పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు
॥పదియారు॥
ఎడమచేత బట్టె యిదివో పండ్లగొల
కుడిచేత రాకాసిగుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో దూరుపుమొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు
॥పదియారు॥
తొక్కి అక్షకుమారుని దుంచి యడగాళ సంది
నిక్కించెను తోక యెత్తి నింగి మోవను
చుక్కలు మోవ బెరిగి సుతు వద్ద వేదాలు
పుక్కిట బెట్టె కలశాపుర హనుమంతుఁడు
॥పదియారు॥
గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశు బంటు తానాయ
అట్టె వాయువునకు అంజనిదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుఁడు
॥పదియారు॥
- తాళ్ళపాక అన్నమాచార్యులు
గానం - శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి