంతటి అర్థం, పరమార్థం ఉన్నదో గదా!*

                                     *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: