దశిక రాము**
*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*
🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
🌹 **ఆర్యాశతకము**
🌹
🌹11.
**కాఞ్చీరత్న విభూషాం**
**కామపి కన్దర్పసూతికాపాఙ్గీమ్౹**
**పరమాం కలాముపాసే**
**పరశివ వామాఙ్క పీఠికాసీనామ్౹౹**
🌺భావం:కామాక్షీ దేవి కాంచీ పట్టణమునకు రత్నభూషణముగా ఒప్పుచున్నది.ఆతల్లి శుభకటాక్షమే మన్మథుని ప్రసూతిగృహము (జన్మస్థానము) గా యున్నది.
పరమశివుని వామాంకమునే పీఠముగాచేసుకొని కూర్చుని యున్న ఆ పరా కళను ఉపాసించెదను.🙏
💮కాంచీపురరత్నభూష కామాక్షీ దేవి.శివుని కామిని చేయదలచిన మన్మథుడు శివుని త్రినేత్రాగ్నికి బూది అయినాడు.అట్టి కామునకు ఆమ్మవారి కనుచూపులే జన్మస్థానములయినవి. కామాక్షి సృష్టిసంకల్పభావముతో స్వాత్మరూపుడైన శివుని జూచి కామేశ్వరాంకస్థ అయినది.ఆమెకు భిన్నముగా శివుడు గానీ ,బ్రహ్మాండముగానీ ,కాముడు గానీ లేరు. సర్వమూ ఆ జగదీశ్వరియే అయిఉన్నది. అట్టి పరమోత్క్రష్టమైన ఆ పరాకళను సేవించుచున్నాను.
సశేషం
🙏🙏🙏
సేకరణ
ధర్మము - సంస్కృతి
🙏🙏🙏
🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱
🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹
సశేషం....
🙏🙏🙏
సేకరణ
ధర్మము-సంస్కృతి
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి