11, మార్చి 2025, మంగళవారం

తొలి భక్తుడు

 *శివుని యొక్క తొలి భక్తుడు ఎవరు* ❓


 *"సాటిలేని మహా భక్తుడు శ్రీ మహావిష్ణువు"‼️* 


శివుని యొక్క సాకార స్వరూపమైన సదాశివుని వామాంగం నుండి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివ భక్తుడు అనే ఘనకీర్తి విష్ణు దేవునికే లభించినది. కారణం శివుడిని ఆరాధించే మొదటి అవకాశం మహాభాగ్యం విష్ణుదేవునికి లభించినది. 


పార్వతి శంకరుడిని, రాధ శ్రీ కృష్ణుడిని,సీత శ్రీరాముడిని, ఏ విధంగా ధ్యానం చేస్తూఉంటారో....ఆ విధంగా విష్ణువు శివుని సదా ధ్యానిస్తూ ఉంటాడు. 

నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే!


శివుడి అష్టోత్తర శత నామాలలో శివుడు విష్ణు వల్లభుడని కీర్తించబడినాడు. నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు అందుకే శివుడిని విష్ణు వల్లభుడని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను.


 *శంకర: శూలపాణిచ కట్వంగి విష్ణువల్లభా:* 


విష్ణువు యొక్క శివ భక్తికి మెచ్చి. శివుడు విష్ణువు కు ఎన్నో వరాలను ప్రసాదించాడు. ఎన్నో దివ్యశక్తులను ప్రసాదించాడు. క్షణాలలో శత్రువులను సమూలంగా నాశనం చేసే సుదర్శనచక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు.


భూలోకములో మానవులచే పూజలందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు, భూలోకములో, క్షేత్రం, ప్రతిష్ట, ఉత్సవం, జరిగే విధంగా శివుడు విష్ణువుకు వరం ప్రసాదించాడు. 


విష్ణువు ఎంతటి శివభక్తుడంటే

.. ఆదిశంకరులు, పరమశివ! త్రిపుర సంహారం కాలమందు విష్ణువు నీకు బాణం అయ్యెను. వృషభ రూపమును పొంది నీకు వాహనం అయ్యెను. ఆర్య రూపమును పొంది నీ అర్థాంగమ్మున భార్య‌ అయినాడు. నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చాడు .జగన్మోహిని రూపమును పొంది నీ వల్లభూదపొందేన. నీవు శివ తాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి పూజ్యుడు ఎలా అగునని తెలిపెను. 


హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో, అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమించాడో, సేవించాడు. ఆ విధంగా శివుడిని ప్రేమించినవాడు, సేవించినవాడు విష్ణువు. అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటిలేని గొప్ప శివ భక్తుడు అని కొనియాడారు.  


హనుమంతుడు తన హృదయములో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృదయములో గల శివుడుని చూపించుని వామన పురాణం తెలిపినది. మహావిష్ణువు, కమలం అంటే తన హృదయాన నివసించే శివ లింగేశ్వరుని దేవతలకు చూపించెను.


 విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు, "శుద్ధగామం" ఈ విధంగా తెలిపినది. త్రయోదశo హరే రార్ధం - అర్ధనారి చతుర్దశo' 

 విష్ణువు శివుని ధ్యానించి సేవించి సగము శరీరమును పొందిన హరిహర మూర్తి. ఈ లీల రూపము మహేశ్వరుని లీలా రూపములలో 13వ అర్ధనారీశ్వర రూపం 14 విష్ణువు పార్వతీ కన్నా ముందే శివుని శరీరమును పొందాడు. అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకున్నది. విష్ణువుచే అష్టోత్తర శత నామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివుని లో సగం శరీరం సాధించి "అర్ధనారీశ్వరి" అయినది.


 విష్ణువు ఎంతటి గొప్ప మహా శివ భక్తుడు కాబట్టే శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు.

కామెంట్‌లు లేవు: