29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఆరోగ్య నియమాలు - 1

 పురాతన ఆయుర్వేద గ్రంథముల యందలి ఆరోగ్య నియమాలు - 1


      ఈ మధ్యకాలం నందు కొన్ని పురాతన ఆయుర్వేద గ్రంథములు నా పరిశోధన నిమిత్తం వాటిని శోధించుచుండగా కొన్ని అమూల్యమైన ఆరోగ్యసూత్రాలు నాకు లభ్యమైనవి. అటువంటి అముల్యమైన విషయాలను మీకు తెలియచేయుటకు సేకరించి ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది.  



  * ఆరోగ్యవంతుడు ఆయూ రక్షణ కొరకు బ్రహ్మముహుర్తాన మేల్కొని మల మోచనాది శరీరకృత్యములు ముగించుకొని శౌచవీధులు నిర్వర్తించుకొనవలెను . శౌచవిధులు అనగా స్నానకార్యక్రమము . 


 * ముండ్లు , పాలు , కారము , చేదు , వగరు గల పుల్లలు దంతధావనమునకు ప్రశస్తములు. మామిడి , పున్నాగ , మారేడు , ఉత్తరేణి , దిరిసెన చెట్ల యొక్క పుల్లలు దంతధావనమునకు సరైనవి . 7 నుంచి 10 అంగుళముల పుల్లను దంతధావనమునకు ఉపయోగించవచ్చు . చిటికిన వేలు లావు కలిగి ఉండవలెను . ముందుభాగమును కుంచెగా చేసి దంతములను శుభ్రపర్చుకొనవలెను . నాలుక గీచుకొనుటకు కూడ ఉపయోగించవలెను . 


 * ఉత్తర ముఖమునకు గాని , తూర్పు ముఖమునకు గాని తిరిగి దంతధావనం చేయవలెను . ఎన్నడూ దక్షిణ , పశ్చిమ ముఖమునకు తిరిగి దంతధావనం చేయరాదు . 


 * చతుర్దశి , అష్టమి , అమావాస్య , పూర్ణిమ , సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించు సంక్రమణము ఈ దినముల యందు స్త్రీ సంగమము , అభ్యంగనము , మాంస భోజనం మానవలెను . దంతధావన పుడక ఉపయోగించరాదు . 


 * అజీర్ణము , వాంతి , శ్వాస , కాసరోగము , జ్వరం , వాతము , దప్పి , నోటిపూత , గుండెజబ్బు , నేత్రరోగము , శిరోరోగము , కర్ణరోగము వంటి సమస్యలతో ఉన్నవారు దంతధావనం చేయరాదు . 


 * బంగారంతో గాని , రాగితోగాని చేయబడిన 6 అంగుళముల ప్రమాణము కలిగి కరుకుగా లేదా నున్నగా చేయబడిన బద్ధతో నాలుక గీచుకొనవలెను . 


 * దంతధావనం పిత్తమును , శ్లేష్మమును హరించును . రుచిని కలిగించును . కండ్లకు మంచిది . కండ్లు , ముక్కు , చెవులు వీనిని శుద్ధపరచును . శ్లేష్మమును , నాలిక మీద పాచిని , నోటి దుర్వాసన పోగొట్టి నోటికి రుచిని కలిగించును. 


 * చెవిలో తైలము నింపుట చేత దవడలు , మెడ నరములు , తల వీని యందు నమిలినట్లు ఉండు బాధ , నొప్పి నివారణ అగును. 


 * పాదములకు తైలము రుద్దుట చేత పాదములకు బలము కలుగును. మంచి నిద్రవచ్చును . దృష్టి ప్రభావంతముగా ఉండును. పాదములు మొద్దుబారుట , బిగుసుకొనిపోవుట , ముడుచుకుపోవుట , పగులుట తగ్గును . 


 * తైలముతో నస్యకర్మ చేయుట చేత శిరోరోగములు , తలకు నూనె రాయుట చేత కర్ణ రోగములు , చెవులలో చమురు వేయుట చేత నాలిక సంబంధ రోగములు , నాలిక మీద తైలము రాయుట చేత కంఠరోగములు మానును . 


 * వేడినీటితో కంట స్నానం చేసిన బలకారముగా ఉండును , వేడినీటితో శిరస్నానం చేసిన తలకు , వెంట్రుకలకు , నేత్రములకు నష్టం చేయును . 


 * భూమి నుండి పుట్టిన నీరు మంచిది . దీనికంటే సెలయేటి నీరు శ్రేష్టము . సరస్సులోనిది , నదీజలము , తీర్దోదకము , గంగోదకం ఇవి ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనది . 


 * స్నానం అయిన పిమ్మట తన తువ్వాలునే శరీరమునకు అదిమి తుడవవలెను . చీడ మొదలైన చర్మదోషములు పోయి శరీరముకు కాంతి కలుగును. పొక్కులు ( మొటిమలు ) , మంగు కలగకుండా ఉండును. 


 * ఆర్థితవాతము , నేత్రవ్యాధి , ముఖరోగము , కర్ణరోగము , అతిసారం , కడుపుబ్బరం , పీనసరోగము , అజీర్ణరోగము కలవారు , భుజించినవారు స్నానం చేయరాదు . 


       తరువాతి పోస్టు నందు మరికొన్ని ఆయుర్వేద ఆరోగ్యసూత్రాలు సంపూర్ణముగా వివరిస్తాను . 


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: